చత్తీస్‌గఢ్ నుంచి బస్సులో బయలుదేరిన తెలుగు విద్యార్థులు
సాక్షి, అమరావతి/న్యూఢిల్లీ: ఇటలీలోని తెలుగు విద్యార్థులు సోమవారం విశాఖ చేరుకోనున్నారు. ఇటలీ నుంచి మార్చి 15, 21 తేదీల్లో ఢిల్లీ వచ్చి ప్రభుత్వ ఐటీబీపీ క్యాంపస్‌లోని క్వారంటైన్ కేంద్రాల్లో ఏపీ విద్యార్థులు 33 మంది ఉన్నారు. వీరికి రెండు సార్లు కోవిడ్ పరీక్షలు జరపగా నెగిటివ్‌గా తేలింది. క్వారంటైన్ పూర్తయ్యాక ఐటీబీపీ క్యాంపస్ అధికారుల అనుమతి తీసుకుని ప్రైవేటు బస్సులో ఏప్రిల్ 10న బయలుదేరారు. ఛత్తీస్‌గఢ్ అధికారులు వీరిని ఆపేశారు.
అన్ని పత్రాలు ఉన్నాయని చూపినా వారు కదలనివ్వలేదు. స్థానికంగా ఆదివాసీ బాలికా విహార్‌లో వసతి కల్పించారు. ఇందులో కొందరు విద్యార్థినులు కూడా ఉన్నారు. విషయాన్ని విద్యార్థులు ఏపీ ప్రభుత్వం, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ ఎంపీ జీవీఎల్ దృష్టికి తీసుకెళ్లారు. సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ సవాంగ్, ఐఏఎస్ అధికారి కృష్ణబాబు చొరవ తీసుకొని విద్యార్థులు విశాఖకు చేరే విధంగా ఏర్పాట్లు చేశారు.
కాశీ నుంచి తెలుగు రాష్ట్రాలకు యాత్రికుల తరలింపు: జీవీఎల్
లాక్‌డౌన్‌కు ముందు కాశీ యాత్రకు వెళ్లి అక్కడే చిక్కుకుపోయిన వెయ్యి మంది తెలుగు యాత్రికులను సొంత ప్రాంతాలకు తరలించినట్టు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు. ప్రధాని కార్యాలయ అనుమతితో వారందరినీ స్వస్థలాలకు తరలించేందుకు చర్యలు చేపట్టారన్నారు. కాగా, ఏపీలో చిక్కుకుపోయిన జపాన్ దేశీయులను వారి దేశానికి తరలించడానికి విశాఖ నుంచి బెంగళూరుకు నేడు ప్రత్యేక విమానం నడపనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment