Mr Rahul Pakka Professional
-
సంకల్ప బలంతో...
రఫీ కథానాయకునిగా నటించి, స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘మిస్టర్ రాహుల్’. పక్కా ప్రొఫెషనల్ అనేది ఉపశీర్షిక. ఈ సినిమా ప్రచార చిత్రాలను ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఆవిష్కరించారు. ‘‘మురికివాడలో పుట్టి, పెరిగిన ఓ యువకుడు సంకల్ప బలంతో తన ఆశయాన్ని ఎలా సాధించాడనేది ఈ చిత్రం. హిందూ, ముస్లిమ్ కుటుంబాలకు చెందిన ఓ యువతీ యువకుడి ప్రేమకథ నేపథ్యంలో చిత్రం సాగుతుంది’’ అని రఫీ చెప్పారు. ఈ వేడుకలో ప్రకాశ్, సాయివెంకట్ తదితరులు పాల్గొన్నారు. -
హిందూ, ముస్లిమ్ ప్రేమకథ
రఫీ కథానాయకునిగా నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘మిస్టర్ రాహుల్... పక్కా ప్రొఫెషనల్’. నూతన నటి అంజలి నాయిక. ఓ గల్లీ కుర్రాడు ఉన్నత స్థాయికి ఎలా ఎదిగాడన్నది ప్రధానాంశమైన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. రఫీ స్వరాలందించిన ఈ చిత్ర పాటల సీడీని ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన పూర్ణ, ఆనంద్‌లు ఆవిష్కరించి, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు పాపారావుకి అందించారు. ‘‘హిందూ ముస్లిమ్‌ల మధ్య జరిగే ప్రేమకథ ఇది’’ అని రఫీ చెప్పారు. సీనియర్ పాత్రికే యుడు పాశం యాదగిరి, వాణిజ్యపన్నుల అధికారి వివేక్ ఈ వేడుకలో పాల్గొన్నారు.