
ప్రపంచ కుబేరుడు.. టెస్లా చీఫ్ 'ఇలాన్ మస్క్' (Elon Musk) 'గ్రోక్ 3' లాంచ్‌కు సంబంధించి కీలక ప్రకటన చేశారు. సోమవారం రాత్రి 8 గంటలకు (భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 9:30 గంటలకు) లైవ్ డెమోతో దీనిని లాంచ్ చేయనున్నట్లు ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పేర్కొన్నారు. ఇది భూమి మీద అత్యంత తెలివైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అన్నారు.
చాట్‌జీపీటీకి ప్రత్యర్థిగా వచ్చిన గ్రోక్.. ప్రారంభం నుంచి మంచి ఆదరణ పొందుతోంది. ఎక్స్ఏఐ రూపొందిన ఈ గ్రోక్ త్వరలోనే.. 'గ్రోక్3'గా రానుంది. అయితే ఇదెలా పనిచేస్తుంది, దీనికి సంబంధించిన వివరాలు అధికారికంగా వెల్లడి కాలేదు. ఇది టెక్స్ట్-టు-వీడియో వంటి లేటెస్ట్ ఫీచర్స్ పొందనున్నట్లయితే.. ఇప్పుడు వినియోగంలో ఉన్న ఓపెన్ఏఐ, గూగుల్ జెమిని, మెటా ఏఐ వంటి వాటికి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: ట్రంప్ నిర్ణయాల ఎఫెక్ట్.. అమెరికాలో అమ్మకానికి భారీగా ఇళ్లు!
గ్రోక్ 3 అభివృద్ధి చివరి దశలో ఉందని.. ఒకటి లేదా రెండు వారాల్లో అందుబాటులోకి వస్తుందని మస్క్ చెప్పారు. అయితే లైవ్ డెమో త్వరలోనే విడుదలకానుంది. అన్ని రంగాల్లోనూ ఏఐ తన హవా కొనసాగిస్తున్న వేళ 'గ్రోక్ 3' లాంచ్ అధిక ప్రజాదరణ పొందే అవకాశం ఉందని టెక్ నిపుణులు చెబుతున్నారు.
Grok 3 release with live demo on Monday night at 8pm PT.
Smartest AI on Earth.— Elon Musk (@elonmusk) February 16, 2025
Comments
Please login to add a commentAdd a comment