
తెనాలి: అమెరికా నార్త్ కెరోలినాలో తుపాను కారణంగా గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ప్రవాస భారతీయ కుటుంబంలో ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. దీంతో తెనాలి అయితానగర్‌లో విషాదం చోటుచేసుకుంది. తెనాలికి చెందిన బిషప్ గడ్డం థామస్ కుమార్తె షారోన్ నథానియేల్‌కు, అమెరికాకు చెందిన నథానియేల్ లివిస్కాతో 2007లో వివాహమైంది.
వారు అమెరికాలోనే ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె. ఆదివారం తెల్లవారుజామున అమెరికాలో సంభవించిన తుపానుకు భారీ వృక్షం కూలి వీరి ఇంటిపై పడింది. ప్రమాదంలో ఇల్లు పాక్షికంగా కూలడంతో బెడ్‌రూమ్‌లో నిద్రిస్తున్న షారోన్ కుమారులు సాధు జోషయ్య(13), జాషువా అషె్వల్(11) ప్రాణాలు విడిచారు. సమాచారం తెలియగానే షారోన్ తల్లి మేరీగ్రేస్, సోదరుడు సాధు థామస్ అమెరికాకు పయనమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment