
తాడేపల్లి: ఉక్రెయిన్‌లో తెలుగు విద్యార్థులు క్షేమంగా ఉన్నారని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. విద్యార్థులను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆయన పేర్కొన్నారు.
దీనిపై ఇప్పటికే ఇద్దరు ప్రత్యేక అధికారులను నియమించిన విషయాన్ని సజ్జల తెలిపారు. ఇదే విషయంపై విదేశాంగశాఖ మంత్రికి సీఎం జగన్ లేఖ రాశారన్నారు. ఎంబసీతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామన్నారు.