ఎయిడ్స్ నిర్మూలనకు కృషి
Published Wed, Jan 1 2014 3:24 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్: ఎయిడ్స్ నిర్మూలనలో యువతను భాగస్వామ్యం చేసేందుకు విద్యాసంస్థలు కీలకపాత్ర పోషించాలని ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు పేర్కొన్నారు. స్థానిక సాంబశివపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో మంగళవారం ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (ఏపీశాక్స్) ఆధ్వర్యంలో రెడ్ రిబ్బన్‌క్లబ్ మాస్టర్ ట్రైనీలకు అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఇటీవల ప్రపంచ ఎయిడ్స్ నియంత్రణ దినోత్సవం సందర్భంగా హెచ్‌ఐవీ-ఎయిడ్స్‌పై వివిధ కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులను చైతన్యపరిచినందుకు 16 మంది మాస్టర్‌ట్రైనీలను ఈ సందర్భంగా అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు.
వీరీలో అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ కింద ఐ.నాగేశ్వరరావు(జేకేసీ కళాశాల-గుంటూరు), వి. వెంకటేష్ (ఎస్‌కేవీబీఆర్ కళాశాల-నరసరావుపేట), బి. మాధవిగ్లోరి(ఎస్‌వీఆర్‌ఎం కళాశాల-నగరం)లను సత్కరించారు. అదే విధంగా విద్యార్థులను చైతన్య పర్చడంలో కృషిచేసినందుకు బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల (బాపట్ల), పీఎన్‌సీ అండ్ కేఆర్ కళాశాల (నరసరావుపేట), ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల(గుంటూరు)లకు అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రకటించారు. కార్యక్రమంలో కళాశాల విద్య ఆర్జేడీ ఎం. ప్రసాదరావు, కళాశాల ఇన్‌చార్జ్ సీహెచ్ పుల్లారెడ్డి, రెడ్‌రిబ్బన్ క్లబ్ జిల్లా కో-ఆర్డినేటర్ బాలిరెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు.
Advertisement