కెనడాలో తెలుగు విద్యార్థి దుర్మరణం | Telugu student killed in Canada | Sakshi
Sakshi News home page

కెనడాలో తెలుగు విద్యార్థి దుర్మరణం

Published Tue, Mar 15 2016 5:44 PM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM

Telugu student killed in Canada

ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లిన ఓ తెలుగు విద్యార్థి రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. వివరాలివీ... కృష్ణా జిల్లా కైకలూరుకు చెందిన రావులపల్లి లక్ష్మణ్‌రావు, లక్ష్మి దంపతులు మణికొండలోని జైహింద్ వ్యాలీ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. వారికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు వంశీకృష్ణ అమెరికాలోని వర్జీనియాలో స్థిరపడగా, చిన్నకుమారుడు రాజీవ్‌కృష్ణ(28) గత ఆగస్టులో ఎంబీఏ చదివేందుకు కెనడాకు వెళ్లాడు.

 

అక్కడి థామ్సన్ రివర్స్ యూనివర్శిటీలో చదువుతున్న అతడు శనివారం రాత్రి కారులో వెళ్తుండగా ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. ఆ విషయాన్ని అక్కడి అధికారులు సోమవారం తల్లిదండ్రులకు తెలిపారు. దాంతో వారు అమెరికాలోని పెద్ద కుమారునికి విషయం చెప్పారు. అతను కెనడా అధికారులతో మాట్లాడి ధ్రువీకరించుకున్నారు. అయితే, అతడు అమెరికా నుంచి కెనడాకు వెళ్లేందుకు ప్రయత్నిస్తే వీసా ఇవ్వటం లేదని తల్లిదండ్రులు పేర్కొన్నారు. తమ కుమారుని మృతదేహాన్ని త్వరగా తమ వద్దకు చేర్చేందుకు తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలే సాయం చేయాలని వారు వేడుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement