
బంధువులకు వీడియో పెట్టి యువకుడి ఆత్మహత్య
వచ్చే నెల 6న పెళ్లి పీటలు ఎక్కాల్సిన సాయికుమార్
మొయినాబాద్ (రంగారెడ్డి జిల్లా): త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నేను చనిపోతున్నా అంటూ వీడియో రికార్డు చేసి బంధువులకు పంపి చెట్టుకు ఉరేసుకున్నాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పరిధిలో మంగళవారం వెలుగుచూసింది.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. చిలుకూరుకు చెందిన వీఎం సాయికుమార్(32)కు వికారాబాద్ జిల్లా కొడంగల్‌కు చెందిన యువతితో పెళ్లి నిశ్చయమైంది. మార్చి 6న పెళ్లి ముహూర్తం పెట్టుకున్నారు. వివాహం కుదిరిన రోజు నుంచి సాయికుమార్ తన కు కాబోయే భార్యతో నిత్యం ఫోన్ మాట్లాడేవాడు. ఉన్నట్టుండి ఏం జరిగిందో తెలియదు కానీ సోమవారం రాత్రి 7 గంటల సమయంలో నేను చనిపోతున్నా అంటూ వీడియో రికార్డ్ చేసి బంధువులకు పంపించాడు.
వారు వెంటనే ఈ విషయాన్ని సాయికుమార్ తల్లి లక్ష్మికి తెలియజేశారు. కుటుంబసభ్యులు రాత్రంతా వెతికారు. మంగళవారం ఉదయం 9.50 గంటల సమయంలో గండిపేట ్త సమీపంలోని ఓ చెట్టుకు ఉరేసుకొని కనిపించాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు చెప్పారు. సాయికుమార్ ఆత్మహత్యకు అమ్మాయి తరఫు కుటుంబసభ్యుల వేధింపులే కారణమని తల్లి లక్ష్మి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment