అభివృద్ధి చెందిన నగరాల్లో ట్రాఫిక్ కష్టాలు వర్ణనాతీతం. దీనికి పరిష్కారమే లేదా? అంటే.. ఓ మార్గం ఉంది. అదే ఫ్లైయింగ్ కార్లు. ఈ మాట ఎప్పటినుంచో చెబుతూనే ఉన్నారు, వచ్చిందేమో లేదు అంటారేమో.. అయితే ఎగిరే కారు కల నిజమయ్యే సమయం ఆసన్నమైంది. కాలిఫోర్నియాకు చెందిన కంపెనీ 'అలెఫ్ ఏరోనాటిక్స్' తన ప్రతిష్టాత్మకమైన ప్రణాళికతో ఎగిరే కార్లను జనంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది.
సినిమాల్లో కనిపించే ఫ్లైయింగ్ కార్లు.. నిజ జీవితంలోకి వస్తే ట్రాఫిక్ కష్టాలు తీరినట్టే. కాబట్టి అలెఫ్ ఏరోనాటిక్స్ 2025లో ఫ్లైయింగ్ కార్లను ఉత్పత్తి చేయనుంది. ఇది వ్యక్తిగత రవాణాలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది. ఈ కార్ల ధర 300000 డాలర్లు ఉంటుందని అంచనా. ఇది చాలా ఎక్కువ ధర కావడంతో బహుశా దీనిని సామాన్య ప్రజలకు కొనుగోలు చేయలేకపోవచ్చనే తెలుస్తోంది.
కంపెనీ 2025నాటికి మోడల్ ఏ అనే ఫ్లైయింగ్ కారును ప్రారభించనుంది. కాగా దీని కోసం ఇప్పటికీ 3200 బుకింగ్స్ పొందినట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తే.. ఈ ఎగిరేకారుకు డిమాండ్ భారీగానే ఉందని తెలుస్తోంది. యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కంపెనీ ప్రత్యేక ఎయిర్‌వర్తినెస్ సర్టిఫికేషన్‌ను పొందినట్లు సమాచారం. ఇది కీలక భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉందని చెబుతున్నారు.
ఇదీ చదవండి: ఇదే జరిగితే.. 75శాతం యూపీఐ ట్రాన్సక్షన్స్ ఆపేస్తారు!
అలెఫ్ మోడల్ ఏ డెలివరీలు 2025 నాలుగో త్రైమాసికంలో ప్రారంభమవుతాయని తెలుస్తోంది. మోడల్ ఏ తరువాత కంపెనీ మోడల్ జెడ్ అనే మరో కారును లాంచ్ చేసే అవకాశం ఉంది. దీని ధర 35000 డాలర్లు ఉంటుందని అంచనా. దీనికి సంబంధించిన మరిన్ని అధికారిక వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment