అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెనాలి హారిక మృతి | Doctor Jetti Harika Dead In USA Road Accident | Sakshi
Sakshi News home page

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెనాలి హారిక మృతి

Jul 21 2024 8:49 PM | Updated on Jul 21 2024 8:49 PM

Doctor Jetti Harika Dead In USA Road Accident

వాషింగ్టన్‌: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన వెటర్నరీ డాక్టర్‌ జెట్టి హారిక(25) అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. దీంతో, ఆమె స్వస్థలం గుంటూరు జిల్లాలో విషాదఛాయలు నెలకొన్నాయి. కుటుంబ సభ్యులు హారిక మృతదేహం కోసం భారత రాయబార కార్యాలయం వద్ద ఎదురుచూపులు చూస్తున్నారు.

వివరాల ప్రకారం.. అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెనాలికి చెందిన వెటర్నరీ డాక్టర్ జెట్టి హారిక మృతి చెందింది. హారిక అమెరికాలోని ఓక్లహోమా స్టేట్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డి మరణించారు. కాగా, హారిక ఏడాదిన్నర క్రితం వెటర్నరీలో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లింది. ఇంతలోనే ఇలా మృతిచెందడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.

ఇక, ఆమె తల్లిదండ్రులు జెట్టి శ్రీనివాసరావు, నాగమణి. జెట్టి శ్రీనివాస్‌ దేవాదాయ శాఖ ఉద్యోగిగా పని చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె మృతదేహాన్ని స్వస్థలానికి తెచ్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కుటుంబసభ్యులు కోరుతున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement