rafi
-
యుగళధారతో మ్యూజిక్ థె‘రఫీ’
రఫీ సోలోలు వేన వేలు... వాటికి అభిమానులు ఉన్నారు. రఫీ డ్యూయెట్లు వేలకు వేలు... వాటికీ అభిమానులు ఉన్నారు. ఈ స్వీటు కావాలా ఆ జున్ను కావాలా అంటే చాయిస్ ఏమైనా ఉంటుందా ఎవరికైనా? రెండూ కావాలి. కాని రఫీతో డ్యూయెట్లు పాడి సరిజోడుగా నిలిచి సంగీతాభిమానులను మెప్పించిన అద్భుత గాయనీమణులను రఫీతో పాటు స్మరించుకోవాలి. డిసెంబర్ 24 రఫీ శతజయంతి. మరి ఆయనతో కలిసి పాడుదామా యుగళగీతం.లాహోర్ నుంచి ఒక అన్నను తోడు చేసుకుని బాంబేకు బయలుదేరిన రఫీ (Mohammed Rafi) తాను గాయకుడిగా బతకాలంటే ముందు సంగీత దర్శకుణ్ణి మెప్పించాలని తెలుసుకున్నాడు. ఆ రోజుల్లో నౌషాద్ చాలా పెద్ద డిమాండ్‌లో ఉన్నాడు. కాని ఆయనను నేరుగా కలిసే శక్తి రఫీకి లేదు. అందుకని అన్నాదమ్ములు ఆలోచించి నేరుగా లక్నో వెళ్లారు. అక్కడ నౌషాద్ తండ్రి ఉంటారు. ఆయన దగ్గర సిఫార్సు ఉత్తరం తీసుకుని బాంబే తిరిగి వచ్చి అప్పుడు నౌషాద్‌ను కలిశారు. ‘లాహోర్ నుంచి వచ్చావా? పాడతావా? ఏం పాడతావ్... నిన్ను వద్దనడానికి లేనంత పెద్ద రికమండేషన్ తెస్తివి’ అని నౌషాద్ రఫీని పరికించి చూసి తన టీమ్‌లోకి తీసుకున్నాడు. అప్పటికి తలత్ ఊపు మీదున్నాడు. అయినా సరే ‘దులారీ’ (1949)లో రఫీ పాడిన సోలో ‘సుహానీ రాత్ ఢల్ చుకీ నా జానే తుమ్ కబ్ ఆవొగే’ పాట పెద్ద హిట్ అయ్యి రఫీ దేశానికి పరిచయం అయ్యాడు. అయినప్పటికీ రావలసినంత పేరు రాలేదు. అప్పుడు నౌషాదే ‘బైజూ బావరా’ (1952)లో మళ్లీ పాడించాడు. ఆ సినిమాలో రఫీ పాడిన సోలో పాటలు ‘ఓ దునియాకే రఖ్వాలే’, ‘మన్ తర్పత్ హరి దర్శన్ కో ఆజ్’ పాటలు ఇక రఫీని తిరుగులేని గాయకుని స్థానంలో కూచోబెట్టాయి. రఫీ రేంజ్‌ను తెలిపిన పాటలు అవి. అయితే అప్పటికే నూర్జహాన్ పాకిస్తాన్ వెళ్లిపోగా ప్రతిభను, ప్రొఫెషనలిజాన్ని నిలబెట్టుకుంటూ లతా మంగేశ్కర్ ‘మహల్’ (1949)లో ‘ఆయేగా ఆయేగా ఆనేవాలా ఆయేగా’ పాటతో స్థిరపడింది. రఫీ, లతా తొలి పాట కామెడీ సాంగ్ అయినా ఆ తర్వాత వారి డ్యూయెట్లు సరైన రొమాంటిక్ టచ్‌ను అందుకున్నాయి. అందుకు ‘బైజూ బావరా’లోని ఈ పాటే సాక్ష్యం.తూ గంగాకి మౌజ్ మై యమునా కా ధారహో రహేగా మిలన్ యే హమారా హోహమారా తుమ్హారా రహేగా మిలన్...మేల్ సింగర్ కొందరికి సరిపోతాడు.. కొందరికి సరిపోడు అనే ధోరణి ఉంది. రఫీ.. రాజ్‌కపూర్‌కు(Raj Kapoor) మేచ్ కాడు. దిలీప్ కుమార్, దేవ్ ఆనంద్‌లకు బాగా సరిపోయేవాడు. కాని లతాకు ఆ అడ్డంకి లేదు. ఏ హీరోయిన్ గొంతైనా లతా గొంతే. మీనా కుమారి, నర్గిస్, వైజయంతీ మాల, మాలా సిన్హా.. అందరికీ లతా గొంతు. అందువల్ల రఫీ, లతాల పాటలు రాజ్ కపూర్ సినిమాల్లో తప్ప తక్కిన అన్నింటిలో కొనసాగాయి. అందరు సంగీత దర్శకులు సరైన తీపితో తయారైన రవ్వలడ్ల వంటి పాటలను వారి చేత పాడించారు.∙దో సితారోంకా జమీ పర్ హై మిలన్ ఆజ్ కీ రాత్ (కోహినూర్)∙ఓ జబ్ యాద్ ఆయే బహుత్ యాద్ ఆయే (పరాస్మణి)∙దిల్ పుకారే ఆరె ఆరె ఆరె (జువెల్ థీఫ్)∙జిల్ మిల్ సితారోంక ఆంగన్ హోగా (జీవన్ మృత్యు)∙వాదా కర్లే సాజ్నా (హాత్ కీ సఫాయి)..వీటికి అంతే లేదు. రఫీ తన కెరీర్లో షమ్మీ కపూర్‌కు పాడటానికి ఎక్కువ సరదా చూపాడు. వాళ్లిద్దరిదీ హిట్ పెయిర్. షమ్మీ కపూర్ సినిమాలో రఫీ డ్యూయెట్లు ఎక్కువగా ఆశా భోంస్లేకు (Asha Bhosle) వెళ్లినా లతా కూడా పాడింది. రఫీ–లతాల జోడి వెన్నెల–వెలుతురు లాంటిది. ఆ చల్లదనం వేరు.→ ఆశా భోంస్లేవ్యాంప్లకు పాడుతూ మెల్లమెల్లగా కుదురుకున్న గాయని ఆశా రఫీతో కలిసి గొప్ప పాటలు పాడింది. అన్నింటిలోకి కలకాలం నిలిచే పాట ‘అభీ నా జావో ఛోడ్ కర్ కె దిల్ అభీ భరా నహీ’ (హమ్ దోనో). ఈ పాటలో రఫీ బాగా పాడుతున్నాడా ఆశానా అనేది చెప్పలేం. ఓపి నయ్యర్ ఆశా చేత ఎక్కువ పాడించడం వల్ల ‘కశ్మీర్ కి కలీ’లో రఫీతో ‘దీవానా హువా బాదల్’, ‘ఏక్ ముసాఫిర్ ఏక్ హసీనా’లో ‘బహుత్ షుక్రియా బడీ మెహర్బానీ’ వంటి సూపర్హిట్లు సాధించింది. ఆర్.డి.బర్మన్ తన సంగీతంలో రఫీ, ఆశాలను అద్భుతమైన పాటల్లో కూచోబెట్టాడు. ‘ఓ మేరే సోనరే సోనరే సోనరే’ (తీస్రీ మంజిల్), ‘చురాలియా హై తుమ్నే జో దిల్‌కో’ (యాదోంకి బారాత్)... ఒంట్లో నిస్సత్తువను వదలగొట్టే పాటలు.→ గీతా దత్ఎంతో గొప్ప గాయని అయి ఉండి తక్కువ కాలం పాడిన గీతా దత్ (గీతా రాయ్) గురుదత్ సినిమాల్లో రఫీతో మురిపమైన పాటలు పాడింది. ‘సున్ సున్ సున్ జాలిమా’ (ఆర్ పార్), ‘హమ్ ఆప్కే ఆంఖోమే ఇస్ దిల్ కో బసాదేతో’(ప్యాసా) ఇవి రెండు గురుదత్ మీద తీసినవి. ‘సిఐడి’లో దేవ్ ఆనంద్, షకీలా మీద తీసిన ‘ఆంఖోహి ఆంఖోమే ఇషారా హోగయా’..పెద్ద హిట్. గురుదత్ సినిమాల్లో కమెడియన్ జానీ వాకర్‌కు పాటలు ఉంటాయి. జానీ వాకర్‌కు కూడా రఫీనే పాడతాడు. తోడు గీతా దత్. ‘అయ్ దిల్ ముష్కిల్ హై జీనా యహా’ (సిఐడి), ‘జానే కహా మేరా జిగర్ గయా జీ’(మిస్టర్ అండ్ మిసెస్ 55)... ఇవన్నీ దశాబ్దాలైనా నిలిచి ఉన్న పాటలు. రఫీతో పాటు గాయనీమణులు నిలబెట్టిన పాటలు.→ సుమన్ కల్యాణ్పూర్రాయల్టీ విషయంలో లతా మంగేష్కర్‌కు (Lata Mangeshkar) రఫీకు విభేదాలు వచ్చాయి. రాయల్టీ కావాలని లతా, అక్కర్లేదని రఫీ మూడేళ్లు విభేదించి పాడలేదు. 1961 నుంచి 63 వరకు సాగిన ఈ కాలంలో రఫీతో డ్యూయెట్లు పాడిన గాయని సుమన్ కల్యాణ్‌పూర్. ‘పూర్‌మేన్స్ లతా’గా పేరుబడ్డ సుమన్‌కు గొప్ప ప్రతిభ ఉన్నా తక్కువ అవకాశాలు దొరికాయి. అయినా సరే రఫీ, సుమన్ కలిసి మంచి హిట్స్ ఇచ్చారు. వీటిలో ‘బ్రహ్మచారి’ కోసం పాడిన ‘ఆజ్ కల్ తెరె మెరె ప్యార్ కే చర్చే హర్ జబాన్ పర్’, ‘జబ్ జబ్ ఫూల్ ఖిలే’లో ‘నా నా కర్తే ప్యార్ తుమ్హీసే కర్బైఠే’ పెద్ద హిట్స్‌గా నిలిచాయి. ‘రాజ్ కుమార్’లోని ‘తుమ్నే పుకారా ఔర్ హమ్ చలే ఆయే’ కూడా పెద్ద హిట్టే. అయితే లతా, రఫీల మధ్య సంధి కుదరడంతో సుమన్ వెనక్కు వెళ్లిపోయింది.వీళ్లే కాదు ఎందరో గాయనులతో రఫీ డ్యూయెట్స్ పాడాడు. షంషాద్ బేగంతో ‘లేకె పెహలా పెహలా ప్యార్’, ముబారక్ బేగంతో ‘ముజ్కో అప్నే గలే లగాలో’, హేమలతాతో ‘తూ ఇస్ తర్హా మేరి జిందగీమే’... లాంటి ఎన్నో మంచి పాటలు ఉన్నాయి. సుశీలతో ‘ఇద్దరి మనసులు ఒకటాయె’, జానకితో ‘నా మది నిన్ను పిలిచింది గానమై’... ఈ పాటలు అపురూపం. రఫీ ఘనతలో రఫీ ఫ్రతిభకు మరో సగమై నిలిచిన గాయనీమణులందరికీ రఫీ శతజయంతి సందర్భంగా జేజేలు పలకాలి. రఫీకి జిందాబాద్‌లు కొట్టాలి. -
జైలు నుంచే చదువు.. పీజీ గోల్డ్ మెడల్ కైవశం
కోవెలకుంట్ల: జైలు శిక్షపడిన యువ ఖైదీ అక్కడి అధికారుల సహకారం, పట్టుదలతో లా కోర్సు చదివి న్యాయవాద పట్టాతో తన తండ్రిని నిర్దోషిగా నిరూపించేందుకు న్యాయస్థానంలో వాదించి గెలిచిన ఘటనను 20 ఏళ్ల క్రితం స్టూడెంట్ నంబర్ –1 సినిమాలో చూశాం. అదే తరహాలో యావజ్జీవ కారాగార శిక్షపడిన ఓ యువకుడు నిజ జీవితంలో విజయం సాధించి రియల్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. నంద్యాల జిల్లా సంజామల మండలం పేరుసోముల గ్రామానికి చెందిన దూదేకుల నడిపి మాబుసా, మాబున్నీ కుమారుడు మహమ్మద్ రఫీ 2014లో బీటెక్ చదివేవాడు. ఆ సమయంలో ప్రేమ వ్యవహారంలో ఇదే గ్రామానికి చెందిన ఓ యువతి హత్యకు కారకుడని భావించి ఆ యువకుడిపై పోలీస్‌స్టేషన్‌లో హత్యకేసు నమోదైంది. కోర్టులో విచారణ అనంతరం 2019 జూలై నెలలో రఫీకి జీవితఖైదు విధించారు. అప్పటి నుంచి కడప కేంద్ర కారాగారంలో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఖైదీలను సైతం అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో అక్కడి జైలు అధికారులు చదువుపై ఆసక్తి ఉన్న వారిని గుర్తించారు. పది చదివిన వారిని దూర విద్య కోర్సుల ద్వారా పై చదువులకు ప్రోత్సహించారు. శిక్షపడే నాటికే డిగ్రీ పూర్తి చేసిన మహమ్మద్ రఫీకి చదువుపై ఉన్న మక్కువను గుర్తించి అప్పటి జైలు సూపరింటెండెంట్ ప్రకాశ్, ఇతర జైలు అధికారులు ప్రోత్సాహమందించారు. 2020లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పీజీ చేసేందుకు అవకాశం కల్పించారు. తెలుగు రాష్ట్రాల్లో మొదటి ర్యాంకు మహమ్మద్ రఫీ ఎంఏ సోషియాలజీలో అడ్మిషన్ పొందాడు. వివిధ రకాల పుస్తకాలు, స్టడీ మెటీరియల్‌ను సమకూర్చుకుని జైలులోనే నాలుగు గోడల మధ్య కష్టపడి చదివాడు. కోర్టు ఆదేశాల మేరకు జైలు అధికారులు 2022లో పరీక్షలకు అనుమతి ఇచ్చారు. అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుని యూనివర్సిటీ పరిధిలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి ఎంఏ సోషియాలజీలో మొదటి ర్యాంకుతో గోల్డ్ మెడల్ కైవశం చేసుకున్నాడు. జైలులో ఉంటున్న రఫీకి పీజీ పట్టా గోల్డ్ మెడల్ ప్రదానం చేయాలని యూనివర్సిటీ అధికారులు ఇటీవల జైలు అధికారులకు సమాచారం అందించారు. కోర్టు అనుమతితో నాలుగు రోజులు బెయిల్ మంజూరు కావడంతో గురువారం హైదరాబాద్‌లోని అంబేడ్కర్ యూనివర్సిటీలో వైస్ చాన్స్‌లర్ జగదీశ్ ఆధ్వర్యంలో గోల్డ్‌మెడల్ బహూకరించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా రఫీ మాట్లాడుతూ తన జీవితం జైలు పాలైనప్పటికీ చదువుపై ఉన్న మమకారంతో పట్టుదలతో పీజీ సాధించానన్నారు. తన తల్లిదండ్రులకు ఈ గోల్డ్‌మెడల్ అంకితం చేస్తున్నట్లు తెలిపారు. -
భార్య సూత్రధారి.. కొడుకు పాత్రధారి
బూర్గంపాడు: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భార్య, మాదక ద్రవ్యాలకు బానిసైన తనను నిత్యం వేధిస్తున్నాడని కొడుకు.. ఇద్దరూ పక్కాగా ప్లాన్ వేసి దారుణానికి పాల్పడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలో నాలుగు రోజుల క్రితం సయ్యద్ రఫీ(38) హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు చేపట్టిన విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. పాల్వంచ సీఐ నాగరాజు, బూర్గంపాడు ఎస్సై సంతోష్ తెలిపిన వివరాల ప్రకారం.. సారపాక మసీద్రోడ్లో నివాసముంటున్న సయ్యద్ రఫీ అలియాస్ జాఫర్ ఈనెల 10న తెల్లవారుజామున ఇంట్లోనే హత్యకు గురయ్యాడు. ఈ ఘటనలో ప్రాథమిక విచారణ చేపట్టిన పోలీసులు క్లూస్ టీమ్, పోలీసు జాగిలాల సాయంతో చేపట్టిన విచారణలో హత్యకు సంబంధించి కొన్ని క్లూస్ కనుగొన్నారు. రఫీ హత్యకు అతని కుమారుడు(15) కారణమని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అయితే మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు రఫీ భార్య జీనత్ ఫర్వీన్ పై కూడా పోలీసులు నిఘా పెట్టారు. విచారణలో రఫీ కుమారుడు వెల్లడించిన వివరాలతో జీనత్‌ను కూడా విచారణ చేశారు. తన వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉండటంతో అతనిని వదిలించుకునేందుకు పథకం ప్రకారమే హత్యకు పాల్పడినట్లు ఆమె అంగీకరించింది. మాదక ద్రవ్యాలకు అలవాటైన కొడుకును ఈ హత్యకు ఉసిగొల్పింది. కాళ్లను తల్లి పట్టుకోగా.. కొడుకు తండ్రి తలపై సుత్తితో బలంగా కొట్టి.. రఫీ భార్య జీనత్ ఫర్వీన్‌కు బూర్గంపాడు మండలం నకిరిపేటకు చెందిన కొర్ర జంపన్నతో ఆరు నెలల క్రితం పరిచయమైంది. ఈ క్రమంలో వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయాన్ని రఫీ గమనించి భార్యపై అనుమానం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే ఇంట్లో గొడవలు ప్రారంభమయ్యాయి. రఫీని వదిలించుకుంటే తమకు అడ్డుండదని జంపన్న జీనత్‌కు సలహా ఇచ్చాడు. ఇందుకోసం మూడునెలల క్రితమే పథకం వేశారు. జంపన్న తీసుకొచ్చిన మత్తుమాత్రలను జ్యూస్‌లో కలిపి ఇచ్చారు. అయితే రఫీకి మత్తు ఎక్కకపోవడంతో ఆ ప్రయత్నం విఫలమైంది. కాగా, ఈ నెల 9న డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చిన రఫీ.. గంజాయి మత్తులో ఉన్న కొడుకును తిట్టాడు. అందుకు అడ్డుపడిన భార్యతో పాటు కుమారుడిని కూడా రెండు దెబ్బలు కొట్టాడు. దీంతో ఆ రాత్రే రఫీని చంపాలని భార్య, కొడుకు పథకం వేశారు. గాఢ నిద్రలో ఉన్న రఫీ కాళ్లను జీనత్ గట్టిగా పట్టుకోగా, కొడుకు పెద్దసుత్తితో కొట్టి తలమొత్తం ఛిద్రం చేశాడు. దీంతో రఫీ అక్కడికక్కడే మృతిచెందాడు. హత్యకు ఉపయోగించిన సుత్తి, రక్తపు మరకలున్న బట్టలను నిందితుడు మోతె గ్రామ సమీపంలో దాచిపెట్టాడు. పోలీసు జాగిలాలు సుత్తిని, దుస్తులను గుర్తించాయి. నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు పంపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. -
జనాజా
అప్పుడప్పుడే తెల్లారుతోంది. అసలే ఎముకలు కొరికే చలి..ఆపై చల్ల గాలి.. ఎంతగా కాళ్లు ముడుచుకుని పడుకున్నా వణుకు తగ్గడం లేదు డ్రైవర్ రాముడికి. రాత్రి పడుకునేటప్పుడు బస్సు అద్దాలన్నీ దించేసి.. నిండా దుప్పటి కప్పుకుని వెచ్చగా పడుకున్నాడు. కానీ ఎక్కడో కిటికీలోంచి వీస్తున్న ఈదురుగాలి తన ఒంటిని వింటినారిలా మార్చేసింది. అప్పుడు అర్థమైంది అతనికి తన ఒంటిపై దుప్పటి లేదని. నిద్ర మబ్బులోనే చేత్తో అటూ ఇటూ తారాడాడు. దుప్పటి కనిపించలా. గొణుక్కుంటూనే ‘ రేయ్ రఫీ...’ అని ఆ మత్తులోనే కేక వేశాడు. బయట బస్సు అద్దాలను కడుగుతున్న క్లీనర్ రఫీ ‘ఆ.. అన్నా..’ అంటూ లోనికి వచ్చాడు. దుప్పటి ఏమైందిరా చిటపటలాడాడు రాముడు. ‘ ఇందాకా.. నేనే తీశాలే.. ఇంక లేవన్నా.. తెల్లారుతాంది. అసలే ఆదివారం’ దేవుళ్ల చిత్రపటాల వద్ద ఊదుకడ్డీలు ముట్టిస్తూ సమాధానమిచ్చాడు. అప్పుడప్పుడే ఊర్లకు, పక్కూర్లో బజారుకు పోయేటోళ్లు ఒక్కొక్కరు రోడ్డుపైకి వస్తాండారు. నియోజకవర్గం కేంద్రానికి 15 కి.మీ దూరంలో ఉన్న ఓ పల్లెటూరులో బస్సు నైట్ హాల్ట్ చేశారు.రాముడు, రఫీ ఇద్దరూ ఓ ప్రైవేటు బస్సుకు డ్రైవర్, క్లీనర్‌గా పోతాండారు. ఆ నియోజకవర్గంలో పేరున్న నాయకుడిదే ఆ బస్సు. ఒకటి రెండు కాదు మూడు, నాలుగు బస్సులున్నాయి ఆ లీడర్‌కి.నియోజకవర్గం కేంద్రంగా ఆ చుట్టు పక్కల పల్లెలంతటికీ ఆ ప్రైవేటు బస్సులే దిక్కు. ఆర్టీసీ బస్సులు ఆ రూట్లలో అస్సలు తిరగవు. ఆటోలు తిప్పకూడదని ఆ రౌడీ నాయకుడు పెట్టిన రూలు. ఎవరైనా ఆ రూల్‌ను బ్రేక్ చేస్తే అతని వేలు తీయడమో.. రైలు కింద తోయడమో.. ఏదోకటి జరుగుతుంది. అందుకే ఆ రూట్లో వెళ్లాలంటేనే ఆటో డ్రైవర్లకు హడల్. 27 ఏళ్ల రాముడు ఏడేళ్లుగా ఆ బస్సుకే డ్రైవర్‌గా పోతున్నాడు. పక్క జిల్లాకు చెందిన రఫీ మూడు నెలల కిందటే క్లీనర్‌గా చేరాడు. డిగ్రీ ఫెయిల్ అయ్యాడని నాన్న కోప్పడితే అలిగి పారిపోయి ఇక్కడికొచ్చాడు. ఈ మూడు నెలలకే వాళ్లిద్దరి మధ్య స్నేహం బాగా చిగురించింది. ఇద్దరూ పేదింటివారే కావడంతో సఖ్యత బాగుంది. కాసేపటికే రాముడు నిద్ర లేచి రెడీ అయ్యాడు. ‘రఫీ.. బస్సును కాసేపు స్టార్టింగ్‌లో ఉంచిరా.. టీ తాగొద్దాం..’ ‘ఆ.. అలాగే అన్నా..’ రఫీ బస్సు స్టార్ట్ చేసి కిందికొచ్చాడు. ఇద్దరూ పక్కనే ఉన్న అలీ టీ బంకులోకి వెళ్లారు. ఆ పల్లెటూర్లో అలీ టీ స్టాల్ ఒకటే ఉంది. టీ తాగకముందే ‘రామూ... బస్సు నిండింది రా బ్బా.. పోదాం’ బస్సులోంచి ఒకాయన కేక వేశాడు. వస్తున్నా పెద్దరెడ్డయ్యా అంటూ రాముడు బస్సెక్కాడు. రఫీ టీ డబ్బులు ఇచ్చి రైట్..రైట్ అంటూ ఈల వేసి బస్సెక్కాడు. ఆదివారం కావడంతో మొదటి ట్రిప్పు నుంచే ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉంది. సినిమాలకు, షికార్లకు పోయే వారు, సెలవని ఊర్లకు వచ్చే వారితో రోజంతా రద్దీతో నడిచింది బస్సు. రాత్రి లాస్ట్ ట్రిప్పు తర్వాత బస్సును ఆ లీడర్ గోడౌన్ ఆవరణలో పార్కింగ్ చేశారు. ఆదివారం రోజు బస్సులన్నీ నైట్ హాల్ట్ అక్కడే. అన్ని బస్సుల డ్రైవర్లు, కండక్టర్లు అక్కడికి చేరుకున్నారు. టౌన్లో ఇళ్లు ఉన్నవారు ఇళ్లకెళతారు. ఊర్లు దూరంగా ఉండేటోళ్లు అక్కడే నిద్రపోతారు. డ్రైవర్లందరూ కుశల ప్రశ్నలు వేసుకుంటున్నారు. క్లీనర్లేమో ఆ రోజుకు వచ్చిన డబ్బు గురించి లెక్కలేసుకుంటున్నారు. ఇంతలో ‘అయ్యా.. నన్నొదిలేయండయ్యా.. ఇంకోసారి ఈ ఇలాఖల కనిపించనయ్యా.. వదిలేయండయ్యా’ అంటూ ఏడుపులు వినిపిస్తున్నాయి.‘ఎవడ్రా కొడకా నువ్.. చెప్తాన్నా కూడా వినిపించుకోకుండా మా రూట్లోకొచ్చి ఆటో తోలతావ్.. తోలు తీస్తాం కొడకా.. పా.. అయ్య దగ్గరికి పా..రా..నువ్’ అంటూ అతన్ని లోపలికి లాక్కెళ్లారు. డ్రైవర్లు, క్లీనర్లు అందరూ లోపలికెళ్లారు. లోపల మహరాజా కుర్చీలో ఠీవిగా కూర్చుని ఉన్నాడా లీడర్. మూరెడు సిగరెట్ నోట్లో పెట్టుకుని గుప్పు గుప్పు మంటూ పొగ వదులుతున్నాడు. అందరూ చేతులు కట్టుకుని నిలడ్డారు. అప్పటికే విషయం తెలిసిందేమో ఆ లీడర్‌కి పట్టరాని కోపంతో ‘లం.. కొడకా’ అంటూ లేస్తూనే కాలుతో ఆ ఆటో డ్రైవర్ దొమ్మలపై తన్నాడు. ఊపిరిబిగపట్టుకుని ‘అమ్మా..’ అంటూ అంతదూరం పడ్డాడు. లేచే శక్తి కూడా లేదు. ‘నన్నొదిలేయండయ్యా’ పాక్కుంటూ వచ్చి కాళ్లమీద పడ్డాడు. టైం ఎంతైందిరా అడిగాడు.. పక్కనున్న వాళ్లు ‘‘10.10 అయిందయ్యా...’’ సమాధానమిచ్చారు. ‘‘సరే... నే పోతాన్నా ఈ నా కొడుక్కి ఇంకో కోటింగ్ ఇచ్చి పంపించండి’’ అంటూ బయలుదేరాడు. గోడౌన్ పక్కనే రైలు పట్టాలు ఉన్నాయి. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ వచ్చే సమయమైంది.. అప్పటికే రైలు గేట్లు పడ్డాయి. అతన్ని పక్కనున్న రూంలో పడేసి రైలు వచ్చే సమయానికి ఒక్కొక్కరు ఒక్కో రాడ్డు తీసుకుని చావబాదుతున్నారు అతని కేకలు, అరుపులు రైలు శబ్దం మింగేసింది. రైలెళ్లిపోయింది. ఇక్కడ కోటింగ్ కూడా అయిపోయింది. అక్కడే ఉండి చూస్తున్న రఫీకి కాళ్లు, చేతులు వణుకుతున్నాయి. ఈ మూడు నెలలకాలంలో వాళ్ల అరాచకం గురించి వినడమే తప్ప చూసింది లేదు. ఫస్ట్ టైం చూసేసరికి భయంతో అప్పుడే జ్వరం వచ్చింది. ఆ పక్కనే ఉన్న డ్రైవర్ రాముడు ‘ రా రఫీ .. పోదాం అంటూ భుజంపై చేయివేసి పిలుచుకుపోయాడు. రాముడికి అవన్నీ చూసి చూసి అలవాటైంది. రోజు ప్రకారమే ఆ రోజు కూడా మామూలుగా నిద్రపోయాడు.రఫీకి ఎంత చేసినా నిద్ర రావడం లేదు. జ్వరంతో ఒళ్లు వేడెక్కింది. అమ్మా, నాన్న, చెల్లీ గుర్తుకొస్తున్నారు. కళ్ల నుంచి నీళ్లు జలజల రాలిపోతున్నాయి. రాత్రి 2 గంటల ప్రాంతంలో రాముడికి మెలకువ వచ్చింది. రఫీ కూర్చుని ఉన్నాడు. ‘ ఏం రఫీ... నిద్ర రావడం లేదా..’ అంటూ చేయి పట్టుకున్నాడు. ‘ఒళ్లు కాలిపోతోందే..’ నిద్ర లేచి ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌లోంచి జ్వరం మాత్ర తీసి ఇచ్చాడు. ‘నేను చెప్తానే ఉన్నా ఇక్కడ నువ్వు ఉండలేవని.. వచ్చిన రోజే పో అంటే వినలేదు.. ఇప్పుడు చూడు.. తాగు’ అంటూ గ్లాసుతో నీళ్లిచ్చాడు రాముడు. మాత్ర మింగాక ఏడుస్తూనే ‘అన్నా నే వెళ్తాన్నా.. నాకు ఇక్కడ భయమేస్తాందన్నా.. మా అమ్మా,నాన్న గుర్తుకొస్తున్నారన్నా..’ గట్టిగా హత్తుకున్నాడు. ‘వాళ్లు రాక్షసులు రఫీ.. ఒక్కసారి ఇక్కడికొస్తే మళ్లీ పంపించరు.. పైగా నువ్వేమో వాళ్ల దగ్గర అడ్వాన్స్ తీసుకుని ఐపో జేసుకున్నావ్.. అది తీర్చాలన్నా ఐదు నెలలు పని చేయాలి..’ అని రాముడు సమాధానమిచ్చాడు. ‘సర్లే ఏదోఒకటి చేస్తాలే నువ్ పడుకో’ అంటూ తన దుప్పటి ఇచ్చాడు. ఏడేళ్లుగా పని చేస్తున్న రాముడికి వాళ్ల గురించి అంతా తెలుసు. రాముడు కూడా చాలా పేదవాడే. ఇంట్లో పెళ్లాం పిల్లల్ని పోషించుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నాడు. రాముడికి ఇద్దరు పిల్లలు. ఐదేళ్ల పాప. ఏడాది బాబు. రాత్రంతా జాగారం చేసిన రాముడు ఓ నిర్ణయానికి వచ్చాడు. రఫీ బాధను చూడలేక ఏమైనా సరే తన ఊరికి పంపిద్దామని నిశ్చయించుకున్నాడు. తెల్లారుజామునే రఫీని నిద్ర లేపాడు. ‘ఊరికి పోతానంటే పంపించేటోళ్లు కాదు వారు.. ఆ అడ్వాన్స్ డబ్బులు నేను కడతాను. ఇదిగో ఈ నెల జీతం కూడా తీసుకుని పో..’ అంటూ తన డబ్బులు కూడా ఇచ్చి ట్రైన్ ఎక్కించాడు. తెల్లారింది. బస్సు కదల్లేదు.. క్లీనర్ లేడన్న విషయం లీడర్‌కి తెలిసింది. ‘నీకు తెలీకుండా వాడు యాడికి పోతాడ్రా.. ఏషాలేస్తున్నావ్..’ అంటూ అందరిలాగే ‘కోటింగ్’ ఇచ్చారు. దెబ్బలకు రాముడు అల్లాడిపోయాడు. నెల నుంచి ఒక్కరోజు కూడా రెస్ట్ లేకుండా పని చేస్తూనే ఉన్నాడు. ఆపై సమ్మెట దెబ్బలు.. పాపం ఒళ్లు హూనమైంది. చేతిలో చిల్లిగవ్వ లేకుండా పోయింది. అక్కడేమో డ్యూటీకి పోయినెలైంది.. అంతో ఇంతో డబ్బులతో వస్తాడని రాము భార్య దేవి కళ్లుకాయలు కాచేలా ఎదురుచూస్తాంది. నాన్న వస్తాడు... ఏదైనా తెస్తాడని పిల్లల ఆశ. కుంటుకుంటూ.. కళ్లు తుడుచుకుంటూ ఇంటికొచ్చాడు రాము. ‘ఏమైందయ్యా’ అంటూ భార్య ఎదురొస్తానే జరిగిన విషయమంతా చెప్పేశాడు. ‘ఇన్నేళ్ల నుంచి చేస్తాన్న కాసింత కూడా కనికరం లేదా వాళ్లకి’ ...ఒంటిపై ఉన్న దెబ్బలకి ఇంట్లో ఉన్న ఆయింట్మెంట్నే రాస్తూ.. ఏడ్చేసింది దేవి. ఐదారు నెలలు గడిచాయి.. ఓ రోజు ఇంటర్నేషనల్ కాల్ వచ్చింది రాము మొబైల్‌కి. దేవి ఫోన్ తీసింది. ‘రామన్నా.. నేను రఫీని.. బాగున్నావా’ అన్న మాటలు వినిపించాయి. ‘నేను దేవిని రఫీ.. నువ్వు బాగున్నావా?’ ఆమె సమాధానం ఇచ్చింది. ‘బాగున్నా వదినా.. అన్న యాడికి పోయినాడు.... ‘ఊర్లోనే కూలి పనికి పోయినాడు...’ అని చెబుతూనే జరిగిన విషయం మొత్తం చెప్పి బాధ పడింది దేవి. రఫీ చాలా బాధపడ్డాడు. ‘నా వల్లే అన్న ఉద్యోగం పోయింది.. ఇన్ని కష్టాలు వచ్చింది.. సర్లే వదిన అన్న వచ్చాక మళ్లీ ఫోన్ చేస్తాలే..’ బాధతో ఫోన్ పెట్టేశాడు. ఆరోజు తన ఊరికెళ్లిన రఫీ అన్ని సరంజామా సిద్ధం చేసుకుని కువైట్‌కు వెళ్లాడు. అంతాపోనూ నెలకు 25 వేలు జీతం. మంచి సేఠ్ దొరికాడు. మళ్లీ సాయంత్రం రాముడికి ఫోన్ చేశాడు రఫీ. ఇద్దరు పలకరించుకున్నారు.గుర్తు పెట్టుకుని కృతజ్ఞతలు తెలిపినందుకు రాముడు.... తన వల్ల అన్ని కష్టాలు వచ్చినా ఒక్క మాట అనకుండా.. ఇంకా తన క్షేమాన్నే కోరుతున్న రాముడి పలకరింపుతో రఫీ .. ఇద్దరూ చాలా సంతోషపడ్డారు. ఆ మూడు నెలల్లో చిగురించిన స్నేహం మళ్లీ మొగ్గలు తొడిగి... ఫలాల్ని కూడా ఇస్తోంది. ఆపదలో తనను ఆదుకున్న రాముడి కుటుంబాన్ని తన సొంత కుటుంబంలా భావించిన రఫీ ఆర్థికసాయం చేస్తుండేవాడు. వద్దని చెప్పినా వినకుండా రాముడి కూతురి ట్యూషన్ ఫీజుకంటూ ప్రతి నెలా కొంత మొత్తాన్ని బ్యాంకులో వేస్తుండేవాడు. ఐదేళ్లు గడిచాయి. ఓ రోజు రఫీ రాముడికి ఫోన్ చేసి ‘అన్నా వచ్చే నెల 10వ తేదీన ఇండియాకు వస్తున్నాను.. 11న వదిన, పిల్లల్ని పిలుచుకుని మా ఊరికి రావాలి.. లేకుంటే నా మీద ఒట్టే’ అన్నాడు.తప్పకుండా వస్తాను రఫీ అంటూ రాముడు మాటిచ్చాడు. వచ్చే మూడు రోజుల ముందు ఫోన్ చేసి మా ఇంటి అడ్రస్ ఇస్తాలే అని ఫోన్ పెట్టేశాడు రఫీ.మరుసటి నెల ఒకటో తేదీ ... రెండు, మూడు.. ఎనిమిదో తేదీ వచ్చింది. రఫీ నుంచి ఫోన్ రాలేదు. ఇండియాకు వచ్చే రోజైన ఫోన్ చేస్తాడనుకున్నాడు. రాలేదు. 11వ తేదీ ఉదయాన్నే రాముడు తన కుటుంబంతో సుమారు 200 కి.మీ ఉన్న రఫీ ఊరికి బయలుదేరాడు. రఫీ వాళ్లు నియోజకవర్గ కేంద్రంలో ఉంటున్నారని తెలుసు. పల్లెటూరయితే అడ్రస్ తెలుసుకోవచ్చు. టౌన్లో అడ్రస్ లేకుండా కనుక్కోవడం ఎలాగబ్బా .. అతనేమో ఫోన్ చేయకపాయ.. ఎక్కడికని వెళ్లాలి.. ఎలా వెళ్లాలి? రాముడిలో ఆందోళన మొదలైంది. వెళ్లకపోతే ఫీల్ అవుతాడేమోనన్న దిగులు పట్టుకుంది. ఏదైతేనేం ఆ ఊర్లో దిగారు. అప్పటికే ఉదయం 11 గంటలైంది. అక్కడ.. ఇక్కడ తిరిగారు. ఓ సారి మాటల్లో ఏదో మసీదు సందులో అని చెప్పినట్టుగా గుర్తు. పాపం అక్కడికీ చాలా మసీదుల సందుల్లో తిరిగారు. ఊహూ.. కనిపించలేదు. సుమారు రెండు గంటలు తిరిగారు. రఫీ నుంచి ఫోన్ మూగబోయింది. వీరికి ఓపిక నశించిపోయింది. మధ్యాహ్నం ఏదో హోటల్లో తినేసి పోదామని అనుకుని.. ఓ మసీదు సందు చివర్లో అలసిపోయి కూర్చున్నారు. అంతలోనే ‘ అల్లాహు అక్బర్...’ అజాన్ పిలుపులు. వీధి మొదట్లో టోపీలు పెట్టుకుని గుంపులు గుంపులుగా జనాలు వస్తున్నారు. ఆ జనాల మధ్యలో కొందరు ‘డోలీ’ని ఎత్తుకొస్తున్నారు. డోలీలో జనాజా (మృతదేహం) ఉంది. డోలీపైన ఖురాన్‌లోని అక్షరాలతో కూడిన ఆకుపచ్చని రంగు వస్త్రం, దానిపైన ఎర్రని గులాబీ పూలు. వీధంతా జనంతో నిండిపోయింది. పైగా అది పెద్ద బజారు వీధి. డోలీకి ఎదురుపోయే వాళ్లు, అంగట్లో కూర్చున్న వాళ్లు తమ పనులు పక్కనెట్టి ఆ డోలీని తమ భుజాలపై మోస్తూ రెండడుగులైనా వేస్తున్నారు. మళ్లీ వచ్చి తమ పనుల్లో నిమగ్నమవుతున్నారు. ఇక బైక్‌పై పోయేటోళ్లు.. తమ బండిని పక్కన పడేసి మరీ డోలీని భుజాన వేసుకుని కొంతదూరం నడిచి వెళ్లడం.. తర్వాత వెనక్కు వచ్చి తమ బైక్ తీసుకుని తమ దారిన తాము వెళ్లడం చేస్తున్నారు. ఇదంతా గమనిస్తున్న రాముకి ఓ సందర్భంలో రఫీ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. అదేమంటే ఓసారి ఊర్లో రాము, రఫీ బస్సును స్టాండ్‌లో నిలబెట్టి టీ తాగుతున్నారు. సరిగ్గా ఆ సమయంలో ఎదురుగా ఎవరో ముస్లిం యువకుడి శవాన్ని ఖబరస్తాన్కు తీసుకెళుతున్నారు. అది చూసిన రఫీ వెంటనే టీ గ్లాస్‌ను అక్కడ పడేసి తలకు కర్చీప్ కట్టుకుని పరిగెత్తుకుంటూ వెళ్లి కొంతదూరం వరకు ఆ శవ పేటిక (జనాజా)ను తన భుజాలపై మోశాడు. మళ్లీ వచ్చి ఇంకో టీకి ఆర్డరిచ్చాడు. ఇది చూసిన రాముడు ‘చనిపోయింది ఎవరో నీకు తెలీదు.. నీ బంధువు కూడా కాదు ఎందుకలా పాడె మోశావు?’ అని ప్రశ్నించాడు. అప్పుడు రఫీ ‘ అన్నా.. అతనెవరో నాకు తెలియకపోవచ్చు.. కానీ బతికున్నప్పుడు అతను ఏదో ఒక సందర్భంలో నాకేమైనా సాయం చేశాడేమో.. లేదా నేనేమైనా అతనికి రుణ పడి ఉన్నానో ఏమో.. ఇలా భుజం ఇవ్వడం వల్ల ఆ రుణం తీరిపోతుంది. ఈ రోజు అతన్ని సాగనంపుతున్నాం.. రేపు మేమూ వెళ్లేవాళ్లమే.. ఇక్కడేదీ.. ఎవరూ శాశ్వతం కాదు కదా’ అని వివరించాడు. ఆ రోజు మిత్రుడు చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకున్న రాము వెంటనే తన జేబులోంచి కర్చీప్ బయటికి తీశాడు. తలకు చుట్టుకుని పరిగెత్తుకుంటూ వెళ్లి ఎదురుగా వస్తున్న జనాజాను తన భుజంపై ఎత్తుకుని మసీదు దగ్గరి వరకు అడుగులేశాడు. మసీదు లోపలి ఆవరణలోనే ఖబరస్తాన్ ఉంది. మసీదులో ప్రార్థనలనంతరం ఆ ఆవరణలోని ఖబరస్తాన్లోనే ఖననం చేస్తారు. రఫీ గురించి అక్కడికొచ్చిన వాళ్లకేమైనా తెలుసుంటుందేమోనని ఒక పెద్దాయనను అడిగాడు రాము. అప్పుడా పెద్దాయన ‘ఆ రఫీ.. మా అందర్నీ వదిలిపెట్టి హాయిగా ఎలా నిద్రపోతున్నాడో చూడు’ అంటూ జనాజా వైపు చేయి చూపి కన్నీటి పర్యంతమయ్యాడు. ‘మూడు రోజుల్లో వస్తాడనగా కువైట్‌లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. సంతోషంగా గుమ్మంలో అడుగుపెడతాడులే అనుకుంటే.. శవమై ఈ శవపేటికలో వచ్చాడయ్యా’ అంటూ ఏడ్చుకుంటూ మసీదులోనికి వెళ్లాడు ఆ పెద్దాయన. తనకు తెలీకుండానే కళ్ల నుంచి నీళ్లు జాలువారాయి రాముడికి. ఒట్టేసి ఇక్కడికి రమ్మని చెప్పింది ‘రుణ’బంధం తెంచుకోవడానికేనేమో.. లేక ఇలా రుణం తీర్చుకోవడానికేనేమో.. అనుకుంటూ మరపురాని జ్ఞాపకాలతో.. బరువెక్కిన హృదయంతో భారంగా కదిలాడు రాముడు.ఈ లోకంలో ‘నేను.. నాది ’ అని కాకుండా ‘మనం.. మనది’ అనుకుంటే ఎవరూ ఒంటరి కాదు... అనాథలే ఉండరు.. నీ వెంట నలుగురు ఉన్నారన్న సత్యం సమాజంలో చాటి చెప్పేందుకే జనాజా సిద్ధాంతమేమో. · - ఎస్. షబ్బీర్ హుస్సేన్ -
చిన్నోడా!
అర్ధరాత్రి వేళ నిద్రపట్టక మంచంపై అటూ ఇటూ దొర్లుతున్నాడు బాషా. బాషా తన తల్లిదండ్రులకు లేక లేక కలిగిన సంతానం కావడంతో పేదరికంలో ఉన్నప్పటికీ వాడికి ఏ లోటూ రాకుండా గారాభంగా పెంచారు. ఇంట్లో ఒక్క మంచం మాత్రమే ఉండటంతో కొడుకును మంచంపై పడుకోబెట్టి భార్యాభర్తలిద్దరు నేలపైనే కునుకు తీస్తున్నారు. మంచంపై పడుకుంటున్న బాషా కంటినిండా ఒక్క రోజైనా నిద్రపోయింది లేదు. బాషా తన తల్లిదండ్రులవైపు చూసి, ‘ఇక్కడ నిద్ర పట్టక చస్తుంటే కింద పడుకొని వీళ్లు ఎలా నిద్రపోతున్నార్రా!’ అనుకోని రోజు లేదు. ఇదే విషయం అమ్మను అనేక సార్లు అడిగినా, ఆమె నవ్వి ఊరుకుంటుంది గానీ సమాధానం చెప్పలేదు. బాషా తండ్రి రఫీ మాంసం అమ్ముతాడు. తల్లి రబియా ఆయనకు అన్నివిధాల సహకారంగా ఉంటుంది. ఇద్దరూ కలిసి కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. ఒకరోజు రఫీకి నాలుగు పక్కల పని తగిలింది. డబ్బుకి ఆశపడి పనులన్నీ ఒప్పుకున్నాడు. కానీ లోలోన ఆందోళనగానే ఉన్నాడు. ఎలా ఇవన్నీ చక్కబెట్టాలా అని భార్యతో ఆలోచించాడు. ఎవరో ఒక వ్యక్తిని పనికి పురమాయించుకున్నాడు. అయినా ధైర్యం చాలడం లేదు. ‘‘మరేమీ కంగారుపడకండి. మన బాషాను కూడా తీసుకుపోదాం. వాడి కాలేజీకి ఇప్పుడు సెలవులు కూడా! ఇవ్వాళ్టికి వాడినీ తీసుకెళ్తే బాగుంటుంది.’’ అంది రబియా కాస్తంత ధైర్యాన్నిస్తూ. బాషాను పనికి తీసుకెళ్లడం రఫీకి ఇష్టం లేదు. కానీ ఈసారికి తప్పదనుకున్నాడు. రాత్రి పదకొండు గంటలకే బయలుదేరి పన్నెండు గంటలకు మంత్రి గారింటికి చేరుకున్నారు. అక్కడ ఆరు గొర్రెలు కోయాల్సి ఉంది. పెట్టుకున్న మనిషి రాలేదు. రఫీ చకచకా పని కానిచ్చేస్తున్నాడు. రఫీ గొర్రెలను భాగాలుగా విడదీసి పడేస్తుంటే, తల్లి ముక్కలుగా నరుకుతోంది. బాషా ఇద్దరి మధ్య అటు ఇటు అందించడం, సహాయంగా పట్టుకోవడం వంటి పనులు చేస్తున్నాడు. ముగ్గురూ చకచకా పని చేస్తున్నారు కానీ అంత పని ఒకేసారి, ముగ్గురే చేయడం కష్టమైన పనే! సమయం రాత్రి రెండు దాటుతోంది. మంత్రిగారి మనిషి వచ్చి, ‘‘తెల్లారిపోతోంది. ఇంకో ఇద్దరిని తీసుకురాకపోయారా! మీ ఇద్దరివల్ల ఏమవుతుంది? వీడికేమో పని రానట్లుంది’’ అన్నాడు బాషా వైపు చూస్తూ. ‘‘అవునండీ! వాడికి పని రాదు. ఏదో ఉన్నంతలో వాడ్ని చదివిస్తున్నాం. అందువల్ల పని అబ్బలేదు.’’ అంది రబియా. ‘‘ఎంతసేపు లెండి! అయిపోతుంది. మనిషిని పెట్టాను కానీ వాడు రాలేదు. అయినా ఫర్వాలేదు సమయానికి మీకు అందిస్తాను కదా!’’ అన్నాడు రఫీ. ఆ మాటంటూ కూడా పనిచేస్తూనే ఉన్నాడు. తెల్లవారు జాము నాలుగయ్యేసరికి పనంతా పూర్తయింది. మంత్రిగారింట్లో పనవ్వగానే అక్కడ్నుంచి రఫీ హడావుడిగా దుకాణం తెరవాలని వచ్చాడు. రబియా, బాషా ఇంటికి వెళ్లిపోయారు. దుకాణంలో ప్రతిరోజూ మూడు నాలుగు మేకలు అమ్ముతుంటాడు రఫీ. ఈరోజు ఒకటయినా చేద్దామని దానిని సిద్ధం చేసుకుని దుకాణం తెరిచాడు. ఇంతలో రాజుగారి ఇంటినుండి కబురు రానే వచ్చింది. మేకలు కోసేందుకు తొందరగా రావాలన్నది దాని సారాంశం. రఫీ త్వరగా దుకాణం పనులు ముగించుకొని ఇంటికి వచ్చాడు. ‘‘రాజుగారింట్లో మేకలు కోయాల్సి ఉంది. త్వరగా బయలుదేరండి.’’ అని భార్యాబిడ్డలను తొందర చేశాడు. బాషా తల్లి వైపు దిగాలుగా చూశాడు.రబియా వాడి పరిస్థితి గమనించి, ‘‘చిన్నోడా! నీకోసమేరా. మీ నాన్నా, నేను కష్టపడుతున్నాం. నువ్వింకా చదవాలి. ఉద్యోగం రావాలి. హాయిగా బతకాలిరా! అందుకేరా ఈరోజు నిన్ను కూడా పనిలోకి తీసుకురాక తప్పలేదు. నాలుగు డబ్బులుంటేనే కదా చదువుకోవడం వీలవుతుంది’’ అని సముదాయించింది. ‘‘పర్వాలేదమ్మా! ప్రతిరోజూ నాన్నా, నువ్వు ఎంత కష్టపడుతున్నారో నాక్కూడా అర్థమైంది.’’ అన్నాడు. రాజుగారింటికి ముగ్గురూ హడావుడిగా బయలుదేరి వెళ్లి మధ్యాహ్నం రెండు గంటలకు అక్కడ పని పూర్తిచేశారు. చెమటలు కక్కేస్తున్నారు. హడావుడిగా ఇంటికి వచ్చి స్నానాలు చేసి రబియా బిర్యానీ తయారీలో పడింది. ఈరోజు ఆర్డర్లు ఎక్కువగా ఉన్నాయి. బాషా అమ్మకు సహయం చేస్తున్నాడు. ఇంతలో ఎవరో వచ్చి, ‘‘రఫీ! నిన్ను వాండ్రమ్ సర్పంచ్ గారు రమ్మంటున్నారు. అక్కడ రెండు మేకలు చెయ్యాలి’’ అన్నాడు. ‘‘రాలేనండీ! రాత్రినుండి పనిచేసి ఇప్పుడే ఇంటికి వచ్చాం. తయారయిన బిర్యాని అప్పగించాలి.’’ అన్నాడు రఫీ. ‘‘రానంటే ఎలా! సర్పంచ్ గారింట్లో ఎప్పుడూ నువ్వే కదా చేసేది’’ అన్నాడతను. ‘‘అవుననుకోండి! కానీ ఇప్పటికిప్పుడంటే ఎలా వీలవుతుంది? ఈ పని అవ్వాలి కదా’’ అన్నాడు రఫీ. ‘‘ఫర్వాలేదు. అక్కడ రాత్రి పది గంటల వరకు ప్రార్థనలు జరుగుతాయి. అవి అయిన తర్వాతే భోజనాలు. నువ్వు నాలుగు గంటలకు వచ్చినా సరిపోతుంది.’’ అన్నాడు ఆ వచ్చినతను. భార్య వైపు చూశాడు రఫీ. ‘‘సర్పంచ్ గారికి ఎప్పుడూ మీరేగా చేసేది. కాదంటే బాగుంటుందా! సరేననండి. ఇవ్వాళ ఉన్న పని రేపు ఉంటుందా?’’ అంది. ‘‘సరే వస్తానని చెప్పండి సర్పంచ్ గారితో’’ అన్నాడు రఫీ. చిన్నోడు ఈసారి తండ్రివైపు గుర్రుగా చూశాడు – ‘‘ఇప్పటికే ఒళ్లు హూనమైంది. ఇంకేం వెళతాం నాన్నా!’’ అంటూ. ‘‘తప్పదురా చిన్నోడా! తెలిసినోళ్లు. కాదంటే ఎలా?’’ అంది రబియా. త్వరగా పని ముగించుకొని సర్పంచ్ ఇంటికి బయలుదేరారు ముగ్గురూ. అక్కడ మేకను కోస్తుండగా సర్పంచ్ వచ్చాడు. రబియాను చూసి, ‘‘మీ చేతి పలావు బాగుంటుందమ్మా! కాస్త పలావు వండి వెళ్లాలి మీరు’’ అన్నాడు. రబియాకు గొంతులో వెలక్కాయ పడినట్టయింది. రబియా ఏదో అనబోతుండగా మళ్లీ సర్పంచ్ అందుకొని, ‘‘నాకు తెలుసు, మీరు రాత్రి నుండి పని చేస్తూనే ఉన్నారని. ఇలాంటి సమయంలో అడగకూడదు. అయినా తప్పదు. ఎందుకంటే మాకు ప్రత్యేకమైన అతిథులు వచ్చారు. వారు మళ్లీ మళ్లీ వచ్చే వ్యక్తులు కాదు. పలావు మీరు చేసినట్లుగా మన చుట్టుపక్కల ఎవ్వరూ చేయలేరు. మా ప్రత్యేకమైన అతిథులకు మీ చేతి పలావు రుచి చూపించాలని అడుగుతున్నాను. వంటవాళ్లు ఉన్నారు. మీకు సాయం చేస్తారు. కాస్త కాదనకుండా చేయండి’’ అన్నాడు. ఈసారి రబియా భర్త వైపు చూసింది. ‘‘సర్పంచ్‌గారు అంతలా అడుగుతుంటే ఎలా కాదంటాం, కానివ్వు..’’ అన్నాడు రఫీ. ఇప్పుడు చిన్నోడు అమ్మవైపు గుర్రుగా చూశాడు. ‘‘నాయనా! నీకోసమేరా ఇదంతా’’ అంది రుబియా. బాషా మాట్లాడలేదు. మేకను కోసే పని అవ్వగానే బిర్యానీ తయారీలో పడింది రబియా. అప్పటికే నీరసం వచ్చిన బాషా ఒక మూల కూలబడ్డాడు.రఫీ, రబియాలు పలావు పూర్తిచేశారు. రాత్రి తొమ్మిది గంటలయ్యింది. అక్కడే కాస్త తిన్నామనిపించి ఇంటికి వచ్చేటప్పటికి రాత్రి పదకొండు గంటలయ్యింది.రబియా వెంటనే వేడినీళ్లు పెట్టింది. ‘‘చిన్నోడా! స్నానం చేసి పడుకోరా. ఉదయం నుండి క్షణం తీరిక లేకుండా పోయింది.’’ అంది. చిన్నోడు పలకలేదు. మళ్లీ పిలిచింది. పలకలేదు. ‘‘వాడు కునుకు తీస్తున్నట్లున్నాడే నేను చేస్తా. ఈలోపు వాడు లేస్తాడులే’’ అన్నాడు రఫీ. రఫీ స్నానమయింది. మళ్లీ నీళ్లు కాగాయి. ‘‘చిన్నోడా! స్నానం చెయ్యరా’’ పిలిచింది. చిన్నోడు అరుగు మీద హాయిగా నిద్ర పోతున్నాడు. తల్లి పిలుపుకి ఉలుకూ పలుకూ లేదు. ‘‘సరే! నిద్రలో ఉన్నట్లున్నాడు. నువ్వు చేసిరా. ఆ తరువాత వాడు చేస్తాడులే!’’ అన్నాడు రఫీ. రబియా స్నానమయింది. నీళ్లు రెడీ అయ్యాయి. ‘‘చిన్నోడా!’’ అని పిలిచింది. వాడు మత్తుగా నిద్రపోతున్నాడు. తల్లి మాటలకు పలకలేదు. తట్టి లేపింది. అయినా వాడు లేవడం లేదు. హాయిగా నిద్ర పోతున్నాడు. ‘‘వీడు లేవడం లేదండి. ఏం చేయాలి?’’ అంది రబియా. ‘‘పోనీలే! వాడ్ని లేపకు. పడుకోనీ. లేచినప్పుడే చేస్తాడులే’’ అన్నాడు రఫీ.నేలపైనే నిద్రపోతున్న కొడుకు వైపు ప్రేమగా చూసింది రబియా. ఆ సమయంలో.. ‘‘అమ్మా నాకు మంచి నిద్ర పట్టడం లేదు. నాన్నా, నువ్వు నేలపై ఎలా నిద్దరవుతున్నారే’’ అన్న వాడి మాటలు గుర్తుకు వచ్చి రబియా తనలో తనే నవ్వుకుంది. ప్రేమగా బాషా తల నిమిరి ఆ పక్కనే నిద్రకు ఉపక్రమించింది. ఎప్పుడు తెల్లారిందో బాషాకు తెలియలేదు. లేచి చూసేసరికి తల్లి వంట చేస్తోంది. తను ఎక్కడ పడుకున్నాడో చూసుకుంటే చిన్నోడికి ఆశ్చర్యమేసింది. రోజూ మంచంపై పడుకున్నా పట్టని నిద్ర ఇక్కడ పట్టిందా. ఎంత మత్తుగా పడుకున్నాను. ఊహ తెలిసాక ఇంత మత్తుగా ఎప్పుడూ పడుకోలేదనుకున్నాడు. ‘‘అమ్మా! నాన్న ఎక్కడ?’’ అని అడిగాడు బాషా. ‘‘మీ నాన్న ఉదయాన్నే దుకాణం వెయ్యడానికి వెళ్లార్రా! నువ్వు రాత్రినుండి అలా పడుకొనే ఉన్నావు. ఎంత లేపినా లేవడం లేదని మీ నాన్న వాడి నిద్ర పాడు చేయొద్దు. పడుకోనివ్వు అన్నారని నిన్ను లేపలేదు. త్వరగా స్నానం చేసిరా. టిఫిన్ చేద్దువుగాని’’ అంది. చిన్నోడు కదలలేదు. రబియా దగ్గరకు వచ్చి, ‘‘నాయనా! ప్రతిరోజూ మంచంపై పడుకునేవాడివి రాత్రి నేలపై పడుకుండిపోయావు. ఎలా నిద్ర పట్టిందిరా!’’ అంది ప్రేమగా, బిడ్డవైపు చూస్తూ. ‘‘అమ్మా! నిన్ను ఎన్నోసార్లు నేను ఇదేమాట అడిగేవాడ్ని. నువ్వు సమాధానం చెప్పకుండా నవ్వి ఊరుకునేదానివి. కానీ నాకు సమాధానం దొరికిందమ్మా’’ అన్నాడు. ‘‘ఏంట్రా!’’ అంది రబియా. ‘‘అమ్మా! కష్టపడి పనిచేసేవాడికి నేలేంటి? మంచమేంటి? ఎక్కడైనా నిద్ర పడుతుంది. అమ్మా! శ్రమలోనే సుఖం ఉంది. సంపాదన ఉంది. ఒక ధీమా ఉంది. ధైర్యం ఉంది. ముఖ్యంగా ఆత్మవిశ్వాసం ఉంది’’ అన్నాడు. ‘‘ఒరేయ్ చిన్నోడా! ఇవన్నీ నాకు తెలియదుకానీ నువ్వు స్నానం చేసిరా. టిఫిన్ చేద్దువుగాని’’ అంది. చిన్నోడు విషయం గ్రహించాడు. ప్రతిరోజూ తండ్రికి సహాయపడుతూ మరింత ధీమాగా, మరింత హాయిగా నిద్రపోతున్నాడు. - కె. భాగ్య చంద్రశ్రీ -
ఫేస్బుక్లో యువతిని ఎరగా వేసి..
► యువకుడిని హత్య చేసిన శత్రువులు ► పాత కక్షల నేపథ్యంలో హత్య! ► రెండు కోణాల్లో విచారిస్తున్న పోలీసులు కంకిపాడు (పెనమలూరు): ఫేస్బుక్ పరిచయం ఓ యువకుడి ప్రాణాలు బలిగొంది. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం పునాదిపాడు గ్రామ పరిధిలో ఓ కార్పొరేట్ కళాశాల సముదాయం వద్ద షేక్ రఫీ అనే యువకుడు దారుణహత్యకు గురైన ఘటన గురువారం వెలుగుచూసింది. పోలీసుల కథనం మేరకు.. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన షేక్ రఫీ (26)కి కొద్ది రోజుల క్రితం ఫేస్బుక్లో ఓ యువతితో పరిచయం ఏర్పడింది. బుధవారం యువతి నుంచి ఫోన్ రావడంతో రఫీ తన స్నేహితుడు షేక్ అబ్దుల్ జబ్బా అలియాస్ మున్నాతో కలిసి రాత్రి 8 గంటల సమయంలో బైక్‌పై పునాదిపాడు వచ్చాడు. తనకు ఫోన్ చేసిన యువతి గురించి ఆరా తీస్తున్న సమయంలో ఆటోలో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు రఫీ, మున్నాపై కత్తులతో దాడి చేశారు. మున్నా స్వల్ప గాయాలతో దాడి నుంచి తృటిలో తప్పించుకున్నాడు. రక్షించుకునేందుకు పరుగు తీసిన రఫీ ఆచూకీ బుధవారం అర్ధరాత్రి వరకూ తెలియలేదు. రఫీ స్నేహితులు, కుటుంబ సభ్యులు గురువారం పునాదిపాడు వచ్చి గాలించగా, దాడి జరిగిన ప్రదేశానికి 100 మీటర్ల దూరంలోనే రఫీ మృతదేహం లభించింది. కత్తులతో దాడి చేయడంతో రఫీ ఎడమచేయి, తల ఛిద్రమయ్యాయి. హత్య వెనుక అనుమానాలెన్నో అయితే రఫీ హత్యలో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. మంగళగిరిలో గత నెల 2న కనకారావు హత్య జరిగింది. ఇందులో రఫీ పాత్ర ఉందని కనకారావు కుటుంబ సభ్యులకు అనుమానం ఉంది. ఈ నేపథ్యంలో రఫీని చంపడానికి ఫేస్బుక్ ద్వారా యువతిని ఎరగా వేసి సంఘటన స్థలానికి రప్పించి హత్య చేశారని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. పోలీసులు దీంతోపాటు రఫీ కదలికలను మొదటి నుంచి శత్రువులు గమనించి హత్య చేశారనే కోణంలోనూ విచారణ చేస్తున్నారు. హత్య జరిగిన ప్రదేశాన్ని డీసీపీ రాణా, ఈస్ట్ జోన్ ఏసీపీ విజయ్‌భాస్కర్ పరిశీలించారు. -
సాహితీలోకం
రఫీ నోట సినారె పాట రఫీ తెలుగు పాట పాడటం విడ్డూరం. అదీ ఎన్టీఆర్‌కు పాడటం ఇంకా విచిత్రం. కానీ ఆ విచిత్రం సాధ్యమైంది. పైగా అది జనానికి నచ్చింది. నిర్మాత పుండరీకాక్షయ్యకు రఫీ అంటే అభిమానం. ఆయన తన ‘భలే తమ్ముడు’లో రఫీ చేత పాడిద్దామనుకున్నారు. ఇది షమ్మీ కపూర్ ‘చైనా టౌన్’కు రీమేక్ కాబట్టి అందులో హిట్ అయిన ‘బార్ బార్ దేఖో’ను తెలుగులో అనుసరించి దాంతోపాటు మిగిలిన పాటలను కూడా రఫీ చేత పాడిద్దామనుకున్నారు. ఆ పాటలు సినారెకు రాసే అవకాశం వచ్చింది. ‘ఎంతవారు కాని వేదాంతులైన కాని’ పెద్ద హిట్. ‘నేడే ఈనాడే కరుణించె నన్ను చెలికాడే’ పాట కూడా. ఆ తర్వాత ‘గీత్’ రీమేక్ ‘ఆరాధన’లో సినారె రాసిన పాటలకు మళ్లీ రఫీ పాడారు. ‘నా మది నిన్ను పిలిచింది గానమై’, ‘నేడే తెలిసింది ఈనాడే తెలిసింది’ నేటికీ రేడియోలో వినిపిస్తూనే ఉన్నాయి. ఇంకా మంచి అవకాశం ఏమిటంటే సి.రామచంద్ర సంగీతంలో ‘అక్బర్ సలీం అనార్కలి’కి సినారె పాటలు రాయడం. అందులోని ‘సిపాయీæ సిపాయీ’, ‘తానె మేలి ముసుగు తీసి’.. రఫీ గొంతులో తెలుగు ప్రేక్షకులను అలరించాయి. రఫీకి తెలుగు రాదు కనుక సినారెకు ఉర్దూ బాగా వచ్చు కనుక వారిద్దరికీ అలా కుదిరింది. ఆ జోడీ మాధుర్యం మనకు మిగిలింది. కవి రెచ్చిపోతే... కవికి కవి పాత్ర దొరకడం చాలా అరుదు. సినారెకు అలాంటి అవకాశం కె.విశ్వనాథ్ ద్వారా వచ్చింది. ‘చెల్లెలి కాపురం’లో శోభన్‌బాబు కవి. వాణిశ్రీ డాన్సర్. ఒక సందర్భంలో ఇరువురి మధ్యా పోటీ వస్తుంది. పాటకు సైదోడుగా డాన్స్ చేస్తానని వాణిశ్రీ అంటుంది. ఇక్కడ కవి రెచ్చిపోవాలి. ‘మీ ఇష్టం... మీరే హీరో అనుకుని ఏం రాస్తారో రాయండి’ అన్నారు కె.విశ్వనాథ్. ఇక సినారె కలం జవనాశ్వం మీద పరుగు తీసింది. చరణ కింకిణులు ఘల్లుఘల్లుమన కరకంకణములు గలగలలాడగ వినీల కచభర విలాస బంధుర తనూలతిక చంచలించిపోగా ఆడవే మయూరీ నటనమాడవే మయూరీ నీ కులుకునుగని నా పలుకు విరియ నీ నటననుగని నవ కవిత వెలయగా ఆడవే మయూరీ నటనమాడవే మయూరీ.... ఈ పాటలో సినారె చాలా కఠినమైన క్లిష్టమైన సంస్కృత పదబంధాలు వేసినా ప్రేక్షకులు ఇబ్బంది పడలేదు. పైగా పాటల పోటీలో ఈ పాట పాడటం ఒక ఆనవాయితీగా మారింది. దీని మీద పారడీలు రావడం కూడా కద్దు. బంధాలకు మాటలు అద్దాడు సినారెకు తోడబుట్టువులు లేరు. అందుకని చెల్లెలి బంధం అంటే ఆయనకు ఎంతో ఇష్టం. ‘బంగారుగాజులు’ సినిమాలో చెల్లెలి పాట రాసే అవకాశం వచ్చినప్పుడు దానిని ఆయన సద్వినియోగం చేసుకున్నారు. ‘అన్నయ్య సన్నిధి’ పాట ఇప్పటికీ హిట్. ఇక తండ్రి గురించి రాసిన ‘ఓ నాన్నా నీ మనసే వెన్న’... తండ్రి గొప్పతనం తెలియచేస్తుంది. ‘ప్రేమించు’ సినిమాలో ‘కంటేనే అమ్మ అని అంటే ఎలా?’ పాట చాలా ఆర్ద్రంగా అమ్మ గొప్పతనం తెలియ చేస్తుంది. ఇక స్నేహం మీద సినారె రాసిన ‘స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం’ చిరస్థాయిగా నిలిచి ఉంది. ఇన్ని బంధాల గురించి రాసిన సినారెనే మనుషులలో ఉండే కృత్రిమత్వాన్ని ఏవగిస్తూ ‘అనురాగం ఆత్మీయత అంతా ఒక బూటకం’ (తాత మనవడు) రాశారు. సూపర్ హిట్ ఐటమ్ సాంగ్ ఐటమ్ సాంగులు ఇవాళ ప్రతి సినిమాకు ఒక హిట్ ఫార్ములాగా మారాయి. కాని పాత రోజుల్లో ఒక పాట గొప్ప ఐటమ్ సాంగ్‌గా రాణించింది. ఆ పాట సినారె వల్ల జన్మెత్తింది. ‘అమ్మ మాట’ సినిమాలో జ్యోతిలక్ష్మితో ఒక డాన్స్ నంబర్ చేయాలని దర్శకుడు భావించాడు. దానికి గీత రచయిత సినారె, సంగీత దర్శకుడు రమేశ్‌నాయుడు కూర్చుని కుస్తీలు పడుతున్నారు. ఎంతకీ పాట కుదరలేదు. రమేశ్ నాయుడు మొదట లంచ్‌కు వెళ్లిపోయారు. సినారె పేపర్ మీద అసలు పాటకు కావలసిన రఫ్ నోట్స్‌లా ‘మాయదారి సిన్నోడు నా మనసే లాగేసిండు లగ్గమెప్పుడ్రా మావా అంటే మాఘమాసం వెళ్లేదాకా మంచి ముహూర్తం లేదన్నాడు ఆగేదెట్టాగా అందాక వేగేదెట్టాగా’ అని రాసుకుని తానూ లంచ్‌కు వెళ్లారు. లంచ్ నుంచి తిరిగి వచ్చిన రమేశ్‌నాయుడు ఈ సంగతి తెలియక అదే పాట పల్లవి అనుకుని దానికి అద్దిరిపోయే ట్యూన్ కట్టారు. సినారె వచ్చి ఆశ్చర్యపోయి దానికి కొనసాగింపుగా చరణాలు రాశారు. ఆ పాట బహుశా తెలుగులో చాలా పెద్ద ఐటమ్సాంగ్గా నిలిచింది. ఎల్.ఆర్.ఈశ్వరి గొంతులో గొప్ప అందం సంతరించుకుంది. ఇదే ఎల్ఆర్ ఈశ్వరి పాడిన ‘నందామయా గురుడ నందామయ’ కూడా పెద్ద హిట్ సాంగే. ‘దమ్ మారే దమ్’ పాటను అనుసరిస్తూ తెలుగు నేటివిటీతో సినారె ఆ పాటను రాస్తే జె.వి.రాఘవులు ట్యూన్ చేశారు. చేవ ఉన్న కవికి ఏ సందర్భమైనా ఒకటే... మెప్పించే పాట బయటకు వస్తుంది అనడానికి ఈ సందర్భాలు ఉదాహరణ. క్లాసిక్ పాటల కొలువు ‘మల్లెలు పూచె వెన్నెల కాచె ఈ రేయి హాయిగా మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా’.... రాజన్ నాగేంద్ర సంగీతంలో సినారె రాసిన ఈ పాట ఎటువంటి చికాకు సమయంలో అయినా సేద తీరుస్తుంది. ఇదే కాదు ఇలాంటి క్లాసిక్ పాటలు సినారె చిట్టాలో చాలానే ఉన్నాయి. ‘నిర్దోషి’ కోసం ఆయన రాసిన ‘మల్లియలారా... మాలికలారా’... ఘంటసాల గాత్రంలో అమరత్వాన్ని పొందింది.‘తిరుపతమ్మ కథ’లో ‘పువ్వై విరిసిన పున్నమి వేళ బిడియము నీకేలా బాలా’... కూడా క్లాసిక్ కిందకే వస్తుంది. ‘ఏకవీర’లోని ‘తోటలో నా రాజు తొంగి చూచెను నాడు’ ఒక కోమలమైన గీతం. దీనిని రాసిన సినారె కె.వి.మహదేవన్ ముందు పెడితే దానిని ఆయన ‘ఎట్టాగో ఉన్నాది ఓలమ్మీ’ స్టయిల్లో చాలా ఫాస్ట్‌గా ట్యూన్ కట్టాడట. అప్పుడు సినారె అది క్లాసిక్‌గా ఉండాలని ఇప్పుడు రికార్డ్ అయి ఉన్న వరుసలో తానే పాడగా సినారె ఆ వరుసనే తీసుకున్నారు. ఇక అమరశిల్పి జక్కన కోసం ‘ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో’ ఆల్‌టైమ్ క్లాసిక్ కింద చెప్పుకోవాలి. ఇందులో– ‘పైకి కఠినమనిపించును– లోన వెన్న కురిపించును జీవమున్న మనిషి కన్న– శిలలే నయమనిపించును’... అనడంలో ఎంతో లోతు, తాత్త్వికత ఉన్నాయి. సినారె రాసిన కొన్ని పాటలు స్పీడ్‌గా ఉన్నా క్లాసిక్ స్థాయిలో నిలబడ్డాయి. ‘ఆడబ్రతుకు’ కోసం ఆయన రాసిన– ‘అందము చిందె హృదయకమలం– అందుకునే రాజొకడే వేల తారకల బృందములోన– వెలిగె చందురుడొకడే’... ఒక కొత్త సొబగుతో పదాల పొహళింపుతో ఉంటుంది. పౌరాణిక సినిమాలలో ‘కురుక్షేత్రం’ కోసం రాసిన ‘మోగింది కల్యాణ వీణ’... చారిత్రక సినిమాలలో తాండ్ర పాపారాయుడుకు రాసిన ‘అభినందన మందార మాల’ క్లాసిక్స్ స్థాయిలో నిలిచాయి. ఇన్ని పాటలు ఇచ్చి వెళ్లిన కవి సినారె. ఎన్నో పాటలు ఇచ్చి వెళ్లిన కవి సినారె. జాతి కోసం పరితపించే పాట తెలుగు ప్రాంతాలన్నా తెలుగు భాష అన్నా తెలుగు జాతి అన్నా సినారెకు ఎంతో ప్రాణం ఎంతో ఇష్టం. ఇరు ప్రాంతాల మధ్య విభేదం ఆయనకు అంతగా నచ్చేది కాదు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్నప్పుడు ఆయన ఇరువర్గాల సహజీవనాన్ని కాంక్షిస్తూ కవిత్వం రాశారు. ఈ సంగతి విన్న ఎన్టీ రామారావు ఆ సమయంలో తాను తీస్తున్న ‘తల్లా పెళ్లామా’లో ఒక పాటను సందర్భం లేకపోయినా రాసి పెట్టించారు. అదే– ‘తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది’. ఈ పాటను ఎన్టీఆర్ తన ఎన్నికల ప్రచార సమయంలో చైతన్యరథం మీద విపరీతంగా వినిపించేవారు. ఇవాళ తెలుగు రాష్ట్రాలు రెండు ఏర్పడినా ఇద్దరూ గ్రహించ వలసిన ఉపదేశం ఈ పాటలో కనిపిస్తుంది. ‘వచ్చిండన్నా వచ్చాడన్నా వరాల తెలుగు ఒకటేనన్నా’... ‘మహాభారతం పుట్టింది రాజమహేంద్రవరంలో భాగవతం వెలసింది ఏకశిలా నగరంలో ఈ రెంటిలోన ఏది కాదన్న ఇన్నాళ్ల సంస్కృతి నిండు సున్నా’..... కవి పలుకు అక్షర సత్యం. జయలలిత స్విమ్‌సూట్ సాంగ్ ‘మనుషులు–మమతలు’ సినిమా నాటికి జయలలిత ఇంకా స్టార్ కాలేదు. ఆమెకు సినారె రాసిన కవ్వించే పాట పెద్ద హిట్టయ్యింది. ‘సిగ్గేస్తో్తందా సిగ్గేస్తో్తందా మొగ్గలాంటి చిన్నది బుగ్గ మీద చిటికేస్తేసిగ్గేస్తుందా– నీకు సిగ్గేస్తుందా’...ఈ పాటలో నాగేశ్వరరావు బిడియస్తుడిగా కనిపిస్తారు.‘చిన్నవాడు అనుకున్నది చిన్నది చేసేస్తుంటే‘ సిగ్గేస్తుంది అంటారు. ఈ పాటలో జయలలిత స్విమ్‌సూట్‌లో కనిపించి ప్రేక్షకులకు హుషారు కలిగిస్తారు. అప్పటికి అలాంటి డ్రస్సుల్లో పాటలు కొత్త.ఈ పాటే కాదు జయలలిత కోసం సినారె రాసిన ‘అయ్యయ్యో బ్రహ్మయ్య’ పాట కూడా చాలా పెద్ద హిట్ అయ్యింది. జగపతివారి ‘అదృష్టవంతులు’ సినిమాలో జయలలితను కవ్విస్తూ నాగేశ్వరరావు ఈ పాట పాడతాడు. ఈ లెక్కన సినారె ఇద్దరు (మాజీ) సి.ఎం.లకు పాట రాసినవారయ్యారు. -
మనస్తాపంతో ఆత్మహత్య
తాడిపత్రి : తాడిపత్రిలోని రోజా మసీదు సమీపంలో రఫీ(23) శనివారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ ఆందజనేయులు తెలిపారు. అమ్మానాన్నలు మృతి చెందడంతో పిన్ని షాహీన వద్ద ఉంటున్న అతను ఏ పనీపాట లేకుండా జులాయిగా తిరిగేవాడన్నారు. దీంతో ఆమె మందలించడంతో మనస్తాపం చెంది ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు వివరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
పల్లె పడుచులే లక్ష్యం
కొలువుల పేరుతో యువతుల తరలింపు తిరుపతి కేంద్రంగా వ్యాపారం వ్యభిచార ముఠాల గుప్పిట్లో చిక్కుకుని విలవిల బాధిత కుటుంబాల ఫిర్యాదుతో పోలీసులు అప్రమత్తం తిరుపతి ఏజెంటు రాణిమ్మను అదుపులోకి తీసుకుని విచారణ తిరుపతి : నిన్నా మొన్నటి వరకూ చిత్తూరు, సత్యవేడు ప్రాంతాల్లో ఈ తరహా మోసాలు వెలుగు చూశాయి. తమిళనాడుకు చెందిన రఫీ, పాండియన్‌లనే ఇద్దరు ఏజెంట్లు సుమారు 150 మంది మహిళలను విదేశాలకు పంపారు. సత్యవేడుకు చెందిన ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్పందించిన చిత్తూరు పోలీసులు కేసు నమోదు చేసి సమగ్రంగా దర్యాప్తు చేశారు. రఫీ, పాండియన్‌లను అరెస్టు చేశారు. కాగా ఈ తరహా మోసాలు, మహిళల అక్రమ తరలింపులు తిరుపతిలోనూ వెలుగు చూశాయి. దీంతో అర్బన్ పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ముఠాల కోసం గాలిస్తున్నారు. తిరుపతి నుంచి ఇలా... పూతలపట్టు మండలం డీ మిట్టూరుకు చెందిన వెంకట రమణ, తిరుపతికి చెందిన వెటశాల శ్రీనివాసరావు మంగళవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. తిరుపతికి చెందిన కొందరు మహిళల తరలింపు ఏజెంట్లు తమ తమ భార్యలను ఏ విధంగా విదేశాలకు తీసుకెళ్లారో వివరించి అక్కడి వ్యభిచార కూపాల్లో మహిళలు అనుభవిస్తోన్న నరక యాతనను వివరించారు. వివరాలు వారి మాటల్లోనే.... నా భార్యను రక్షించండి... మాది పూతలపట్టు మండలం డి. మిట్టూరు గ్రామం. కొన్నాళ్లుగా భార్యాపిల్లలతో తిరుపతి మంగళం రోడ్డులో ఉంటున్నాం. పక్కనే ఉన్న రాణిమ్మ పరిచయమైంది. దుబాయ్‌కి వెళితే నెలకు రూ.1 లక్ష సంపాదన ఉంటుందనీ, అక్కడి ఇళ్లల్లో పనిచేస్తే నెలవారీ జీతం వస్తోందని ఆశ చూపింది. ఇందుకోసం ఖర్చవుతుందని చెపితే రూ.50 వేలు చెల్లించాం. ఆగస్టు 12న నా భార్య అమృతతో పాటు మరో 14 మంది మహిళల్ని తీసుకుని రేణిగుంటలో రెలైక్కారు. మూడ్రోజులు ముంబయి హోటల్లో ఉన్నట్లు సమాచారం. ఆ తరువాత ఎటు నుంచి ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదు. 15 రోజుల తర్వాత సౌదీకి తీసుకెళ్తున్నారని ఫోన్లో చెప్పింది. తిరిగి ఈ నెల 17న మళ్లీ ఫోన్లో మాట్లాడింది. అక్కడ తనను హింసిస్తున్నారనీ, వ్యభిచారం చేస్తేనే ఉంటావనీ, లేకుండా ప్రాణాలతో ఉంచబోమని బెదిరిస్తున్నారని ఏడ్చింది. ఏం చేయాలో తెలియక ఆదివారం సాయంత్రం అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేశాం. వాళ్లు రాణిమ్మను పట్టుకొచ్చారు. విచారణ చేస్తున్నారు. ఎలాగైనా నా భార్యను రక్షించండి. పీ వెంకట రమణ, తిరుపతి. విచారణ జరుపుతున్నాం... మహిళల రవాణా గురించి తెల్సింది. ఎక్కడెక్కడ ఎంత మందిని విదేశాలకు పంపారో గుర్తిస్తున్నాం. అసలు మహిళల్ని ఎలా ట్రాప్ చేశారో, బాధితులు, ముఠా సభ్యుల మధ్య పరిచయాలు ఎలా మొదలయ్యాయే తెల్సుకుంటున్నాం. ఇటీవలనే ఈ తరహా కేసు మరొకటి నమోదైంది. అన్ని కోణాల్లోనూ విచారణ చేస్తున్నాం. ఎవర్నీ వదలం. జయలక్ష్మి, అర్బన్ ఎస్పీ, తిరుపతి. -
బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
బావిలోపడి ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన దమ్మపేట మండటం మొద్దులగూడెం ఎస్టీ కాలనీలో బుధవారం చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి గ్రామంలోని చెరువులో చేపలు పట్టడానికిలక్ష్మణరావు(22), రఫీ(20)లు వెళ్లారు. తిరిగి ఇంటికి వచ్చే క్రమంలో ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందారు. మధ్యాహ్నం గమనించిన రైతులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
లారీ కిందపడి బాలుడి మృతి
కర్నూలు జిల్లా: బైక్‌పై వేగంగా వెళ్తున్న బాలుడు అదుపుతప్పి లారీ వెనుక టైరు కిందపడి మృతి చెందాడు. ఈ సంఘటన సోమవారం కర్నూలు జిల్లా బేతంచర్ల మండల కేంద్రంలో పోలీస్‌స్టేషన్ సమీపంలో జరిగింది. వివరాలు.. బేతంచెర్ల మండలానికి చెందిన రఫీ(12) తన అక్క జైనాబీని పదోతరగతి పరీక్షా కేంద్రం నుంచి తీసుకొచ్చేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో తిరిగి వస్తుండగా లారీని క్రాస్ చేసే క్రమంలో బైక్ అదుపుతప్పి లారీ వెనుక టైరు కింద పడింది. దీంతో రఫీ అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా, జైనాబీ స్వల్పగాయాలతో బయటపడింది. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (బేతంచర్ల) -
అమ్మో స్వైన్ ఫ్లూ: డాక్టర్ రఫీతో పేస్ టూ పేస్
-
అంతర్ జిల్లా దొంగ అరెస్ట్
ఖానాపూర్(ఆదిలాబాద్): ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ పోలీసులు 42 కేసుల్లో నిందితుడిగా ఉన్న అంతర్ జిల్లా దొంగను అరెస్టు చేశారు. డీఎస్పీ మనోహర్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం పోచంపాడు గ్రామానికి చెందిన మహ్మద్ షఫీ పలు దొంగతనం కేసుల్లో నిందితుడు. ఇతనిపై 29 ట్రాన్స్ఫార్మర్ దొంగతనం కేసులు 29, మోటార్లు ఎత్తుకుపోయిన కేసులు 11, ట్రాన్స్ఫార్మర్లు పగులగొట్టి కాయిల్స్ చోరీ చేసిన కేసులు 2 ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోని పోలీస్స్టేషన్లలో నమోదై ఉన్నాయి. గురువారం మరో ఇద్దరితో కలిసి ద్విచక్ర వాహనంపై మోటారు తీసుకెళ్తుండగా పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డాడు. మిగతా ఇద్దరూ పరారు కాగా, షఫీ దొరికిపోయాడు. ఇతనిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. -
సహకార పద్ధతిలో సినిమా విడుదల!
‘‘సహకార పద్ధతిలో ఓ చిత్రాన్ని విడుదల చేయడం మంచిదే. దీనివల్ల ఒక్కో జిల్లాల్లో పది, పదిహేను మంది ఫండింగ్ చేసుకుని సినిమాను విడుదల చేస్తారు. ఈ విధానంలో చిత్రాన్ని విడుదల చేస్తున్న రఫీని అభినందిస్తున్నాను’’ అని దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ అన్నారు. రఫీ హీరోగా నటించి, స్వీయదర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘మిస్టర్ రాహుల్ పక్కా ప్రొఫెషనల్’. రఫీ మాట్లాడుతూ - ‘‘ప్రస్తుతం సినిమా విడుదల కష్టమవుతోంది. అందుకే, ఫేస్బుక్ ద్వారా సహకార విధానాన్ని ప్రకటించగానే, వివిధ జిల్లాల నుంచి ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ముందుకొచ్చారు. అలాగే, ట్రైలర్ చూసి, కొంతమంది పంపిణీదారులు ముందుకొచ్చారు’’ అన్నారు. -
సంకల్ప బలంతో...
రఫీ కథానాయకునిగా నటించి, స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘మిస్టర్ రాహుల్’. పక్కా ప్రొఫెషనల్ అనేది ఉపశీర్షిక. ఈ సినిమా ప్రచార చిత్రాలను ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఆవిష్కరించారు. ‘‘మురికివాడలో పుట్టి, పెరిగిన ఓ యువకుడు సంకల్ప బలంతో తన ఆశయాన్ని ఎలా సాధించాడనేది ఈ చిత్రం. హిందూ, ముస్లిమ్ కుటుంబాలకు చెందిన ఓ యువతీ యువకుడి ప్రేమకథ నేపథ్యంలో చిత్రం సాగుతుంది’’ అని రఫీ చెప్పారు. ఈ వేడుకలో ప్రకాశ్, సాయివెంకట్ తదితరులు పాల్గొన్నారు. -
పూడ్చిన మృతదేహం వెలికితీయనున్న పోలీసులు!
హైదరాబాద్: మృతదేహం తారుమారైందన్న అనుమానంపై పూడ్చిపెట్టిన మృతదేమాన్ని పోలీసులు వెలికితీయనున్నారు. అంబర్‌పేటలో రఫీ అనే వ్యక్తి అదృశ్యమయ్యాడు. అతని కుటుంబ సభ్యులు అంబర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తరువాత వారు సత్యహరిశ్ఛంద్ర పౌండేషన్ వారిని సంప్రదించారు. ఫొటో ఆధారంగా రఫీ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు నిర్ధారణకు వచ్చారు. ఉస్మానియా మార్చురీకి వెళ్లి ఆరా తీశారు. అయితే మూడు రోజుల క్రితమే ఓ మృతదేహాన్ని సలీం అనే వ్యక్తి తీసుకువెళ్లినట్లు మార్చురీ సిబ్బంది తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పూడ్చిపెట్టిన మృతదేహాన్ని పోలీసులు వెలికితీయనున్నారు. డీఎన్ఏ పరీక్షలు నిర్వహించిన తరువాత పోలీసులు మృతదేహాన్ని వారికి అప్పగిస్తారు. ** -
హిందూ, ముస్లిమ్ ప్రేమకథ
రఫీ కథానాయకునిగా నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘మిస్టర్ రాహుల్... పక్కా ప్రొఫెషనల్’. నూతన నటి అంజలి నాయిక. ఓ గల్లీ కుర్రాడు ఉన్నత స్థాయికి ఎలా ఎదిగాడన్నది ప్రధానాంశమైన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. రఫీ స్వరాలందించిన ఈ చిత్ర పాటల సీడీని ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన పూర్ణ, ఆనంద్‌లు ఆవిష్కరించి, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు పాపారావుకి అందించారు. ‘‘హిందూ ముస్లిమ్‌ల మధ్య జరిగే ప్రేమకథ ఇది’’ అని రఫీ చెప్పారు. సీనియర్ పాత్రికే యుడు పాశం యాదగిరి, వాణిజ్యపన్నుల అధికారి వివేక్ ఈ వేడుకలో పాల్గొన్నారు. -
అశ్రునయనాలతో చిన్నారి రఫీకి వీడ్కోలు
కదిలి వచ్చిన పట్టణ ప్రజలు రఫీకి నేతల నివాళి పెడన జామియా మసీదు ప్రాంగణంలో ఖననం పెడన రూరల్ : పట్టణంలో శనివారం జరిగిన పేలుడు దుర్ఘటనలో మృతి చెందిన చిన్నారి మొహమ్మద్ రఫీకి పట్టణ ప్రజలు కన్నీటితో వీడ్కోలు పలికారు. ఆదివారం పెడన జామియా మసీదు ప్రాంగణంలో అంత్యక్రియలు నిర్వహించారు. పట్టణంతో ఇతర ప్రాంతాలకు చెందిన ముస్లింలతో పాటు వివిధ రాజకీయ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆదివారం ఉదయం ప్రభుత్వాసుపత్రిలో బందర్ రూరల్ సీఐ ఎన్వీవీఎస్ మూర్తి, పెడన ఎస్సై అల్లు దుర్గా ప్రసాద్ సమక్షంలో పెడన వీఆర్వోలు పంచనామా నిర్వహించారు. అనంతరం బందర్ ప్రభుత్వాసుపత్రి వైద్యుడు వై.అశోక్ పోస్ట్‌మార్టం చేసి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. తర్వాత ఉరేగింపుగా తీసుకువెళ్లి గుడివాడ రోడ్డులోని జామియా మసీదు ప్రాంగణంలో ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఖననం చేశారు. భారీ బందోబస్తు రఫీ అంత్యక్రియలు పూర్తయ్యే వరకూ పట్టణంలో భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. పేలుడు జరిగిన ప్రాంతంతో పాటు బస్టాండ్ సెంటర్లో పోలీస్ పికెట్లను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే కాగిత పరామర్శ మృతుడు తండ్రి మొహమ్మద్ హనీఫ్‌ను బందరు ప్రభుత్వాస్పత్రిలో పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు ఓదార్చారు. పేలుడు ఘటనకు సంబంధించిన వివరాలను బందర్ రూరల్ సీఐను అడిగి తెలుసుకున్నారు. పెడన మున్సిపల్ 14వ వార్డు కౌన్సిలర్ బెజవాడ నాగరాజు, టీడీపీ నేతలు అయూబ్‌ఖాన్, కరిముల్లా, శోంఠి స్వామి తదితరులు ఉన్నారు. తరలివచ్చిన నేతలు పెడన మున్సిపల్ చైర్మన్ యర్రాశేషగిరిరావు, కోఆప్షన్ సభ్యుడు బొడ్డు వేణుగోపాలరావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, పెడన మున్సిపల్ ప్రతిపక్ష నాయకులు బండారు ఆనంద్ ప్రసాద్, పట్టణ కన్వీనర్ బండారు మల్లి, మున్సిపల్ మాజీ ప్రతిపక్ష నాయకులు అయూబ్‌ఖాన్, మున్సిపల్ మాజీ కోఆప్షన్ సభ్యులు నసీర్‌ఖాన్, జయలక్ష్మి పీఏసీఎస్ మాజీ డెరైక్టర్ అబ్దుల్ అజీజ్ పాల్గొన్నారు. పేలుడు ఘటనపై దర్యాప్తు ముమ్మరం పెడన రూరల్ : పేలుడు ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పట్టణంలో దీపావళి టపాసులు తయారు చేసే ఇద్దరు మహిళలను అదుపులో తీసుకుని విచారించారు. దీపావళి టపాసులను తయారు చేసేందుకు తీసుకు వచ్చిన రసాయనాలను వల్ల పేలుడు జరిగి ఉంటుందని ప్రాథమిక విచారణలో తెలినట్లు ఎస్సై దుర్గాప్రసాద్ తెలిపారు. శనివారం అర్ధరాత్రి హైదరాబాద్‌కు చెందిన ప్రత్యేక నిఘా విభాగం ఏడీ ఘటన స్థలానికి చేరుకుని జల్లెడ పట్టారు. కొన్ని ఆధారాలు సేకరించి జిల్లా ఎస్పీ కార్యాలయానికి పంపినట్లు తెలిసింది. -
తెలంగానోడు
తెలంగాణ రాష్ట్రం కోసం ప్రజలు ఏ విధంగా పోరాటం చేశారు? రాష్ట్రాన్ని ఎలా సాధించుకున్నారు? అనే విషయాలను విశ్లేషిస్తూ ‘తెలంగానోడు’ పేరుతో ఓ చిత్రం రూపొందనుంది. నటుడు, గాయకుడు, రచ యిత, దర్శకుడు రఫీ స్వీయ దర్శకత్వం ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రం లోగో ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. వివేక్, సాయివెంకట్ ఆవిష్కరించారు. తెలంగాణ నటులు, సాంకేతికనిపుణులు మాత్రమే ఈ చిత్రానికి పనిచేస్తారని రఫీ తెలిపారు. తెలంగాణ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్మాణ కార్యక్రమాలను త్వరలోనే ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో విజయేందర్‌రెడ్డి, వడ్డేపల్లి కృష్ణ, ప్రేమ్‌రాజ్, వైభవ్ తదితరులు పాల్గొన్నారు.