దోమలగూడ: దోమలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని అరవింద్ నగర్ కాలనీలో గురువారం జరిగిన బంగారం చోరీ ఘటన ఇంటి దొంగల పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు బాధితులు రంజిత్ గౌరాయ్ సోదరుడు ఇంద్రజిత్ గౌరాయ్‌ను పోలీసులు విచారించినట్లు సమాచారం. రంజిత్ గౌరాయ్ వద్ద పనిచేసే 40 మంది కారి్మకుల వివరాలతో పాటు కాల్ డేటాను పోలీసులు సేకరించారు. బంగారం దొంగతనం చేసిన వారిని పట్టుకునేందుకు ఐదు ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
Hyderabad: మారణాయుధాలతో బెదిరించి 2కిలోల బంగారం దోపిడీ
Comments
Please login to add a commentAdd a comment