Telugu Student
-
అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతి
వాషింగ్టన్ : అమెరికాలో తెలుగు విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. న్యూయార్క్‌లో చదువుతున్న తుమ్మేటి సాయికుమార్‌రెడ్డి తన రూమ్‌లో బలవన్మరణానికి పాల్పడ్డారు. ఓ వైపు చదువుకుంటూనే మరోవైపు పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తున్న సాయికుమార్‌రెడ్డి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చాక.. తెలుగు విద్యార్థులకు కష్టాలు మొదలయ్యాయి. పార్ట్‌టైమ్ జాబ్ చేసే వారి పరిస్థితి మరింత దయనీయంగా మారింది. పార్ట్‌టైమ్ జాబ్స్ లేక.. ఎడ్యుకేషన్ లోన్ చెల్లించాల్సి రావడంతో విద్యార్థులు ఒత్తిడి గురవుతున్నారు. ఒత్తిడి తట్టుకోలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. కొద్ది రోజుల క్రితం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం మాదన్నపేటకు చెందిన విద్యార్థి బండి వంశీ(25) అనుమానాస్పద రీతిలో మరణించారు. కాంకోర్డియా సెయింట్ పాల్ విశ్వవిద్యాలయం చదువుతూ.. 8580 మాగ్నోలియా ట్రైల్ ఈడెన్ ప్రెయిరీ అపార్ట్మెంట్లో పార్క్ చేసిన కారులో అనుమానాస్పద స్థితితో మృతి చెందాడు. తాజాగా, సాయికుమార్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవడంతో అతని స్నేహితులు శోకసంద్రంలో మునిగిపోయారు. -
అమెరికాలో తెలంగాణ వాసి మృతి
-
అమెరికాలో తెలుగు విద్యార్థి అనుమానాస్పద మృతి
కమలాపూర్: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం మాదన్నపేటకు చెందిన విద్యార్థి బండి వంశీ(25) శనివారం రాత్రి అమెరికాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. మాదన్నపేటలో కల్లుగీత వృత్తితో పాటు వ్యవసాయం చేసుకుని జీవనం సాగించే బండి రాజయ్య–లలిత దంపతులకు ఇద్దరు కుమారులు. వీరి చిన్న కుమారుడు వంశీ సుమారు రెండేళ్ల క్రితం ఉన్నత చదువుల(ఎంఎస్) కోసం అమెరికాకు వెళ్లాడు. కాంకోర్డియా సెయింట్ పాల్ విశ్వవిద్యాలయం చదువుతూ.. 8580 మాగ్నోలియా ట్రైల్ ఈడెన్ ప్రెయిరీ అపార్ట్మెంట్, రూం నంబర్ 206, మిన్నెసోటా 55344లో ఉంటున్నాడు. శనివారం రాత్రి అపార్ట్మెంట్ కింద ఉన్న సెల్లార్లో పార్కుచేసి కారులో వంశీ ఉరి వేయబడి అనుమానాస్పద స్థితితో మృతి చెందాడు. సమాచారం అందుకున్న అక్కడి పోలీసులు మృతదేహాన్ని తరలిస్తున్న సమయంలో.. పక్క అపార్ట్మెంట్లో ఉంటున్న కంఠాత్మకూర్ వాసి విషయాన్ని ఫోన్ ద్వారా తన తల్లిదండ్రులకు తెలుపగా వారు వంశీ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వంశీ మృతితో మాదన్నపేటలో విషాదం అలుముకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి వంశీ మృతదేహాన్ని త్వరితగతిన స్వస్థలానికి తెప్పించాలని, మృతికి కారకులను చట్టపరంగా శిక్షించేలా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరారు. ఇదిలా ఉండగా.. వంశీ మృతి విషయాన్ని స్థానిక బీజేపీ నాయకులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ దృష్టికి తీసుకెళ్లి మృతదేహాన్ని త్వరగా తీసుకొచ్చేలా చూడాలని కోరినట్లు పేర్కొన్నారు.మృతదేహాన్ని తెప్పించేందుకు కృషి చేస్తా : ప్రణవ్అమెరికాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన వంశీ మృతదేహాన్ని ప్రభుత్వ పరంగా వీలైనంత త్వరితగతిన స్వగ్రామానికి తెప్పించేందుకు తన వంతుగా కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఒడితల ప్రణవ్ తెలిపారు. ఆయన మాదన్నపేటకు వెళ్లి వంశీ తల్లిదండ్రులను పరామర్శించి ఓదార్చారు. కుటుంబానికి ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. -
అమెరికాలో కాల్పులు.. ఖమ్మం విద్యార్థి మృతి
-
అమెరికా స్పెల్ బీ విజేత బృహత్ సోమ
వాషింగ్టన్: అమెరికా స్పెల్లింగ్ పోటీలో తెలుగు సంతతి విద్యార్థి గెలుపొందారు. ఏడో గ్రేడ్ చదువుతున్న 12 ఏళ్ల బృహత్ సోమ.. ప్రతిష్టాత్మక స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ–2024లో విజేతగా నిలిచాడు. 90 సెకన్లలో 29 పదాలకు సరైన సమాధానం ఇచ్చి బహుమతిగా 50వేల డాలర్లు అంటే దాదాపు రూ.41.64లక్షలు గెలుచుకున్నాడు. వాషింగ్టన్లో మూడు రోజుల పాటు జాతీయ స్పెల్‌బీ చాంపియన్íÙప్ పోటీలు జరిగాయి. 50 రాష్ట్రాల నుంచి 245 మంది విద్యార్థులు పోటీలో పాల్గొన్నారు. 14 రౌండ్ల తర్వాత గురువారం జరిగిన ఫైనల్‌కు 8 మంది చేరుకున్నారు. ఫైనల్లో మొదట 30 పదాలకు 29కి సరైన సమాధానం చెప్పిన బృహత్ టై బ్రేకర్‌గా నిలిచాడు. 25 పదాల్లో 21 పదాలకు సరైన సమాధానం ఇచి్చన ఫైజన్ జాకీ మిగిలిన ఆరుగురిని అధిగమించాడు. లైటెనింగ్ రౌండ్లో బృహత్తో పోటీ పడలేకపోయాడు. 90 సెకన్లలో 30 పదాల్లో 29 పదాలకు స్పెల్లింగ్‌ను కరెక్టుగా చెప్పి బృహత్ రికార్డు నెలకొల్పాడు. అబ్సీల్ అనే పదం బృహత్‌కు చాంపియన్‌షిప్‌ను అందించింది. 90 సెకన్లలో 20 పదాలకు మాత్రమే సరైన సమాధానం ఇచ్చిన ఫైజన్ రెండో స్థానంలో నిలిచాడు. 25వేల డాలర్లను గెలుచుకున్నాడు. ఇక కాలిఫోరి్నయాకు చెందిన శ్రేయ్ ఫారిఖ్, నార్త్ కరోలినాలోని అపెక్స్‌కు చెందిన అనన్య ప్రసన్న మూడో స్థానంలో నిలిచారు. చెరో 12,500 డాలర్లను బహుమతిగా అందుకున్నారు. ఫైనల్‌కు చేరిన ఎనిమిది మంది విద్యార్థుల్లో ఐదుగురు భారతీయ సంతతికి చెందినవారు. కాలిఫోరి్నయాకు చెందిన 14 ఏళ్ల రిషబ్ సాహా, కొలరాడోకు చెందిన 13 ఏళ్ల అదితి ముత్తుకుమార్ కూడా ఫైనల్‌కు చేరినవారిలో ఉన్నారు. అమోఘమైన జ్ఞాపకశక్తి.. బృహత్ తండ్రి శ్రీనివాస్ సోమ నల్లగొండ జిల్లాకు చెందిన వ్యక్తి. ఫ్లోరిడాలో స్థిరపడ్డారు. బృహత్‌కు జ్ఞాపకశక్తి ఎక్కువని, భగవద్గీతలో 80 శాతం కంఠతా వస్తుందని అతని తల్లిదండ్రులు తెలిపారు. ‘‘గెలిచానని ప్రకటించగానే కొన్ని క్షణాలపాటు నమ్మలేకపోయాను. నా గుండె వేగం పెరిగింది. ఆ తరువాత గొప్ప అనుభూతినిచి్చంది’’ అని బృహత్ వెల్లడించాడు. కేవలం 12 ఏళ్ల వయసులో బృహత్ తన ప్రశాంతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడని స్క్రిప్స్ నిర్వాహకులు తెలిపారు. బృహత్‌కు గొప్ప జ్ఞాపకశక్తి ఉందని, అన్ని రౌండ్లలో ఏ ఒక్క పదాన్ని కోల్పోకుండా సమాధానం చెప్పి పదాలను శాసించాడని కొనియాడారు. గతంలోనూ స్పెల్ బీలో పాల్గొన్న బృహత్ 2023లో 74వ స్థానంలో, 2022లో 163 స్థానంలో నిలిచారు. వివిధ అంశాల్లో ఆసక్తి, అభిరుచి ఉన్న బృహత్ అంతకుముందు వర్డ్స్ ఆఫ్ విస్డమ్ బీ, స్పెల్ పండిట్ బీలను కూడా గెలుచుకున్నాడు. భారత సంతతి విద్యార్థుల హవా...కాగా, స్పెల్ బీలో భారత సంతతి విద్యార్థుల హవా కొనసాగుతోంది. గత ఏడాది స్పెల్ బీని సైతం భారత సంతతికి చెందిన విద్యార్థి దేవ్ షా గెలుచుకున్నాడు. 2022లో హరిణి లోగాన్ ఛాంపియన్íÙప్ను గెలుచుకుంది. దేశంలోనే అతిపెద్ద, ఎక్కువ రోజులు జరిగే కార్యక్రమం అయిన స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీని 1925లో ప్రారంభించారు. 1999 నుంచి ఇప్పటివరకు ఇరవై తొమ్మిది మంది భారతీయ సంతతికి చెందిన విద్యార్థులే చాంపియన్లుగా నిలిచారు. -
సివిల్స్‌లో తెలుగు తేజాలు
సాక్షి, హైదరాబాద్: సివిల్స్‌లో ర్యాంకు సాధించడం దేశంలో చాలామంది కల. ఇందులో ఈసారీ తెలుగు విద్యార్థులు సత్తా చాటి తమ లక్ష్యాన్ని అందుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన దోనూరు అనన్యరెడ్డి మూడో ర్యాంకు సాధించారు. వంద లోపు ర్యాంకుల్లో ముగ్గురు తెలుగువాళ్లే ఉన్నారు. నందాల సాయి కిరణ్ 27వ ర్యాంకు సాధిస్తే, కేఎన్ చందన జాహ్నవి 50, మెరుగు కౌశిక్ 82వ ర్యాంకు సాధించారు. మొత్తం ర్యాంకుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు 36 మంది ఉన్నారు. అలాగే, ఇతర కేంద్ర సర్వీసులకు 20 మందికిపైగా ఎంపికయ్యారు. మొత్తమ్మీద కేంద్ర సర్వీసులకు 56 మందికిపైగా తెలుగు తేజాలు ఎంపికవడం విశేషం. అఖిల భారత సర్వీసుల్లో పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్స్– 2023 కోసం గత ఏడాది మే 28న ప్రిలిమ్స్ నిర్వహించింది. ప్రిలిమినరీలో అర్హత పొందిన వారికి గత నవంబర్‌లో మెయిన్స్ పరీక్ష నిర్వహించగా, ఈ పరీక్ష ఫలితాలను డిసెంబర్ 8న వెల్లడించారు. మెయిన్స్‌లోనూ అర్హత పొందిన వారికి జనవరి 2, ఏప్రిల్ 9 మధ్య వ్యక్తిగత ఇంటర్వ్యూలు నిర్వహించారు. మొత్తంగా పొందిన మార్కుల ఆధారంగా ర్యాంకులను యూపీఎస్సీ మంగళవారం ప్రకటించింది. ఆలిండియా టాపర్‌గా లక్నోకు చెందిన ఆదిత్య శ్రీవాత్సవ నిలవగా, ఒడిశాకు చెందిన అనిమేష్ ప్రదాన్ రెండో స్థానంలో నిలిచారు. తెలంగాణకు చెందిన అనన్య రెడ్డి మూడో ర్యాంకు సాధించారు. 2022 సివిల్స్‌లోనూ తెలుగు విద్యార్థి ఉమాహారతి మూడో స్థానం పొందడం విశేషం. 1,016 మంది ఎంపిక సివిల్స్–2023 కోసం యూపీఎస్సీ 1,016 మందిని ఎంపిక చేసింది. ఇందులో జనరల్ కేటగిరీలో 347 మంది ఉన్నారు. ఈడబ్ల్యూఎస్ కోటా నుంచి 115, ఓబీసీ నుంచి 303, ఎస్సీల నుంచి 165, ఎస్టీ విభాగం నుంచి 86 మంది ఎంపికయ్యారు. పోస్టుల వారీగా చూస్తే ఐఏఎస్ సర్వీసులకు 180 మంది, ఐఎఫ్ఎస్కు 37 మంది, ఐపీఎస్‌కు 200 మంది ఎంపికయ్యారు. సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్–ఏ కేటగిరీకి 613 మంది, గ్రూప్ బీ సర్వీసెస్‌కు 113 మంది ఎంపికైనట్టు యూపీఎస్సీ వెల్లడించింది. అభ్యర్థులు పొందిన మార్కులను 15 రోజుల్లో తమ వెబ్సైట్లో ఉంచుతామని ప్రకటించింది. విజేతలకు సీఎం రేవంత్ శుభాకాంక్షలు సివిల్స్ ఫలితాల్లో మెరిసిన తెలుగు రాష్ట్రాల విజేతలకు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. తెలంగాణ, ఏపీ నుంచి ఈసారి 50 మందికి పైగా ఎంపికవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించిన పాలమూరుకు చెందిన దోనూరి అనన్య రెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. మహేష్ భగవత్ కృషి ఫలించింది సివిల్స్ పరీక్షల్లో సీనియర్ ఐపీఎస్ అధికారి మహేష్ భగవత్ గైడెన్స్ మంచి ఫలితాలను ఇచ్చింది. హైదరాబాద్ కేంద్రంగా శిక్షణ పొందుతున్న వారితో ప్రత్యక్షంగా, ఇతర రాష్ట్రాల వారితో ఆన్లైన్ ద్వారా ఆయన ఇచ్చిన సూచనలతో 200 మందికి పైగా ర్యాంకులు సాధించారు. అందులో తెలంగాణ నుంచి అనన్య రెడ్డి సహా జాతీయ పోలీస్ అకాడమీలో ఐపీఎస్ శిక్షణ పొందుతున్న వారు కూడా ఉన్నారు. సివిల్స్ ప్రిపేరయ్యే వారికి వ్యక్తిత్వ వికాసం, పరీక్ష సమయాల్లో ఒత్తిడి, సమయ పాలన, ఇంటర్వ్యూలో వ్యవహరించాల్సిన తీరు తదితర అంశాలపై మహేష్ భగవత్ సూచనలు చేశారు. -
అమెరికాలో తెలుగు విద్యార్థి కిడ్నాప్ : క్లీవ్‌ల్యాండ్ డ్రగ్స్ ముఠా పనేనా?
అమెరికాలో చదువుతున్న భారతీయ విద్యార్థుల రక్షణకు సంబంధించి వరుస ఘటనలు ఆందోళన రేపు తున్నాయి. తాజాగా అమెరికాలో మాస్టర్స్ చదువుతున్నహైదరాబాద్కు చెందిన 25 ఏళ్ల అబ్దుల్ మహ్మద్ కిడ్నాప్ ఉదంతం కలకలం రేపుతోంది. క్లీవ్‌ల్యాండ్‌లో డ్రగ్స్ అమ్మే ముఠానే ఈ కిడ్నాప్‌కు పాల్పడినట్టు తెలుస్తోంది. క్లేవ్‌ల్యాండ్ యూనివర్శిటీలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ)లో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్న అబ్దుల్ మహ్మద్ మార్చి 7 నుంచి ఆచూకీ లేకుండా పోయింది. దీంతో కుటుంబ సభ్యులు అందోళనకు గురయ్యారు. ఇంతలో అయితే కిడ్నాపర్ల నుంచి డబ్బులుచెల్లించాల్సిందిగాలు గుర్తు తెలియని వ్యక్తులనుంచి ఫోన్ వచ్చిందని అబ్దుల్ తండ్రి మహ్మద్ సలీమ్ వెల్లడించారు. అబ్దుల్‌ను విడుదల చేయాలంటే 1,200 డాలర్లు డిమాండ్ చేశారని తెలిపారు. దీంతో వారు మార్చి 8న క్లీవ్‌ల్యాండ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే మార్చి 18న చికాగోలోని ఇండియన్ కౌన్సిల్ నుండి సహాయం కోరారు. మరోవైపు మార్చి 7న తన కొడుకుతో చివరిసారిగా మాట్లాడానని అంటూ అబ్దుల్ తల్లి అబేదా ఆవేదన వ్యక్తం చేశారు. తన బిడ్డ ఆచూకీ విషయంలో కేంద్రం జోక్యం చేసుకుని, క్షేమంగా తిరిగి వచ్చేలా చూడాలని ఆమె విజ్ఞప్తి చేశారు. క్లీవ్‌ల్యాండ్ పోలీసులు ప్రస్తుతం అబ్దుల్ అదృశ్యంపై విచారణ చేపట్టారు. -
అమెరికాలో హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు: టీడీపీకి వైఎస్సార్సీపీ స్ట్రాంగ్ కౌంటర్
అమెరికాలో మిస్సోరిలో కొన్ని నెలలుగా ఒక తెలుగు యువకుడిని బంధించి వేధించిన కేసు కలకలం రేపింది. అయితే ఈ కేసులో నిందితులను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో నిందితులపై సత్తారు వెంకటేష్ రెడ్డి (35), శ్రావణ్ వర్మ (23), నిఖిల్ (27)పై విచారణ, చట్టపరమైన చర్యలకు తీసుకునేందుకు అక్కడి అధికారులు సన్నద్ధమయ్యారు. అయితే ఇక్కడే మరోసారి టీడీపీ తన వక్రబుద్ధిని చాటుకుంది. ప్రధాన నిందితుడు వైఎస్సార్సీపీకి చెందిన నాయకుడు అంటూ టీడీపీ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తోంది. ఈ ఆరోపణలను ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్ ఖండించారు. "మన రాష్ట్రం, మనదేశం కానీ ఒక ప్రాంతంలో జరిగిన నేరాన్ని అడ్డం పెట్టుకుని మా పార్టీ, ప్రభుత్వం పై టీడీపీ విమర్శలు చేయడం టీడీపీ దిగజారుడుతానానికి నిదర్శనమన్నారు. మోకాలికి బొడిగుండుకు ముడిపెట్టి లబ్ధిపొందాలన్న ఆలోచనతో టీడీపీ దిగజారి వ్యవహరిస్తోంది. ఈ కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుంది. చట్టాన్ని గౌరవించే పార్టీ వైఎస్సార్సీపీ అని, నిందితులు ఎవరైనా సరే నేరం నిరూపణ అయిన పక్షంలో శిక్షార్హులని" ఆయన వెల్లడించారు. "టీడీపీ కార్యకర్తలు, అభిమానుల్లో నేరప్రవృత్తి ఉన్నవారు తమ వ్యక్తిగత జీవితాల్లో చేసే నేరాలకు టీడీపీ బాధ్యత తీసుకుంటుందా? టీడీపీ నేతలు మహిళలపై చేసే అఘాయిత్యాలకు చంద్రబాబు, లోకేష్ బాధ్యత తీసుకుంటారా? అని రత్నాకర్ సూటిగా ప్రశ్నించారు. అంతేకాదు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వెంకటేష్ సత్తారును అడ్డంపెట్టుకుని ఈ నేరాన్ని వైఎస్సార్సీపీకి ముడిపెట్టాలని, తద్వారా లబ్ధిపొందాలని చూసే టీడీపీ.. ముందుగా ఏపీలో టీడీపీ నేతలు నడిపే కాల్ మనీ సెక్స్ రాకెట్లపై సమాధానం చెప్పాలి. ఎక్కడో విదేశాల్లో జరిగే నేరాలను మాకు ముడిపెట్టడం కాదు.. ఏపీలో టీడీపీ నేతలు చేసే దుర్మార్గాలకు టీడీపీ బాధ్యత వహించాలన్నారు" రత్నాకర్. "కాల్ మనీ దందాలు, సెక్స్ రాకెట్లు నడిపి వేలాది మహిళల జీవితాలను చీకట్లోకి నెట్టిన నీచమైన చరిత్ర టీడీపీ నేతలది. వీరి సెక్స్ రాకెట్ దందా ఏపీ నుండి అమెరికా వరకు విస్తరించింది. గతంలో ఎన్నారై టీడీపీ నేతలు వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డారు. టీడీపీ నేరప్రవృత్తి కలిగిన పార్టీ..అందుకే ఏపీ ప్రజలు టీడీపీని 23 సీట్లకు పరిమితం చేశారు. ఇలాంటి అనైతిక ప్రచారం తో 2024 ఎన్నికల్లో తెదేపా తెలంగాణ లో మాదిరి గానే తుడిచి పెట్టుకు పోతుందని" పేర్కొన్నారు. ఇదే తెదేపా సంస్కారం ? మీరు చేస్తే సంసారం ... ఇంకోళ్ళు చేస్తే .....చారం .. రాష్ట్రం ఐనా , దేశం ఐనా ... విదేశం ఐనా ... చట్టానికి ఎవరు చుట్టం కాదు .. తన పని చట్టం చేసుకుంటది ..#ENDOFTDP pic.twitter.com/qqLE1LaOSM — Kadapa Rathnakar (@KadapaRathnakar) December 1, 2023 మరోవైపు ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ NRI మెడికల్ అఫైర్స్ అడ్వయిజర్ డాక్టర్. వాసుదేవరెడ్డి స్పందించారు. 'అమెరికాలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్నారై సత్తారు వెంకటేష్ రెడ్డికి, పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. ఈ ఘటనను వైఎస్సార్సీపీతో పాటు ప్రతి ఒక్క ఎన్నారై తీవ్రంగా ఖండిస్తున్నట్టు ప్రకటించారు. ప్రపంచంలో ఎక్కడ తప్పుడు పనులు తెరపైకి వచ్చినా, అది వైఎస్సార్సీపీకి అంటగట్టేలా చేయడమే టీడీపీతో పాటు కొన్ని ఛానళ్లు పనిగా పెట్టుకున్నాయని విమర్శించారు. -
స్వగ్రామానికి తెలుగు విద్యార్థి మృతదేహం
జి.కొండూరు: కొలంబియాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన తెలుగు విద్యార్థి బేతపూడి సుధీర్‌కుమార్ మృతదేహం స్వగ్రామమైన ఎన్టీఆర్ జిల్లా, జి.కొండూరుకు సోమవారం ఉదయం చేరింది. మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణప్రసాద్ కృషి, రాష్ట్ర ప్రభుత్వం చొరవతో బాధిత తల్లిదండ్రులకు కుమారుడి చివరిచూపు దక్కింది. జి.కొండూరుకు చెందిన బేతపూడి దేవదాసు కుమారుడు సుదీర్‌కుమార్ అలియాస్ జోషీ (34) ఎంఎస్ చదివేందుకు 2018లో స్పెయిన్ వెళ్లాడు. అనేక కారణాలతో ఎంఎస్ పూర్తి చేయలేకపోయాడు. అక్కడే ఉంటూ పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తూ చదువు కొనసాగిస్తున్నాడు. గతనెల 15వ తేదీన తన స్నేహితురాలైన తోటి విద్యార్థి జెస్సికా జన్మదిన వేడుకల నిమిత్తం కొలంబియా వెళ్లాడు. 19వ తేదీన అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దీంతో మృతుడి తల్లిదండ్రులు బేతపూడి కేథరీన్, దేవదాసు తమ కుమారుడి మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనని, రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని తమ కుమారుడి ఆఖరి చూపు క ల్పించాలని వారు అభ్యర్థించారు. దీనిపై స్పందించిన స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణప్రసాద్ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఏపీఎన్ఆర్టీ) ద్వారా కొలంబియాలోని ఇండియన్ ఎంబసీతో సంప్రదింపులు జరిపి, జి.కొండూరు తరలించి కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు. బంధువులు, కుటుంబ సభ్యుల చివరిచూపు అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. తమ కుమారుడి చివరిచూపును కల్పించిన ఎమ్మెల్యేకు, రాష్ట్ర ప్రభుత్వానికి తామెప్పుడూ రుణపడి ఉంటామని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. -
కొలంబియాలో తెలుగు విద్యార్థి అనుమానాస్పద మృతి
జి.కొండూరు(మైలవరం): కొలంబియాలో స్నేహితురాలి జన్మదిన వేడుకలకు హాజరైన తెలుగు విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు గ్రామానికి చెందిన బేతపూడి సుదీర్‌కుమార్ అలియాస్ జోషి (34) టెలీ కమ్యూనికేషన్లో ఎంఎస్ చేసేందుకు 2018లో స్పెయిన్ వెళ్లాడు. అక్కడ యూనివర్సిటీ ఆఫ్ లే డే జైన్‌లో ఎంఎస్‌లో చేరాడు. కరోనా కారణంగా చదువు పూర్తి కాకపోవడం, సబ్జెక్ట్‌లు మిగిలిపోవడంతో అక్కడే ఉండి పార్ట్‌టైమ్ ఉద్యోగం చేసుకుంటూ ఎంఎస్ పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. తనతోపాటు అదే యూనివర్సిటీలో చదువుతున్న కొలంబియాకు చెందిన యువతి జెస్సికాతో సుదీర్‌కుమార్‌కు పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఈ నెల 15వ తేదీన తన స్నేహితురాలి జన్మదిన వేడుకల నిమిత్తం సుదీర్‌కుమార్ స్పెయిన్ నుంచి కొలంబియా రాజధాని బోగోటో వెళ్లాడు. అక్కడి నుంచి రియో బ్లాంకోలోని స్నేహితురాలి నివాసానికి చేరుకున్నాడు. అక్కడ జన్మదిన వేడుకల అనంతరం ఏం జరిగిందో ఏమో కానీ ఈ నెల 19వ తేదీన మంగళవారం తెల్లవారుజామున కొలంబియాలోని జెస్సీకా నుంచి జి.కొండూరులోని సుదీర్‌కుమార్ తల్లిదండ్రులు బేతపూడి కేథరీన్, దేవదాసుకు సుదీర్‌కుమార్ మరణ వార్త అందింది. తన ఇంట్లోనే సుదీర్‌కుమార్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని జెస్సీకా తెలిపినట్లు కేథరీన్, దేవదాసు చెబుతున్నారు. స్నేహితురాలి జన్మదిన వేడుకలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను సైతం తమతో వాట్సాప్‌లో పంచుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. జన్మదిన వేడుకలలో భాగంగా తాగిన డ్రింక్ వల్ల మత్తుగా ఉందని, తర్వాత మాట్లాడతానని తమతో చివరిగా ఫోన్లో మాట్లాడినట్లు చెబుతున్నారు. తమ కుమారుడిని జన్మదిన వేడుకల పేరుతో రప్పించి కావాలని హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పటికే తాము ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని తమ కుమారుడి భౌతికకాయం తమకు అప్పగించేలా చూడాలని మృతుడి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. -
అమెరికాలో తెలుగు విద్యార్ధి దారుణ హత్య
-
విషాదం.. అమెరికాలో పోలీస్ వాహనం ఢీకొని తెలుగు విద్యార్థిని మృతి..
ఆదోని అర్బన్ (కర్నూలు): అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆదోనికి చెందిన విద్యార్థిని మృతిచెందింది. ఈ ఘటన వివరాలను విద్యార్థిని తాత సూర్యబాబు, మామ శ్రీనివాసులు బుధవారం తెలియజేశారు. కర్నూలు జిల్లా కౌతాళం మండలంలోని కుంబళ్లూరు క్యాంప్‌నకు చెందిన శ్రీకాంత్, విజయలక్షి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. శ్రీకాంత్ కానిస్టేబుల్ కాగా, విజయలక్షి ప్రయివేటు పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నారు. పిల్లల చదువు కోసం శ్రీకాంత్ దంపతులు ఆదోని వచ్చి స్థిర పడ్డారు. పెద్ద కుమార్తె జాహ్నవి (23) ఆదోనిలో డిగ్రీ వరకు చదివింది. ఆమె 2021లో అమెరికాలోని సీయాటిల్ నగరంలో ఉన్న నార్త్ ఈస్ట్రన్ యూనివర్సిటీలో ఎంఎస్ కోర్సులో చేరింది. మరో నాలుగు నెలల్లో జాహ్నవి ఎంఎస్ కోర్సు పూర్తికానుంది. ఈ క్రమంలో ఆమె సోమవారం రాత్రి సియాటిల్‌లో కాలేజీ నుంచి రూమ్‌కు వస్తూ రోడ్డును దాటుతుండగా సీయాటిల్ పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఢీకొంది. వాహనం కింద చిక్కుకున్న జాహ్నవి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఈ విషయం తెలిసిన తల్లి విజయలక్ష్మి ఒక్కసారిగా కుప్పకూలింది. నాలుగు నెలల్లో ఎంఎస్ పూర్తి చేసుకుని అమెరికాలోనే మంచి ఉద్యోగం సంపాదించి జీవితంలో ఉన్నతంగా స్థిరపడతుందని ఆశించిన కుమార్తె అకాలమరణంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. జాహ్నవి మృతదేహాన్ని మరో మూడు రోజుల్లో స్వదేశానికి తీసుకువస్తారని తెలిసింది. -
తెలుగు కుర్రాడి సత్తా.. ప్రతిష్టాత్మక సీఎన్ఎన్ హీరోస్ అవార్డు..
వాషింగ్టన్: తెలుగు కుర్రాడు అమెరికాలో సత్తా చాటాడు. వాడి పడేసిన బ్యాటరీలు రీసైకిల్ చేస్తున్నందుకు సీఎన్ఎన్ హీరోస్ యంగ్ వండర్ అవార్డు కైసవం చేసుకున్నాడు. 13 ఏళ్ల వయసులోనే అరుదైన ఘనత సాధించాడు. ఈ కుర్రాడి పేరు శ్రీ నిహాల్ తమ్మన. తెలుగు మూలాలున్న ఇతని కుటుంబం అమెరికా న్యూజెర్సీలోని ఎడిసన్‌లో నివసిస్తోంది. వాడి పడేసిన బ్యాటరీలు పర్యావరణానికి హానికరం. అందులోని కెమికల్స్ మట్టిని, నీటిని కలుషితం చేస్తాయి. ఏటా ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల బ్యాటరీలను పడేస్తున్నారు. వీటి వల్ల పర్యావరణానికి ఎంత ప్రమాదకరమో 10 ఏళ్ల పసిప్రాయంలోనే గుర్తించాడు నిహాల్. 2019లోనే 'రీసైకిల్ మై బ్యాటరీ క్యాంపెయిన్' ప్రారంభించాడు. బ్యాటరీ రీసైకిల్‌పై అమెరికాలోని స్కూళ్లు తిరిగి విద్యార్థులకు అవగాహన కల్పించాడు నిహాల్. తనతో కలిసి స్వచ్ఛందంగా పనిచేసేందుకు 300 సభ్యుల టీంను ఏర్పాటు చేసుకున్నాడు. వాడిపడేసే బ్యాటరీల కోసం స్కూళ్లు, ఇతర ప్రదేశాల్లో ప్రత్యేక బిన్లు ఏర్పాటు చేశాడు. ఇలా మూడేళ్లలో మొత్తం 2,25,000 బ్యాటరీలను సేకరించి వాటిని రీసైకిల్ చేశాడు. నిహాల్ ప్రతిభను గుర్తించిన సీఎన్ఎన్ అతడ్ని యంగ్ వండర్ అవార్డుతో గౌరవించింది. భవిష్యత్తుల్లో ప్రపంచమంతా రీసైక్లింగ్ బ్యాటరీ సేవలను విస్తరించి పర్యావరణాన్ని కాపాడటమే తన లక్ష్యమని నిహాల్ చెబుతున్నాడు. చదవండి: కరోనా ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత చైనాలో తొలిసారి మరణాలు! -
దేవుడా.. ఇదేమి అన్యాయం.. గుండెకోత మిగిల్చావ్
వరంగల్ చౌరస్తా: వారిది మధ్య తరగతి కుటుంబం. ఇద్దరూ ఆడపిల్లలే. పిల్లలను బాగా చదివించాలనుకున్నాడు. అనుకున్నట్టుగానే పిల్లలు కూడా కష్టపడి చదివారు. పెద్దకూతురు సాఫ్ట్వేర్ ఉద్యోగి, కాగా, చిన్నకూతురును ఉన్నత విద్యాభ్యాసానికి అమెరికా పంపాడు. కానీ ఆ తల్లిదండ్రుల ఆశలు.. మధ్యలోనే ఆరిపోయాయి. అమెరికాలో స్నేహితులతో కలిసి వ్యాన్‌లో వెళ్తున్న ఆమె.. పొగమంచు కారణంగా జరిగిన ప్రమాదంలో చనిపోయింది. ఆ తల్లిదండ్రులకు గుండెకోత మిగిల్చింది. ఇక్కడ మరో విషాద ఏమిటంటే.. కూతురు చనిపోయిన విషయం తల్లికి తెలియజేయలేని పరిస్థితి. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ నగరంలోని గిర్మాజీపేటకు చెందిన గుళ్లపెల్లి రమేష్, కల్పన దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అతను ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో అడ్తి దుకాణాల్లో అకౌంటెంట్‌గా పనిచేస్తుండగా, తల్లి కల్పన ప్రైవేట్ స్కూల్ టీచర్. పెద్ద కుమార్తె వాసవి ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది. చిన్నకూతురు పావని (22)ని అమెరికా పంపించాలనుకున్నారు. అందుకోసం రూపాయి.. రూపాయి కూడబెట్టారు. గత ఏడాది బీటెక్ పూర్తికాగా, ఎంఎస్ కోసం రెండు నెలల క్రితం అమెరికా వెళ్లింది. స్నేహితులతో వెళ్తుండగా.. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 5 నుంచి 7 గంటల సమయంలో కనెక్టికట్ రాష్ట్రంలో 8 మంది స్నేహితులు మినీ వ్యానులో ప్రయాణిస్తున్నారు. వీరి వాహనం పొగమంచు కారణంగా ఓ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మొత్తం ముగ్గురు చనిపోగా, అందులో పావని ఒకరు. మిగతా ఇద్దరు ఏపీకి చెందిన వారు ఉన్నారు. మరికొంతమంది గాయపడ్డారు. గుండెలవిసేలా.. కూతురు చనిపోయిన విషయం తెలుసుకున్న తండ్రి రమేష్ గుండెలవిసేలా రోదిస్తున్నాడు. తల్లికి అనారోగ్యం కారణంగా విషయం చెప్పకుండా దాస్తున్నట్లు తెలిసింది. బంధువులు, ఇతరులు కూడా విషయం తెలిసినా మిన్నకుండిపోతున్నారు. ఆదివారం పావని మృతదేహం నగరానికి చేరుతుందని సమాచారం అందించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. (క్లిక్ చేయండి: ఉన్నత చదువుకు అమెరికా వెళ్లి.. మృత్యుఒడికి..) దేవుడు అన్యాయం చేసిండు ‘ఇద్దరు కూతుళ్లు అని ఎప్పుడూ బాధ పడలేదు. ఉన్నత చదువులు చదివించాలనేది మా లక్ష్యం. అందుకోసం నేను, నా భార్య అహర్నిశలు కష్టపడ్డాం. మా కలలకు తగ్గట్టుగా పెద్ద పాప ఇక్కడే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది. చిన్న పాపను అమెరికాను పంపాలనుకున్నాం. రెండు నెలల కిందట పంపించాం. మొన్న దసరా, దీపావళి పర్వదినాల సందర్భంగా వీడియో కాల్లో మాతో మాట్లాడింది. అంతా బాగానే ఉందని ఓదార్చింది. అంతలోనే ఏం జరిగిందో తెలియదు. చనిపోయినట్లు అమెరికా నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. ఇది నమ్మలేకపోతున్నాను. దేవుడా.. ఇదేమి అన్యాయం’ - దగ్గర బంధువుల వద్ద పావని తండ్రి ఆవేదన -
పాపం సాయి.. ఉద్యోగావకాశం వదులుకుని అమెరికా వెళ్తే...
కడియం: యూఎస్‌లో పెద్ద చదువు చదివి ఉన్నత స్థితికి చేరుకుంటాడని పంపిన బిడ్డ ఇక లేడని తెలిసి ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడని సమాచారం అందుకుని గుండెలవిసేలా రోదిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక పంచాయతీ పరిధిలోని బుర్రిలంకకు చెందిన నర్సరీ రైతు పాటంశెట్టి శ్రీనివాసు (వాసు), సుశీల దంపతుల కుమారుడు సాయినరసింహ (25). చెన్నైలోని హిందుస్థాన్ ఇంజినీరింగ్ కాలేజీలో ఈ ఏడాది బీటెక్ చదివాడు. యూఎస్‌లో ఎంఎస్ చదవాలనేది సాయినరసింహ ఆకాంక్ష. ఇదే విషయాన్ని తలిదండ్రుల వద్ద వ్యక్తం చేశాడు. దీనికి వారు అంగీకరించి ఇందుకు ఏర్పాట్లు చేశారు. ఆగస్టు 6న యాఎస్లోని కనెక్టికట్ స్టేట్ పరిధిలోని న్యూ హెవెన్స్ యూనివర్శిటీకి పంపించారు. అక్కడ పార్ట్‌టైమ్ జాబ్ చేస్తూ చదివే అవకాశం లభించడంతో కుటుంబ సభ్యులు సంతోషించారు. బుర్రిలంకకు చెందిన సిద్దిరెడ్డి సత్తిబాబు కుమార్తె ఐశ్వర్య కూడా అక్కడే చదువుతోంది. సెలవులు కావడంతో మంగళవారం సాయినరసింహ, ఐశ్వర్య, మరో అయిదుగురు స్నేహితులు కలిసి సమీపంలోని విలేజ్‌ను సందర్శించేందుకు మినీ వ్యాన్‌లో బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న వ్యాన్ గంటన్నరకే మరో మినీ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సాయి నరసింహతో పాటు, మరో ఇద్దరు మృతి చెందారు. ఐశ్వర్య గాయపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడు నరసింహ సోదరి నందిని చెన్నైలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. మృతదేహం తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు సాయి నరసింహ మృతి చెందినట్టు తెలియడంతో బుర్రిలంకలో విషాద వాతావరణం నెలకొంది. యూఎస్ వెళ్లిన మూడు నెలలకే మృత్యు ఒడికి చేరడం పట్ల స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాయి తండ్రి శ్రీనివాసు (వాసు) నర్సరీ రైతుగా అందరికీ తలలోనాలుకగా ఉంటారు. గ్రామంలో ఏ కార్యక్రమం జరిగినా తోడ్పాటు అందిస్తుంటారు. బుధవారం ఉదయం పెద్ద ఎత్తున గ్రామస్తులు వాసు ఇంటికి చేరుకున్నారు. అమెరికా పంపడం తమ శక్తికి మించినదే అయినప్పటికీ బిడ్డ ఉన్నత స్థాయికి చేరుకుంటాడని పంపించామంటూ మృతుడి తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమవుతున్నారు. బీటెక్ చేస్తుండగా ఉద్యోగావకాశం వచ్చినా ఎంఎస్ చదువుతానని వెళ్లి మృత్యు ఒడికి చేరాడని రోదిస్తున్నారు. యూఎస్ ప్రయాణానికి ముందు కుమారుడితో కలిసి తిరుమల వెళ్లామని చివరి క్షణాలను గుర్తు చేసుకుని కుమిలిపోతున్నారు. మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకువచ్చే విషయంలో ఎంపీ భరత్‌రామ్ దృష్టికి తీసుకువెళ్లారు. శనివారానికి మృతదేహం బుర్రిలంకకు చేరుకోవచ్చని భావిస్తున్నారు. (క్లిక్: అమెరికాలో తెలుగు విద్యార్థుల దుర్మరణం: అక్కడి డ్రైవింగ్ రూల్స్ తెలుసుకోండి!) -
కలెక్టర్ ప్రశంసలందుకున్న తెలుగు విద్యార్థి
తిరువళ్లూరు: తెలుగు మీడియం విద్యార్థి తిరుక్కురల్‌ను అనర్గళంగా చెప్పి కలెక్టర్‌తో శభాష్ అనిపించుకున్నాడు. తిరువళ్లూరు కలెక్టరేట్లో శిరగుగల్ (రెక్కలు)–100 పేరిట శుక్రవారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 100 మంది ఎస్టీ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థుల ప్రతిభను ప్రదర్శించాలని కోరారు. నొచ్చిలి ప్రభుత్వ పాఠశాల తెలుగు మీడియం విద్యార్థి వెంకటేషన్ దాదాపు 5 నిమిషాల పాటు తిరుక్కురల్‌ను ఒప్పించాడు. కలెక్టర్ ఆల్బీజాన్వర్గీస్ విద్యార్థి ప్రతిభను మెచ్చుకున్నారు. వెంటనే విద్యార్థి జోక్యం చేసుకుని.. సార్ నేను తెలుగు మీడయం విద్యార్థి, అయినా తిరుక్కురల్పై ఆసక్తితో నేర్చుకున్నానని తెలిపాడు. దీంతో కలెక్టర్ శభాష్ అంటూ ప్రశంసించారు. -
నేడు వైజాగ్‌కు ఇటలీ తెలుగు విద్యార్థులు
సాక్షి, అమరావతి/న్యూఢిల్లీ: ఇటలీలోని తెలుగు విద్యార్థులు సోమవారం విశాఖ చేరుకోనున్నారు. ఇటలీ నుంచి మార్చి 15, 21 తేదీల్లో ఢిల్లీ వచ్చి ప్రభుత్వ ఐటీబీపీ క్యాంపస్‌లోని క్వారంటైన్ కేంద్రాల్లో ఏపీ విద్యార్థులు 33 మంది ఉన్నారు. వీరికి రెండు సార్లు కోవిడ్ పరీక్షలు జరపగా నెగిటివ్‌గా తేలింది. క్వారంటైన్ పూర్తయ్యాక ఐటీబీపీ క్యాంపస్ అధికారుల అనుమతి తీసుకుని ప్రైవేటు బస్సులో ఏప్రిల్ 10న బయలుదేరారు. ఛత్తీస్‌గఢ్ అధికారులు వీరిని ఆపేశారు. అన్ని పత్రాలు ఉన్నాయని చూపినా వారు కదలనివ్వలేదు. స్థానికంగా ఆదివాసీ బాలికా విహార్‌లో వసతి కల్పించారు. ఇందులో కొందరు విద్యార్థినులు కూడా ఉన్నారు. విషయాన్ని విద్యార్థులు ఏపీ ప్రభుత్వం, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ ఎంపీ జీవీఎల్ దృష్టికి తీసుకెళ్లారు. సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ సవాంగ్, ఐఏఎస్ అధికారి కృష్ణబాబు చొరవ తీసుకొని విద్యార్థులు విశాఖకు చేరే విధంగా ఏర్పాట్లు చేశారు. కాశీ నుంచి తెలుగు రాష్ట్రాలకు యాత్రికుల తరలింపు: జీవీఎల్ లాక్‌డౌన్‌కు ముందు కాశీ యాత్రకు వెళ్లి అక్కడే చిక్కుకుపోయిన వెయ్యి మంది తెలుగు యాత్రికులను సొంత ప్రాంతాలకు తరలించినట్టు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు. ప్రధాని కార్యాలయ అనుమతితో వారందరినీ స్వస్థలాలకు తరలించేందుకు చర్యలు చేపట్టారన్నారు. కాగా, ఏపీలో చిక్కుకుపోయిన జపాన్ దేశీయులను వారి దేశానికి తరలించడానికి విశాఖ నుంచి బెంగళూరుకు నేడు ప్రత్యేక విమానం నడపనున్నారు. -
పంజాబ్‌లో తెలుగు విద్యార్ధి ఆత్మహత్య
-
సాయి కృష్ణకి అండగా ఉంటాం - కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : అమెరికాలో దుండగుల చేతిలో కాల్పులకు గురై చికిత్స పొందుతున్న మహబూబాబాద్ కు చెందిన విద్యార్థి సాయి కృష్ణ కు పూర్తి అండగా ఉంటామని మాజీ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. సాయి కృష్ణ కుటుంబ సభ్యులు ఈరోజు బేగంపేట క్యాంపు కార్యాలయంలో కేటిఆర్ ని కలిసి ప్రభుత్వ సహకారాన్ని కోరారు. సాయి కృష్ణ తల్లిదండ్రులు వెంటనే అమెరికాకి వెళ్లేందుకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామని ఈ సందర్భంగా కేటీఆర్ వారికి హామీ ఇచ్చారు. (అమెరికాలో తెలుగువిద్యార్థిపై కాల్పులు) తనను కలిసిన సాయికృష్ణ కుటుంబ సభ్యులను సాయి కృష్ణ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం సాయి కృష్ణ ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారని అయితే పలు శస్త్ర చికిత్సలు ఆయనకు అవసరమని అక్కడ ఉన్న సాయి కృష్ణ మిత్రులు తమకు తెలియజేశారని తల్లిదండ్రులు కేటీఆర్ కు తెలిపారు. ఇప్పటికే సాయి కృష్ణ కు అవసరమైన తక్షణ వైద్య సహాయం గురించి అమెరికాలోని కాన్సల్ జనరల్ ఆఫ్ ఇండియా కార్యాలయానికి తమ ఎన్ఆర్ఐ శాఖ అధికారులు సమాచారం అందించారని ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు. అవసరమైతే మరింత సహకారం కోసం కేంద్ర ప్రభుత్వం విదేశీ వ్యవహారాల శాఖ తరఫున సహాయం కోసం విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌తో మాట్లాడుతామని సాయి కృష్ణ కుటుంబ సభ్యులకు కేటీఆర్ హామీ ఇచ్చారు. ఈ మేరకు మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు సీతారాం నాయక్ నేరుగా సుష్మాస్వరాజ్ గారిని కలిసిన్నట్లు కేటీఆర్ తెలిపారు. సాయి కృష్ణ వైద్య సహాయం ప్రస్తుతం ఎలాంటి ఆటంకాలు లేకుండా అందుతుందని, అయితే ఆయనకి భీమా సౌకర్యం లేకపోవడంతో తమకు ఆర్థిక సహాయం అవసరమవుతుందని ఈ సందర్భంగా కేటిఆర్ ను సాయి కృష్ణ కుటుంబ సభ్యులు కోరారు. సాయి కృష్ణ ను అన్ని విధాల ఆదుకుంటామన్న కేటీఆర్, ముందుగా కుటుంబ సభ్యులు అమెరికా వెళ్లేందుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని తక్షణం అందించాలని ముఖ్యమంత్రి కార్యాలయ స్పెషల్ సెక్రటరీ రాజశేఖర్ రెడ్డి కి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. సాయి కృష్ణ కుటుంబ సభ్యులు అమెరికా వెళ్లేందుకు అవసరమైన అత్యవసర వీసాలను జారీ చేయాల్సిందిగా హైదరాబాద్‌లోని అమెరికా కాన్సుల్ జర్నల్ కేథరిన్ హెడ్డా తోనూ కేటీఆర్ ఫోన్లో మాట్లాడారు. కుటుంబ సభ్యుల రవాణా ఖర్చులతోపాటు, కొంత ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున తక్షణమే అందిస్తామని సాయి కృష్ణ కుటుంబ సభ్యులకు కేటీఆర్ తెలిపారు. కష్ట కాలంలో తమ కుటుంబానికి ఆసరాగా నిలబడుతున్న తెలంగాణ ప్రభుత్వానికి సాయి కృష్ణ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. -
అమెరికాలో తెలుగువిద్యార్థిపై కాల్పులు
