
అమెరికాలో తెలుగు విద్యార్థి గల్లంతు
యూఎస్‌ఏలో తెలుగు విద్యార్థి ఒకరు నదిలో మునిగి గల్లంత య్యారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం బండిపాలెం గ్రామానికి చెందిన పుట్టా నరేష్ కాలిఫోర్నియా యూనివర్సిటీలో ఎంఎస్ సెకండియర్ చదువుతున్నాడు. ఆదివారం అతడు మిత్రులతో కలిసిలివర్‌మోర్ నదిలో పడవ షికారుకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు పడవ బోల్తా పడటంతో అతడు నదిలో పడి గల్లంతయ్యాడు. నరేష్ కోసం గాలింపు కొనసాగుతోందని కుటుంబసభ్యులు తెలిపారు.