Lakshmana Rao
-
లోకాయుక్త బిల్లు.. ప్రజాస్వామ్య స్ఫూర్తికి భిన్నం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త చట్టానికి సవరణలు తీసుకొస్తూ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతిపాదనలు పార్లమెంటరీ ప్రజాస్వామ్య స్ఫూర్తికి అనుగుణంగాలేవని పీడీఎఫ్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణ్‌రావు అభిప్రాయపడ్డారు. సీఎం పేరుతో మంత్రి నారా లోకేశ్ లోకాయుక్త చట్ట సవరణ బిల్లు ఆమోదం కోసం శుక్రవారం ‘మండలి’లో ప్రవేశపెట్టగా, దానిపై కొద్దిసేపు చర్చ జరిగింది. బిల్లులో సవరణలపై లోకేశ్ వివరిస్తూ.. లోకాయుక్త, సభ్యుల నియామక కమిటీలో సీఎం చైర్మన్‌గా, అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్, శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు, హోంమంత్రి లేదా సీఎం నామినేట్ చేసే మంత్రి సభ్యులుగా ఉంటారని.. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత లేనిపక్షంలో మిగతా నలుగురు సభ్యులతో లోకాయుక్త కమిటీ సమావేశం ఏర్పాటుకు ఈ బిల్లును ప్రవేశపెడుతున్నట్లు వివరించారు. దీనిపై లక్ష్మణ్‌రావు మాట్లాడుతూ.. ‘ప్రజాస్వామ్యంలో అధికార పక్షం, ప్రతిపక్షం రెండూ జోడు గుర్రాల్లా వెళ్లాలని ఓ రాజనీతిశాస్త్ర అధ్యాపకుడిగా నేను భావిస్తున్నా. బిల్లు సారాంశం నాకు అర్థమైనంత వరకు.. ప్రతిపక్ష నాయకుడు లేరు కాబట్టి ఆయనను మినహాయిస్తూ, మిగిలిన నలుగురితో చేయాలని అనుకుంటున్నట్లుగా ఉంది. నిజానికి.. ప్రతిపక్ష నాయకుడు లేకపోయినా, ప్రతిపక్షం ఉంది. ప్రతిపక్షం నుంచి ఎవరైనా ఒక సభ్యుడు ఉండేలా కమిటీ ఉంటే బాగుంటుంది అని నా అభిప్రాయం. దానికి ప్రతిపక్ష హోదా అక్కరలేదు. ప్రతిపక్ష పార్టీ అక్కడ ఉంది. ఆ పార్టీని ఎవరో ఒక సభ్యుడిని నామినేట్ చేయమని అడగొచ్చు. మీ ప్రతిపాదనలు ప్రజాస్వామ్య స్పిరిట్ కాదు’ అంటూ మాట్లాడారు. ఈ సమయంలో పలువురు టీడీపీ సభ్యులు పెద్దగా మాట్లాడే ప్రయత్నం చేయగా.. లక్ష్మణరావు స్పందిస్తూ.. ‘వాదనలు చేయాలంటే చాలా చెయ్యొచ్చు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య సూత్రం చెబుతున్నా. ఆచరిస్తే ఆచరించండి లేకపోతే లేద’ని తెలిపారు.ప్రజాస్వామ్యయుతంగానే ముందుకు..లక్ష్మణరావు చేసిన సూచనపై లోకేశ్ స్పందిస్తూ.. ‘ప్రతిపక్ష నేత లేనిపక్షంలో అని బిల్లులో పేర్కొన్నాం.. అంతేగానీ ఏమీ తీసివేయడంలేదు. ఆయన లేనిపక్షంలో నలుగురుతో జరుగుతుందని మాత్రమే బిల్లులో పేర్కొన్నాం’.. అని చెప్పారు. ప్రజాస్వామ్యయుతంగానే లోకాయుక్తను తమ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందన్నారు. మాజీ సీఎం జగన్ రెండు సమావేశాల నుంచి సభకు రాని పరిస్థితి అని.. అన్నీ పరిగణనలోకి తీసుకునే నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. చర్చ అనంతరం, సభ మూజువాణితో బిల్లు ఆమోదం పొందినట్లు మండలి చైర్మన్ ప్రకటించారు.మరో ఏడు బిల్లులు కూడా.. జ్యుడీషియల్ ప్రివ్యూకు రద్దుఇప్పటికే అసెంబ్లీ ఆమోదం పొందిన లాండ్ గ్రాబింగ్ సవరణ బిల్లు, పీడీ యాక్ట్ సవరణ బిల్లు, దేవదాయశాఖ పాలక మండలి కమిటీ అదనపు సభ్యుల నియామకం సవరణ బిల్లు, జ్యుడీషియల్ ప్రివ్యూకు సంబంధించిన బిల్లులతో పాటు మున్సిపల్ చట్ట సవరణ బిల్లు, జీఎస్టీ చట్ట సవరణ బిల్లు, వ్యాట్ చట్ట సవరణ బిల్లులు కూడా శుక్రవారం మండలిలో ఆమోదం పొందాయి. -
కోకిలా! నోట్లో వేలు పెట్టుకోవడం మంచి అలవాటు కాదమ్మా!’
కోకిల నాలుగో తరగతి చదువుతోంది. రోజూ బడికి వెడుతుంది. తరగతిలో అందరి కంటే ముందు ఉంటుంది. అయితే కోకిల అస్తమానూ నోట్లో వేలు పెట్టుకుంటుంది. గోళ్లు కోరుకుతుంది. ‘కోకిలా! నోట్లో వేలు పెట్టుకోవడం మంచి అలవాటు కాదమ్మా!’ అంటూ అమ్మ ఎన్నిసార్లు చెప్పినా ,‘అలాగేనమ్మా! అలవాటు మానుకుంటాన’ని అంటుందే కానీ, మానుకోలేక పోతోంది. రోజూలానే ఆరోజు కూడా బడికి వెళ్ళింది కోకిల. సాయంత్రం చివరి పీరియడ్‌లో సైన్స్ పాఠాలు చెప్పే సుజాతా టీచర్ వచ్చారు. సుజాతా టీచర్ చెప్పే సైన్స్ పాఠాలు కోకిలకు ఎంతో ఇష్టం.‘పిల్లలూ! ఈ రోజు ‘అలవాట్లు’ అనే అంశం మీద మాట్లాడుకుందామా? మీరంతా ఖాళీ సమయంలో ఏమేమి చేస్తారో? ఒకొక్కరుగా టేబుల్ వద్దకు వచ్చి చెప్పాలి. సరేనా!’ అంటూ పిల్లలను అడిగారు సుజాతా టీచర్. ‘అలాగే టీచర్’ అంటూ ఉత్సాహంగా తలూపారు పిల్లలు. ‘అయితే మీ మీ అలవాట్లను చెప్పండి’ పిల్లల కేసి చూస్తూ అడిగారు టీచర్.శశాంక్ లేచి హుషారుగా టేబుల్ వద్దకు వచ్చి ‘టీచర్! నేను ఖాళీ సమయంలో బొమ్మలు వేస్తాను’ అని చెప్పాడు. ‘గుడ్! మంచి అలవాటు’ మెచ్చుకున్నారు టీచర్. ‘నేనయితే ఖాళీ సమయంలో కథలు చదువు తాను’ ఆనందంగా అన్నాడు కిరణ్. ‘వేరీ గుడ్!’ అని కిరణ్‌ని ప్రశంసిస్తూ ‘మరి నువ్వేం చేస్తావ్’ అంటూ కమలను అడిగారు టీచర్. ‘ఆడుకుంటాను టీచర్’ చెప్పింది కమల. ‘ఆటలు మానసిక ఆనందాన్ని, శారీరక ఆరోగ్యాన్ని ఇస్తాయి. మంచిది’ అని చెబుతూ ‘మరి నువ్వేం చేస్తావు కోకిలా?’ అంటూ కోకిలను అడిగారు టీచర్.కోకిల ముందుకు రాలేదు. ‘నేను చెప్పలేను టీచర్.. చెప్పను’ అంటూ విచారంగా జవాబు ఇచ్చింది కోకిల. ‘ముందు నీ అలవాటు చెప్పమ్మా! చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? పర్వాలేదు’ అని టీచర్ అనేసరికి ‘గోళ్లు కోరుకుతాను. అమ్మ ఎన్నిసార్లు వద్దని చెప్పినా, ఆ అలవాటు మానుకోలేకపోతున్నాను’ చెప్పింది కోకిల. విన్న పిల్లలంతా ఘొల్లున నవ్వారు. వెంటనే టీచర్ ‘హుష్! పిల్లలూ! అలా నవ్వకూడదు. అలవాటు మంచిదైతే మెచ్చుకోవాలి. చెడ్డదైతే వద్దని చెప్పాలి. అంతే గానీ వెక్కిరించరాదు’ అంటూ మందలించారు. దాంతో పిల్లలంతా కోకిలకు సారీ చెప్పారు. ‘కోకిలా! అలవాటు చెడ్డదైతే అది మన ఎదుగుదలకు ఆటంకంగా మారుతుంది. మీకు నా చిన్నతనంలో జరిగిన ఓ కథ చెబుతాను’ అన్నారు టీచర్ పిల్లలందరి వంకా చూస్తూ! కోకిలతో సహా పిల్లలంతా ‘చెప్పండి టీచర్’ అంటూ ఉత్సాహంగా అడిగారు. ‘నా చిన్నప్పుడు నాకు ‘చిట్టి ’ అనే స్నేహితురాలు ఉండేది. తనకు ఖాళీ సమయంలో ముగ్గులు పెట్టడమంటే ఎంతో ఇష్టం. బాగా పెట్టేది. చిట్టి ముగ్గు వేస్తే చాలా బావుంటుంది అని ఇరుగుపొరుగు వాళ్లంతా చిట్టిని మెచ్చుకునే వారు. అయితే చిట్టికి ఒక చెడ్డ అలవాటు ఉంది’ అంటూ పిల్లలకేసి చూశారు టీచర్.‘ఏం అలవాటు టీచర్?’ అంటూ ఆసక్తిగా అడిగింది కోకిల. ‘ఉదయాన్నే నిద్ర లేచేది కాదు. బారెడు పొద్దెక్కే దాకా మొద్దు నిద్ర పోయేది. ‘నిద్ర లే చిట్టీ’ అని అమ్మ ఎన్నిసార్లు చెప్పినా, వినిపించుకునేది కాదు. ఒకసారి ఊర్లో సంక్రాంతికి ముగ్గుల పోటీలు పెట్టారు. పచ్చని చిలుకలు, మామిడి తోరణాలతో స్వాగతం చెబుతున్న ముగ్గును పోటీలో వేయాలనుకుంది చిట్టీ. ప్రాక్టీస్ కూడా చేసుకుంది. మరునాడు ముగ్గుల పోటీ అనగా, ఆ రాత్రి పడుకోబోతూ.. ‘అమ్మా! ఉదయాన్నే నన్ను నిద్రలేపు. పోటీకి వెళ్ళాలి’ అని చెప్పి పడుకుంది. కానీ మరునాడు.. చిట్టీని అమ్మ ఎన్నిసార్లు నిద్రలేపినా బద్ధకంతో నిద్ర లేవలేదు చిట్టీ.’‘అయ్యో.. అప్పుడేమయింది? టీచర్?’ పిల్లలంతా ఆసక్తిగా అడిగారు. ‘ఏముంది? చిట్టి అక్కడకు వెళ్లేటప్పటికి పోటీ అయిపోయింది. చిట్టీకి ఏడుపొచ్చింది. అమ్మ చెప్పినట్లు ‘బద్ధకమే బద్ధ శత్రువ’ని గ్రహించింది. చిట్టికి ఆ అనుభవం ఒక గుణపాఠం అయింది. ఇంకెప్పుడూ మొద్దు నిద్ర పోలేదు. బద్ధకం చూపించలేదు. చక్కగా చదువు కుంది. టీచర్ అయ్యింది. ఇప్పుడు మీకు పాఠం చెబుతోంది’ అని ఆపారు సుజాతా టీచర్.పిల్లంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. అందరికన్నా ముందుగా తేరుకున్న కోకిల వెంటనే ‘చిట్టీ అంటే మీరేనా? టీచర్?’ అని అడిగింది. ‘అవును! కోకిలా, చిన్నప్పుడు నన్ను ముద్దుగా ‘చిట్టీ’ అని పిలిచేవారు. అర్థమైంది కదా కోకిలా .. చెడు అలవాట్ల వల్ల నష్టమేంటో.. పట్టుదలతో ప్రయత్నిస్తే చెడు అలవాట్లను మానుకోవడం పెద్ద కష్టమేం కాదని!’ అన్నారు టీచర్. ‘అవును టీచర్.. తప్పకుండా ప్రయత్నిస్తాను’ చెప్పింది కోకిల. ‘వేరీ గుడ్! కోకిల మారింది’ అంటూ టీచర్ అభినందించగానే, పిల్లలంతా కూడా కోకిలను అభినందిస్తూ చప్పట్లు కొట్టారు. – కె.వి.లక్ష్మణరావు -
స్వాతంత్య్రం కోసం వ్యాయామం
గడిచిన శతాబ్దంలో తెలుగు ప్రముఖులలో ఉప్పల లక్ష్మణరావుగారొకరు (1898– 1985). ఆయనది విశిష్టమైన వ్యక్తిత్వం. ‘అతడు–ఆమె’ అనే నవలను ఆయన మూడు భాగాలుగా రచించారు. 1946 ప్రాంతంలో నీలంరాజు వెంకటశేషయ్య నిర్వహించిన పత్రికలో వెలువడ్డది. బరంపురంలో వీరిని 1972 ప్రాంతంలో నేను కలిశాను. ఆ రాత్రి వీరింటనే నా బస. అది బరంపురం కాబట్టి గురజాడ అప్పారావు గూర్చి, వి.వి. గిరి గూర్చి రాత్రి ఎంతో పొద్దుపోయినదాకా వారు చెప్పారు. లక్ష్మణరావు వామపక్ష భావజాలం పట్ల మొగ్గుచూపేవారు. మాస్కో ప్రగతి ప్రచురణాలయంలో పని చేశారు. తెలుగు–రష్యన్ నిఘంటువు ప్రచురించారు. స్విట్జర్లాండ్‌కు చెందిన మహిళ మెర్లీ షోలింగర్‌ను పెళ్లి చేసుకున్నారు. విజయవాడ ఆంధ్ర సిమెంట్ కంపెనీలో పనిచేశారు. ఉప్పలవారు రచించిన ‘అతడు– ఆమె’ తెలుగులో వచ్చిన ఐతిహాసిక నవలల్లో ఎంతో చెప్పుకోదగినది. నాయికా–నాయకులు దినచర్య రాసుకున్న రీతిలో రచితమైన నవల ఇది. కొంతకాలం కలకత్తా బోస్ ఇన్స్టిట్యూట్లో పనిచేశారు వీరు. అప్పట్లో జగదీశ్ చంద్రబోస్ ద్వారా కలకత్తాకు వైజ్ఞానిక పరంగా ఎంతో గొప్ప పేరుండేది. సాహిత్యపరంగా రవీంద్రనాథ్ టాగూర్ విశ్వకవిగా నోబెల్ ప్రైజ్ అప్పటికే పొందారు. బోస్ ఇన్స్టిట్యూట్లో పని చేస్తున్న రోజులలో జగదీశ్ చంద్రబోస్‌ను ఆఫీసు పని అయిపోయిన తరువాత ఉద్యోగులు మానసిక ఒత్తిడి నుంచి బయట పడటానికి ఒక టెన్నిస్ కోర్టును ఏర్పాటు చేస్తే బాగుంటుందని లక్ష్మణరావు అర్థించాడు. సర్ జగదీశ్ చంద్రబోస్ ఇందుకు సమ్మతిం చారు. కానీ ఆయన చేసిన ఏర్పాటు వేరే విధంగా ఉంది. వంగదేశంలో అప్పుడు అత్యంత ప్రసిద్ధికెక్కిన మల్లుడొకరిని (కుస్తీ మొదలైన వ్యాయామ క్రీడా ప్రవీణుడిని) శిక్షణనిచ్చేందుకు నియోగించి, విశాలమైన బోస్ పరిశోధనా సంస్థ ఆవరణలో ఒక తాలింఖానా నెల కొల్పారు బోస్. తన పరిశోధనా సంస్థలో పనిచేసే ఉద్యోగులందరూ సాముగరిడీలలో ఆరితేరాలని అభిలాషించారాయన. ఈ విషయం బ్రిటిష్ ప్రభుత్వం (ది ఇంపీరియల్ గవర్నమెంట్) తెలుసుకొని వెంటనే మూసివేయవలసిందిగా హెచ్చరించారు. అట్లా చేయని పక్షంలో ప్రభుత్వం ఇచ్చే సాలుసరి లక్ష రూపాయల గ్రాంటును రద్దుపరుస్తున్నట్లు తాఖీదు పంపారు. అయినా సర్ జగదీశ్ చంద్రబోస్ ఏమాత్రం చలించలేదు. య«థావిధి తాలింఖానా పనిచేసింది. శరీర వ్యాయామం, కుస్తీలు, దండేలు, బస్కీలు సంస్థ ఉద్యోగులలో ఇష్టమున్న వారు సాగించారు. జగదీశ్ చంద్రబోస్ దేశభక్తి, స్వాతంత్య్రాశయ నిరతి ఇట్లా ఉండేవి. స్వామి వివేకానంద, జగదీశ్ చంద్రబోస్‌ను పారిస్‌లో ఒకసారి చూసినపుడు, మా వంగ దేశీయుడు, భారతీయుడు అని ఫ్రెంచి వారికి పరిచయం చేసి పరమానందం అనుభవించాడు. – అక్కిరాజు రమాపతిరావు రచయిత, పరిశోధకుడు, సంపాదకుడు (భారత స్వాతంత్య్ర అమృతోత్సవాల సందర్భంగా) -
‘రాష్ట్ర అభివృద్ధికి, ఆకాంక్షలకు అద్దం పట్టెలా బడ్జెట్’
సాక్షి, అమరావతి : ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ ప్రవేశపెట్టిన రాష్ట్ర వార్షిక బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలు, అభివృద్ధికి అద్దం పట్టిందన్నారు పీడీఎఫ్ ఎమ్మెల్సీ బాలసుబ్రహ్మణ్యం. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. బడ్జెట్ సంక్షేమం వైపు మొగ్గు చూపిందన్నారు. విద్యారంగానికి గతంలో కంటే ఎక్కువ కేటాయింపులు చేశారని ప్రశంసించారు. పౌరులకు నేరుగా నగదు రూపంలో సాయం అందించే ప్రయత్నం బాగుందన్నారు. అయితే బడ్జెట్లో జలవనరులకు, పట్టణాభివృద్ధికి, మౌలిక వసతులకు ఎక్కువ కేటాయింపులు చేయకపోవడం బాధాకరం అన్నారు. ఉపాధి, మౌలిక వసతులు, అభివృద్ధి, సంక్షేమం వంటి అంశాలపై సమతుల్యత లేదన్నారు. మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహిస్తుందని చెప్పడం విశేషమన్నారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ గురించి స్పష్టత లేదు : లక్ష్మణరావు రాష్ట్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో నవరత్నాలు, వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. విభజన హామీల్లో కడప ఉక్కు ఫ్యాక్టరీకి రూ. 259 కోట్లు కేటాయించారు. అయితే దీన్ని కేంద్రం చేపడతుందా.. పీపీపీల కింద చేపడతారా అన్న అంశంపై స్పష్టత లేదన్నారు. రాజధాని నిర్మాణంపై కూడా స్పష్టత లేదని ఆరోపించారు. జలవనరులకు 22 శాతం కేటాయింపులు తగ్గాయన్నారు. వ్యవసాయం, విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత : కత్తి నరసింహరావు రాష్ట్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో వ్యవసాయం, విద్యా, వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇవ్వడం సంతోషకరంగా ఉందన్నారు ఎమ్మెల్సీ కత్తి నరసింహ రావు. బడ్జెట్ వల్ల 45 లక్షల మంది తల్లులకు అమ్మ ఒడి పథకం కింద లబ్ధి చేకూరుతుందన్నారు. సీపీఎస్ రద్దుపై నిర్దిష్ట కాల పరిమితిలో రద్దు ప్రస్తావన చేయలేదన్నారు. -
కెనడాలో తెలుగు విద్యార్థి దుర్మరణం
ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లిన ఓ తెలుగు విద్యార్థి రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. వివరాలివీ... కృష్ణా జిల్లా కైకలూరుకు చెందిన రావులపల్లి లక్ష్మణ్‌రావు, లక్ష్మి దంపతులు మణికొండలోని జైహింద్ వ్యాలీ అపార్ట్మెంట్లో ఉంటున్నారు. వారికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు వంశీకృష్ణ అమెరికాలోని వర్జీనియాలో స్థిరపడగా, చిన్నకుమారుడు రాజీవ్‌కృష్ణ(28) గత ఆగస్టులో ఎంబీఏ చదివేందుకు కెనడాకు వెళ్లాడు. అక్కడి థామ్సన్ రివర్స్ యూనివర్శిటీలో చదువుతున్న అతడు శనివారం రాత్రి కారులో వెళ్తుండగా ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. ఆ విషయాన్ని అక్కడి అధికారులు సోమవారం తల్లిదండ్రులకు తెలిపారు. దాంతో వారు అమెరికాలోని పెద్ద కుమారునికి విషయం చెప్పారు. అతను కెనడా అధికారులతో మాట్లాడి ధ్రువీకరించుకున్నారు. అయితే, అతడు అమెరికా నుంచి కెనడాకు వెళ్లేందుకు ప్రయత్నిస్తే వీసా ఇవ్వటం లేదని తల్లిదండ్రులు పేర్కొన్నారు. తమ కుమారుని మృతదేహాన్ని త్వరగా తమ వద్దకు చేర్చేందుకు తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలే సాయం చేయాలని వారు వేడుకుంటున్నారు. -
బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
బావిలోపడి ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన దమ్మపేట మండటం మొద్దులగూడెం ఎస్టీ కాలనీలో బుధవారం చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి గ్రామంలోని చెరువులో చేపలు పట్టడానికిలక్ష్మణరావు(22), రఫీ(20)లు వెళ్లారు. తిరిగి ఇంటికి వచ్చే క్రమంలో ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందారు. మధ్యాహ్నం గమనించిన రైతులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మళ్లీ పేలిన మావోల తూటా
వై.రామవరం/రంపచోడవరం/అడ్డతీగల : వై.రామవరం మండలం చామగడ్డ పంచాయతీ పరిధిలోని జంగాలతోట గ్రామంలో శనివారం తెల్లవారుజామున మావోయిస్టులు తమ మాజీ కమాండరైన మువ్వల నరేష్ అలియాస్ లచ్చి అలియాస్ లక్ష్మణరావు (25)ను కాల్చి చంపారు. నరేష్ మూడురోజులుగా మండలానికి సరిహద్దు ప్రాంతమైన విశాఖ జిల్లా కొయ్యూరు మండలం వేమనపాలెంలో అత్త వారింట్లో ఉంటున్నాడు. శుక్రవారం అర్ధరాత్రి 8 మంది సాయుధ మావోయిస్టులు అక్కడికి వెళ్లారు. నరేష్‌ను బలవంతంగా జంగాలతోట తీసుకువచ్చి, నడిరోడ్డుపై గుండెలకు తుపాకీ గురిపెట్టి కాల్చడంతో అక్కడికక్కడే మరణించాడు. 2006లో పోలీసులకు లొంగిపోయిన నరేష్ అప్పటి నుంచి వారికి ఇన్ఫార్మర్గా మారాడని, హెచ్చరించినా మారకపోవడంతో హతమార్చామని గాలికొండ ఏరియా కమిటీ పేరుతో మావోయిస్టులు హత్యాస్థలంలో లేఖ పెట్టారు. హత్య వార్త తెలిసిన సీఐ ముక్తేశ్వరరావు, ఎస్సై ఎస్.లక్ష్మణరావు, సిబ్బంది జంగాలతోట చేరుకున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి, మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రంపచోడవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చిన్నవయసులోనే దళంలో చేరిన నరేష్ విశాఖ జిల్లా ఎండకోటకు చెందిన నరేష్ 12 ఏళ్ల వయసులోనే 2001లో మావోయిస్టు దళంలో సభ్యునిగా చేరాడు. 2005లో ఏరియా కమిటీ సభ్యునిగా, 2006లో పలకజీడి ఏరియా కమాండర్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. 2006లోనే పోలీసులకు లొంగిపోయాడు. మావోయిస్టుల నుంచి ప్రాణభయం ఉండడం తో వై.రామవరంలో నివసిస్తున్నాడు. లొంగిపోయాక దారకొండ ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి చదివిన నరేష్ మూడేళ్లుగా వ్య వసాయం చేస్తున్నాడని, ఇప్పుడిలా పొట్టన పెట్టుకున్నారని తల్లిదండ్రులు రోదించారు. నరేష్ రెండేళ్ల క్రితం హేమలతను పెళ్లి చేసుకున్నాడు. ఆ దంపతులకు ఒక పాప. తనకు, బిడ్డకు ఎవరు దిక్కని హేమలత సంఘటనా స్థలంలో బోరున విలపించింది. 2007లో అదే గ్రామంలో ఘాతుకం.. జిల్లా మన్యం చాలా కాలంగా మావోయిస్టుల కదలికలు, కార్యకలాపాలు లేకుండా ప్రశాంతంగా ఉంది. 2007లో జంగాలతోటలోనే ఊలెం రాంబాబు అనే వ్యక్తిని పోలీసు ఇన్ఫార్మర్ అన్న నెపంతో మావోయిస్టులు హతమార్చారు. 2011లో వై.రామవరం మండలం పాతకోట వద్ద రోడ్డు నిర్మాణ యంత్రాలను తగులబెట్టిన మావోయిస్టులు మళ్లీ తమ ఉనికిని ఇలా చాటుకున్నారు. కొంత కాలంగా చాప కింద నీరులా క్యాడర్‌ను బలోపేతం చేస్తూ వచ్చి, ఇప్పుడు వారిలో ఆత్మస్థైర్యం నింపేందుకే ఈ హత్యకు పాల్పడినట్టు భావిస్తున్నారు. షెల్టర్ జోన్‌గా వాడుకుంటున్న ఈ ప్రాంతంలో హత్యకు తెగబడడం పోలీసుల్ని సై తం ఆశ్చర్యపరిచింది. ఈ హత్యతో కొన్నేళ్లుగా తూర్పు ఏజెన్సీలో ఉన్న ప్రశాంతత భగ్నమైనట్టయింది. మావోయిస్టులు పొరుగున విశాఖ, ఒడిశా, ఖమ్మంల్లో దాడులకు పాల్పడినప్పుడు ఇక్కడే తలదాచుకుంటున్నారు. గతంలో గిరిజనులను ఇన్ఫార్మర్లన్న నెపంతో చంపిన మావోయిస్టులు ఇప్పుడు మళ్లీ అలాంటి ఘాతుకానికి పాల్పడడం, ఈ నేపథ్యంలో పోలీసులు మరింత కరకుగా వ్యవహరించే అవకాశం ఉండడం వారిని కలవరపరుస్తోంది. ముఖ్యనేతల ఆధ్వర్యంలో దాడులకు సిద్ధం! కొంత కాలంగా మావోయిస్టు అగ్ర నాయకులు సైతం జిల్లాలో సంచరిస్తున్నట్టు వచ్చిన వార్తలకు ఈ సంఘటన బలం చేకూర్చుతోంది. మావోయిస్టులు విశాఖ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున యువకుల్ని ఉద్యమంలో చేర్చుకున్నట్టు తెలుస్తోంది. ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో వీరు దాడులకు సిద్ధమవుతున్నట్టు ని ఘా వర్గాలు భావిస్తున్నాయి. కార్యకలాపాలను విస్తృతం చేసేం దుకు పక్కా ప్రణాళికతో ఉన్నారనడానికి నరేష్ హత్యే సాక్ష్యమంటున్నారు. 2004లో మావోయిస్టులతో చర్చల అనంతరం ప్రభుత్వం నిపేధం విధించింది. దీంతో నల్లమల, ఉత్తర తెలంగాణ ల్లో ఉద్యమం బలహీనపడి, ఆంధ్రా ఒడిశా బోర్డర్ నుంచి కార్యకలాపాలు సాగించారు. అనంతరం జరిగిన ఎన్కౌంటర్లలో అగ్రనాయకులు దేవన్న, సుధాకర్ చనిపోవడంతో ఇక్కడ ఉద్యమానికి పెద్దదెబ్బ తగిలింది. గోపన్న అరెస్టు తరువాత విశాఖ, తూర్పు ఏజెన్సీలో క్యాడర్ లొంగుబాట్లతో పట్టును కోల్పోయా రు. ఇంత కాలానికి తిరిగి పంజా విసరడం.. ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి సిద్ధమయ్యారనడానికి సంకేతంగా భావించొచ్చు. గిరిజన యువకుడి హత్య హేయం రంపచోడవరం : ఇన్ఫార్మర్ అన్న నెపంతో మావోయిస్టులు గిరిజన యువకుడిని హతమార్చడం హేయమని జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాష్ అన్నారు. మావోయిస్టుల విషయంలో ఇక దూకుడుగా వ్యవహరిస్తామని, విశాఖ ఎస్పీతో చర్చించి గ్రేహౌండ్స్ దళాలను రంగంలోకి దింపి, గాలిస్తామని చెప్పారు. వై.రామవరం మండలం జంగాలతోటలో మావోయిస్టులు కాల్చి చంపిన నరేష్ మృతదేహాన్ని ఎస్పీ రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఈ హత్య కేవలం మావోయిస్టులు ఉనికి చాటుకోవడానికే చేశారన్నారు. గాలికొండ ఏరియా దళ సభ్యులు శరత్, ఆనంద్, జాంబ్రి, ఆజాద్‌తో పాటు 12 మంది వరకూ దళ సభ్యులు ఈ హత్యకు కారకులని తెలుస్తోందన్నారు. దీనిపై వై.రామవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశామన్నారు. విశాఖ సరిహద్దులో పని చేస్తున్న గాలికొండ ఏరియా కమిటీ తూర్పులోనూ సంచరిస్తూ దళాల్లో యువకులను చేర్చుకునేందుకు ప్రయత్నిస్తోందన్నారు. 2001లో మావోయిస్టు ఉద్యమంలోకి వెళ్లిన నరేష్ అనంతరం బయటకు వచ్చి జనజీవన స్రవంతిలో కలిశాడని, వ్యాన్ కొనుగోలు చేసి ఉపాధి పొందుతున్నాడని చెప్పారు. మావోయిస్టులకు సహకరించినా, చందాలు ఇచ్చినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గుర్తేడు ప్రాంతంలో మావోల కదలికలు ఉన్నాయని, సరిహద్దు రాష్ట్రంలోని మల్కనగిరిలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఏజెన్సీలో ప్రజాప్రతినిధులను అప్రమత్తం చేశామని, ఏజెన్సీలోని పోలీస్స్టేషన్లకు గట్టి భద్రత ఉందని చెప్పారు. ఖమ్మం నుంచి విలీనమైన ఆరు పోలీస్ స్టేషన్లు సోమవారం నుంచి తూర్పు గోదావరి పోలీసు విభాగం ఆధ్వర్యంలో నడుస్తాయన్నారు. ఆయన వెంట ఏఎస్పీ విజయరావు ఉన్నారు. -
బహుళ ప్రయోజనకారి ఈ యంత్రం!
ఆరుతడి, మెట్ట పంటల్లో అంతర సేద్యం చేస్తుంది.. బరువులూ మోస్తుంది.. దీనితో మహిళా రైతులూ సునాయాసంగా పనిచేయొచ్చంటున్న రూపశిల్పి వ్యవసాయంలో కూలీల కొరతను అధిగమించేందుకు, మహిళలు సైతం సులభంగా వ్యవసాయ పనులు చేసుకునేలా బహుళ ప్రయోజనకర యంత్రం అందుబాటులోకి వచ్చింది. మోటార్ సైకిల్‌కి వాడే రెండు టైర్లు, టీవీఎస్ ఎక్సెల్ ఇంజన్, ఇతర ఇనుపరాడ్లతో కందుకూరులోని ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ లక్ష్మణరావు దీనికి రూపకల్పన చేశారు. చూడటానికి సింపుల్‌గానే ఉన్నా ఏకకాలంలో అనేక రకాల వ్యవసాయ పనులకు ఉపయోగ పడుతుందని లక్ష్మణ రావు(98491 40465) చెబుతున్నారు. మహిళా రైతులు సైతం సులువుగా పనులు చేసుకోవడానికి దోహదపడాలన్నదే తన తపన అని ఆయన అన్నారు. గతంలోనూ తయారుచేసిన పరికరానికీ రైతుల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. చిన్నసైజు మోటర్ సైకిల్ మాదిరిగా ఉండే ఈ యంత్రం, ఎక్స్‌లేటర్ సహాయంతో నడుస్తుంది. క్రమంగా ఎక్స్‌లేటర్ పెంచుకుంటుంటే యంత్రం ముందుకు సాగుతూ ఉంటుంది. దుక్కి దున్నుకునేందుకు ఉపయోగపడే నాగలి, మూడు చెక్కల గొర్రు, గుంటక వంటి పనిముట్లను దీనికి వెనుక వైపు అవసరాన్ని బట్టి సులభంగా బిగించుకోవచ్చు. పొగాకు, మిరప, పత్తి, కూరగాయ తోటలు, కంది, నువ్వు పంటల్లో, మామిడి, సపోట, బత్తాయి తోటల్లో సులభంగా అంతర సేద్యం చేసుకోవచ్చని ప్రొ. లక్ష్మణరావు చెబుతున్నారు. యంత్రం పైభాగంలో అమర్చిన ఇనుపరాడ్ల సహాయంతో గడ్డిమోపులు, ఎరువుల కట్టలు, నీరు, పురుగుమందు ట్యాంక్ వంటివి మోసుకుపోగలదు. 4.5 హెచ్‌పీ సామర్ధ్యం గల మోటార్‌ని బిగించడం వల్ల ఒక ట్రాక్టర్ చేయగలిగినంత పని చేస్తుందని దీని రూపకర్త వివరిస్తున్నారు. ఇది ఒక లీటర్ పెట్రోల్‌తో 30 నుంచి 40 కిలోమీటర్లు నడుస్తుందని చెప్తున్నారు. దీని తయారీకి రూ.11 వేలు ఖర్చవుతుంది. దుక్కులు దున్నడం దగ్గర నుంచి, పురుగు మందులు/ కషాయాలు/ జీవామృతం పిచికారీ వరకు వివిధ పనులు ఈ యంత్రంతో చేసుకోవచ్చు. - బాజీవలి, కందుకూరు, ప్రకాశం జిల్లా -
కళ్ల ముందే కన్నబిడ్డ దుర్మరణం
పి.కోన వలస(పాచిపెంట): ఆ గిరిజన దంపతులకు ఒక్కడే కుమారుడు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. ఐదో తరగతి చదువుకుంటున్న ఆ విద్యార్థి పాఠశాలలో జెండా పండగకి వెళ్తొస్తానని చెప్పి ఉదయాన్నే ఇంటినుంచి బయలుదేరి తల్లి కళ్లముందే దుర్మరణం పాలయ్యాడు. మండలంలోని చాపరాయివలస గిరిజన గ్రామానికి చోడిపల్లి లింగు, సింగారమ్మ దంపతులకు లక్ష్మణ రావు అనే ఒక్కగానొక్క కుమారుడు ఉన్నాడు. లింగు రోజుకూలీ కాగా సింగారమ్మ పి.కోనవలస చెక్‌పోస్టులో పాచిపని చేస్తుంటుంది. అమ్మవలస ఎంపీపీ పాఠశాలలో లక్ష్మణరావు 5వతరగతి చదువుతున్నాడు. చాపరాయివలస గ్రామంనుంచి అమ్మవలస గ్రామానికి 4 కిలోమీ టర్ల దూరం. లక్ష్మణరావు ప్రతిరోజూ పాఠశాలకు నడుచుకుని వెళ్లి వస్తుంటాడు. శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవం కావడంతో పాఠశాలలో నిర్వహించే జెండా పండగకు హాజరయ్యేందుకు నడుచుకుంటూ వస్తుండగా పి.కోనవలస చెక్‌పోస్ట్ దగ్గర సాలూరు నుంచి ఒడిశావైపు వెళ్తున్న లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. చెక్‌పోస్టు దగ్గరే పనిచేస్తున్న తల్లికి విషయం తెలిసి ఒక్కసారిగా హతాశురాలైంది. విద్యార్థి మృతి చెందిన విషయం తెలుసుకున్న ఆ గ్రామానికి చెందిన గిరిజనులు సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. ఒక్కగానొక్క కొడుకు మృతిచెందిన విషయం తెలుసుకున్న ఆ తల్లిదండ్రుల రోదనను ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. విద్యార్థి మరణ వార్త తెలుసుకున్న అమ్మవలస పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కె.