అమెరికాలో చదువుకుంటున్న తెలుగు విద్యార్ధిని ప్రియాంక గోగినేని ప్రమాదవశాత్తు మరణించింది. సియాటెల్ లోని సెయింట్ మాట్రిన్ యూనివర్సిటీలో చదువుతున్న ప్రియాంక.. స్థానిక హిక్ లేక్‌లో ఈతకు వెళ్లింది. అయితే అక్కడే ప్రమాదవశాత్తు ఆమె ప్రాణాలు కోల్పోయింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలికి చెందిన గోగినేని వెంకటేశ్వర్లు, సత్యవతి దంపతుల పెద్ద కుమార్తె ప్రియాంక. ఈమెకు ఒక తమ్ముడు ఉన్నాడు. వీళ్ల స్వస్థలం ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం చేమెడితిపాడు. కానీ చాలా ఏళ్ల క్రితమే కావలిలో స్థిరపడ్డారు. వెంకటేశ్వర్లు కావలిలో కాంట్రాక్టర్‌గా ఉన్నారు. ఉన్నత చదువు కోసం అమెరికా వెళ్లిన కుమార్తె ఇలా అకాల మరణం పాలవడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.