హైదరాబాద్: మృతదేహం తారుమారైందన్న అనుమానంపై పూడ్చిపెట్టిన మృతదేమాన్ని పోలీసులు వెలికితీయనున్నారు. అంబర్పేటలో రఫీ అనే వ్యక్తి అదృశ్యమయ్యాడు. అతని కుటుంబ సభ్యులు అంబర్పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తరువాత వారు సత్యహరిశ్ఛంద్ర పౌండేషన్ వారిని సంప్రదించారు. ఫొటో ఆధారంగా రఫీ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు నిర్ధారణకు వచ్చారు.
ఉస్మానియా మార్చురీకి వెళ్లి ఆరా తీశారు. అయితే మూడు రోజుల క్రితమే ఓ మృతదేహాన్ని సలీం అనే వ్యక్తి తీసుకువెళ్లినట్లు మార్చురీ సిబ్బంది తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పూడ్చిపెట్టిన మృతదేహాన్ని పోలీసులు వెలికితీయనున్నారు. డీఎన్ఏ పరీక్షలు నిర్వహించిన తరువాత పోలీసులు మృతదేహాన్ని వారికి అప్పగిస్తారు.
**
పూడ్చిన మృతదేహం వెలికితీయనున్న పోలీసులు!
Published Wed, Dec 10 2014 6:04 PM | Last Updated on Sat, Sep 2 2017 5:57 PM
Advertisement
Advertisement