జయ సంఘటనా స్థలానికి చేరుకుని భోరున విలపించారు. ఒక్క రోజు కూడా సెలవు పెట్టకుండా పాఠశాలకు అందరికంటే ముందు వచ్చేవాడని, మంచి డ్రాయింగ్స్ వేస్తూ చలాకీగా ఉండేవాడని గుర్తుచేసుకున్నారు. లక్ష్మణరావు కుటుంబానికి ప్రధానోపాధ్యాయురాలు, పాచిపెంట మండల విద్యాశాఖాధికారి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పాఠశాలకు చెందిన పలువురు ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు సంఘటనా స్థలానికి చేరుకుని విలపించారు. పాచిపెంట హెడ్ కానిస్టేబుల్ సంఘటనా స్థలానికి చేరుకుని కేసునమోదు చేసి, విద్యార్థి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం సాలూరు సీహెచ్‌సీకి తరలించారు. లారీ డ్రైవర్ పరారవడంతో పోలీసులు లారీని అదుపులోకి తీసుకున్నారు. -
డెంగ్యూ కలవరం
ఒకే కుటుంబంలో ఇద్దరికి వ్యాధి, మరొకరికి లక్షణాలు ఏటా వివిధ జ్వరాల దాడి ప్లేట్లెట్లకు కొరత అల్లాడుతున్న సామాన్యులు జ్వర బాధితులు 2012 87,932 2013 71,039 2014 56,084 (జులై వరకూ) విశాఖపట్నం, మెడికల్: నగరంపై డెంగ్యూ వ్యాధి మళ్లీ పంజా విసిరింది. ఒకే కుటుంబానికి చెందిన తండ్రీ కొడుకులకు వ్యాధి సోకినట్లు నిర్థారణ అయింది. మాధవధార ప్రాంతానికి చెందిన బి.లక్ష్మణరావు (40), ఆయన పెద్ద కుమారుడు బి.అభినవ్ (9)లకు వైద్య పరీక్షల్లో పాజిటివ్ వచ్చినట్టు జీవీఎంసీ వైద్యాధికారులు మంగళవారం వెల్లడించారు. చిన్న కుమారుడు అనిరుద్‌కు కూడా ఈ లక్షణాలు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. లక్ష్మణరావు, అభినవ్‌ల రక్తనమూనాలను పరీక్షలకు పంపగా డెంగ్యూగా నిర్థారణ అయింది. లక్ష్మణరావు, అభినవ్‌లను కేజీహెచ్‌కు తరలించారు. ఇప్పటి వరకూ నగర పరిధిలో 14 మందికి డెంగ్యూ వ్యాధి సోకగా, వీరి లో సీతమ్మధారకు చెందిన ఒకరు మృతి చెందినట్టు అధికారిక గణాంకాలువెల్లడిస్తున్నాయి. కేజీహెచ్‌లో జనవరి నుంచి 23 డెంగూ కేసులు నమోదయ్యాయి. నగర వాసులపై జ్వరాలు దండెత్తుతున్నాయి. జ్వరపీడితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడంతో ఆస్పత్రుల వద్ద రోగులు బారులుతీరుతున్నారు. వర్షాకాలం ప్రారంభమం కావడంతో మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, వైరల్ జ్వరాలతో నగరం వణుకుతోంది. జ్వర తీవ్రతను తట్టుకోలేక అధిక సంఖ్యలో రోగులు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. మురికివాడల్లో ఉన్నవారెక్కువగా వీటి బారిన పడుతున్నారు. 2012 సంవత్సరంలో నగర పరిధిలో 87,932 మంది వివిధ రకాల జ్వరాలభారిన పడ్డారు. వీరిలో మలేరియా భారిన 3,019 మంది, డెంగూ జ్వరంతో 42మంది బాధపడ్డారు. 2013లో 71,039 మంది అన్ని రకాల జ్వరాలతో బాధపడగా, అందులో 3046 మంది మలేరియాబారిన, డెంగూ 61 మందికి సోకింది. ఈ ఏడాది జూలై నాటికి 56,084 మంది జ్వరాలభారిన పడ్డారు. వీరిలో మలేరియా 1181 మందికి, డెంగూ భారిన 15 మంది పడగా ఒకరు మృతిచెందారు. మలేరియా వ్యాధి సోకేందుకు అవకాశాలున్న 34 మురికివాడలను అత్యంత సమస్యాత్మక ప్రాంతాలుగా జీవీఎంసీ, వైద్య ఆరోగ్యశాఖలు గుర్తించాయి. ఈ ప్రాంతాల్లో దోమల నిర్మూలన, పారిశుద్ధ్య కార్యక్రమాల మెరుగుదల విషయంలో మాత్రం ఈ శాఖలు ఉదాసీనత వహిస్తున్నాయన్న విమర్శలున్నాయి. దీంతో దోమల సంఖ్య పెరిగి నగరంపై దాడిచేస్తూ రోగాలభారిన పడేటట్లు చేస్తున్నాయి. ప్లేట్లెట్ల కొరత : డెంగూ, వైరల్ జ్వరాల్లో రక్తంలోని ప్లేట్లెట్ల సంఖ్య విపరీతంగా పడిపోవడంతో జ్వరపీడితులు ఎక్కువమంది ప్రాణాప్రాయ స్థితికి చేరుకుంటున్నారు. నగరంలో ప్లేట్లెట్లకు కొరత ఏర్పడింది. కొన్ని బ్లడ్‌బ్యాంకులు ప్లేట్లెట్ల కృత్రిమ కొరతను సృష్టించి రోగులను దోచుకుంటున్నాయన్న విమర్శలున్నాయి. ప్లేట్లెట్లు కొనలేనివారు మృత్యువాత పడుతున్నారు. -
నేనొస్తానంటే...మీరొద్దంటారా..!
జలుమూరు, న్యూస్‌లైన్:ఓడలు బండ్లు .. బండ్లు ఓడలు అవుతాయన్న సామెత నరసన్నపేట నియోజకవర్గ టీడీపీ నేతలకు అచ్చంగా సరిపోతుంది. ఇప్పటికే వైఎస్సార్ సీపీని తట్టుకోలేని టీడీపీ నేతలకు.. మూలిగే నక్కమీద తాటిపండు పడ్డట్టు మరొక సమస్య వచ్చి పడింది. బీజేపీతో పొత్తుపెట్టుకోవడం టీడీపీకి కలిసిరాని అంశమని అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ పార్టీకి చెందిన బగ్గు లక్ష్మణరావు ప్రచారానికి వస్తాడన్న సమాచారం టీడీపీ నేతలను కలవరపెడుతోంది. సామాన్య కార్యకర్తలు ప్రచారానికి వస్తే నాలుగు ఓట్లు వస్తాయని, వారికి సకల మర్యాదలు చేసి ప్రచారానికి స్వాగతిస్తున్న నాయకులు జిల్లా సీనియర్ నేత, ఎంతో చరిత్ర గల కుటుంబం, సుధీర్గ రాజకీయ అనుభవం ఉన్న లక్ష్మణరావును రావద్దని చెప్పడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. గతంలో ఎన్నో ఎన్నికల్లో చిన్నచిన్న గొడవలకు అలక పాన్పుఎక్కిన లక్ష్మణరావును స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు వంటి నేతలు బతిమిలాడి ప్రచారానికి తీసుకెళ్లేవారు. వ్యయప్రయాసలకోర్చేవారు. అలాంటిది ఆయనే స్వయంగా ప్రచారానికి వస్తానంటే... మీరు వస్తే ఓట్లు పడవంటూ నాయకులే ఖరాఖండిగా చెప్పడం పలు సందేహాలకు తావిస్తోంది. 1980-81లో కోటబొమ్మాళి మండలం సమితి అధ్యక్షుడిగా సుశీలమ్మదొరను ఓడించడం, 1984 ఎన్నికల్లో అప్పటి మంత్రి ధర్మాన ప్రసాదరావుపై గెలవడం, అలాగే జెడ్పీ చైర్మన్ పదవితోపాటు ఎన్నో సందర్భాల్లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని సైతం ఇరుకున పెట్టి కింజరాపు ఎర్రన్నాయుడుపై ధిక్కార స్వరాన్ని వినిపించిన సమర్ధత లక్ష్మణరావుది. అలాంటిది ఆయనను కింజరాపు అచ్చెన్నతో పాటు రామ్మోహన్నాయడు కూడా ప్రచారానికి ఆహ్వానించడం లేదు. బీజేపీ అధిష్టానం ఆదేశాల మేరకు ఆయన ప్రచారానికి వస్తానంటే వద్దంటున్నారంటే... ఆయన టీడీపీకి వ్యతిరేకంగా ఓట్లు వేయిస్తారన్న అపనమ్మకం నాయకుల్లో ఉన్నట్టు బోగట్ట. ఎలాగా విజయం సాధించలేం... కనీసం గట్టి పోటీ అయినా ఇవ్వాలన్న ఉద్దేశంలో టీడీపీ నేతలు ఉన్నట్టు సమాచారం. ఆయనను దూరం పెట్టడానికి కళా వెంకట్రావు వర్గమే అసలు కారణమని. ఏది ఏమైనా ప్రస్తుత ఎన్నికల్లో ఎంతో బిజీగా ఉండాల్సిన లక్ష్మణరావు కింజరాపు వర్గం వేసిన పాచికలో ప్రస్తుతం బందీగా ఉన్నారని పలువురు గుసగుసలాడుతున్నారు. -
అంగన్వాడీలకు రూ.10 వేల వేతనం ఇవ్వాలి
కొరిటెపాడు(గుంటూరు), న్యూస్‌లైన్ :అంగన్వాడీ కార్యకర్తలకు కనీస వేతనం రూ.10 వేలు ఇవ్వాలని ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్(సిఐటియు) ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షలను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ అంగన్వాడీలకు పెన్షన్‌తో సహా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని కోరారు. అమృతహస్తం పెండింగ్ బిల్స్ వెంటనే చెల్లించాలని, పెంచిన అద్దెలను షరతుల్లేకుండా చెల్లించాలని డిమాండ్ చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శి డి.రమాదేవి మాట్లాడుతూ ధరల పెరుగదలకు అనుగుణంగా మెను ఛార్జీలు పెంచాలన్నారు. వంటలకు సరిపడా గ్యాస్‌ను సబ్సిడీతో ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమస్యల సాధన కోసం పోరాటాలు తప్పవన్నారు. నిరవధిక నిరాహార దీక్షలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ నాగబ్రహ్మాచారి, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు టి.జ్యోతిరాణి, సిహెచ్ లలితకుమారి, సిహెచ్ సుబ్బలక్ష్మీ, కె.కుమారి, రాధ, పి.శాంతమణి, నాగమల్లేశ్వరమ్మ, కె.పద్మ, ఎన్.శాంతకుమారి, ఎం.శివలక్ష్మి, డి.కోటేశ్వరమ్మ కూర్చున్నారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి వై.రాధాకృష్ణ, సిఐటియు నాయకులు రాంబాబు, బైరగాని శ్రీనివాసరావు తదితరులు దీక్ష శిబిరాన్ని సందర్శించి మద్దతు పలికారు. -
ఎయిడ్స్ నిర్మూలనకు కృషి
గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్: ఎయిడ్స్ నిర్మూలనలో యువతను భాగస్వామ్యం చేసేందుకు విద్యాసంస్థలు కీలకపాత్ర పోషించాలని ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు పేర్కొన్నారు. స్థానిక సాంబశివపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో మంగళవారం ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (ఏపీశాక్స్) ఆధ్వర్యంలో రెడ్ రిబ్బన్‌క్లబ్ మాస్టర్ ట్రైనీలకు అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఇటీవల ప్రపంచ ఎయిడ్స్ నియంత్రణ దినోత్సవం సందర్భంగా హెచ్ఐవీ-ఎయిడ్స్‌పై వివిధ కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులను చైతన్యపరిచినందుకు 16 మంది మాస్టర్ట్రైనీలను ఈ సందర్భంగా అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు. వీరీలో అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ కింద ఐ.నాగేశ్వరరావు(జేకేసీ కళాశాల-గుంటూరు), వి. వెంకటేష్ (ఎస్‌కేవీబీఆర్ కళాశాల-నరసరావుపేట), బి. మాధవిగ్లోరి(ఎస్వీఆర్ఎం కళాశాల-నగరం)లను సత్కరించారు. అదే విధంగా విద్యార్థులను చైతన్య పర్చడంలో కృషిచేసినందుకు బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల (బాపట్ల), పీఎన్సీ అండ్ కేఆర్ కళాశాల (నరసరావుపేట), ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల(గుంటూరు)లకు అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రకటించారు. కార్యక్రమంలో కళాశాల విద్య ఆర్జేడీ ఎం. ప్రసాదరావు, కళాశాల ఇన్చార్జ్ సీహెచ్ పుల్లారెడ్డి, రెడ్‌రిబ్బన్ క్లబ్ జిల్లా కో-ఆర్డినేటర్ బాలిరెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు.