
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువకుడు డల్లాస్‌లో గుండెపోటుతో మరణించాడు. చిన్న వయసులోనే గుండెపోటు మరిణించిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. భవిష్యత్తు కలలతో విదేశాలకు వెళ్లిన కన్న కొడుకు ఆకస్మిక మరణం అతని కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కావూరు గ్రామానికిచెందిన చిలుకూరి శ్రీరాఘవ దొర (24) మరణంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. అమెరికాలో ఎమ్మెస్ పూర్తి చేసుకుని ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడని బంధువులు తెలిపారు. కష్టపడి చదువుకున్నాడని, చాలా మంచి వ్యక్తి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీరాఘవ మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.