తాడిపత్రి : తాడిపత్రిలోని రోజా మసీదు సమీపంలో రఫీ(23) శనివారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ ఆందజనేయులు తెలిపారు. అమ్మానాన్నలు మృతి చెందడంతో పిన్ని షాహీన వద్ద ఉంటున్న అతను ఏ పనీపాట లేకుండా జులాయిగా తిరిగేవాడన్నారు. దీంతో ఆమె మందలించడంతో మనస్తాపం చెంది ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు వివరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.