domalguda
-
దొంగలను పట్టించిన డాగ్ వాక్
2024 డిసెంబర్ 12 తెల్లవారుజాము దాదాపు 4 గంటల సమయం– హైదరాబాద్, దోమలగూడ అర్వింద్నగర్లోని ఘొరాయ్ కుటుంబీకుల ఇంట్లోకి ఆరుగురు ముసుగు దొంగలు చొరబడి, మారణాయుధాలతో బెదిరించి, రెండు కేజీల బంగారం సహా దాదాపు రూ.2 కోట్ల విలువైన సొత్తు దోచుకున్నారు. 2024 డిసెంబర్ 22 మధ్యాహ్నం దాదాపు 2 గంటల మధ్య సమయం–బంజారాహిల్స్‌లోని తెలంగాణ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి, ఘొరాయ్ కుటుంబీకుడు సహా 12 మందిని అరెస్టు చేసినట్లు ప్రకటించారు. ఆధారాలు దొరక్కుండా, పక్కా పథకం ప్రకారం చేసిన ఈ బందిపోటు దొంగతనం ఒక పెంపుడు జాగిలం ద్వారా కొలిక్కి వచ్చింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన అన్నదమ్ములు రంజిత్ ఘొరాయ్, ఇంద్రజిత్ ఘొరాయ్ కొన్నేళ్ల కిందట హైదరాబాద్‌కు వలసవచ్చారు. తమ కుటుంబాలతో దోమలగూడ అర్వింద్నగర్లో స్థిరపడ్డారు. ఇద్దరూ వేర్వేరుగా నగల తయారీ వ్యాపారం ప్రారంభించారు. రంజిత్ యాభైమందికి ఉద్యోగం ఇచ్చే స్థాయికి ఎదిగాడు. అతడి తమ్ముడు ఇంద్రజిత్ వ్యసనాలకు బానిసై, ఆర్థికంగా చితికిపోయాడు. తమ్ముడి పరిస్థితి చూసిన అన్న రంజిత్ తనతో కలిసి ఒకే ఇంట్లో వేరే పోర్షన్లో ఉండే ఏర్పాటు చేశాడు. రంజిత్ వ్యాపారం బాగా సాగుతుండటంతో ఇంద్రజిత్ కొన్నాళ్లుగా ఈర్ష్యతో రగిలిపోతున్నాడు. ఇటీవల రంజిత్ తన భార్య పేరుతో దోమలగూడలో రెండు ఇళ్లు కొన్నాడు. ఈ విషయం తెలిశాక ఇంద్రజిత్ మరింతగా రగిలిపోయాడు. రంజిత్ వద్ద ఉండే బంగారం వివరాలను గమనిస్తూ వచ్చిన ఇంద్రజిత్– నకిలీ ఆదాయపు పన్ను దాడి చేయించడానికి ఆరు నెలల కిందట కొందరితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. వారికి నకిలీ గుర్తింపుకార్డులు తయారు చేయించినా, ఆ పథకం పారలేదు. దీంతో అన్న వద్ద ఉండే బంగారం దోచుకోవాలని ఇంద్రజిత్ భావించాడు. ప్రతి రోజూ తనతో కలిసి మార్నింగ్ వాక్ చేసే అల్తాఫ్ మహ్మద్ ఖాన్, సయ్యద్ ఇర్ఫాన్ అహ్మద్‌లతో ఇంద్రజిత్‌కు స్నేహం ఏర్పడింది. రంజిత్ ఇంట్లో భారీగా బంగారం ఉండే సమయం చెప్తానని, అప్పుడు దోపిడీ చేయిస్తే, అందరం వాటాలు పంచుకుందామని చెప్పాడు. దీనికి అంగీకరించిన అల్తాఫ్, ఇర్ఫాన్, ఈ విషయాన్ని బాలాపూర్‌కు చెందిన రౌడీషీటర్ హబీబ్ హుస్సేన్ ద్వారా మైలార్‌దేవ్‌పల్లికి చెందిన షేక్ షబ్బీర్‌కు చెప్పారు. ఈ దోపిడీకి తనకంటే మైలార్‌దేవ్‌పల్లి రౌడీషీటర్ మహ్మద్ అర్బాజ్ సమర్థుడని చెప్పిన షబ్బీర్, అతడిని పరిచయం చేశాడు. వీరంతా పలుమార్లు వివిధ హోటళ్లలో కూర్చుని, దోపిడీకి పథకం వేశారు. అర్బాజ్ తన అనుచరులతో కలిసి బందిపోటు దొంగతనానికి రంగంలోకి దిగాడు. ఇంద్రజిత్తో చర్చించి, ఒక వాహనాన్ని కూడా కొన్నాడు. తన అనుచరులతో రంజిత్ ఇంటి వద్ద రెక్కీ చేయించాడు. ఇంట్లో పెంపుడు శునకం, చుట్టూ ప్రహరీ, భారీ గేటు, గ్రిల్స్‌తో కట్టుదిట్టంగా ఉండటంతో బయటి వాళ్లు ప్రవేశించడం దుస్సాధ్యమని గుర్తించి, ఇంద్రజిత్‌కు చెప్పాడు. దీంతో అంతా కలిసి బహదూర్‌పురాకు చెందిన న్యాయవాది మహ్మద్ నూరుల్లా సహాయం కోరారు. ఘొరాయ్ ఇంట్లోని పెంపుడు శునకాన్ని ఇంద్రజిత్ రోజూ ఉదయం బయటకు తీసుకువెళుతుంటాడు. దాని కాలకృత్యాలు పూర్తయ్యాక తీసుకువచ్చి, ఇంటి ఆవరణలో వదిలేస్తాడు. దొంగతనం చేసే రోజు మాత్రం తెల్లవారుజామున పెంపుడు శునకాన్ని కాస్త తొందరగా బయటకు తీసుకుని వెళ్లాలని, తిరిగి వస్తూ ప్రధాన గేటుకు గడియపెట్టకుండా వదిలేయాలని నూరుల్లా సలహా ఇచ్చాడు. దీంతో అర్బాజ్ 2024 డిసెంబర్ 12 రాత్రి తన గ్యాంగ్‌తో రంగంలోకి దిగాడు. అర్బాజ్ నేతృత్వంలో అతడి అనుచరులు షబ్బీర్ ఇంట్లో సమావేశమయ్యారు. అక్కడ నుంచి షబ్బీర్ మినహా మిగిలిన వాళ్లు బయలుదేరి, రంజిత్ ఇంటికి చేరారు. తన అన్న కుటుంబీకులను కేవలం బెదిరించాలని ఇంద్రజిత్ పదేపదే చెప్పినా అర్బాజ్ పట్టించుకోలేదు. రంజిత్ కుటుంబాన్ని బంధించి, తన అనుచరులతో వారి పిల్లల మెడపై కత్తులు పెట్టించాడు. అడ్డుకునే ప్రయత్నం చేసిన రంజిత్ చేతిని కత్తితో నరికించాడు. తర్వాత ఇంట్లోని రెండు కేజీల బంగారం, 616 గ్రాముల వెండి, పూజ గదిలోని రెండు కేజీల ఇత్తడి సామాను దోచుకుని పారిపోయారు. పోలీసులకు ఆధారాలు దొరక్కుండా, రహదారుల్లోని సీసీ కెమెరాల్లో రికార్డు కాకుండా జాగ్రత్తపడ్డారు. కాసేపటికి రంజిత్ షాక్ నుంచి తేరుకున్నాడు. ఇంద్రజిత్ స్వయంగా పోలీసులకు ఫోన్ చేశాడు. పోలీసులు అక్కడకు చేరుకుని, కేసు నమోదు చేసుకున్నారు. మధ్య మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. ఇన్స్పెక్టర్ ఖలీల్ పాషా నేతృత్వంలో ఎస్సైలు నవీన్‌కుమార్, నాగేష్, శ్రీకాంత్ తమ బృందాలతో దర్యాప్తు చేపట్టారు. ఘొరాయ్ కుటుంబం దినచర్యపై దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలోనే నేరం జరిగిన రోజు ఇంద్రజిత్ తెల్లవారుజామున 3.00 గంటలకే పెంపుడు శునకాన్ని మార్నింగ్ వాక్కు తీసుకువెళ్లినట్లు గుర్తించారు. అతడిపై అనుమానం వచ్చి అదుపులోకి తీసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అతడు నోరు విప్పాడు. ఆరు నెలల కిందటి ‘ఐటీ స్కెచ్’ నుంచి తాజా బందిపోటు దొంగతనంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్న పదిహేను మంది వివరాలను బయటపెట్టాడు. దీంతో అధికారులు షహబాజ్, నజీర్, జహీర్ మినహా మిగిలిన పన్నెండు మందిని పట్టుకుని, వీరి నుంచి రూ.2.9 లక్షల నగదు, కారు, ఆయుధాలతో పాటు 1228 గ్రాముల బంగారం, 616 గ్రాముల వెండి, రెండు కేజీల ఇత్తడి వస్తువులు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. -
బంగారం చోరీ కేసు ఇంటి దొంగల పనేనా?
