Hyderabad: దోమలగూడలో దారుణం | Old Woman Deceased In Domalguda Thieves Plaster On Her Face | Sakshi
Sakshi News home page

Hyderabad: దోమలగూడలో దారుణం

Published Wed, Jan 31 2024 8:54 PM | Last Updated on Wed, Jan 31 2024 9:43 PM

Old Woman Deceased In Domalguda Thieves Plaster On Her Face - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దోమలగూడలోని గగన్‌మహల్ రాధామదన్‌నివాస్‌లో ఓ వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. ఇంటి యజమానులు లేని సమయంలో కారు డ్రైవర్‌గా పనిచేసే వ్యక్తి ఆమె చేతులు కాళ్లు కట్టేసి ఇంట్లో నగదు, బంగారు ఆభరణాలు చోరీ చేశాడు. మృతురాలు స్నేహలత దేవి (61)కు భర్త మహేష్ కుమార్.. కుమారుడు పవన్ కుమార్, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మహేష్ కుమార్ పవన్ కుమార్ గోషామాల్‌లో ప్లైవుడ్ వ్యాపారం చేస్తున్నారు. ఎప్పటిలాగే బుధవారం ఉదయం వ్యాపార నిమిత్తం తండ్రి కొడుకు ప్లైవుడ్ షాప్‌కు వెళ్లారు.

ఆ సమయంలో కారు డ్రైవర్ మహేష్.. స్నేహలత దేవి కాళ్లు చేతులు కట్టేసి నోట్లో బట్టలు కుక్కి ఇంట్లో ఉన్న నగదు బంగారు ఆభరణాలతో పరారైనట్లు దోమలగూడ పోలీసులు అనుమానిస్తున్నారు. బీహార్‌కు చెందిన మహేష్ రెండు నెలల క్రితమే వీరి వద్ద కారు డ్రైవర్‌గా విధుల్లో చేరాడని తెలిపారు. సాయంత్రం ఐదున్నర గంటలకు పోలీసులకు సమాచారం రావడంతో స్నేహలత దేవిని హుటాహుటిన హైదర్‌గూడాలోని అపోలో ఆసుపత్రి తరలించారు.

అప్పటికే ఆమె మృతి చెందినట్లు ఆస్పత్రి వర్గాల ధ్రువీకరించాయి. ముఖానికి ప్లాస్టర్‌ వేయటంతో ఊపిరడకపోవటం వల్లే ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు భావిస్తున్నామని దోమలగూడ పోలీసులు తెలిపారు. గాంధీనగర్ ఏసీపీ కే రవి కుమార్‌, దోమలగూడ సీఐ శ్రీనివాస్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఘటనా స్థలంలో  క్లూస్ టీం వివరాలు సేకరిస్తోంది.

చదవండి: TSRTC: కండక్టర్‌పై మహిళ దాడి.. సజ్జనార్‌ సీరియస్‌ కామెంట్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement