
తెలంగానోడు
తెలంగాణ రాష్ట్రం కోసం ప్రజలు ఏ విధంగా పోరాటం చేశారు? రాష్ట్రాన్ని ఎలా సాధించుకున్నారు? అనే విషయాలను విశ్లేషిస్తూ ‘తెలంగానోడు’ పేరుతో ఓ చిత్రం రూపొందనుంది.
నటుడు, గాయకుడు, రచ యిత, దర్శకుడు రఫీ స్వీయ దర్శకత్వం ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రం లోగో ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. వివేక్, సాయివెంకట్ ఆవిష్కరించారు. తెలంగాణ నటులు, సాంకేతికనిపుణులు మాత్రమే ఈ చిత్రానికి పనిచేస్తారని రఫీ తెలిపారు.
తెలంగాణ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్మాణ కార్యక్రమాలను త్వరలోనే ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో విజయేందర్‌రెడ్డి, వడ్డేపల్లి కృష్ణ, ప్రేమ్‌రాజ్, వైభవ్ తదితరులు పాల్గొన్నారు.