ఖానాపూర్(ఆదిలాబాద్): ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ పోలీసులు 42 కేసుల్లో నిందితుడిగా ఉన్న అంతర్ జిల్లా దొంగను అరెస్టు చేశారు. డీఎస్పీ మనోహర్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం పోచంపాడు గ్రామానికి చెందిన మహ్మద్ షఫీ పలు దొంగతనం కేసుల్లో నిందితుడు. ఇతనిపై 29 ట్రాన్స్‌ఫార్మర్ దొంగతనం కేసులు 29, మోటార్లు ఎత్తుకుపోయిన కేసులు 11, ట్రాన్స్‌ఫార్మర్లు పగులగొట్టి కాయిల్స్ చోరీ చేసిన కేసులు 2 ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోని పోలీస్‌స్టేషన్లలో నమోదై ఉన్నాయి.
గురువారం మరో ఇద్దరితో కలిసి ద్విచక్ర వాహనంపై మోటారు తీసుకెళ్తుండగా పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డాడు. మిగతా ఇద్దరూ పరారు కాగా, షఫీ దొరికిపోయాడు. ఇతనిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు.