![Telugu Student Thummeti Sai Kumar Reddy Passes Away in US](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/usa.jpg.webp?itok=0ctUnThP)
వాషింగ్టన్ : అమెరికాలో తెలుగు విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. న్యూయార్క్‌లో చదువుతున్న తుమ్మేటి సాయికుమార్‌రెడ్డి తన రూమ్‌లో బలవన్మరణానికి పాల్పడ్డారు. ఓ వైపు చదువుకుంటూనే మరోవైపు పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తున్న సాయికుమార్‌రెడ్డి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చాక.. తెలుగు విద్యార్థులకు కష్టాలు మొదలయ్యాయి. పార్ట్‌టైమ్ జాబ్ చేసే వారి పరిస్థితి మరింత దయనీయంగా మారింది. పార్ట్‌టైమ్ జాబ్స్ లేక.. ఎడ్యుకేషన్ లోన్ చెల్లించాల్సి రావడంతో విద్యార్థులు ఒత్తిడి గురవుతున్నారు. ఒత్తిడి తట్టుకోలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.
కొద్ది రోజుల క్రితం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం మాదన్నపేటకు చెందిన విద్యార్థి బండి వంశీ(25) అనుమానాస్పద రీతిలో మరణించారు. కాంకోర్డియా సెయింట్ పాల్ విశ్వవిద్యాలయం చదువుతూ.. 8580 మాగ్నోలియా ట్రైల్ ఈడెన్ ప్రెయిరీ అపార్ట్‌మెంట్‌లో పార్క్ చేసిన కారులో అనుమానాస్పద స్థితితో మృతి చెందాడు. తాజాగా, సాయికుమార్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవడంతో అతని స్నేహితులు శోకసంద్రంలో మునిగిపోయారు.
![ట్రంప్ అధికారంలోకి వచ్చాక భారతీయ విద్యార్ధులకు కష్టాలు](https://www.sakshi.com/s3fs-public/inline-images/sai_1.jpg)
Comments
Please login to add a commentAdd a comment