అమెరికాలో మిస్సోరిలో కొన్ని నెలలుగా ఒక తెలుగు యువకుడిని బంధించి వేధించిన కేసు కలకలం రేపింది. అయితే ఈ కేసులో నిందితులను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో నిందితులపై సత్తారు వెంకటేష్ రెడ్డి (35), శ్రావణ్ వర్మ (23), నిఖిల్ (27)పై విచారణ, చట్టపరమైన చర్యలకు తీసుకునేందుకు అక్కడి అధికారులు సన్నద్ధమయ్యారు.
అయితే ఇక్కడే మరోసారి టీడీపీ తన వక్రబుద్ధిని చాటుకుంది. ప్రధాన నిందితుడు వైఎస్సార్సీపీకి చెందిన నాయకుడు అంటూ టీడీపీ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తోంది. ఈ ఆరోపణలను ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్ ఖండించారు. "మన రాష్ట్రం, మనదేశం కానీ ఒక ప్రాంతంలో జరిగిన నేరాన్ని అడ్డం పెట్టుకుని మా పార్టీ, ప్రభుత్వం పై టీడీపీ విమర్శలు చేయడం టీడీపీ దిగజారుడుతానానికి నిదర్శనమన్నారు. మోకాలికి బొడిగుండుకు ముడిపెట్టి లబ్ధిపొందాలన్న ఆలోచనతో టీడీపీ దిగజారి వ్యవహరిస్తోంది. ఈ కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుంది. చట్టాన్ని గౌరవించే పార్టీ వైఎస్సార్‌సీపీ అని, నిందితులు ఎవరైనా సరే నేరం నిరూపణ అయిన పక్షంలో శిక్షార్హులని" ఆయన వెల్లడించారు.
"టీడీపీ కార్యకర్తలు, అభిమానుల్లో నేరప్రవృత్తి ఉన్నవారు తమ వ్యక్తిగత జీవితాల్లో చేసే నేరాలకు టీడీపీ బాధ్యత తీసుకుంటుందా? టీడీపీ నేతలు మహిళలపై చేసే అఘాయిత్యాలకు చంద్రబాబు, లోకేష్ బాధ్యత తీసుకుంటారా? అని రత్నాకర్ సూటిగా ప్రశ్నించారు. అంతేకాదు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వెంకటేష్ సత్తారును అడ్డంపెట్టుకుని ఈ నేరాన్ని వైఎస్సార్‌సీపీకి ముడిపెట్టాలని, తద్వారా లబ్ధిపొందాలని చూసే టీడీపీ.. ముందుగా ఏపీలో టీడీపీ నేతలు నడిపే కాల్ మనీ సెక్స్ రాకెట్లపై సమాధానం చెప్పాలి. ఎక్కడో విదేశాల్లో జరిగే నేరాలను మాకు ముడిపెట్టడం కాదు.. ఏపీలో టీడీపీ నేతలు చేసే దుర్మార్గాలకు టీడీపీ బాధ్యత వహించాలన్నారు" రత్నాకర్.
"కాల్ మనీ దందాలు, సెక్స్ రాకెట్లు నడిపి వేలాది మహిళల జీవితాలను చీకట్లోకి నెట్టిన నీచమైన చరిత్ర టీడీపీ నేతలది. వీరి సెక్స్ రాకెట్ దందా ఏపీ నుండి అమెరికా వరకు విస్తరించింది. గతంలో ఎన్నారై టీడీపీ నేతలు వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డారు. టీడీపీ నేరప్రవృత్తి కలిగిన పార్టీ..అందుకే ఏపీ ప్రజలు టీడీపీని 23 సీట్లకు పరిమితం చేశారు. ఇలాంటి అనైతిక ప్రచారం తో 2024 ఎన్నికల్లో తెదేపా తెలంగాణ లో మాదిరి గానే తుడిచి పెట్టుకు పోతుందని" పేర్కొన్నారు.
ఇదే తెదేపా సంస్కారం ?
— Kadapa Rathnakar (@KadapaRathnakar) December 1, 2023
మీరు చేస్తే సంసారం ... ఇంకోళ్ళు చేస్తే .....చారం ..
రాష్ట్రం ఐనా , దేశం ఐనా ... విదేశం ఐనా ...
చట్టానికి ఎవరు చుట్టం కాదు ..
తన పని చట్టం చేసుకుంటది ..#ENDOFTDP pic.twitter.com/qqLE1LaOSM
మరోవైపు ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ NRI మెడికల్ అఫైర్స్ అడ్వయిజర్ డాక్టర్. వాసుదేవరెడ్డి స్పందించారు. 'అమెరికాలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్నారై సత్తారు వెంకటేష్ రెడ్డికి, పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. ఈ ఘటనను వైఎస్సార్సీపీతో పాటు ప్రతి ఒక్క ఎన్నారై తీవ్రంగా ఖండిస్తున్నట్టు ప్రకటించారు. ప్రపంచంలో ఎక్కడ తప్పుడు పనులు తెరపైకి వచ్చినా, అది వైఎస్సార్సీపీకి అంటగట్టేలా చేయడమే టీడీపీతో పాటు కొన్ని ఛానళ్లు పనిగా పెట్టుకున్నాయని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment