అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి కిడ్నాప్ కలకలం
కిడ్నాపర్లు 1200 డాలర్లు డిమాండ్ చేశారంటున్న కుటుంబం
అమెరికాలో చదువుతున్న భారతీయ విద్యార్థుల రక్షణకు సంబంధించి వరుస ఘటనలు ఆందోళన రేపు తున్నాయి. తాజాగా అమెరికాలో మాస్టర్స్ చదువుతున్నహైదరాబాద్‌కు చెందిన 25 ఏళ్ల అబ్దుల్ మహ్మద్ కిడ్నాప్ ఉదంతం కలకలం రేపుతోంది. క్లీవ్‌ల్యాండ్‌లో డ్రగ్స్ అమ్మే ముఠానే ఈ కిడ్నాప్‌కు పాల్పడినట్టు తెలుస్తోంది.
క్లేవ్‌ల్యాండ్ యూనివర్శిటీలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ)లో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్న అబ్దుల్ మహ్మద్ మార్చి 7 నుంచి ఆచూకీ లేకుండా పోయింది. దీంతో కుటుంబ సభ్యులు అందోళనకు గురయ్యారు. ఇంతలో అయితే కిడ్నాపర్ల నుంచి డబ్బులుచెల్లించాల్సిందిగాలు గుర్తు తెలియని వ్యక్తులనుంచి ఫోన్ వచ్చిందని అబ్దుల్ తండ్రి మహ్మద్ సలీమ్ వెల్లడించారు. అబ్దుల్‌ను విడుదల చేయాలంటే 1,200 డాలర్లు డిమాండ్ చేశారని తెలిపారు. దీంతో వారు మార్చి 8న క్లీవ్‌ల్యాండ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే మార్చి 18న చికాగోలోని ఇండియన్ కౌన్సిల్ నుండి సహాయం కోరారు.
మరోవైపు మార్చి 7న తన కొడుకుతో చివరిసారిగా మాట్లాడానని అంటూ అబ్దుల్ తల్లి అబేదా ఆవేదన వ్యక్తం చేశారు. తన బిడ్డ ఆచూకీ విషయంలో కేంద్రం జోక్యం చేసుకుని, క్షేమంగా తిరిగి వచ్చేలా చూడాలని ఆమె విజ్ఞప్తి చేశారు. క్లీవ్‌ల్యాండ్ పోలీసులు ప్రస్తుతం అబ్దుల్ అదృశ్యంపై విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment