
(ఫైల్ ఫోటో)
సాక్షి, అమరావతి: ఉక్రెయిన్ దేశంలో తెలుగు విద్యార్థులు క్షేమంగా ఉన్నారని ఏపీ మంత్రి ఆదిమూలాపు సురేష్ తెలిపారు. రష్యా, ఉక్రెయిన్‌పై దాడులు చేస్తున్న యుద్ధ సమయంలో మంత్రి ఆదిమూలాపు సురేష్ ఉక్రెయిన్‌లో ఉన్న తెలుగు విద్యార్థులతో ఫోన్‌లో మాట్లాడారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశారని తెలిపారు.
ప్రభుత్వం విద్యార్థులను ఉక్రెయిన్ రప్పించేందుకు ప్రయత్నిస్తోందని వెల్లడించారు.ప్రస్తుతం ఉక్రెయిన్‌లో విమాన సర్వీసులు రద్దయ్యాయని మంత్రి ఆదిమూలపు తెలిపారు. విద్యార్థుల సహాయం కోసం నోడల్ అధికారి, స్పెషల్ ఆఫీసర్‌ను నియమించినట్లు చెప్పారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో అధికారులను అప్రమత్తం చేశామని పేర్కొన్నారు.
నోడల్ అధికారిగా రవి శంకర్: 9871999055.
అంతర్జాతీయ సహకారం ప్రత్యేక అధికారిగా రిటైర్డ్ ఐఎఫ్‌ఎస్ గీతేష్ శర్మను సంప్రదించాల్సిన నెంబర్: 7531904820
ఏపీ ఎన్ఆర్‌టీ సీఈఓ దినేష్ కుమార్: 9848460046
Comments
Please login to add a commentAdd a comment