దోమలగూడ: దోమలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని అరవింద్ నగర్ కాలనీలో గురువారం జరిగిన బంగారం చోరీ ఘటన ఇంటి దొంగల పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు బాధితులు రంజిత్ గౌరాయ్ సోదరుడు ఇంద్రజిత్ గౌరాయ్ను పోలీసులు విచారించినట్లు సమాచారం. రంజిత్ గౌరాయ్ వద్ద పనిచేసే 40 మంది కారి్మకుల వివరాలతో పాటు కాల్ డేటాను పోలీసులు సేకరించారు. బంగారం దొంగతనం చేసిన వారిని పట్టుకునేందుకు ఐదు ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. Hyderabad: మారణాయుధాలతో బెదిరించి 2కిలోల బంగారం దోపిడీ -
Hyderabad: దోమలగూడలో దారుణం
సాక్షి, హైదరాబాద్: దోమలగూడలోని గగన్‌మహల్ రాధామదన్‌నివాస్‌లో ఓ వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. ఇంటి యజమానులు లేని సమయంలో కారు డ్రైవర్‌గా పనిచేసే వ్యక్తి ఆమె చేతులు కాళ్లు కట్టేసి ఇంట్లో నగదు, బంగారు ఆభరణాలు చోరీ చేశాడు. మృతురాలు స్నేహలత దేవి (61)కు భర్త మహేష్ కుమార్.. కుమారుడు పవన్ కుమార్, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మహేష్ కుమార్ పవన్ కుమార్ గోషామాల్‌లో ప్లైవుడ్ వ్యాపారం చేస్తున్నారు. ఎప్పటిలాగే బుధవారం ఉదయం వ్యాపార నిమిత్తం తండ్రి కొడుకు ప్లైవుడ్ షాప్‌కు వెళ్లారు. ఆ సమయంలో కారు డ్రైవర్ మహేష్.. స్నేహలత దేవి కాళ్లు చేతులు కట్టేసి నోట్లో బట్టలు కుక్కి ఇంట్లో ఉన్న నగదు బంగారు ఆభరణాలతో పరారైనట్లు దోమలగూడ పోలీసులు అనుమానిస్తున్నారు. బీహార్‌కు చెందిన మహేష్ రెండు నెలల క్రితమే వీరి వద్ద కారు డ్రైవర్‌గా విధుల్లో చేరాడని తెలిపారు. సాయంత్రం ఐదున్నర గంటలకు పోలీసులకు సమాచారం రావడంతో స్నేహలత దేవిని హుటాహుటిన హైదర్‌గూడాలోని అపోలో ఆసుపత్రి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు ఆస్పత్రి వర్గాల ధ్రువీకరించాయి. ముఖానికి ప్లాస్టర్ వేయటంతో ఊపిరడకపోవటం వల్లే ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు భావిస్తున్నామని దోమలగూడ పోలీసులు తెలిపారు. గాంధీనగర్ ఏసీపీ కే రవి కుమార్, దోమలగూడ సీఐ శ్రీనివాస్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఘటనా స్థలంలో క్లూస్ టీం వివరాలు సేకరిస్తోంది. చదవండి: TSRTC: కండక్టర్‌పై మహిళ దాడి.. సజ్జనార్ సీరియస్ కామెంట్స్ -
