
సంకల్ప బలంతో...
రఫీ కథానాయకునిగా నటించి, స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘మిస్టర్ రాహుల్’. పక్కా ప్రొఫెషనల్ అనేది ఉపశీర్షిక. ఈ సినిమా ప్రచార చిత్రాలను ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఆవిష్కరించారు. ‘‘మురికివాడలో పుట్టి, పెరిగిన ఓ యువకుడు సంకల్ప బలంతో తన ఆశయాన్ని ఎలా సాధించాడనేది ఈ చిత్రం. హిందూ, ముస్లిమ్ కుటుంబాలకు చెందిన ఓ యువతీ యువకుడి ప్రేమకథ నేపథ్యంలో చిత్రం సాగుతుంది’’ అని రఫీ చెప్పారు. ఈ వేడుకలో ప్రకాశ్, సాయివెంకట్ తదితరులు పాల్గొన్నారు.