వాషింగ్టన్‌డీసీ: హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులెట్ జనరల్‌గా నియమితులైన జెన్నిఫర్ లార్సన్‌కు అభినందనలు తెలిపారు ప్రవాసాంధ్రులు. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో జెన్నిఫర్ లార్సన్‌కు గౌరవ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రవాసాంధ్రులు, తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడిన వ్యాపార దిగ్గజాలు పాల్గొన్నారు..
కార్యక్రమంలో మాట్లాడుతున్న జెన్నిఫర్ లార్సన్
అమెరికా-భారత వాణిజ్య, సాంస్కృతిక సంబంధాల్లో చురుకుగా పాల్గొంటున్న వారు, వివిధ తెలుగు సంఘాల్లో పనిచేస్తున్న ప్రముఖులు జెన్నిఫర్ లార్సన్‌ను అభినందించారు. వ్యాపారవేత్త పార్థ కారంచెట్టి జెన్నిఫర్ లార్సన్ పూలగుచ్ఛంతో స్వాగతం పలికారు.
అమెరికాలో పాతికేళ్లుగా సామాజిక సేవల్లో ముందుండేసాఫ్ట్‌వేర్ వ్యాపార దిగ్గజం రవి పులి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కోవిడ్ సమయంలో అమెరికాలో చిక్కుకు పోయిన ఎందరో భారతీయులను ప్రత్యేక విమానంలో భారత్‌కు చేర్చిన రవి పులి తెలుగువారికి సుపరిచుతులే. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ కొత్త కాన్సులేట్ జనరల్ లార్సన్‌ను రవి పులి అభినందించారు. తాము ఈ దేశంలో అన్ని సౌకర్యాలు అనుభవిస్తూ, అందమైన జీవితాన్ని అనుభవిస్తున్నా, మాతృదేశంపై మమకారంతో, రెండు దేశాల మధ్య సాంస్కృతిక, సాంకేతిక, ఆర్థిక, వైద్య లాంటి అన్ని రంగాల్లో పరస్పరం సహకరించుకుని, రెండు దేశాల అభివృద్ధిలో తమ వంతు సహకారం చేయడానికి ఈ సమావేశం ఉపయోగ పడుతుందని ఆశిస్తున్నామని రవి పులి అన్నారు.
ఈ సందర్భంగా జెన్నిఫర్ ప్రవాసాంధ్రులను అభినందించారు. వచ్చే నవంబర్‌లో, ఆసియాలోనే అతి పెద్ద ఎంబసీ హైదరాబాద్‌లో ప్రారంభించ బోతున్నామన్నారు. అక్కడ 55 వీసా విండోస్‌తో, కోవిడ్ మహమ్మారి సమయంలో వెనుకబడిన వీసా సంఖ్యని పెంచడానికి శాయశక్తులా కృషి చేయబోతున్నాం" అని అన్నారు. ప్రతీ సంవత్సరం అమెరికాలో సమాజానికి చేసే ఉత్తమ సేవలకు ఇచ్చే “ప్రెసెడెంట్ వాలంటరీ అవార్డు"ని రవి పులి గెలుచుకోవడం సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నారు. 5279 గంటల వాలంటరీ సమయాన్ని రవి పులి, సమాజ హితం కోసం కేటాయించడం గర్వించదగిందని అమెరికా అధ్యక్షులు తమ అవార్డు సందేశంలో రవి పులి సేవలని కొనియాడారు. ప్రెసిడెంట్ బైడెన్ అవార్డు సందేశాన్ని చదివిన అనంతరం, అవార్డుతో పాటు ఇచ్చే బటన్‌ను రవి పులికి బహుకరించారు మిస్సెస్ జెన్నిఫర్. ఈ కార్యక్రమంలో భారత కాన్సులేట్ మినిష్టర్ (ఎకనామిక్ ) డాక్టర్ రవి కోట ప్రత్యేక అతిధిగా పాల్గొన్నారు.
కార్యక్రమంలో మాట్లాడుతున్న రవి పులి
హైద్రాబాద్‌లో అమెరికా కాన్సులేట్ కార్యాలయ విధులు నిర్వహిణకు ఎలాంటి మద్ధతు కావాలన్నా తామంతా ముందుంటామని ప్రవాసాంధ్రులు తెలిపారు. ఈ సమావేశంలో USIBC, CII, FICCI,US India SME Council, Indian Embassy ప్రతినిధులు, సైంటిస్టులు,, వ్యాపార వేత్తలు, CGI కంపెనీ అధికారులు పాల్గొన్నారు. చివరిగా వ్యాపారవేత్త జయంత్ చల్లా వందన సమర్పణతో ఈ కార్యక్రమం ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment