
పీఆర్‌సీ ప్రకారం వేతనాలు సవరించాలి
దోమలగూడ: పదవ వేతన సిపారసుల ప్రకారం కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల (కేజీబీవి) ఉపాధ్యాయుల, ఉద్యోగుల వేతనాలు సవరించాలని టీజేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. కేజీబీవీ లో పని చేస్తున్న ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. వేతనాలు పెంచాలని, సమస్యలను తీర్చాలని కోరుతూ కేజీబీవి ఉపాధ్యాయుల, ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడపిల్ల అక్షరాస్యత పెంచాలనే ఆశయంతో ఏర్పాౖటెన కేజీబీవి స్కూళ్లలో పని చేసే టీచర్లు మంచి ఫలితాలు సాధిస్తున్నారన్నారు.
సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ కేజీబీవి ఉద్యోగులు, ఉపాధ్యాయుల డిమాండ్లు న్యాయమైనవన్నారు. దీనిపై కేంద్ర మంత్రి జవదేవకర్‌ను కలిసి విన్నవించినట్లు తెలిపారు. నర్సిరెడ్డి, స్వరూపరాణి మాట్లాడుతూ పదవ పీఆర్‌సీ ఆధారంగా స్పెషల్ ఆఫీసర్లకు రూ. 37 వేలు, ఉపాధ్యాయులకు రూ.28 వేలు, పీఈటీలకు రూ.22 వేలు, అకౌంటెంట్‌లకు రూ.20 వేలు, ఎఎన్‌ఎంలకు రూ.18 వేలు, నాల్గవ తరగతి ఉద్యోగులకు రూ.13 వేలు, కుక్‌లకు రూ. 14 వేల వేతనంగా ఇవ్వాలన్నారు.
వేతనంతో కూడిన ఆరు నెలల ప్రసూతి సెలవులను మంజూరు చేయాలన్నారు. కార్యక్రమంలో వెంకట్‌రెడ్డి, సంధ్య, ప్రమీల, రాజ్యలక్షి్మ, ఎం పరిత, సిహెచ్‌లక్షి్మ, ఆర్ సునీత, ఆర్ భారతి, కె శిరీష, రవి తదితరులు పాల్గొన్నారు.