
అమెరికాలో తెలుగు విద్యార్థి దుర్మరణం
వాషింగ్టన్: అమెరికాలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఓ తెలుగు విద్యార్థి దుర్మరణం చెందాడు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన భీమవరం వాసి దిలీప్ వర్మ(26) మిత్రుడితో కలిసి కారులో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. భారత కాలమాన ప్రకారం శనివారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. వీరు ప్రయాణిస్తున్న హోండుసిటీ కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొనడంతో దిలీప్ వర్మ అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన మరో వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. కాగా దిలీప్ వర్మ పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.