దోమలగూడ అరవింద్‌నగర్ కాలనీలో ఘటన
కవాడిగూడ: దొంగలు బరితెగించారు. దోమలగూడ పరిధిలోని అరవింద్‌నగర్ కాలనీలో గురువారం తెల్లవారుజామున నగల వ్యాపారిని మారణాయుధాలతో బెదిరించి ఇంట్లోని 2 కిలోల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. బాధితుడు, పోలీసుల కథనం ప్రకారం.. కోల్‌కతాకు చెందిన రంజిత్ గౌరాయ్ కొన్నేళ్లుగా అరవింద్‌నగర్ కాలనీలో నివసిస్తున్నారు.
నగరంలోని వివిధ జ్యువెలరీ షాపుల నుంచి ఆర్డర్లు తీసుకుని నగలు తయారు చేసి సప్లయ్ చేస్తుంటారు. రంజిత్ వద్ద దాదాపు సుమారు 50 మంది కారి్మకులు పని చేస్తున్నారు. గురువారం తెల్లవారు జామున 3– 4 గంటల మధ్య దాదాపు ఆరుగురు గుర్తు తెలియని వ్యక్తులు రంజిత్ ఇంటి తలుపులు కొట్టి కత్తులతో ఒక్కసారిగా ఇంట్లోకి చొరబడ్డారు. రంజిత్ కుటుంబ సభ్యులను బెదిరించి ఇంట్లోని 2 కిలోల బంగారాన్ని ఎత్తుకెళ్లారు.
దీంతో బాధితుడు రంజిత్ గౌరాయ్ దోమలగూడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్‌టీం, డాగ్‌స్కా్వడ్‌లతో తనిఖీలు చేపట్టారు. బంగారం దోపిడీకి పాల్పడింది ఇంట్లో పని చేస్తున్న సిబ్బందికి తెలిసినవారా? గుర్తు తెలియని వ్యక్తులా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
హైదరాబాద్‌లో దారుణం
Comments
Please login to add a commentAdd a comment