Flying cars
-
ట్రాఫిక్ కష్టాలకు చెక్!.. ఇదో చక్కని పరిష్కారం..
అభివృద్ధి చెందిన నగరాల్లో ట్రాఫిక్ కష్టాలు వర్ణనాతీతం. దీనికి పరిష్కారమే లేదా? అంటే.. ఓ మార్గం ఉంది. అదే ఫ్లైయింగ్ కార్లు. ఈ మాట ఎప్పటినుంచో చెబుతూనే ఉన్నారు, వచ్చిందేమో లేదు అంటారేమో.. అయితే ఎగిరే కారు కల నిజమయ్యే సమయం ఆసన్నమైంది. కాలిఫోర్నియాకు చెందిన కంపెనీ 'అలెఫ్ ఏరోనాటిక్స్' తన ప్రతిష్టాత్మకమైన ప్రణాళికతో ఎగిరే కార్లను జనంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది.సినిమాల్లో కనిపించే ఫ్లైయింగ్ కార్లు.. నిజ జీవితంలోకి వస్తే ట్రాఫిక్ కష్టాలు తీరినట్టే. కాబట్టి అలెఫ్ ఏరోనాటిక్స్ 2025లో ఫ్లైయింగ్ కార్లను ఉత్పత్తి చేయనుంది. ఇది వ్యక్తిగత రవాణాలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది. ఈ కార్ల ధర 300000 డాలర్లు ఉంటుందని అంచనా. ఇది చాలా ఎక్కువ ధర కావడంతో బహుశా దీనిని సామాన్య ప్రజలకు కొనుగోలు చేయలేకపోవచ్చనే తెలుస్తోంది.కంపెనీ 2025నాటికి మోడల్ ఏ అనే ఫ్లైయింగ్ కారును ప్రారభించనుంది. కాగా దీని కోసం ఇప్పటికీ 3200 బుకింగ్స్ పొందినట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తే.. ఈ ఎగిరేకారుకు డిమాండ్ భారీగానే ఉందని తెలుస్తోంది. యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కంపెనీ ప్రత్యేక ఎయిర్‌వర్తినెస్ సర్టిఫికేషన్‌ను పొందినట్లు సమాచారం. ఇది కీలక భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉందని చెబుతున్నారు.ఇదీ చదవండి: ఇదే జరిగితే.. 75శాతం యూపీఐ ట్రాన్సక్షన్స్ ఆపేస్తారు!అలెఫ్ మోడల్ ఏ డెలివరీలు 2025 నాలుగో త్రైమాసికంలో ప్రారంభమవుతాయని తెలుస్తోంది. మోడల్ ఏ తరువాత కంపెనీ మోడల్ జెడ్ అనే మరో కారును లాంచ్ చేసే అవకాశం ఉంది. దీని ధర 35000 డాలర్లు ఉంటుందని అంచనా. దీనికి సంబంధించిన మరిన్ని అధికారిక వివరాలు తెలియాల్సి ఉంది. -
14 సంవత్సరాల కృషి.. నిజమవుతున్న ఎగిరే కారు కల - వీడియో
ఇప్పటివరకు డీజిల్, పెట్రోల్, సీఎన్జీ, ఎలక్ట్రిక్ కార్లు అందుబాటులోకి వచ్చాయి. ఎగిరే కార్లు వచ్చేస్తున్నాయ్ అంటూ గత కొన్ని రోజులుగా చాలా కంపెనీలు చెబుతూనే ఉన్నాయి. కొన్ని సంస్థలు చెప్పినట్లుగానే ఎగిరే కార్లను విడుదల చేసే పనిలో ఉంటే. మరి కొన్ని సైలెంట్‌గా ఉన్నాయి. అయితే 'సామ్సన్ స్కై' (Samson Sky) కంపెనీ ఎట్టకేలకు ఓ ఫ్లైయింగ్ కారుని తీసుకువచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. వాషింగ్టన్‌లోని మోసెస్ లేక్‌లోని గ్రాంట్ కంట్రీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో 'సామ్సన్ స్విచ్‌బ్లేడ్' (Samson Switchblade) ఆకాశానికి ఎగిరింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది దాదాపు ఆరు నిముషాలు 500 అడుగులు ఎత్తులో ఎగిరింది. సుమారు 14 సంవత్సరాల తరువాత కంపెనీ తన మొదటి ఫ్లైయింగ్ కారు తయారైందని సంస్థ సీఈఓ, స్విచ్‌బ్లేడ్ రూపకర్త 'సామ్ బౌస్ఫీల్డ్' తెలిపాడు. ఇప్పటికే సుమారు 57 దేశాల నుంచి 170000 డాలర్ల అంచనా ధరతో 2300 రిజర్వేషన్స్ తీసుకున్నట్లు కూడా ఆయన వెల్లడించారు. రెండు సీట్లు కలిగిన ఈ ఫ్లైయింగ్ కారు స్ట్రీట్ మోడ్‌లో గంటకు 200 కిమీ, ఫ్లైట్ మోడ్‌లో 322 కిమీ/గం కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించగలదని కంపెనీ ధ్రువీకరించింది. ఈ కారులోని వింగ్స్, టెయిల్ వంటివి పార్కింగ్స్ సమయంలో ముడుచుకుని ఉంటాయి. కాబట్టి పార్కింగ్ కోసం ఎక్కువ స్థలం కేటాయించాల్సిన అవసరం లేదు. ఇదీ చదవండి: రెండు హోటల్స్ నుంచి ఏడు దేశాలకు.. వేల కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించిన ఒబెరాయ్ సామ్సన్ స్విచ్‌బ్లేడ్ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 125 లీటర్లు వరకు ఉంటుంది. కాబట్టి ఒక ఫుల్ ట్యాంక్‌లో 805కిమీ పరిధిని అందిస్తుందని చెబుతున్నారు. అయితే ఈ కారు ఎప్పుడు అధికారికంగా మార్కెట్లో విడుదలవుతుందనే సమాచారం కంపెనీ స్పష్టంగా వెల్లడించలేదు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉందని భావిస్తున్నాము. -
ఎగిరే కారుకు అమెరికా అనుమతి
కాలిఫోర్నియా: తాము తయారు చేసిన ఎగిరే కారు(ఫ్లయింగ్ కారు)కు అమెరికా ప్రభుత్వం నుంచి చట్టబద్ధ అనుమతి లభించిందని కాలిఫోర్నియాకు చెందిన అలెఫ్ ఏరోనాటిక్స్ కంపెనీ ప్రకటించింది. ఎలక్ట్రిక్ వర్టీకల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్(ఈవీటీఓఎల్) వెహికల్ అని పిలిచే ఈ కారు పూర్తిగా విద్యుత్‌తో పనిచేస్తుంది. ఫ్లయింగ్ కారును తొలిసారిగా 2022 అక్టోబర్‌లో అలెఫ్ కంపెనీ ఆవిష్కరించింది. రోడ్లపైనే పరుగులు తీయడమే కాదు, గాల్లోనూ ప్రయాణించడం ఈ కారు ప్రత్యేకత. హెలికాప్టర్ తరహాలో గాల్లోకి నిలువుగా ఎగరగలదు. నిలువుగా భూమిపై దిగగలదు. మోడల్–ఎ ఫ్లయింగ్ కారు ఒకసారి పూర్తిగా చార్జింగ్ చేస్తే రోడ్డుపై 200 మైళ్లు(322 కిలోమీటర్లు), గాలిలో 110 మైళ్లు(177 కిలోమీటర్లు) ప్రయాణించగలదు. ఇద్దరు వ్యక్తులు ఇందులో ప్రయాణించవచ్చు. ఈ కారు ప్రారంభ ధర 3 లక్షల అమెరికన్ డాలర్లు(రూ.2.46 కోట్లు). 150 డాలర్లు (రూ.12,308) చెల్లించి అలెఫ్ వెబ్సైట్ ద్వారా ఫ్లయింగ్ కారును బుక్ చేసుకోవచ్చు. ఇప్పటికే ప్రజల నుంచే కాకుండా కంపెనీల నుంచి కూడా ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయని అలెఫ్ ఏరోనాటిక్స్ కంపెనీ వెల్లడించింది. మోడల్–ఎ కార్ల ఉత్పత్తిని 2025 నుంచి పూర్తిస్థాయిలో ప్రారంభిస్తామని ప్రకటించింది. తమ ఎగిరే కారుకు యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్ఏఏ) నుంచి స్పెషల్ ఎయిర్‌వర్తీనెస్ సర్టీఫికెట్ లభించిందని అలెఫ్ సంస్థ హర్షం వ్యక్తం చేసింది. ఇలాంటి వాహనానికి అమెరికా ప్రభుత్వం నుంచి అనుమతి రావడం ఇదే మొదటిసారి అని తెలియజేసింది. మోడల్–ఎ మాత్రమే కాకుండా మోడల్–జెడ్ తయారీపైనా అలెఫ్ సంస్థ దృష్టి పెట్టింది. మోడల్–జెడ్‌ను 2035 నుంచి మార్కెట్లోకి తీసుకురావాలని భావిస్తోంది. ఈ మోడల్ డ్రైవింగ్ రేంజ్, ఫ్లయింగ్ రేంజ్ మరింత అధికంగా ఉంటుంది. ఇందులో ఆరుగురు ప్రయాణించవచ్చు. -
మరో మూడేళ్లలో ‘ఎగిరే కారు’.. గాలిలో గంటకు 418 కిలోమీటర్ల వేగం
వాషింగ్టన్: గాల్లో ప్రయాణించే కారు.. ఈ వార్త కొత్తదేమీ కాకపోయినా ఇలాంటి వాహనం ఇంకా అందుబాటులోకి రాలేదు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఇతర కంపెనీల కంటే తామే ముందుగా ఎగిరే కారును మార్కెట్లోకి తీసుకురావాలని అమెరికాలో కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాన్ మాటియోలో ఉన్న అలెఫ్ ఏరోనాటిక్స్ అనే సంస్థ తీవ్రంగా కృషి చేస్తోంది. మరో మూడేళ్లలోపే మార్కెట్లోకి తీసుకొస్తామని చెబుతోంది. గాలిలో ప్రయాణించే కారు తయారీలో అలెఫ్ ఏరోనాటిక్స్ ఇంజనీర్లు నిమగ్నమయ్యారు. ఈ కారులో 8 ప్రొపెలర్స్, చుట్టూ జల్లెడ లాంటి బాడీ ఉంటుందని చెబుతున్నారు. ఇది నిలువుగా గాల్లోకి ఎగురుతుంది. నిర్దేశిత ఎత్తుకు చేరుకున్న తర్వాత 90 డిగ్రీలు మళ్లుతుంది. అనంతరం వేగంగా గాల్లో దూసుకెళ్తుంది. ఎగిరే కారు ధర 3 లక్షల డాలర్లు (రూ.2.47 కోట్లు) ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రత్యేకంగా రన్‌వే అవసరం లేదని, సాధారణ రోడ్లపై కూడా ఈ కారును టేకాఫ్ చేయొచ్చని ఇంజనీర్లు వెల్లడించారు. గాలిలో గంటకు 260 మైళ్ల (418.429 కిలోమీటర్లు) వేగంతో ప్రయాణిస్తుందని చెప్పారు. ఇది పూర్తిగా విద్యుత్‌తో నడిచే ఎలక్ట్రిక్ కారు. 2025 నుంచి విక్రయాలు ప్రారంభించనున్నారు. -
ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్.. ఫ్లైయింగ్ కార్లు వచ్చేస్తున్నాయ్!
హ్యుందాయ్ మోటార్స్, ఉబర్ సంయుక్తంగా ఫ్లైయింగ్ కార్ల తయారీపై దృష్టిసారించాయి. వీరి భాగస్వామ్యంతో ఫ్లైయింగ్ కార్ల ఉత్పత్తి మరింత వేగం పుంజుకోనుంది. 2025లోపు ఎయిర్ టాక్సీలను మొదలు పెట్టాలని ఇరు కంపెనీలు ఆశాభావం వ్యక్తం చేశాయి. ఫైయింగ్ కార్లలో భాగంగా హ్యుందాయ్ ఎస్-ఏ1 ఎయిర్ టాక్సీలను సీఈఎస్-2020 కాన్ఫరెన్స్‌లో ఇప్పటికే రిలీజ్ చేసింది. కాగా, ఈ ఫ్లైయింగ్ కార్లు హైబ్రిడ్ ఇంజన్ కాన్సెప్ట్‌తో పనిచేయనున్నాయి. ఫ్లైయింగ్ కార్ల రాకతో ట్రాఫిక్ జామ్స్‌కు చెక్‌పెట్టవచ్చునని ఇరు కంపెనీలు భావిస్తున్నాయి. 2028 నాటికి తన మొదటి వాణిజ్య విమానాన్ని మార్కెట్లోకి లాంచ్ చేయలని లక్ష్యంగా చేసుకుంది. హ్యుందాయ్ యూరోపియన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మైఖేల్ కోల్ ఈ దశాబ్దం చివరినాటికి ఎగిరే కార్లు వాస్తవ రూపం దాల్చుతాయి అని తాను నమ్ముతున్నానని గతంలో తెలియజేశారు. "ఇవి భవిష్యత్తులో మన జీవితంలో భాగం కానున్నట్లు మేము నమ్ముతున్నాము" అని అతను చెప్పారు. హ్యుందాయ్ ఇప్పటికే ఎస్-ఎ1 కాన్సెప్ట్ అభివృద్ధిపై పనిచేయడానికి ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఇది గంటకు 300 కిలోమీటర్ల గరిష్ట వేగంతో వెళ్లే విధంగా రూపొందిస్తున్నారు. అలాగే, 600 మీటర్ల వరకు వెళ్లగలదు. ఫ్లైయింగ్ కార్లపై ఇప్పటికే ప్రముఖ స్టార్టప్ కంపెనీలతోపాటు, దిగ్గజ ఆటోమోబైల్ కంపెనీలు టయోటా మోటార్, డైమ్లెర్ ఏజీ, చైనాకు చెందిన గీలీ మోటార్ కంపెనీలు దృష్టిసారించాయి. (చదవండి: భారత్ భారీ ప్లాన్.. చైనాకు గట్టి ఎదురుదెబ్బ!) -
గాల్లో ఎగిరే సూపర్ కార్ల సేవలు! దేనికోసమంటే..
ది జెట్సన్స్ అనే ఓ అమెరికన్ యానిమేషన్ సిరీస్ ఉంటుంది. 60వ దశాబ్దంలో సూపర్ హిట్ అయిన సిట్కామ్ ఇది. గాల్లో ఎగిరే వాహనాల ఊహకు ఒక రూపం తెచ్చింది ఈ సిరీస్. మరి ఇదంతా రియల్‌గా జరుగుతుందా? గాల్లో ఎగిరే కార్లు ఈ టెక్నాలజీ గురించి దశాబ్దంపై నుంచే చర్చ నడుస్తోంది. ఇప్పటికే చాలా కంపెనీలు ముందడుగు వేశాయి కూడా. కానీ, ఆచరణలో రావడానికి కొంచెం టైం పట్టొచ్చని భావించారంతా. ఈ తరుణంలో ఫ్రాన్స్ ఓ అడుగు ముందుకేసింది. 2024 ప్యారిస్ సమ్మర్ ఒలింపిక్స్ కోసం ఎగిరే ట్యాక్సీల సేవలను ఉపయోగించాలనుకుంటోంది. భారీ సైజులో ఉండే ఎలక్ట్రిక్ డ్రోన్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను క్రీడాభిమానుల కోసం ఉపయోగించబోతున్నారు. వీటిద్వారా ప్రేక్షకులను క్రీడాసమరాలు జరిగే ఒక వేదిక నుంచి మరో వేదికకు తీసుకెళ్తారు. అంతర్జాతీయ ఈవెంట్లకు జనాలు క్యూ కడుతున్న(సగటున 60 లక్షల మంది టికెట్లు కొంటున్నారు.కానీ, కరోనాకి ముందు లెక్కలు ఇవి) తరుణంలో.. బిజీ నగరం ప్యారిస్ ట్రాఫిక్ ఇక్కట్లను తప్పించేందుకే ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 30 ఎయిరోనాటిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు టెస్ట్ ఫ్లైట్స్ నిర్వహించేందుకు ముందుకొచ్చాయి. ప్యారిస్‌లోని కార్మెల్లెస్ ఎన్ వెక్సిన్లోని పోంటాయిస్ ఎయిర్‌ఫీల్డ్‌లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ టెస్ట్ ఫ్లైట్స్ కేవలం ఒలంపిక్స్ కోసం మాత్రమేనని, భవిష్యత్తులో వీటిని పూర్తి స్థాయిలో వినియోగించాలనే ప్రతిపాదనతో తమకేం సంబంధం లేదని ఒలింపిక్స్ నిర్వాహకులు చెప్తున్నారు. ఈ టెస్ట్ ఫ్లైట్ ఈవెంట్లో స్లోవేకియాకు చెందిన క్లెయిన్ విజన్ ఎయిర్‌కార్ కేవలం మూడు నిమిషాల్లో కారు నుంచి విమానంగా మారిపోయి అమితంగా ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే జపాన్‌కు చెందిన స్కైడ్రైవ్ కంపెనీ 2020లో ప్రపంచంలోనే మొట్టమొదటి ఫ్లైయింగ్ కారును విజయవంతంగా పరీక్షించింది. అయితే వీటిని 2023లోనే మార్కెట్లోని తెచ్చే యోచనలో ఉంది. ఇక సంప్రదాయ కార్ల కంపెనీలు హుండాయ్, రెనాల్ట్ కూడా ఎయిర్‌స్పేస్ రేసులో అడుగుపెడుతున్నాయి. ఫ్లైయింగ్ కార్లను మార్కెట్లోని తేవాలనే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నాయి. చదవండి: మెషిన్ అరుస్తోంది అక్కడ.. నిజం చెప్పు -
వెన్నులో వణుకుపుట్టించిన దృశ్యం.. గాల్లో కార్ల రేసింగ్
ఫార్ములా వన్ రేసింగ్... కార్లు జెట్‌స్పీడ్‌లో ట్రాక్‌మీద దూసుకుపోతుంటే... ఊపిరి బిగబట్టి చూడటం ప్రేక్షకుల వంతవుతుంది. ఇక అవే కార్లు గాల్లో ఎగిరిపోతుంటే ఉండే థ్రిల్ అంతా ఇంతా కాదు. వినడానికే వెన్నులో వణుకు పుట్టిస్తోన్న ఈ ఎగిరేకార్ల రేసింగ్ గురువారం నాడు ఆస్ట్రేలియాలో జరిగింది. దీపావళి పండుగరోజు మన దగ్గర రాకెట్ పటాకులు ఆకాశంలో కాంతులీనితే... ఆస్ట్రేలియాలో మాత్రం రెండు కార్లు గాల్లో దూసుకుపోయాయి. ఎయిర్‌స్పీడర్ సంస్థ ఎక్సా సిరీస్ పేరుతో నిర్వహించిన ఫ్లయింగ్ కార్స్ రేస్‌లో అలౌడా ఎరోనాటిక్స్ కంపెనీ తయారు చేసిన ఎమ్కె3 (ఎలక్ట్రికల్ వర్టికల్ టేకాఫ్ అండ్ల్యాండింగ్) కార్లు పాల్గొని విజయవంతంగా రేస్ పూర్తి చేశాయి. రన్‌వే అవసరమే లేదు... ఈ కార్లను నిపుణులైన ఆపరేటర్స్ రిమోట్ సా యంతో (డ్రోన్ల మాదిరిగా) కంట్రోల్ చేశారు. ఈ ఎమ్కె3 ఎగిరే కార్లు టేకాఫ్ అయిన 2.3 సెకన్లలోనే గంటకు వంద కి.మీ. వేగాన్ని అందుకోగలవు. సాధారణంగా విమానం, హెలికాప్టర్ టేకాఫ్ అవ్వడానికి రన్‌వే అవసరం. కానీ.. ఈ కార్లలో ఉన్న వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ కోసం థర్డ్ డైమెన్షన్‌ను యాడ్ చేశారు. దీంతో ఉన్న చోటనుంచే గాల్లోకి ఎగరగలదు కారు. 2022 నాటికి పైలట్ నడిపేట్టుగా... దాదాపు వంద కేజీల బరువున్న ఈ కార్లను కార్బన్ ఫైబర్‌తో తయారు చేశారు. పైలట్ నడపాలంటే మాత్రం ఎమ్కె 4 తయారు చేయాలంటోంది కంపెనీ. 2022 కల్లా సాధ్యం చేసి చూపిస్తామని చెబుతోంది. క్షణాల్లో బ్యాటరీ రిప్లేస్మెంట్... సాధారణంగా ఫార్ములావన్ రేసింగ్‌లో ఫ్లాట్ టైర్ అయితే క్షణాల్లో మార్చే అవకాశం ఉంటుంది. ఫ్లయింగ్ కార్లలోనూ బ్యాటరీ రిప్లేస్మెంట్ వేగంగా చేయడం కోసం స్లైడ్ అండ్ లాక్ సిస్టమ్ రూపొందించారు. కారు గాల్లో ఉన్నప్పుడు రోటర్ లేదా బ్యాటరీ సిస్టమ్ ఫెయిల్ అయినా సురక్షితంగా ల్యాండయ్యేలా రూపొందించారు. సో పైలట్ సేఫ్. 2050 నాటికి లక్షల కోట్ల ఇండస్ట్రీ... జాబీ, అలౌడా, జెట్సన్, మేజర్ వంటి ఎయిర్‌క్రాఫ్ట్ కంపెనీలన్నీ ఎలక్ట్రికల్ వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ వాహనాల మీద పనిచేస్తున్నాయి. ఈ ‘ఎలక్ట్రికల్ వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ ఇండస్ట్రీ’ 2050 సంవత్సరం నాటికి లక్షన్నర కోట్ల పరిశ్రమగా అవతరిస్తుందని మోర్గన్ స్టాన్లీ అంచనా. – సాక్షి, సెంట్రల్ డెస్క్ -
ఇండియా నుంచే ఆసియా తొలి ఫ్లయింగ్ కారు!
ప్రపంచవ్యాప్తంగా వివిధ కంపెనీలు ఎగిరే కార్లను తయారు చేయడానికి సరికొత్త ఆవిష్కరణలు చేస్తుంటే. ఇప్పుడిప్పుడే మన దేశం ఆ దిశగా అడుగులు వేస్తుంది. ఆసియాలో మిగిలిన దేశాలను వెనక్కి నెడుతు తొలి ఫ్లయింగ్ కారును మార్కెట్లోకి తెచ్చేందుకు మన వాళ్లు తీవ్రంగా కృషి చేస్తున్నారు. లండన్‌లో అక్టోబర్ 5న జరిగిన ప్రపంచంలోని అతిపెద్ద హెలిటెక్ ఎక్స్ పో - ఎక్సెల్ షోలో ఆసియాలోని మొట్టమొదటి హైబ్రిడ్ ఫ్లయింగ్ ప్రోటోటైప్ కారును చెన్నైకి చెందిన సంస్థ వినాటా ఏరోమొబిలిటీ ఆవిష్కరించింది. కంపెనీ తన యూట్యూబ్ ఛానెల్లో ఎగిరే కారు డిజిటల్ ప్రోటోటైప్ వీడియోను విడుదల చేసింది. ఈ కారులో రెండు సీట్లు మాత్రమే ఉన్నాయి. దీనిని నడిపే పక్కన మరో వ్యక్తి మాత్రమే కూర్చోవడానికి అవకాశం ఉంది. ఇది రెక్కల మాదిరిగా నిటారుగా తెరుచుకునే డోర్లను కలిగి ఉంటుంది. ఇతర విషయాలతో పాటు నావిగేషన్ కోసం భారీ డిజిటల్ టచ్ స్క్రీన్ వ్యవస్థ ఇందులో ఉంది. వినాటా ఏరోమొబిలిటీ రూపొందించిన ఫ్లైయింగ్ కారు రోడ్డు, వాయు మార్గంలో ప్రయాణించగలదు. ఇది గరిష్టంగా 1300ల కేజీల బరువును మోసుకెళ్లగలదు. గాలిలో గరిష్టంగా 60 నిమిషాల వరకు ఎగురగలదు. దీని గరిష్ట వేగం గంటకు 120 కిలోమీటర్లు. (చదవండి: రైల్వే ఉద్యోగులకు కేంద్రం భారీ శుభవార్త!) భూమి నుంచి 3000 అడుగుల ఎత్తులో ఈ ఫ్లైయింగ్ కారు ప్రయాణిస్తుంది. వాలుగా కాకుండా నిట్టనిలువుగా ల్యాండింగ్, టేకాఫ్ అవడం ఈ కారు ప్రత్యేకత. ఈ హైబ్రిడ్ ఫ్లైయింగ్ కారులో బ్యాటరీలతో పాటు ఇంధనంగా బయో ఫ్యూయల్‌ను ఉపయోగిస్తారు. కో యాక్సియల్ క్వాడ్ రోటార్ సిస్టమ్ ఆధారంగా ఈ కారు గాలిలో పైకి లేస్తుంది. ఒక సీటు పక్కన షాంపైన్ హోల్డర్ ఉంది. ఇప్పటికే కొరియాకు చెందిన హ్యుందాయ్ కంపెనీ సైతం ఏషియా నుంచి ఫ్లైయింగ్ కారు తయారీ చేసే పనిలో ఉంది. -
ట్రాఫిక్‌కు చెక్: ఫ్లైయింగ్ కార్లు వచ్చేస్తున్నాయ్!
హ్యుందాయ్ మోటార్స్, జనరల్ మోటార్స్ సంయుక్తంగా ఫ్లైయింగ్ కార్లపై దృష్టిసారించాయి. వీరి భాగస్వామ్యంతో ఫ్లైయింగ్ కార్ల ఉత్పత్తి మరింత వేగం పుంజుకోనుంది. 2025లోపు ఎయిర్ టాక్సీలను మొదలు పెట్టాలని ఇరు కంపెనీలు ఆశాభావం వ్యక్తం చేశాయి. ఫైయింగ్ కార్లలో భాగంగా హ్యుందాయ్ ఎస్-ఏ1 ఎయిర్ టాక్సీలను సీఈఎస్-2020 కాన్ఫరెన్స్‌లో ఇప్పటికే రిలీజ్ చేయగా, జనరల్ మోటార్స్ 2021 జనవరిలో ఫైయింగ్ కాడిలాక్ కాన్సెప్ట్‌ను రిలీజ్ చేసింది. కాగా ఈ ఫ్లైయింగ్ కార్లు హైబ్రిడ్ ఇంజన్ కాన్సెప్ట్‌తో పనిచేయనున్నాయి. ఫ్లైయింగ్ కార్ల రాకతో ట్రాఫిక్ జామ్స్‌కు చెక్‌పెట్టవచ్చునని ఇరు కంపెనీలు భావిస్తున్నాయి. ఎయిర్ టాక్సీల రాకతో వాయు ప్రయాణాల మార్కెట్ విలువ 2040 వరకు సుమారు ఒక ట్రిలియన్ (రూ. 73 లక్షల 28 వేల 450 కోట్లు)కు చేరగా, అదే 2050 సంవత్సరానికి తొమ్మిది ట్రిలియన్లకు చేరుకుంటుందని ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ తెలిపింది. కాగా ఫ్లైయింగ్ కార్లపై ఇప్పటికే ప్రముఖ స్టార్టప్ కంపెనీలతోపాటు, దిగ్గజ ఆటోమోబైల్ కంపెనీలు టయోటా మోటార్, డైమ్లెర్ ఏజీ, చైనాకు చెందిన గీలీ మోటార్ కంపెనీలు దృష్టిసారించాయి. చదవండి : Huwaie: వాహనాల తయారీ కాదు.. ఏకంగా డ్రైవర్‌లెస్ కార్! -
ప్రపంచంలోనే తొలి ఎగిరే కారు, ధర ఎంతంటే..
బంపర్-టు-బంపర్ ట్రాఫిక్‌లో గంటలు గంటలు జామ్ అయ్యే సమస్యలకు చెక్ పెట్టేలా ఇపుడు ఎగిరే కార్లు రయ్ మంటూ దూసుకురానున్నాయి. దీంతో ఇక హాలీవుడ్ సినిమాల్లో జేమ్స్‌బాండ్ లాగా రెక్కలు తొడుక్కున్న కార్లతో అలా గాల్లోకి ఎగిరిపోవచ్చన్నమాట. ప్రపంచంలోని మొట్టమొదటి కమర్షియల్ ఫ్లయింగ్ కారు ఎగిరే కారు నెదర్లాండ్స్ వీధుల్లో చక్కర్లు కొట్టనుంది. దీనికి సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. నెదర్లాండ్స్‌లో అక్కడి రహదారులపై కమర్షియల్ ప్లయింగ్ కోసం అధికారిక ఆమోదం లభించింది. పాల్-వి లిబర్టీగా పిలిచే ‘ఎయిర్ కార్' ను డచ్ కంపెనీ పాల్-వి రూపొందించింది. ఎగిరే కారు మనం ఊహించినట్టు గానే చిన్న హెలికాప్టర్ , ఏరోడైనమిక్ కారు (పైన మడతపెట్టే ప్రొపెల్లర్‌తో) లా ఉంటుంది. డ్రైవింగ్ మోడ్‌లో గంటకు 99 మైళ్లు, ఫ్లైట్ మోడ్‌లో దీని గరిష్టంగా గంటకు 112 మైళ్లు వేగాన్ని అందుకుంటుంది. లిబర్టీ ఒక గైరోకాప్టర్, అంటే పైన ఉన్న రోటర్లుకారును పైకి లేపుతాయి. ఇందుకు కారు వెనుక భాగంలో ఒక ప్రత్యేక ప్రొపెల్లర్ ఇంజిన్ ఉంటుంది. కారు హెలికాప్టర్ లాగా కదిలినా, వర్టికల్ గా టేకాఫ్ అవ్వలేదు. టేకాఫ్‌కు కనీసం 590 అడుగుల పొడవు, ల్యాండింగ్‌కు 100 అడుగుల పొడవు రన్‌వే అవసరం. అయితే డ్రైవింగ్ మోడ్‌లో ఉండగా రోటర్లను మడవటం అనే సాధారణ విషయం కాదు. భవిష్యత్ మోడళ్లలో లిబర్టీ ఇంజనీర్లు దీనిపై దృష్టిపెడుతున్నారు. పరిమిత ఎడిషన్ గా 90 పయనీర్ వాహనాలను విక్రయించింది. ప్రీ-టాక్స్ ధర ట్యాగ్‌తో 599,000 డాలర్లుగా (4.47 కోట్ల రూపాయలు)దీని ధరను నిర్ణయించింది. మంచి డిజైన్, సొగసుగా తయారుచేయడానికి ఇటాలియన్ డిజైనర్లను నియమించుకుంది. అనంతరం స్పోర్ట్ మోడల్ తదుపరి 399,000 డాలర్లకు విక్రయించనుంది. అయితే నెదర్లాండ్స్ వెహికల్ అథారిటీతో నాణ్యతా పరీక్షల తరువాతగానీ కారు ఉత్పత్తిని ప్రారంభించమని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం అధికారిక లైసెన్స్ తో ఒకటి మాత్రమే నడుస్తోందని వెల్లడించింది. 2022 లో యూరోపియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీతో ధృవీకరణను అందుకోవాలని యోచిస్తోంది. అటు స్లోవేకియాకు చెందిన క్లెయిన్ విజన్ అనే కంపెనీ ఎగిరే కారును అభివృద్ధి చేసింది. విజయవంతంగా పరీక్షించిన ఈ కారు బరువు 1,100 కిలోలు. 200 కిలోల వరకు మోసుకెళ్లగలదు. నవంబర్‌లో నిర్వహించనున్న ‘చైనా ఇంటర్నేషనల్ ఇంపోర్ట్'లో రెండు మోడళ్లను ప్రదర్శనకు పెట్టనున్నారు. కారు వచ్చే ఏడాది మార్కెట్లోకి రావచ్చు. ఈ కారు 2021 కల్లా అందుబాటులోకి రానుందనీ..ఈ కారు భూమికి 1500 అడుగుల ఎత్తులో గంటకు 620 కిమీల వేగంతో కారు దూసుకెళ్తుందని క్లెయిన్‌విజన్ సంస్థ వెల్లడించింది.ఈ కారును రెండు రకాల వెర్షన్లలో విడుదల చేయనుంది సదరు సంస్థ. వీటిలో ఒకటి టూసీటర్, రెండోది ఫోర్ సీటర్. ఇందులో సెల్ఫ్ డ్రైవింగ్ ఆప్షన్ కూడా ఉంటుందట. -
కారు.. ఎగిరింది సారు
ఇప్పటివరకూ ఎగిరే కారును డిజైన్లలోనే చూశాం.. ఇదిగో ఇప్పుడు నిజంగా చూసేయండి.. అమెరికాలోని వర్జీనియాలో ఈ ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కారు నమూనాను బోయింగ్ కంపెనీ విజయవంతంగా పరీక్షించింది. దీన్ని ‘పీఏవీ’ అని పిలుస్తున్నారు. ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టం ఆధారంగా ఇది నడుస్తుంది. ఒకేసారి 80 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. రద్దీగా ఉండే పట్టణాలు, నగరాల్లో దీన్ని ఉపయోగించవచ్చని బోయింగ్ తెలిపింది. దీని పొడవు 30 అడుగులు, వెడల్పు 28 అడుగులు. తొలి టెస్ట్ ఫ్లైట్ సక్సెస్ అయింది. అంటే.. ఈ కారు ఆకాశంలో జామ్మంటూ దూసుకుపోయే రోజు త్వరలోనే వచ్చేసినట్లే.. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
ఎగిరే కార్ల రేసులోకి ఆ కంపెనీ కూడా..
డ్రైవర్ అనే వాడే లేకుండా వాటంతట అవే నడిచే వాహనాలు రోడ్ల మీదకు వస్తాయి. కేవలం రోడ్లపైనే కాక, గగనంలోనూ స్వయంప్రతిపత్త వాహనాలు ఎగరబోతున్నాయి. ఈ బిగ్ ట్రాన్స్‌పోర్టేషన్ ట్రెండ్ ఇప్పుడిప్పుడే ప్రపంచమంతటా వ్యాప్తిస్తోంది. ఉబర్ దుబాయ్‌లో ఈ ఎగిరే ట్యాక్సీ నెట్‌వర్క్‌ను క్రియేట్ చేస్తుండగా.. గూగుల్ సహ వ్యవస్థాపకుడు ల్యారీపేజ్ కిట్టి హాక్ అనే ఎగిరే కారు స్టార్టప్‌ను ఏర్పాటు చేశారు. ఈ కంపెనీ ఇప్పటికే పలువురు కస్టమర్లకు వీటిని ఆఫర్ చేస్తుంది కూడా. తాజాగ ఈ రేసులోకి రోల్స్ రాయిస్ కూడా వచ్చి చేరింది. యూకేలో జరిగిన ఫార్న్బోరో అంతర్జాతీయ ఎయిర్ షోలో ఎలక్ట్రిక్ వెర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ కాన్సెప్ట్‌ను ఆవిష్కరించింది. ఈ వెహికిల్ హెలికాప్టర్ తరహాలో గగనతలంలో ఎగరడంతోపాటు రోడ్డుపైనా దూసుకెళ్తుంది. ఈ వెహికిల్ ఐదుగురు ప్రయాణికులను తీసుకెళ్లడంతో పాటు, గాల్లో 500 మైళ్ల (805 కిలోమీటర్లు) వరకు ప్రయాణించగలదని, గంటకు గరిష్ఠంగా 200 మైళ్ల వేగంతో దూసుకెళ్లగలదని సంస్థ తెలిపింది. మరో ఏడాదిన్నరలో ఈ హైబ్రిడ్ ఫ్లయింగ్ ట్యాక్సీ ప్రొటొటైప్ సిద్ధం కానుందని, 2020నాటికి వెహికిల్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని రోల్స్‌రాయిస్ ఎలక్ట్రిక్ టీమ్ హెడ్ రాబ్ వాట్సన్ తెలిపారు. టేకాఫ్ అవ్వడం కానీ ల్యాండ్ అవ్వడం కానీ వెర్టికల్‌గా జరుగుతుందని కంపెనీ తెలిపింది. ఈ వెహికిల్ వింగ్స్ 90 డిగ్రీల్లో తిరుగుతూ ఉంటాయని చెప్పింది. -
ఎగిరే కార్ల ధర ఎంతో తెలుసా?
లండన్ : హెలీకాప్టర్, విమానాల్లో కాకుండా కార్లలోనే ఆకాశంలోకి ఎంచక్కా ఎగిరేయోచ్చు. హెలీప్యాడ్, ఎయిర్‌పోర్టుల అవసరం లేకుండానే కార్లలో కూర్చోనే ఆకాశంలో విహరించొచ్చు. .ట్రాఫిక్ జాముల్లో గంటలకొద్ది ఎదురు చూడాల్సిన పని లేకుండా ఆకాశంలోంచే కార్లలో ఎంచక్కా గమ్యస్థానాలకు చేరుకోవొచ్చు. అవునండీ మీరు విన్నది నిజమే. ఈ కల త్వరలో సాకారం కాబోతుంది. డచ్ కంపెనీ పాల్-V గాల్లో చక్కర్లు కొట్టే కారు లిబర్టీని రూపొందించింది. కారు, హెలీకాప్టర్లను పోలి ఉండే ఎగిరే కారు లిబర్టీని 2018లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తొలుత యూకే మార్కెట్లలో ఈ వాణిజ్య కార్లను విడుదల చేయనున్నారు. ఎయిర్, రోడ్డు నిబంధనలకు అనుగుణంగా లిబర్టీని తయారు చేస్తున్నామని పాల్-V తెలిపింది. లిబర్టీ ఓ గైరో ప్లేన్...చూడ్డానికి హెలీకాప్టర్‌కు ఉన్నట్టుగానే దీనికి పైభాగంలో బ్లేడ్లు ఉంటాయి. 100 హార్స్ పవర్ ఉండే రెండు ఇంజిన్లను ఈ లిబర్టీలో ఉపయోగిస్తారు. అంతేకాకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అత్యవసర సమయాల్లో వినియోగించడానికి మరో ఇంజిన్ కూడా ఇందులో ఉంటుంది. గాల్లో లిబర్టీ 177 కిలో/గంట వేగంతో విహరించగలదు. అదే రోడ్డు పైన గరిష్ఠంగా 160 కిలో/గంట వేగంతో దూసుకు పోగలదు. డ్రైవింగ్ మోడ్ నుంచి ఫ్లైయింగ్ మోడ్‌లోకి మారడానికి పదినిమిషాల సమయం తీసుకుంటుంది. ఒక్కసారి ఫుల్ ట్యాంక్ చేస్తే దాదాపు 500 కిలో మీటర్లు ప్రయాణించగలదు. ఇందులో పైలెట్‌తో పాటూ మరో వ్యక్తి మాత్రమే ప్రయాణించే అవకాశం ఉంది. అయితే త్వరలోనే కొత్త టెక్నాలజీతో కుటుంబసభ్యులు అందరూ కలిసి ప్రయాణించేలా మరో మోడల్‌ను కూడా రూపొందించే యోచనలో సంస్థ ఉంది. పర్వతాలు, నదులు, సరస్సులు, ట్రాఫిక్ జామ్‌లను దాటుకుంటూ లిబర్టీలో చక్కర్లు కొడుతుంటే ఓ కొత్త అనుభూతి కలుగుతుందని పాల్-V యాజమాన్యం తెలిపింది. ఈ వాహనంలో చక్కర్లు కొట్టాలంటే మాత్రం ముందస్తుగా శిక్షణ తీసుకోవాల్సిందే. రోడ్డు, గాల్లో ఈ వాహనాన్ని నడపాలంటే ప్రైవేట్ పైలెట్ లైసెన్స్ ఉండాలి. లిబర్టీ తొలి మోడల్ ధర దాదాపు రూ. 3.8 కోట్లుగా నిర్ణయించారు. -
ఎగిరే.. మనసే ఎగిరే...
ఎగిరే కారు వచ్చేస్తోంది... వచ్చేస్తోంది..! ఇలాంటి వార్తలు ఇప్పటివరకూ చాలా చూసే ఉంటాం. కానీ... ఇది మాత్రం చిట్టచివరిది కావచ్చు. ఎందుకంటే.. సాంకేతికంగా, భద్రతా పరంగా అన్ని రకాల అనుమతులు సాధించి తొట్టతొలి ఎగిరే కారుగా రికార్డు సృష్టించేందుకు నెదర్లాండ్స్ కంపెనీ పీఏఎల్–వీ సిద్ధమైంది! ఫొటోల్లో కనిపిస్తున్నవి వచ్చే ఏడాది నుంచి అందుబాటులోకి వచ్చే పీఏఎల్–వీ లిబర్టీ ఎగిరే కారు మోడళ్లు! ఇప్పుడు వీటి ప్రత్యేకతలేమిటో చూద్దాం. వీటిలో గాల్లో ఎగిరేందుకు, రోడ్డుపై పరుగులు పెట్టేందుకు రెండు ప్రత్యేకమైన రోటాక్స్ ఇంజిన్స్ ఉంటాయి. సాధారణ కారు సైజులోనే ఇవి ఉన్నా ఇద్దరు మాత్రమే ప్రయాణించగలరు. రోడ్డుపై వెళ్లేటప్పుడు ప్రొపెల్లర్లు కారు బాడీలోకి ఒదిగిపోతాయి. చిన్న మీట నొక్కగానే విచ్చుకుని అయిదు నిమిషాల వ్యవధిలో కారు ఎగిరేందుకు సాయపడతాయి. దాదాపు ఆరు అడుగుల ఎత్తుండే ఈ కార్లు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు. ఒకసారి ఇంధనం నింపుకుంటే 500 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. రోడ్డుపై వెళ్లేటప్పుడు ఇంతే ఇంధనంతో 1,315 కిలోమీటర్లు వెళ్లవచ్చు. ప్రస్తుతం ఈ ఎగిరే కారు రెండు మోడళ్లలో లభ్యమవుతోంది. పయనీర్ ఎడిషన్ పేరుతో వచ్చే మోడల్లో కొనేవాడి ఇష్టం మేరకు ఇంటీరియర్, ఎక్స్టీరియర్ డిజైన్లను ఏర్పాటు చేస్తారు. ఈ మోడల్ ఖరీదు దాదాపు రూ.5 కోట్లు. ఇలాంటి హంగులేవీ లేని రెండో మోడల్ రూ.3 కోట్ల వరకూ ఖరీదు చేస్తుంది. అయితే ఈ మోడల్‌ను కొనుక్కునేందుకు వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది. ప్రస్తుతానికి ఈ ఎగిరే కార్లను ఎక్కడపడితే అక్కడ వాడే అవకాశం లేదు. తగిన నిబంధనలు రూపొందిస్తే భవిష్యత్తులో హైవే నుంచి ఉన్నట్టుండి పైకి ఎగిరి గాల్లో దూసుకెళ్లే కార్లను చూడవచ్చునేమో. – సాక్షి నాలెడ్జ్ సెంటర్