అపార్ట్మెంట్లో చోరీకి విఫలయత్నం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని అపార్ట్మెంట్లో ఓ అగంతకుడు చోరీకి విఫలయత్నం చేశాడు. వివరాల్లోకి వెళితే.. దోమల్‌గూడలోని సౌభాగ్య అపార్ట్మెంట్లో సీతా భాగ్యలక్ష్మి(61), జ్యోత్స్న రాణి(66) అనే వృద్ధ మహిళలు నివాసం ఉంటున్నారు. ఈ నెల18వ తేదీ మధ్యాహ్నం రెండు గంటల సమయంలో వారి అపార్ట్మెంట్లోకి ఓ అగంతకుడు చొరబడి గొంతుపై కత్తి పెట్టి వారిని డబ్బులు డిమాండ్ చేశాడు. దిక్కుతోచని మహిళలు గట్టిగా కేకలు వేయడంతో ఇంట్లోనే ఉంటున్న మరో మహిళ మరో కత్తితో అగంతకుడిని బెదిరించింది. దీంతో దుండగుడు ఇద్దరు మహిళలను తీవ్రంగా గాయపరిచి పారిపోయేందుకు ప్రయత్నించగా స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పజెప్పారు. అనంతరం గాయపడిన సీతా భాగ్యలక్ష్మి, జ్యోత్స్న రాణిలను హైదర్‌గూడలోని అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్సను అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితున్ని కోర్టులో హాజరుపర్చారు. చదవండి: కారుతోపాటు మృతదేహం కాల్చివేత: శ్రీనివాస్ హత్య కేసులో ట్విస్ట్ -
మహానగరంలో ఉల్లిపాయల దోంగలు
-
పీఆర్సీ ప్రకారం వేతనాలు సవరించాలి
దోమలగూడ: పదవ వేతన సిపారసుల ప్రకారం కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల (కేజీబీవి) ఉపాధ్యాయుల, ఉద్యోగుల వేతనాలు సవరించాలని టీజేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. కేజీబీవీ లో పని చేస్తున్న ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. వేతనాలు పెంచాలని, సమస్యలను తీర్చాలని కోరుతూ కేజీబీవి ఉపాధ్యాయుల, ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడపిల్ల అక్షరాస్యత పెంచాలనే ఆశయంతో ఏర్పాౖటెన కేజీబీవి స్కూళ్లలో పని చేసే టీచర్లు మంచి ఫలితాలు సాధిస్తున్నారన్నారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ కేజీబీవి ఉద్యోగులు, ఉపాధ్యాయుల డిమాండ్లు న్యాయమైనవన్నారు. దీనిపై కేంద్ర మంత్రి జవదేవకర్‌ను కలిసి విన్నవించినట్లు తెలిపారు. నర్సిరెడ్డి, స్వరూపరాణి మాట్లాడుతూ పదవ పీఆర్సీ ఆధారంగా స్పెషల్ ఆఫీసర్లకు రూ. 37 వేలు, ఉపాధ్యాయులకు రూ.28 వేలు, పీఈటీలకు రూ.22 వేలు, అకౌంటెంట్లకు రూ.20 వేలు, ఎఎన్ఎంలకు రూ.18 వేలు, నాల్గవ తరగతి ఉద్యోగులకు రూ.13 వేలు, కుక్‌లకు రూ. 14 వేల వేతనంగా ఇవ్వాలన్నారు. వేతనంతో కూడిన ఆరు నెలల ప్రసూతి సెలవులను మంజూరు చేయాలన్నారు. కార్యక్రమంలో వెంకట్‌రెడ్డి, సంధ్య, ప్రమీల, రాజ్యలక్షి్మ, ఎం పరిత, సిహెచ్లక్షి్మ, ఆర్ సునీత, ఆర్ భారతి, కె శిరీష, రవి తదితరులు పాల్గొన్నారు. -
ఆరేళ్ల చిన్నారికి వాతలు