మణిపూర్‌లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అండగా నిలిచింది. రెండు ప్రత్యేక విమానాల్లో మొత్తం 157 మంది విద్యార్థులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు ముమ్మర ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో మణిపూర్ నుంచి ఏపీ, తెలంగాణ విద్యార్థులు హైదరాబాద్‌కు చేరుకున్నారు. తొలి విమానంలో 108 విద్యార్థులు హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చారు. హైదరాబాద్ నుంచి విద్యార్థలను తమ స్వస్థలాలకు చేరేవేసేందుకు రెండు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు.
మరో ప్రత్యేక విమానంలో 49 విద్యార్థులు కోల్‌కత్తాకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి హైదరాబాద్‌కు వచ్చేలా ఏపీ అధికారులు ఏర్పాటు చేశారు. ఏపీ విద్యార్థులకు సహాయం చేసేందుకు ప్రభుత్వం కోల్‌కతాకు ప్రత్యేకంగా ఇద్దరు అధికారులు పంపింది. అంతేగాక విద్యార్థులకు విమాన టికెట్లను ప్రభుత్వమే బుక్ చేసింది. విద్యార్థుల భోజన, రవాణా సదుపాయలన్ని ప్రభుత్వం సొంత ఖర్చుతో అందిస్తుంది.
చదవండి: ఫలించిన సీఎం జగన్ యత్నం
సీఎంకు ధన్యవాదాలు
మణిపూర్ చదువుతున్న తెలుగు విద్యార్థులను ప్రత్యేక విమానంలో రాష్ట్రానికి తీసుకువస్తున్న నేపథ్యంలో వారి తలిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మణిపూర్ ఎన్‌ఐటీలో కార్తీక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న తిరుపతి కొర్లగుంటకు చెందిన కార్తీక్ తల్లిదండ్రులు రెడ్డప్ప, మాధవి హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మణిపూర్ ఘటనతో తమ కొడుక్కి ఏం జరుగుతుందో అని ఆందోళన చెందామని, ఎయిర్‌పోర్టు నుంచి కార్తీక్ ఫోన్ చేశాడని పేర్కొన్నారు. సీఎం జగన్ దయవల్ల ఏపీ విద్యార్థులు అందరూ వెనక్కి వస్తున్నారని, ఈ మేరకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment