
రోజువారీ ట్రాఫిక్ రద్దీతో ఇబ్బంది పడుతున్నారా..? ఇకపై మీ సమస్యకు చెక్ పెట్టేలా గాల్లో ఎగిరే కార్లు వస్తున్నాయి. అలెఫ్ ఏరోనాటిక్స్ సంస్థ సినిమాల్లో మాదిరి గాల్లో ఎగిరే కారును తయారు చేసింది. కాలిఫోర్నియాకు చెందిన ఈ స్టార్టప్ తన ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కారు ‘మోడల్ ఏ’ను విజయవంతంగా ప్రదర్శించింది. ఈ వినూత్న వాహనాన్ని రోడ్లపై కూడా డ్రైవ్ చేసేలా తయారు చేసినట్లు సంస్థ పేర్కొంది. ఇది గాల్లో నిలువుగా టేకాఫ్ అవుతుందని కంపెనీ స్పష్టం చేసింది.
సాధారణంగా ఎగిరే కార్లంటే డ్రోన్ల మాదిరి బయటకు కనిపించేలా బారీ ప్రొపెల్లర్లును కలిగి ఉండే అవకాశం ఉంది. కానీ ఈ ‘మోడల్ ఏ’ కారు ఇన్‌బిల్ట్‌గా ఉన్న రోటర్ బ్లేడ్లతో సాంప్రదాయ ఆటోమోటివ్ డిజైన్‌ను కలిగి ఉంది. ఆ డిజైన్‌తోనే నేలపై నుంచి ఎగిరే సామర్థ్యం దీని సొంతం. ఇది పూర్తి ఎలక్ట్రిక్ వాహనం. ఒకసారి ఛార్జ్ చేస్తే రోడ్లపై 320 కిలోమీటర్ల డ్రైవింగ్ పరిధిని, గాల్లో 160 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని కంపెనీ పేర్కొంది.
Flying Cars Are Here!
Back to the Future predicted them for 2015. It didn't happen. But now we're getting closer.
The dream of flying above traffic is becoming real.
Alef Aeronautics is making this happen with their Model A. pic.twitter.com/NeKgH4lREf— Alex / AI Experiments (@byalexai) February 24, 2025
ఇదీ చదవండి: ఎన్‌బీఎఫ్‌సీ, సూక్ష్మ రుణాలకు మరింత మద్దతు!
అలెఫ్ ఏరోనాటిక్స్ ఫ్లైయింగ్ కారుతో ట్రాఫిక్ రద్దీ సమస్యలను పరిష్కరించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ వాహనం నిలువుగా టేకాఫ్, ల్యాండింగ్ సామర్థ్యాలు కలిగి ఉండడంతో రన్‌వేల అవసరం ఉండదు. ఇది పట్టణ వాతావరణానికి సరిగ్గా సరిపోతుందని చెబుతున్నారు. కంపెనీ ‘మోడల్ ఏ’ కోసం 3,300 కంటే ఎక్కువ ప్రీఆర్డర్లను అందుకున్నట్లు పేర్కొంది. ఇది సుమారు 3,00,000 డాలర్ల (రూ.2.5 కోట్లు) ధర ఉండే అవకాశం ఉంది. ఈ సంవత్సరం చివరిలో దీన్ని మార్కెట్‌లోకి తీసుకురాబోతున్నట్లు సంస్థ చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment