
మృతుడు ఎన్.కుమార్
కాణిపాకం: బంధువులు వివాహానికి పిలువలేదని మనస్తాపంతో అతిగా మద్యం సేవించి యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన సోమవారం కాణిపాకం పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఏఎస్‌ఐ యతిరాజులు కథనం మేరకు.. చిత్తూరు నగరం కట్టమంచికి చెందిన ఎన్.కుమార్ (38) బంధువుల వివాహం ఆదివారం కాణిపాకంలో జరిగింది. దీనికి కుమార్‌ను బంధువులు పిలువలేదు. దీంతో మనస్తాపం చెందిన అతను అతిగా మద్యం సేవించి తిరువణంపల్లె గ్రామ సమీపంలో రోడ్డు పక్కన పడిపోయాడు.
ఎవరూ గుర్తించకపోవడంతో మృతిచెందాడు. శరీరానికి చీమలు పట్టి ముక్కు నుంచి రక్తం కారుతుండటంతో గ్రామస్తులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. తవణంపల్లె ఎస్‌ఐ ఉమామహేశ్వరరావు అక్కడికి చేరుకుని మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరుకు తరలించారు. మృతుడికి వివాహం కాలేదు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.