గువాహటి: అసోంలోని గువాహటి ఐఐటీలో తెలుగు విద్యార్థి ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడిని పరమేశ్వరరావుగా గుర్తించారు. వసతిగృహంలో ఉరేసుకుని అతడు ప్రాణాలు తీసుకున్నాడు. మృతుడు విశాఖ జిల్లా వాసిగా గుర్తించారు. పరమేశ్వరరావు బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. అతడు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియరాలేదు.
మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గువాహటి మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయన్న నిస్పృహతో అతడు ఆత్మహత్య చేసుకున్నాడని అనుమానిస్తున్నారు.
గువాహటి ఐఐటీలో తెలుగు విద్యార్థి ఆత్మహత్య
Published Thu, Dec 25 2014 7:04 PM | Last Updated on Thu, May 3 2018 3:17 PM
Advertisement
Advertisement