![Young Man suicide With Extramarital affair - Sakshi](/styles/webp/s3/article_images/2023/05/23/Love.jpg.webp?itok=ZukE9Zcg)
జనగాం: వివాహేతర బంధం కొనసాగిస్తూ, వివాహితను పెళ్లి చేసుకుంటానంటే, తల్లిదండ్రులు నిరాకరించారు. దీంతో గార్లకు చెందిన బాణాల వెంకటేశ్(25) సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. గార్లలోని వేంకటేశ్వరస్వామి దేవాలయం బజార్‌కు చెందిన వెంకటేశ్ తాపీ మేస్త్రీగా పని చేస్తున్నాడు. ఈక్రమంలో కొంతకాలంగా అదే బజారుకు చెందిన ఓ వివాహితతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు.
ఇటీవల ఆమె భర్త అనారోగ్యంతో మృతి చెందాడు. ఆమెకు ముగ్గురు పిల్లలున్నారు. ఈక్రమంలో వెంకటేశ్ ఆమెనే పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులకు చెప్పాడు. కానీ తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో జీవితంపై విరక్తి చెందిన వెంకటేశ్ ఇంట్లో ఎవరూ లేని సమయంతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
‘ఇంటికి పెద్ద కొడుకువు.. మమ్ముల్ని సాకుతావని ఆశలు పెట్టుకుంటిమి కదరా కొడుకా.. గింతపని చేస్తవనుకోలేదు కొడుకా’ అంటూ తల్లితండ్రులు రోదించిన తీరు అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టించింది. మృతుడి తండ్రి శ్రీనివాసాచారి ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేసుకున్నట్లు గార్ల ఎస్సై బానోత్ వెంకన్న తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment