అమెరికాలో మరో విషాదం, తెలుగు విద్యార్థి దుర్మరణం | US Indian student from Andhra Pradesh killed in bike accident in New York | Sakshi
Sakshi News home page

అమెరికాలో మరో విషాదం, తెలుగు విద్యార్థి దుర్మరణం

Published Fri, May 24 2024 11:59 AM | Last Updated on Fri, May 24 2024 12:51 PM

US Indian student from Andhra Pradesh killed in bike accident in New York

ఉన్నత చదువులకోసం అమెరికాకు వెళ్లిన  తెలుగు విద్యార్థులు వరుస మరణాలు ఆందోళన రేపుతున్నాయి. తాజాగా అమెరికాలో మరో తెలుగు విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బెలెం అచ్యుత్ (సన్నీ) బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో  కన్నుమూశాడు.

న్యూయార్క్‌లోని ‘స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్‌’లో చదువుతున్న అచ్చుత్‌ బైక్‌పై వెళ్తుండగా మరో వాహనం వచ్చి ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

 అచ్యుత్ మృతి పట్ల అమెరికాలోని భారత కాన్సులేట్ జనరల్ ఎక్స్ వేదికగా ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించింది.  అతని   మృతదేహాన్నిభారతదేశానికి తిరిగి పంపడం లాంటి ఇతర సహాయాన్ని అందించడానికి వారి కుటుంబ సభ్యులు, స్థానిక ఏజెన్సీలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు  కాన్సులేట్  వెల్లడించింది.

 


కాగా అమెరికాలో  2024లోనే పదకొండు మందికి పైగా విద్యార్థులు మరణించారు . అనేక మంది తీవ్ర దాడులను ఎదుర్కొన్నారు. ఇటీవల జార్జియాలోని అల్ఫారెట్టా నగరంలో జరిగిన ఘోరురోడ్డు కారు ప్రమాదంలో ముగ్గురు భారతీయ సంతతి విద్యార్థులు మరణించిన సంగతి తెలిసిందే.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement