బావిలోపడి ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన దమ్మపేట మండటం మొద్దులగూడెం ఎస్టీ కాలనీలో బుధవారం చోటుచేసుకుంది.
బావిలోపడి ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన దమ్మపేట మండటం మొద్దులగూడెం ఎస్టీ కాలనీలో బుధవారం చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి గ్రామంలోని చెరువులో చేపలు పట్టడానికిలక్ష్మణరావు(22), రఫీ(20)లు వెళ్లారు. తిరిగి ఇంటికి వచ్చే క్రమంలో ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందారు. మధ్యాహ్నం గమనించిన రైతులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.