సాక్షి, హైదరాబాద్ : అమెరికాలో మరో తెలుగువిద్యార్థిపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. మహబూబాబాద్‌కు చెందిన పూస సాయికృష్ణ మిచిగాన్ రాష్ట్రంలోని లారెన్స్ టెక్ యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేస్తున్నారు. స్థానిక రెస్టారెంట్లో ఆహార పదార్థాలు తీసుకొని వస్తుండగా సాయికృష్ణపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సాయికృష్ణ కుడిచేతి, మెడపై బుల్లెట్ గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. కాల్పుల అనంతరం సాయికృష్ణ వద్ద ఉన్న నగదు, కారు, గుర్తింపు పత్రాలను దుండగులు దోచుకెళ్లారు. ఈ ఘటన ఈనెల 3న జరిగినట్టు తెలుస్తోంది. -
చికాగోలో తెలుగు విద్యార్థి మృతి.. ‘ఆట’ సహాయం
చికాగో : నగరంలో నాగరాజు అనే తెలుగు విద్యార్థి రైలు ప్రమాదంలో మృతిచెందాడు. నేపర్‌విల్లే వద్ద రైల్వే ట్రాక్ దాటుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కుమారుడి మరణవార్తతో అతని కుటుంబంలో విషాధ చాయలు అలుముకున్నాయి. కాగా మృతుడి కుటుంబానికి సహాయం చేయటానికి ‘‘అమెరికా తెలుగు అసోషియేషన్ (ఆట)సేవ బృందం’’ ముందుకొచ్చింది. ఆట తరుపున మహిపాల్ రెడ్డి గురువారం ఉదయం మృతుడి కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఆట సేవ బృందం తరుపున వారికి సహాయం చేయనున్నారు. ఆట సేవ బృందం ప్రతినిధి మాట్లాడుతూ.. తాను ఈ ఉదయమే మృతుడి కుటుంబాన్ని కలిశానన్నారు. అతడి కుటుంబం షాక్ గురై ఉందని వారికి సహాయం అవసరమని తెలిపారు. తాను నాగరాజు తమ్ముడితో మాట్లాడానన్నారు. అతని కుటుంబసభ్యులు పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్ కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. నాగరాజు తల్లిదండ్రులు గురువారం ఉదయం భారతదేశం నుంచి చికాగోకు రాబోతున్నట్లు వెల్లడించారు. వారు ఇక్కడికి వచ్చిన తర్వాత అంత్యక్రియల విషయంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ పరిస్థితుల్లో ‘ఆట’ వారికి అండగా ఉంటుందని తెలిపారు. వారికి అవసరమైన పూర్తి సహకారాన్ని తమ చికాగో టీమ్ అందిస్తుందని పేర్కొన్నారు. అయితే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
సివిల్స్ ఫలితాలలో తెలుగు విద్యార్థికి మొదటి ర్యాంక్
-
అమెరికాలో తెలుగు విద్యార్థి దుర్మరణం
-
అమెరికాలో తెలుగు విద్యార్థి దుర్మరణం
సాక్షి, హైదరాబాద్ : సరదాగా బోటింగ్ కోసం వెళ్లిన అతడిని మృత్యువు కబళించింది. తీవ్ర విషాదాన్ని మిగిల్చిన ఈ సంఘటన అమెరికాలోని నార్త్ కరోలినా క్యారీలో చోటుచేసుకుంది. ఏపీకి చెందిన దేవినేని రాహుల్ (19) తన తల్లిదండ్రులతో కలిసి అమెరికాలో నివాసం ఉంటున్నాడు. బుధవారం సాయంత్రం స్నేహితులతో కలిసి సరదాగా బోటింగ్ కు వెళ్లాడు. అయితే ప్రమాదశావత్తు పడవ మునిగిపోవడంతో రాహుల్, అతని స్నేహితుడు నదిలో పడిపోయారు. ఇది గమనించిన స్థానికులు వెంటనే వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనలో రాహుల్ మృతి చెందగా, అతని స్నేహితుడు గాయపడ్డాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. -
దుఃఖ సాగరంలో వంశీ కుటుంబం
-
అమెరికాలో తెలుగు విద్యార్థి కాల్చివేత
హైదరాబాద్: ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లిన ఓ తెలుగు యువకుడు అక్కడ దారుణ హత్యకు గురయ్యాడు. జాతి వివక్ష చర్యల్లో భాగంగానే ఈ హత్య జరిగిందన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. వరంగల్ జిల్లాకు చెందిన వంశీ మామిడాల అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో ఎంస్ పూర్తిచేశాడు. శాన్ఫ్రాన్సిస్కో లోని ఓ స్టోర్‌లో పనిచేస్తున్న వంశీ.. గత రాత్రి విధులు ముగించుకొని తన గదికి తిరిగివస్తుండగా హత్యకు గురయ్యాడు. డ్రగ్స్ వాడిన ఓ తెల్లజాతి వ్యక్తి వంశీపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. దీనిపై అక్కడి అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అమెరికాలో తెలుగు విద్యార్థి కాల్చివేత
-
అమెరికాలో కావలి యువతి మృతి
- వాషింగ్టన్ రాష్ట్రంలో ఘటన - ఎమ్మెస్ చేసేందుకు యూఎస్ వెళ్లిన ప్రియాంక చౌదరి - ఇటీవలే సివిల్ ఇంజనీర్‌గా ఉద్యోగం - ప్రమాదవశాత్తూ సియాటెల్ సరస్సులో మునిగి దుర్మరణం కావలి అర్బన్: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లింది. విద్యనభ్యసించిన ప్రాంతంలోనే ఇటీవల ఉద్యోగం కూడా వచ్చింది. ఇంతలోనే మృత్యువు ఆమెను కబళించింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణానికి చెందిన గోగినేని ప్రియాంక చౌదరి (25) ప్రమాదవశాత్తూ అమెరికాలోని ఓ సరస్సులో పడి మృత్యువాత పడింది. బుధవారం జరిగిన ఈ సంఘటనపై గురువారం రాత్రి 2 గంటలకు తల్లిదండ్రులకు సమాచారం అందింది. మృతురాలి బంధువుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కావలిలోని వైకుంఠపురం చేవూరివారితోటలో నివాసం ఉంటున్న గోగినేని వెంకటేశ్వర్లు, సత్యవతి దంపతులకు ఇద్దరు పిల్లలు. కాంట్రాక్టర్ అయిన వెంకటేశ్వర్లు పిల్లల చదువులు, కాంట్రాక్ట్ పనుల నిమిత్తం కొన్నాళ్లు హైదరాబాద్‌లో ఉండి మూడు నెలల క్రితమే కావలికి తిరిగి వచ్చారు. వారి కుమార్తె ప్రియాంక హైదరాబాద్‌లోని జాగృతి కళాశాలలో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి 2014లో ఎంఎస్ చేసేందుకు అమెరికా వెళ్లింది. వాషింగ్టన్ రాష్ట్రం సియాటెల్ నగరంలో నివాసం ఉంటూ లేసీ నగరంలోని సెయింట్ మార్టిన్స్వర్సిటీలో చదువుతున్న ప్రియాంకకు సెప్టెంబర్ 1న ఓ కంపెనీలో సివిల్ ఇంజనీర్‌గా ఉద్యోగం కూడా వచ్చింది. ప్రియాంక ప్రతిరోజూ ఉదయం సూర్యోదయం చూసేందుకు సియోటెల్ నుంచి సుమారు కిలోమీటర్ దూరంలోని హైక్స్ సరస్సుకు వెళ్లేది. ఆమెతో పాటు మరికొందరు కూడా వెళ్లేవారు. అయితే బుధవారం ఎవరూ వెళ్లలేదు. ఉదయం సరస్సులో దిగి కొంచెం ముందుకు వెళ్లిన ప్రియాంక నాచుపట్టిన రాయిపై కాలు పెట్టడంతో జారి సరస్సులో మునిగిపోయింది. గంటల తరువాత నీళ్లపై తేలియాడుతున్న ప్రియాంక మృతదేహాన్ని చూసిన స్థానిక జాలర్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఫోన్ ద్వారా గురువారం తెల్లవారుజామున ప్రియాంక తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. అమెరికాలోని టెక్సాస్‌లో ఉంటున్న వెంకటేశ్వర్లు స్నేహితుడు సుబ్రహ్మణ్యం అక్కడి తెలుగువారి సంఘం (నాట్స్) సహకారంతో ప్రియాంక మృతదేహాన్ని స్వదేశానికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. తమ కుమార్తె మృతదేహం త్వరగా ఇండియా చేరుకునేలా ప్రధాని, విదేశాంగ శాఖ మంత్రితో పాటు జిల్లాకే చెందిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబులు సహకరించాలని వెంకటేశ్వర్లు కుటుంబం, వారి బంధువులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
అమెరికాలో తెలుగు విద్యార్థిని మృతి
-
తెలుగు విద్యార్ధి అనుమానాస్పద మృతి
-
అమెరికాలో తెలుగు విద్యార్థి గల్లంతు
- ఏడాదిన్నర కిందట ఉన్నత చదువులకు వెళ్లిన విద్యార్థి - మరో నెలలో పూర్తికానున్న చదువు జగ్గయ్యపేట: కుమారుడు ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగం చేసి ప్రయోజకుడవుతాడనుకున్న ఆ కుటుంబాన్ని విధి చిన్నచూపు చూసింది. మరో నెలలో చదువు పూర్తిచేసుకొని స్వదేశం వస్తాడని ఎదురుచూసిన ఆ తల్లిదండ్రులకు.. విహారయాత్రకు వెళ్లి నదిలో గల్లంతైన కుమారుడు తీరని శోకం మిగిల్చాడు. దీంతో కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం బండిపాలెంలో విషాదచాయలు అలుముకున్నాయి. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పుట్టా పూర్ణచంద్రరావు, రమాదేవి దంపతులది వ్యవసాయ కుటుంబం. వీరికి కుమారుడు నరేశ్(27), కుమార్తె ఉన్నారు. కూతురికి ఏడాదిన్నర కిందట వివాహమైంది. కుమారుడు నరేశ్ 2015 జనవరిలో అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉన్న నార్త్ వెస్ట్రన్ పాలిటెక్నిక్ యూనివర్సిటీ(ఎన్పీయూ)లో ఎమ్మెస్ చేసేందుకు వెళ్లాడు. అక్క డ ఉన్నత అభ్యసిస్తూనే పార్ట్‌టైంగా ఓ పెట్రోల్ బంక్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం తన స్నేహితులు 13 మందితో కలసి సమీపంలోని లివర్మోర్ నదికి విహారయాత్రకు వెళ్లాడు. నరేశ్‌తో పాటు కొందరు స్నేహితులు పడవ ఎక్కగా మరి కొందరు ఒడ్డునే ఉన్నారు. పడవ ఎక్కే సమయంలో తన మొబైల్ నీటిలో తడుస్తుందనే సందేహంతో ఒడ్డున ఉన్న స్నేహితులకిచ్చాడు. అనంతరం నదిలో కాసేపు ఉల్లాసంగా విహరించి తిరిగి వస్తూ ఒడ్డు మరో 100 మీటర్ల దూరం ఉందనగా నరేశ్ శరీరంపై ధరించిన సేఫ్టీ కోట్‌ను తీసేశాడు. అదే సమయంలో ఒక్కసారిగా ఎదురుగా పెద్ద అల వచ్చింది. దీంతో పడవ చివర కూర్చున్న నరేశ్ అదుపుతప్పి నదిలో పడిపోయాడు. వెంటనే స్నేహితులు కేకలు వేయటంతో పడవలోని మెరైన్ పోలీసులు గాలింపు చేపట్టారు. అయితే, అప్పటికే గల్లంతయ్యాడు. దాదాపు 9 గంటలు గాలించిన అనంతరం చీకటి పడడంతో గాలింపు చర్యలు నిలిపివేశారు. ఒడ్డున ఉన్న స్నేహితుల వద్ద ఫోన్ ఉండటంతో ఎప్పటిలాగానే సోమవారం ఉదయం తల్లిదండ్రులు ఫోన్ చేయగా స్నేహితులు జరిగిన సంఘటన వివరించారు. అప్పులు చేసి చదివిస్తున్నాం ఒక్కగానొక్క కొడుకు ఉన్నత చదువులు చదువుతానంటే అప్పు చేసి చదివిస్తున్నాను. మరో నెలలో చదువు పూర్తయి ఇంటికి వస్తాడని ఎదురుచూస్తుంటే.. నదిలో గల్లంతయ్యాడనే వార్త వినాల్సివస్తుందని అనుకోలేదు. అమెరికా ప్రభుత్వం మా కుమారుడి గాలింపు చర్యలు చేపట్టాలని ప్రార్థిస్తున్నాను. -పూర్ణచంద్రరావు, తండ్రి -
అమెరికాలో తెలుగు విద్యార్థి గల్లంతు
యూఎస్ఏలో తెలుగు విద్యార్థి ఒకరు నదిలో మునిగి గల్లంత య్యారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం బండిపాలెం గ్రామానికి చెందిన పుట్టా నరేష్ కాలిఫోర్నియా యూనివర్సిటీలో ఎంఎస్ సెకండియర్ చదువుతున్నాడు. ఆదివారం అతడు మిత్రులతో కలిసిలివర్‌మోర్ నదిలో పడవ షికారుకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు పడవ బోల్తా పడటంతో అతడు నదిలో పడి గల్లంతయ్యాడు. నరేష్ కోసం గాలింపు కొనసాగుతోందని కుటుంబసభ్యులు తెలిపారు. -
ఏసీటీ పరీక్షలో తెలుగు విద్యార్థి అరుదైన రికార్డు
విజయవాడ: అమెరికా యూనివర్సిటీల్లో ప్రవేశానికి నిర్వహించే ఏసీటీ (అమెరికన్ కాలేజ్ టెస్ట్)లో తెలుగు విద్యార్థి అరుదైన రికార్డు సాధించాడు. విజయవాడ సూపర్‌విజ్ అధినేత గుప్తా కుమారుడు మామిడి సాయి ఆకాష్ ఏసీటీలో 36 పాయింట్లకు 36 పాయింట్లు సాధించి ప్రపంచంలోనే ఫస్ట్ ర్యాంకు సాధించి సత్తాచాటాడు. దీంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే అమెరికాలోని 16 యూనివర్సిటీలు స్కాలర్షిప్లు అందించి మరీ ఆకాష్‌ను తాము చేర్చుకుంటామంటూ స్వాగతిస్తున్నాయి. స్టాన్ఫోర్డ్, కాలిఫోర్నియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఏల్, ప్రిన్స్టన్, కొలండియా, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్క్లి, బ్రౌన్, డార్జ్‌మౌత్, డ్యూక్, మిషిగన్, జార్జియా టెక్, యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఆస్టిన్, యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్, ఇల్లినాయిస్, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా సాండియాగో, రైస్ వంటి యూనివర్సిటీలు సాయి ఆకాష్ ప్రవేశానికి ఆహ్వానం పలికాయి. పారిశ్రామికవేత్తగా ఎదగాలన్నదే లక్ష్యం: సాయి ఆకాష్ ఎంతో మంది విద్యార్థులను జాతీయస్థాయి ర్యాంకర్లుగా తీర్చిదిద్దిన సూపర్‌విజ్ గుప్తా తనయునిగా తనకు ప్రపంచస్థాయిలో ఫస్ట్ ర్యాంకు రావడం సంతోషంగా ఉందని సాయిఆకాష్ పేర్కొన్నాడు. శనివారం సూపర్‌విజ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తనకు వచ్చిన అడ్మిషన్ ఆఫర్స్‌ను చూపించారు. అండర్ గ్రాడ్యుయేషన్ కోసం కాలిఫోర్నియాలోని స్టాన్ఫోర్ట్ను ఎంచుకున్నట్లు ఆయన తెలిపారు. -
అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి
కాలిఫోర్నియా: అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతి చెందాడు. స్మిమ్మింగ్పూల్లో పడి చనిపోయాడు. బే ఏరియా తెలుగు అసోసియేషన్ ప్రతినిధుల సమాచారం ప్రకారం కాలిఫోర్నియాలోని ఫ్రీమౌంట్ అపార్ట్మెంట్ నెల్లూరు విద్యార్థి హర్ష వర్దన్ స్విమ్మింగ్‌పూల్ లో పడి ప్రాణాలు కోల్పోయాడు. సిలికాన్ వ్యాలీలోని ఓ యూనివర్సిటీలో అతడు చదువుతున్నాడు. హర్ష వర్దన్ మృతివార్తను బే ఏరియా అసోసియేషన్ ప్రతినిధులు అతడి తల్లిదండ్రులకు ఫోన్ చేసి తెలిపారు. -
కెనడాలో తెలుగు విద్యార్థి దుర్మరణం
ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లిన ఓ తెలుగు విద్యార్థి రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. వివరాలివీ... కృష్ణా జిల్లా కైకలూరుకు చెందిన రావులపల్లి లక్ష్మణ్‌రావు, లక్ష్మి దంపతులు మణికొండలోని జైహింద్ వ్యాలీ అపార్ట్మెంట్లో ఉంటున్నారు. వారికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు వంశీకృష్ణ అమెరికాలోని వర్జీనియాలో స్థిరపడగా, చిన్నకుమారుడు రాజీవ్‌కృష్ణ(28) గత ఆగస్టులో ఎంబీఏ చదివేందుకు కెనడాకు వెళ్లాడు. అక్కడి థామ్సన్ రివర్స్ యూనివర్శిటీలో చదువుతున్న అతడు శనివారం రాత్రి కారులో వెళ్తుండగా ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. ఆ విషయాన్ని అక్కడి అధికారులు సోమవారం తల్లిదండ్రులకు తెలిపారు. దాంతో వారు అమెరికాలోని పెద్ద కుమారునికి విషయం చెప్పారు. అతను కెనడా అధికారులతో మాట్లాడి ధ్రువీకరించుకున్నారు. అయితే, అతడు అమెరికా నుంచి కెనడాకు వెళ్లేందుకు ప్రయత్నిస్తే వీసా ఇవ్వటం లేదని తల్లిదండ్రులు పేర్కొన్నారు. తమ కుమారుని మృతదేహాన్ని త్వరగా తమ వద్దకు చేర్చేందుకు తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలే సాయం చేయాలని వారు వేడుకుంటున్నారు. -
ఆస్ట్రేలియాలో తెలుగు విద్యార్థి అదృశ్యం
నల్లజర్ల రూరల్ (పశ్చిమ గోదావరి): ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్లిన పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల విద్యార్థి కనిపించటం లేదని మంగళవారం సమాచారం అందింది. రెండు రోజులుగా కనిపించడం లేదని అతడి స్నేహితులు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దుగ్గిన గోపాలకృష్ణ(23) 2014 అక్టోబర్‌లో ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్లాడు. కొంతకాలానికి ఇదే గ్రామానికి చెందిన నీరుకొండ వంశీకృష్ణ, వల్లూరి చిట్టిబాబు సైతం ఆస్ట్రేలియా వెళ్లి గోపాలకృష్ణ చదువుతున్న కళాశాలలోనే చేరారు. ఆ ముగ్గురూ ఒకే రూంలో ఉంటున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గోపాలకృష్ణ ఆప్తమిత్రుడొకరు చనిపోయాడు. ఆ విషయం తెలిసినప్పటి నుంచి అతడు మానసికంగా కుంగిపోయాడని తోటి విద్యార్థులు చెబుతున్నారు. శుక్రవారం రాత్రి తాముంటున్న గది వరండాలో గోపాలకృష్ణ చాలాసేపు ఫోన్ మాట్లాడుతూ ఉండిపోయాడని వేకువజామున చూడగా అతడు కనిపించలేదని అంటున్నారు. అన్నిచోట్లా గాలించినా ప్రయోజనం లేకపోవడంతో చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. కనిపించకుండా పోయిన రెండు గంటల తర్వాత తనను క్షమించాలంటూ మిత్రులకు ఫోన్ మెసేజ్ పెట్టినట్టు చెబుతున్నారు. అక్కడి పోలీసులు వీడియో పుటేజ్‌లను పరిశీలించగా.. ఒక బ్రిడ్జి వద్ద కనిపించినట్టు తెలిపారు. ఫిబ్రవరిలో ఇంటికి వస్తానని రెండు రోజుల క్రితమే తనతో ఫోన్లో చెప్పాడని తండ్రి దుగ్గిన రామయ్య తెలిపారు. ఏం జరిగిందో తెలియని పరిస్థితుల్లో అతని తండ్రి రామయ్య తల్లడిల్లుతున్నారు. తమ కుమారుడి ఆచూకీ తెలుసుకోవాలంటూ జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు ద్వారా ఎంపీ కంభంపాటి రామ్మోహనరావు, కలెక్టర్ కె.భాస్కర్, ఉన్నతాధికారులను రామయ్య కోరారు. -
నోయిడాలో తెలుగు విద్యార్థి దారుణ హత్య
-
నోయిడాలో తెలుగు విద్యార్థి దారుణ హత్య
నోయిడా : ఉత్తర ప్రదేశ్ నోయిడాలో ఓ తెలుగు విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడు నల్గొండ జిల్లాకు చెందిన సందేశ్ భాస్కర్(23)గా గుర్తించారు. నోయిడాలోని అమేథీ యూనివర్సిటీలో మెరైన్ సైన్స్‌లో విద్యను అభ్యసిస్తున్నాడు. స్థానిక అపార్ట్మెంట్లో తన మిత్రులైన నదీమ్, మధుర్ తో కలిసి ఉంటున్నాడు. శనివారం సాయంత్రం 4.30 ని.లకు అమన్ అనే విద్యార్థి భాస్కర్ రూమ్‌కు వచ్చి బెల్ గొట్టాడు.ఆ టైమ్‌లో రూమ్‌లో భాస్కర్ ఒక్కడే ఉన్నాడు. భాస్కర్ తలుపు తీశాడు. ఒక్కసారిగా అమన్ భాస్కర్‌పై దాడికి దిగాడు. దీంతో ఇద్దరి మధ్య పెనుగుసలాట జరిగింది. వెంటనే అమన్ తనతో పాటు తెచ్చుకున్న గన్‌తో భాస్కర్ తలపై కాల్చాడు. దీంతో భాస్కర్ అక్కడిక్కడే మృతి చెందాడు. అమన్ అదే యూనివర్సిటీలో టూరిజం విద్యార్ధిగా పోలీసులు గుర్తించారు. అతడిని పోలీసులు అరెస్ట్ చేసినట్టు సమాచారం. భాస్కర్ రూమ్మేట్స్ ఇద్దరు అమేథీ యూనివర్సిటీ ఇద్దరు టూరిజం విద్యార్థులు. భాస్కర్‌కు అతని రూమ్మేట్స్ ద్వార అమన్‌తో పరిచయం ఉందని తెలుస్తోంది. ఏదైనా పెద్ద గొడవలు హత్యకు దారితీసి ఉంటాయన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భాస్కర్ కుటుంబసభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై యూనివర్సిటీ అధికారులు, విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి
ఒంగోలు: ఉన్నత చదువులు చదవాలనే తన కోరికను నిజం చేసుకునేందుకు దేశంకాని దేశం వెళ్లాడు. అయితే విధి అతని ఆశలు ఆదిలోనే తుంచివేసింది. ఉన్నత చదువులు చదివి తిరిగి వస్తాడనుకున్న కొడుకు దేశం వదిలి వెళ్లి నెలరోజులు గడువక ముందే విగతజీవి అయ్యాడని తెలిసిన ఆ తల్లిదండ్రుల గుండెలు పుట్టెడు శోకంతో నిండిపోయాయి. వివరాలు... ప్రకాశం జిల్లా చీరాల పట్టణంలోని పేరాలకు చెందిన తాటికొండ రమేష్ పేరాల మసీదు సెంటర్లో కిరాణా దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. రమేష్‌కు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కొడుకు తాటికొండ బాలసురేంద్రకుమార్ (25) 2007లో తంజావూరులోని శస్త్ర ఇంజనీరింగ్ కాలేజీలో బిటెక్ చదివాడు. చదువుతున్న రోజుల్లో క్యాంపస్ సెలక్షన్స్ ద్వారా టీసీఎస్‌లో ఉద్యోగం సంపాదించి చెన్నైలో మూడు సంవత్సరాలు పనిచేశాడు. అయితే ఎంఎస్ చదివేందుకు ఉద్యోగాన్ని వదిలి గత నెల 22వ తేదీన అమెరికాలోని టెక్సాస్ వెళ్లాడు. బాలసురేంద్రకుమార్ 14వ తేదీన చివరిసారిగా కుటుంబ సభ్యులతో మాట్లాడాడు. వారంతపు ఆటవిడుపు కోసం స్నేహితులతో కలిసి విహారయత్రకు వెళ్లాడు. అక్కడ ఉన్న జలపాతం వద్ద ప్రమాదవశాత్తు పడిపోయి మృతిచెందాడు. స్నేహితులు ఆదివారం తెల్లవారుజామున సమాచారాన్ని కుటుంబ సభ్యులకు తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీరాల ఇన్‌ఛార్జి యడం బాలాజీ ఎన్నారై కావడంతో టెక్సాస్‌లోని తానా సభ్యులతో మాట్లాడారు. మృతదేహాన్ని వీలైనంత త్వరగా చీరాలకు తీసుకువచ్చేందుకు వారితో మాట్లాడారు. కొడుకు మరణవార్త విని కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. -
అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి దుర్మరణం
* మరో విద్యార్థికి గాయాలు * ఆగి ఉన్న బుల్డోజర్ను ఢీకొన్న కారు * నిద్రమత్తు వల్లే ప్రమాదం సాక్షి, హైదరాబాద్: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఓ తెలుగు విద్యార్థిని రోడ్డు ప్రమాదం బలితీసుకుంది. సుదూర డ్రైవింగ్ వల్ల కలిగిన అలసట, నిద్రమత్తు రూపంలో మృత్యువు కబళించింది. 6రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌లోని సైదాబాద్ ఎస్బీహెచ్ కాలనీకి చెందిన గుండా నితిన్ (21) ఏడాదిన్నర క్రితం అమెరికాలోని క్యాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీలో ఎంఎస్ చేసేందుకు వెళ్లాడు. ఓక్లహోమా రాష్ట్రంలో నివసిస్తున్న బంధువుల ఇంట్లో శుభకార్యం ఉండటంతో ముగ్గురు మిత్రులతో కలసి కారులో 1,970 కిలోమీటర్లు ప్రయాణించి అక్కడకు చేరుకున్నాడు. అయితే తిరుగు ప్రయాణంలో కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణించాక...అప్పటికే డ్రైవింగ్ వల్ల అలసిపోయిన నితిన్ నిద్రలోకి జారుకున్నాడు. దీంతో కారు ఒక్కసారిగా ప్రధాన రహదారి ఎడమవైపున ఉన్న కన్స్ట్రక్షన్ జోన్లో పార్క్‌చేసి ఉన్న బుల్డోజర్(డీ6 డాజర్)ను బలంగా ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ నితిన్ అక్కడికక్కడే మృతిచెందగా మరో స్నేహితుడు, హైదరాబాద్‌వాసి వివేక్ గాయపడ్డాడు. మరో ఇద్దరు స్నేహితులు ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. వివేక్‌ను మిగిలిన స్నేహితులు ముస్కోగీలోని ఈస్టర్ హెల్త్ సిస్టమ్‌లో చేర్పించారు. నితిన్ సహా స్నేహితులంతా సీటు బెల్ట్‌లు ధరించినా, ఎయిర్ బెలూన్లు తెరుచుకున్నా అవి నితిన్ ప్రాణాలను రక్షించలేకపోయాయి. ప్రమాద సమయంలో కారు 100 కి.మీపైగా వేగంతో వెళ్తున్నట్లు తెలుస్తోంది. కన్నీరుమున్నీరు.. నితిన్ మరణవార్త తెలియగానే అతని తల్లిదండ్రులు షాక్‌కు గురై ఆస్పత్రిపాలయ్యారు. ఏకైక సంతానమైన నితిన్ లేడన్న విషయం తెలియడంతో కన్నీరుమున్నీరవుతున్నారు. డిసెంబర్లో హైదరాబాద్ వచ్చేందుకు నితిన్ ఏర్పాట్లు చేసుకున్నాడు. నితిన్ మృతదేహం శనివారం హైదరాబాద్‌కు వచ్చే అవకాశముంది. నితిన్ ఇబ్రహీంపట్నంలోని సీవీఆర్ కళాశాలలో బీటెక్ పూర్తి చేశాడు. ఎస్బీహెచ్ కాలనీకే చెందిన వివేక్ నితిన్‌తోనే చదువుతున్నాడు. నితిన్ తండ్రి శ్రీనివాస్ ఎస్బీహెచ్లో స్పెషల్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. -
అమెరికాలో మెరిసిన తెలుగు తేజం
జూబ్లీహిల్స్: నగర కుర్రాడు అమెరికాలో సత్తా చాటాడు. నగరానికి చెందిన ప్రణీత్ పొలినేని ప్రతిష్టాత్మక ‘ప్రెసిడెన్షియల్ స్కాలర్షిప్’కు ఎంపికయ్యాడు. నగరానికి చెందిన శ్రీనివాస్‌రావు, శాలిని దంపతులు అమెరికాలో సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడ్డారు. వారి ఏకైక కుమారుడు ప్రణీత్ ఫ్లోరిడా రాష్టంలో జాక్సన్‌విల్లేలోని స్టేషన్ కాలేజి ప్రిపేటరి స్కూల్లో 12వ తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో ప్రతిష్టాత్మక ప్రెసిడెన్షియల్ స్కాలర్షిప్కు ధరఖాస్తు చేసుకున్నాడు. 30లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా వివిధ దశల్లో పరీక్షలు నిర్వహించగా చివరకు 141 మంది స్కాలర్షిప్కు ఎంపికయ్యారు. వీరిలో ఐదుగురు భారతీయులు కాగా అందులో ప్రణీత్ ఒకరు. 1964లో ఏర్పాటు చేసిన ఈ స్కాలర్షిప్ పథకంలో ఎంపిక కావడం ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. ఈనెల 21న వాషింగ్టన్‌లోని అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్‌హౌస్‌లో నిర్వహించే కార్యక్రమంలో అద్యక్షుడు ఒబామా చేతులమీదుగా స్కాలర్షిప్ అందుకోనున్నారు. అత్యుత్తమ వైద్యుడిగా సేవలు అందించడమే తన లక్ష్యమని ప్రణీత్ పేర్కొన్నాడు. -
అమెరికా ఒలింపియాడ్‌లో తెలుగు తేజం
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో నిర్వహించిన ఓ సైన్స్ ఒలింపియాడ్‌లో హైదరాబాద్ అనంతసాగర్‌కు చెందిన త్విషారెడ్డి ప్రతిభను చాటుకుంది. అమెరికాలోని పెనిసిల్వేనియా రాష్ట్రంలోని అలెన్‌టౌన్‌లో ఉన్న స్ప్రింగ్‌హౌస్ మాథ్యమిక పాఠశాలలో త్విషారెడ్డి 8వ తరగతి చదువుతున్నది. ఎలాస్టిక్ పదార్థాన్ని ఉపయోగించి ఈవెంట్‌ను రూపొందించింది. న్యాయమూర్తి నిర్దేశించిన ప్రదేశంలోనే ఆగే విధంగా నాలుగు చక్రాల వాహనాన్ని తయారు చేసింది. పెనిసిల్వేనియా సైన్స్ ఒలింపియాడ్‌లో త్విషారెడ్డి ప్రతిభను చాటి ప్రథమ బహుమతి సాధించింది. లింకన్ నెబ్రాస్కా రాష్ట్రంలో ఈ నెల 15, 16 తేదీల్లో జరుగనున్న అమెరికా జాతీయస్థాయి సైన్స్ ఒలింపియాడ్ టోర్నమెంట్లో తన పాఠశాల టీమ్ అర్హత సాధించేందుకు త్విషా సిద్ధమైంది. విజ్ఞానంపట్ల విద్యార్థుల్లో అవగాహన, సైన్స్పట్ల ఆసక్తిని పెంచేందుకు అమెరికా సైన్స్ ఒలింపియాడ్‌ను ప్రతి ఏటా నిర్వహిస్తోంది. -
అమెరికాలో తెలుగు విద్యార్థి దుర్మరణం
వాషింగ్టన్: అమెరికాలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఓ తెలుగు విద్యార్థి దుర్మరణం చెందాడు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన భీమవరం వాసి దిలీప్ వర్మ(26) మిత్రుడితో కలిసి కారులో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. భారత కాలమాన ప్రకారం శనివారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. వీరు ప్రయాణిస్తున్న హోండుసిటీ కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొనడంతో దిలీప్ వర్మ అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన మరో వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. కాగా దిలీప్ వర్మ పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
గువాహటి ఐఐటీలో తెలుగు విద్యార్థి ఆత్మహత్య
గువాహటి: అసోంలోని గువాహటి ఐఐటీలో తెలుగు విద్యార్థి ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడిని పరమేశ్వరరావుగా గుర్తించారు. వసతిగృహంలో ఉరేసుకుని అతడు ప్రాణాలు తీసుకున్నాడు. మృతుడు విశాఖ జిల్లా వాసిగా గుర్తించారు. పరమేశ్వరరావు బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. అతడు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియరాలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గువాహటి మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయన్న నిస్పృహతో అతడు ఆత్మహత్య చేసుకున్నాడని అనుమానిస్తున్నారు. -
శ్రీనగర్ వరదల్లో చిక్కుకున్న ముఖేష్ క్షేమం
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ వరదల్లో చిక్కుకున్న తెలుగు విద్యార్థి ముఖేష్ సురక్షితంగా ఉన్నాడు. కాలేజీ క్యాంపస్‌లోకి భారీగా వరద నీరు చేరడంతో కొట్టుకుపోయిన ముఖేష్ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. సురక్షిత ప్రాంతంలో ఉన్నట్టు సమాచారం అందించాడు. కాగా నిరాశ్రయుడు కావడంతో తన దగ్గర డబ్బులు లేవని, సాయం చేయాల్సిందిగా ముఖేష్ ప్రభుత్వాన్ని కోరాడు. అనంతపురం జిల్లా కొత్తచెరువు ప్రాంతానికి చెందిన ముఖేష్ శ్రీనగర్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదువుకుంటున్నాడు. జమ్మూకాశ్మీర్‌లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రాంతంలో భారీగా వరద నీరు చేరింది. ఈ పరిస్థితిని గమనించిన ఎన్ఐటీ అధికారులు.. వెంటనే విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే ముఖేష్ వరదల్లో చిక్కుకుపోవడంతో సహ విద్యార్థులతో పాటు అతని కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందారు. అతను సురక్షితంగా ఉన్నాడని సమాచారం రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.జమ్ము కాశ్మీర్ ప్రాంతంలో ముంచుకొచ్చిన వరదల్లో 60 మంది తెలుగు వాళ్లు చిక్కుకున్నారు. -
ఈ బాలలను అబినందించాలి
-
తెలుగుతేజం పూర్ణ ప్రపంచ రికార్డు
హైదరాబాద్: తెలుగు తేజం పూర్ణ ప్రపంచ రికార్డు సాధించింది. చిన్న వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన బాలికగా పూర్ణ చరిత్ర సృష్టించింది. తెలుగు విద్యార్థులు ఆనంద్, పూర్ణ ఈ సాహసం చేశారు. ఎవరెస్ట్ పర్వతంపై వీళ్లు జాతీయ జెండా ఎగురవేశారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా ఆనంద్ రికార్డులకెక్కాడు. 14 ఏళ్ల పూర్ణ నిజామాబాద్ జిల్లా తాడ్వాయి గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. 17 ఏళ్ల ఆనంద్ ఖమ్మం జిల్లా గురుకులంలో ఇంటర్ ఫస్ట్ఇయర్ చదువుతున్నాడు. వీరిద్దరూ గతేడాది నవంబర్‌లో డార్జిలింగ్‌లోని 17వేల అడుగుల ఎత్తున్న మౌంట్ రినాక్ శిఖరాన్ని ఎక్కి రికార్డు సృష్టించారు. వీరి ప్రతిభను గుర్తిం చిన సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల సొసైటీ వీరికి భువనగిరిలోని రాక్ క్లైంబింగ్ స్కూల్లో ప్రత్యేక తర్ఫీదునిచ్చింది. వీరికి సొసైటీకి చైర్మన్‌గా ఉన్న ఐపీఎస్ అధికారి ప్రవీణ్‌కుమార్ తనవంతు సహాయం అందించారు. మూడు నెలల తర్ఫీదు అనంతరం విద్యార్థులను ఎవరెస్ట్ అధిరోహణకు సిద్ధం చేశారు. -
‘తిరువళ్లూరు’లో 88.23 శాతం ఉత్తీర్ణత
తిరువళ్లూరు, న్యూస్‌లైన్: రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం విడుదల చేసిన ప్లస్‌టూ పరీక్షా ఫలితాల్లో తిరువళ్లూరు జిల్లాలో 88.23 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించిన ట్టు కలెక్టర్ వీరరాఘవరావు వెల్లడించా రు. జిల్లా వ్యాప్తంగా ప్లస్‌టూ పరీక్షలకు 40,032 మంది విద్యార్థులు హాజరుకాగా, 35,320 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాది 85 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, ఈ ఏడాది మరో మూడు శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ప్లస్‌టూ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 289 పాఠశాలకు చెందిన విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, వీటిలో 69 పాఠ శాల విద్యార్థులు వంద శాతం ఫలితాలను సాధించి రికార్డు సృష్టించారు. టాపర్లు వీరే: తిరువళ్లూరు జిల్లా స్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థుల జాబి తాను కలెక్టర్ వీరరాఘవరావు శుక్రవారం ఉదయం విడుదల చేశారు. తమిళాన్ని ప్రథమ భాషగా ఎంచుకుని విధ్యనభ్యసించిన మెగప్పేరు వేలమ్మాల్ పాఠశాలకు చెందిన కే. రంజిత్(1188) జిల్లా స్థాయిలో మొదటి స్థానం సంపాదించగా, అంబత్తూరు సేతు భాస్కర పాఠశాలకు చెందిన పూజా(1187), పంజె ట్టి వేలమ్మాల్ పాఠశాల విద్యార్థిణి శరణ్య(1187) మార్కులతో రెండవ స్థానం సాధించారు. మూడవ స్థానంలో పంచెట్టి వేలామ్మాల్ పాఠశాలకు చెందిన రమ్యప్రభ(1186), మెగప్పేరు వేలమ్మాల్ పాఠశాలకు చెందిన అనణ్య(1186) మార్కులతో మూడవ స్థానంలో నిలిచారు. ప్రభుత్వ పాఠశాల టాపర్లు: ప్రభుత్వ పాఠశాల పరిధిలోని పళవేర్కాడు ప్రభుత్వ పాఠశాలకు చెందిన సంగీత(1160), టీఎంకేవీ అమ్మయ్యార్కుప్పం పాఠశాలకు చెందిన ప్రభాకరన్(1160) మార్కులతో జిల్లా స్థాయిలో మొదటి స్థానం సాధించారు. రెండవ స్థానంలో పొన్నేరి ప్రభుత్వ బాలుర పాఠశాలకు చెందిన కుమరవేల్(1157) నిలిచారు. మూడవ స్థానంలో కవరపేట ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఆనంది(1153), అంబత్తూరు పీకే పాఠశాల విద్యార్థిని యువరాణి(1153) మార్కులతో మూడవ స్థానంలో నిలిచినట్టు కలెక్టర్ వివరించారు. సత్తాచాటిన తెలుగు విద్యార్థి: ప్లస్‌టూ పరీక్షలలో తెలుగు, సంస్కృతం, ప్రెంచ్ భాషను మొదటి భాషగా ఎంచుకుని చదివిన విద్యార్థులు తమ సత్తాను చాటారు. సంస్కృతాన్ని మొదటి భాషగా ఎంచుకున్న వేలమ్మాల్ విద్యార్థులు అజిత్(1192), శ్రీనిధి(1192) మార్కులతో మొదటి స్థానం సాధిం చారు. సంస్కృతాన్ని ప్రథమ భాషగా ఎంచుకున్న దీపక్ అరవింద్(1189) మార్కులతో రెండవ స్థానంలోనూ, ప్రెంచ్ను మొదటి భాషగా తీసుకున్న వేలమ్మాల్ విద్యార్థులు మణిగండ న్(1188), తెలుగును మొదటి భాషగా ఎంచుకున్న రంజిత్(1188) మూడవ స్థానంలో నిలిచారు. తమిళ విద్యార్థులకు దీటుగా సంస్కృతం, తెలుగు విద్యార్థులు రాణించడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. -
ఖరగ్‌పూర్ ఐఐటీలో తెలుగు విద్యార్థి ఆత్మహత్య
భువనగిరి, న్యూస్‌లైన్: నేత కార్మికుడి కొడుకైనా పట్టుదలతో చదివి ప్రతిష్టాత్మక ఖరగ్‌పూర్ ఐఐటీలో సీటు సంపాదించాడు. బీటెక్ కోర్సు అయిపోయే దశలో ఆత్మహత్యకు పాల్పడి తల్లిదండ్రులకు అంతులేని శోకాన్ని మిగిల్చి వెళ్లాడు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని ఖరగ్‌పూర్ ఐఐటీలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న నల్లగొండ జిల్లా రాజపేట మండలం రఘునాథపురం గ్రామానికి చెందిన బోగ శ్రవణ్‌కుమార్(22) కళాశాల హాస్టల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని ఐఐటీ యాజమాన్యం శ్రవణ్ తల్లిదండ్రులకు తెలియజేయడంతోపాటు మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు రెండు విమాన టికెట్లు కూడా పంపించింది. ఇటీవల క్యాంపస్ సెలక్షన్స్‌లో ఎంపిక కాకపోవడం వల్లే శ్రవణ్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. శ్రవణ్ 10వ తరగతి వరకు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివాడు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ పూర్తిచేశాడు. -
కూతుర్ని గన్‌తో కాల్చి చంపిన ఎన్నారై సుజాత
అమెరికా ఫ్లోరిడాలోని ఓర్లాండోలో తెలుగు విద్యార్థిని కన్నతల్లి చేతిలోనే దారుణ హత్యకు గురైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుంటూరు జిల్లాకు చెందిన గూడూరు సుజాత... తన 17 ఏళ్ల కుమార్తె చేతనను గన్ తో కాల్చివేసింది. కన్న కూతురిని కాల్చి చంపి, అనంతరం ఆమె కూడా గుండెలపై కాల్చుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. అంతకు ముందు సుజాత...హత్య...ఆత్మహత్య విషయాన్ని తన సోదరుడు చిత్తలూరి ప్రసాద్‌కి ఈ మెయిల్ చేసింది. దాంతో అతడు హుటాహుటిన ఫ్లోరిడా చేరుకున్నాడు. అప్పటికే తల్లీ కూతుళ్లిద్దరూ రక్తపు మడుగులో పడి ఉన్నారు. అక్కడకు చేరుకున్న అతనికి చేతన మృతి చెందగా, సుజాత తీవ్రంగా గాయపడి కనిపించటంతో పోలీసులకు సమాచారం అందించాడు. సుజాత ఇంకా ప్రాణాలతో ఉండటంతో ఆమెను చికిత్స నిమిత్తం ఓర్లాండో రీజినల్ మెడికల్ సెంటర్‌కు తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. హత్య, ఆత్మహత్య ఘటనకు కుటుంబ కలహాలే కారణమని పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సంఘటన జరిగినప్పుడు సుజాత భర్త రావు గూడూరు అక్కడ లేరు. ఆయన అట్లాంటా వెళ్లి అక్కడినుంచి తిరిగొస్తున్నారు. కాగా ఈ దుర్ఘటన ఆకస్మికంగా జరిగింది కాదని... సుజాత ఈనెల 2వ తేదీనే గన్ కొన్నారని, పథకం ప్రకారమే ఈ హత్య జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. సుజాత కోలుకున్నాక...ఆమెను విచారిస్తామని తెలిపారు. దుర్ఘటన జరిగే సమయానికి చేతన నాయనమ్మ ఇంట్లోనే ఉన్నా..ఆమె నిద్రపోతున్నారని తెలుస్తోంది. తాను చనిపోవాలని నిర్ణయించుకున్నానని, తాను మరణించాక ఇక కూతుర్ని చూసుకునేవారు ఎవరూ లేరు కాబట్టి ఆమెను కూడా చంపేస్తున్నానని సుజాత తన సోదరుడికి రాసిన ఈ మెయిల్ సందేశంలో పేర్కొన్నారు. మరోవైపు చేతన మరణ వార్త విని ఓర్లాండోలోని సెమినోల్ హైస్కూల్లోని ఆమె సహ విద్యార్థులు తీవ్ర దిగ్ర్బాంతికి గురయ్యారు. చేతన క్లాస్‌లో అందరినీ అబ్బురపరచే తెలివైన విద్యార్థి అని , చదువు తప్ప మరో ధ్యాస లేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఏ ప్రశ్న అడిగినా వెంటనే సమాధానం చెప్పగల సమర్థురాలని తెలిపారు. అమెరికా అధ్యక్షుడిని కలిసే అత్యంత ప్రతిభావంతులైన విద్యార్థుల బృందంలో ఈమె కూడా ఒకరు. ఆరేళ్లుగా ఈ కుటుంబం ఓర్లాండోలో ఉంటోంది. సంచలనం రేపిన ఈ దారుణ సంఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.