vasudeva reddy
-
మేం చెప్పినట్లే చెప్తావా లేదా?
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ రెడ్‌బుక్ రాజ్యాంగ వేధింపులు వెర్రితలలు వేస్తున్నాయి. ఏకంగా సీఐడీ అధికారులనే అధికారిక గూండాలుగా, రిటైర్డ్ ఐపీఎస్ అధికారులను రాజ్యాంగేతర శక్తులుగా మార్చి మరీ ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోంది. ఈ అధికారిక గూండాగిరీ తాజాగా రాష్ట్ర బెవరేజస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిని లక్ష్యంగా చేసుకుంది. ఆయన్ని మూడు రోజులుగా హైదరాబాద్ శివార్లలో అక్రమంగా నిర్బంధించి, వేధించింది. వైఎస్సార్సీపీ కీలక ప్రజాప్రతినిధులకు వ్యతిరేకంగా అబద్ధపు వాంగ్మూలమిచ్చి, సంతకాలు చేయాలని ఆయనపై ఒత్తిడి తెచి్చంది. చంద్రబాబు ప్రభుత్వంలో అరాచక శక్తులుగా రూపాంతరం చెందిన రిటైర్డ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్ తెరవెనుక సూత్రధారిగా, రిటైర్డ్ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్ తెరముందు అరాచక శక్తిగా, సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్, మరికొందరు అధికారులు పాత్రధారులుగా సాగుతున్న ప్రభుత్వ అధికారిక గూండాగిరీ ఇలా ఉంది.. మూడు రోజులపాటు అక్రమ నిర్బంధం రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే బెవరేజస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డిపై అక్రమ కేసు పెట్టింది. దీనిపై ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు కూడా. ఆయన్ని విచారణ పేరుతో సీఐడీ అధికారులు పలుసార్లు వేధించారు. ఆయన నివాసంలో తనిఖీల పేరుతో రాద్ధాంతం చేశారు. అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడ్డారు. ఇందుకు ఆయన అంగీకరించలేదు. తనపై పెట్టిన అక్రమ కేసుపై న్యాయ పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సీఐడీ అధికారులు మూడు రోజులుగా వాసుదేవరెడ్డిని హైదరాబాద్‌లో అక్రమంగా నిర్బంధించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఆయన్ని ఎక్కడకు తీసుకువెళ్లారనే కనీస సమాచారం కూడా కుటుంబ సభ్యులకు తెలియనివ్వలేదు. కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆయన మొబైల్‌కు ఫోన్ చేస్తే స్పీకర్ ఆన్ చేసి మాట్లాడించారు. ఢిల్లీలో ఉన్నానని ఒకసారి, చెన్నైలో ఉన్నానని ఓసారి అబద్ధం చెప్పించారు. ఆయనకు ఎవరు ఫోన్లు చేస్తోంది, వారేం మాట్లాడుతోందీ అన్నీ ఘట్టమనేని శ్రీనివాస్, ఇతర సీఐడీ అధికారులు వింటున్నారు. వైఎస్సార్సీపీ ఎంపీల పేర్లు చెప్పాలని వేధింపులు వాసుదేవరెడ్డిని హైదరాబాద్‌లోని ఓ గుర్తు తెలియని ఫామ్ హౌస్‌లో నిర్బంధించినట్లు సమాచారం. ఏపీ ప్రభుత్వ న్యాయవాదికి చెందిన హైదరాబాద్‌లోని నివాసానికి తీసుకువెళ్లి ఎలా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలో వివరించి, అలాగే చెప్పాలని తీవ్ర ఒత్తిడి తెచ్చారు. ప్రధానంగా వైఎస్సార్సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి పేర్లు చెప్పాలంటూ వేధించారు. తాము చెప్పినట్టు చేస్తే ఢిల్లీలో గుర్తింపు ఉన్న పోస్టింగు ఇప్పిస్తామని ప్రలోభ పెట్టారు. ఇందుకు వాసుదేవరెడ్డి సమ్మతించలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ మద్యం దుకాణాల కోసం లిక్కర్ కొనుగోళ్లలో ఎలాంటి అక్రమాలు జరగలేదని స్పష్టం చేశారు. దాంతో ఆయనపై సీఐడీ అధికారులు విరుచుకుపడ్డారు. ‘వైఎస్సార్సీపీ ఎంపీల పేర్లను ప్రస్తావిస్తూ అబద్ధపు వాంగ్మూలం ఇవ్వకపోతే నీ సంగతి తేలుస్తాం. అసలు నువ్వు ఎక్కడ ఉన్నావో కూడా ఎవరికీ తెలియకుండా చేస్తాం’ అంటూ బెదిరించారు. వాసుదేవరెడ్డి అక్రమ నిర్బంధం, వేధింపుల సమాచారం టీవీ చానళ్లు మంగళవారం సాయంత్రం నుంచి ప్రసారం చేయడంతో సీఐడీ అధికారులు తోక ముడిచారు. ఆయన్ని ప్రస్తుతానికి విడిచిపెట్టినట్టు తెలుస్తోంది. హైకోర్టు, ఎన్హెచ్ఆర్సీలను ఆశ్రయించనున్న కుటుంబ సభ్యులు వాసుదేవరెడ్డి అక్రమ నిర్బంధం, వేధింపులపై హైకోర్టు, జాతీయ మానవ హక్కుల సంఘాన్ని (ఎన్హెచ్ఆర్సీ) ఆశ్రయించాలని ఆయన కుటుంబ సభ్యులు నిర్ణయించారు. రిటైర్డ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్, రిటైర్డ్ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్‌తోపాటు సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్, ఇతర సీఐడీ అధికారులు ఆయన్ని అక్రమంగా నిర్బంధించి వేధించారని కుటుంబ సభ్యులు మంగళవారం తెలిపారు. ఆయన ప్రాణాలకు ముప్పు ఉందని చెప్పారు. అన్ని వివరాలతో ఫిర్యాదు చేస్తామని తెలిపారు. వాసుదేవరెడ్డికి ఏపీ సీఐడీ, రిటైర్డ్ ఐపీఎస్ అధికారుల నుంచి ఎలాంటి హానీ కలగకుండా రక్షణ కల్పించాలని కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. ఏపీ ప్రభుత్వం సీఐడీ అధికారుల ద్వారా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేస్తామన్నారు. ఏదైనా కేసును చట్టపరంగా దర్యాప్తు చేయాలి తప్ప సీఐడీ అధికారులే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని భయభ్రాంతులకు గురి చేయడమేమిటని న్యాయ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. అందులోనూ రిటైర్డ్ పోలీసు ఉన్నతాధికారులను అనధికారిక గూండాలుగా ప్రభుత్వం వాడుకోవడం విభ్రాంతి కలిగిస్తోందని విమర్శిస్తున్నారు. -
తప్పుడు వాంగ్మూలం ఇవ్వకుంటే ఇరికిస్తాం..!
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు, నేతలను అక్రమ కేసులతో వేధించేందుకు సీఎం చంద్రబాబు ప్రభుత్వం మరింత బరి తెగిస్తోంది! అందుకోసం సీఐడీ విభాగాన్ని టీడీపీ అనుబంధ సంస్థగా మార్చే పన్నాగానికి పదును పెట్టింది! వైఎస్సార్సీపీ ఎంపీలు వి.విజయసాయిరెడ్డి, పీవీ మిథున్‌రెడ్డిపై మద్యం అక్రమ కేసులను బనాయించేందుకు కుతంత్రం పన్నుతోంది.ప్రభుత్వ ‘ముఖ్య’ నేత ఆదేశాలతో స్వయంగా సీఐడీ ఉన్నతాధికారి తన వృత్తి ధర్మానికి విరుద్ధంగా అధికారిక దాదాగిరీకి తెగబడుతుండటం విభ్రాంతి కలిగిస్తోంది. ఈ క్రమంలో బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిని తప్పుడు వాంగ్మూలం ఇవ్వాలంటూ తీవ్రస్థాయిలో వేధింపులకు గురి చేస్తుండటం ప్రభుత్వ కుట్రకు తార్కాణం.సాయిరెడ్డి, మిథున్‌రెడ్డి పేర్లు చెబుతావా... లేదా?రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెట్టిన మొదటి అక్రమ కేసు మద్యం కేసే! జూన్ 12న టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగా... వైఎస్సార్సీపీ హయాంలో బెవరేజస్ కార్పొరేషన్ ద్వారా మద్యం అక్రమాలకు పాల్పడ్డారంటూ జూన్ 24న సీఐడీ అక్రమ కేసు నమోదు చేసింది. అప్పటి బెవరేజస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డిని నిందితుడిగా చేర్చగా ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించి బెయిల్ పొందారు.అయితే ఆయనపై మరిన్ని అక్రమ కేసులు పెట్టేందుకు సీఐడీ ఉపక్రమించింది. ఈ నేపథ్యంలో సీఐడీ ఉన్నతాధికారి ఒకరు వాసుదేవరెడ్డికి ఫోన్ చేశారు. తన కింది స్థాయి అధికారి ఫోన్ ద్వారా ఆయనకు కాల్ చేసి బెదిరింపులకు దిగారు. ‘మీకు ఓ కేసులో బెయిల్ వస్తే... మరో కేసు బనాయించి మరీ అరెస్ట్ చేస్తాం...! మీ సంగతి తేలుస్తాం..!’ అని బెదిరించారు. అనంతరం అసలు విషయాన్ని చెప్పేశారు! ‘మీరు ఈ కేసులో అప్రూవర్‌గా మారిపోవాలి.మద్యం వ్యవహారం అంతా ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి చేశారని వాంగ్మూలం ఇవ్వాలి. వాళ్లిద్దరూ చెప్పినట్టే చేశానని 164 సీఆర్పీసీ కింద వాంగ్మూలంలో పేర్కొనాలి..’ అని ఆదేశించారు. అలా కాదంటే లెక్కలేనన్ని కేసులు బనాయించి వేధింపులకు గురి చేస్తామన్నారు. వాస్తవాలతో పని లేదు.. చెప్పినట్లు వాంగ్మూలం ఇవ్వాలి!సీఐడీ ఉన్నతాధికారి వేధింపులతో వాసుదేవరెడ్డి ఓ వాంగ్మూలాన్ని లిఖితపూర్వకంగా ఇచ్చారు. అయితే పారదర్శకంగా వాస్తవ విషయాలను ఆయన తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి పేర్లను అందులో ప్రస్తావించ లేదు. దాంతో సీఐడీ ఉన్నతాధికారి తీవ్ర ఆగ్రహంతో చిందులు తొక్కారు. ‘వాస్తవాలు ఎవరు అడిగారు...? నేను చెప్పినట్టుగా వాంగ్మూలం ఇవ్వాలి. విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డే అంతా చేశారు...! వారిద్దరూ అక్రమాలకు పాల్పడ్డారని వాంగ్మూలం ఇవ్వాలి.అది వాస్తవమా... అవాస్తవమా అన్నది నాకు అనవసరం. నేను చెప్పినట్టుగా వాంగ్మూలం ఇవ్వాలి. లేకపోతే మరిన్ని కేసులు పెట్టి జైలుకు పంపుతాం’ అని బెదిరించారు. అంతేకాదు... వాసుదేవరెడ్డి సతీమణి తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న విషయాన్ని కూడా ప్రస్తావించారు. ‘నేను చెప్పినట్టు తప్పుడు వాంగ్మూలం ఇస్తే... ఆమె చికిత్స వ్యవహారాలను ప్రశాంతంగా పర్యవేక్షించుకోవచ్చు. లేకపోతే ఇబ్బందులు పడతావ్’ అని బెదిరించడం తీవ్ర విస్మయం కలిగిస్తోంది.డీజీపీ పోస్టు ఎర.. అందుకే అంత బరితెగింపా...!వైఎస్సార్సీపీ ఎంపీలను అక్రమ కేసులతో వేధించేందుకు ‘ముఖ్య’ నేత బరితెగించి వ్యవహరిస్తున్నారు. తాను చెప్పినట్టుగా వారిపై అక్రమ కేసులు బనాయిస్తే డీజీపీ పోస్టు ఇస్తానని సీఐడీ ఉన్నతాధికారికి ఎర వేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే డీజీ స్థాయి అధికారులు తదుపరి డీజీపీ పోస్టు కోసం పోటీ పడుతున్నారు. అయితే అంతకంటే ఒక మెట్టు తక్కువ స్థాయిలో ఉన్న సీఐడీ ఉన్నతాధికారికి డీజీపీ పోస్టు ఆశ చూపించడం గమనార్హం.ప్రస్తుత డీజీపీ పదవీ కాలం వచ్చే ఏడాది జనవరితో ముగియనుంది. ఆ పోస్టును ఆశిస్తున్న హరీశ్ కుమార్ గుప్తా కూడా వచ్చే ఏడాది ఆగస్టులో రిటైర్ కానున్నారు. ఈ నేపథ్యంలో తను చెప్పినట్టుగా ఆ ఇద్దరు విపక్ష ఎంపీలను అక్రమ కేసులతో వేధిస్తే డీజీపీ పోస్టు ఇస్తానని సీఐడీ ఉన్నతాధికారికి ‘ముఖ్య’ నేత ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వ పెద్దలను సంతృప్తి పరచడమే లక్ష్యంగా ఆ ఉన్నతాధికారి బరితెగించి అక్రమాలు, వేధింపులకు పాల్పడుతున్నట్లు పోలీసు వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. -
వాసుదేవరెడ్డి కేసులో పూర్తి వివరాలివ్వండి..
సాక్షి, అమరావతి: ఏపీ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్‌బీసీఎల్)కు చెందిన ఫైళ్లు, కంప్యూటర్ పరికరాలు, ఇతర డాక్యుమెంట్లను తరలించారంటూ ఆ సంస్థ మాజీ ఎండీ డి. వాసుదేవరెడ్డిపై నమోదు చేసిన కేసులో పూర్తి వివరాలను తమ ముందుంచాలని సీఐడీని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 18కి వాయిదా వేసింది.అప్పటివరకు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేయాలన్న వాసుదేవరెడ్డి అభ్యర్థనపట్ల హైకోర్టు సానుకూలంగా స్పందించలేదు. మధ్యంతర ముందస్తు బెయిల్‌ను సీఐడీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయాన్ని హైకోర్టు గుర్తుచేసింది. అందువల్ల ఇప్పటికిప్పుడు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యం కాదంటూ విచారణను 18కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ న్యాపతి విజయ్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు.మధ్యంతర ముందస్తు బెయిల్ కోసం పిటిషన్.. ఏపీఎస్‌బీసీఎల్ కార్యాలయం నుంచి ఆ సంస్థకు చెందిన ఫైళ్లు, కంప్యూటర్ పరికరాలు, ఇతర కీలక పత్రాలను వాసుదేవరెడ్డి తీసుకెళ్లారని, ఇవన్నీ ఆయన తన కారులో తరలిస్తుండగా చూశానంటూ కంచికచర్లకు చెందిన గద్దె శివకృష్ణ సీఐడీకి ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా సీఐడీ అధికారులు ఈనెల 6న వాసుదేవరెడ్డిపై కేసు నమోదు చేశారు. ఆధారాల ధ్వంసం, చోరీ, నేరపూరిత కుట్ర తదితర సెక్షన్ల కింద కేసు పెట్టారు. అనంతరం హైదరాబాద్‌లోని ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో వాసుదేవరెడ్డి సీఐడీ తనపై నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.పూర్తి వివరాలు కోర్టు ముందుంచుతాం.. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ విజయ్ విచారణ జరిపారు. ఈ సమయంలో సీనియర్ న్యాయవాది, టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు పోసాని వెంకటేశ్వర్లు స్పందిస్తూ.. ఈ కేసులో తాను సీఐడీ తరఫున హాజరవుతున్నానని తెలిపారు. ఈ కేసు మొదటిసారి విచారణకు వస్తోందని, అందువల్ల వివరాల సమర్పణకు గడువునివ్వాలని కోర్టును కోరారు. ఈ సమయంలో వాసుదేవరెడ్డి తరఫు న్యాయవాది ఎస్. నగే‹Ùరెడ్డి వాదనలు వినిపిస్తూ.. తాము మధ్యంతర ముందస్తు బెయిల్ కోసం అనుబంధ పిటిషన్ దాఖలు చేశామన్నారు. ఈ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన కోర్టును అభ్యర్థించారు.చంద్రబాబుపై ఫిర్యాదు చేసినందుకే కేసు.. నిజానికి.. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే పిటిషనర్‌పై కేసు నమోదు చేశారన్నారు. ప్రస్తుత సీఎం చంద్రబాబుపై పిటిషనర్ వాసుదేవరెడ్డి గతంలో ఫిర్యాదు చేశారని, ఈ కక్షతోనే అతనిపై ఇప్పుడు ఈ కేసు నమోదు చేశారని తెలిపారు. కార్యాలయం నుంచి ఫైళ్లు తీసుకెళ్తున్నట్లు ఫిర్యాదు అందగా, రాత్రి 11.30కి సీఐడీ కేసు నమోదు చేసిందన్నారు. ఆ మరుసటి రోజు 200 మంది పోలీసులు వాసుదేవరెడ్డి, ఆయన బంధువుల ఇళ్లలో సోదాలు చేశారని.. పోలీసులకు ఏమీ దొరకలేదని, ఆయన పిల్లల ల్యాప్‌టాప్‌లను జప్తు చేశారని వివరించారు. పిటిషనర్‌పై ఏడేళ్ల కన్నా తక్కువ శిక్షపడే కేసులే ఉన్నాయని, అందువల్ల ఆయన విషయంలో సీఆర్పీసీ సెక్షన్ 41ఏను అనుసరించి నడుచుకునేలా ఆదేశాలివ్వాలని కోరారు. పోసాని జోక్యం చేసుకుంటూ, పిటిషనర్‌పై మరిన్ని సెక్షన్ల కింద కేసులు పెట్టామన్నారు. ఐపీసీ సెక్షన్లు 409, 467, 471 కింద కూడా కేసు నమోదు చేశామని, ఇవన్నీ ఏడేళ్లు అంతకు మించి శిక్షపడే కేసులేనన్నారు. అందువల్ల 41ఏ ప్రకారం నడుచుకోవడం సాధ్యంకాదన్నారు.ఫిర్యాదులో గుర్తుతెలియని వ్యక్తి అని ఉంది.. నగేష్ రెడ్డి స్పందిస్తూ.. ఫిర్యాదులో ఎక్కడా వాసుదేవరెడ్డి కారు నెంబర్ లేదని, ఎఫ్ఐఆర్లో చేర్చారన్నారు. ఫిర్యాదులో గుర్తు తెలియని వ్యక్తులు అని ఉంటే, ఎఫ్ఐఆర్లో పిటిషనర్ పేరును చేర్చారన్నారు. ఇది పూర్తిగా తప్పుడు కేసన్నారు. సోదాలు జరిగిన రోజు పిటిషనర్ ఢిల్లీలో ఉన్నారన్నారు. పోసాని స్పందిస్తూ.. వాసుదేవరెడ్డి మామ, బావమరిది ఇళ్లలో సోదాలు నిర్వహించామని, వాసుదేవరెడ్డి కారులో కీలక పత్రాలు స్వా«దీనం చేసుకుని సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేశామన్నారు. సోదా చేసిన కారులో రూ.4 కోట్ల విలువచేసే 6 కేజీల బంగారం కొనుగోలు తాలుకు బిల్లులు, వాసుదేవరెడ్డి ఐడీ కార్డు దొరికాయన్నారు. ఈ వివరాలను మేజి్రస్టేట్ ముందుంచామన్నారు. సాక్ష్యాలను తారుమారు చేస్తారు..ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, పూర్తి వివరాల సమర్పణ నిమిత్తం ఈ వ్యాజ్యంలో తదుపరి విచారణను 18కి వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. నగేష్ రెడ్డి జోక్యం చేసుకుంటూ, అప్పటివరకు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ అభ్యరి్థంచారు. లేకుంటే ఈలోపు పిటిషనర్‌ను అరెస్టుచేసే అవకాశం ఉందన్నారు. ఎలాంటి షరతులు విధించినా వాటికి కట్టుబడి ఉంటామన్నారు. కావాలంటే పాస్‌పోర్ట్ స్వా«దీనం చేస్తామన్నారు. అయితే, మధ్యంతర ముందస్తు బెయిల్ అభ్యర్థనను పోసాని తీవ్రంగా వ్యతిరేకించారు. వాసుదేవరెడ్డికి ముందస్తు బెయిల్ ఇస్తే దర్యాప్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని, బేవరేజస్ కార్పొరేషన్లో అతని సహచరులు ఇంకా ఉన్నారని, వారి ద్వారా సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందన్నారు. దీంతో.. మధ్యంతర ముందస్తు బెయిల్‌ను సీఐడీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఈ దశలో ఎలాంటి ఉత్తర్వులు జారీచేయడం సాధ్యంకాదని న్యాయమూర్తి స్పష్టంచేశారు. -
దుష్ప్రచారం చేయడం డాక్టర్ లోకేశ్‌కు అలవాటే..
సాక్షి, అమరావతి: ప్రముఖులపై దుష్ప్రచారం చేయడం డాక్టర్ ఉయ్యూరు లోకేశ్‌కు అలవాటని ప్రముఖ ఎన్ఆర్ఐ డాక్టర్ వాసుదేవరెడ్డి తెలిపారు. ఏపీలో ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని మేధావిగా చలామణి అవుతున్నారని ఎద్దేవా చేశారు. అయితే అమెరికాలో 18 ఏళ్లుగా ఆయన ప్రాక్టీస్‌పై నిషేధం కొనసాగుతోందని తెలిపారు. టీడీపీ సానుభూతిపరుడైన లోకేశ్ ఇటీవల గన్నవరం విమానాశ్రయంలో లండన్‌కు వెళుతున్న సీఎం జగన్‌ను అడ్డుకునేందుకు కుట్ర పన్నారు. ఈ సందర్భంగా అతని గురించి పలు విస్తుపోయే వాస్తవాలను డాక్టర్ వాసుదేవరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. గుంటూరు మెడికల్ కాలేజీలో 1983లో లోకేశ్ గ్రాడ్యుయేట్ అయ్యాడు. గ్యాస్ట్రో విభాగంలో ఎండీ పూర్తిచేసిన ఆయన అమెరికాలోని వర్జీనియాలో తొలుత ప్రాక్టీస్ మొదలెట్టాడు. అప్పటి నుంచే ఎదుటి వ్యక్తులపై అవాస్తవ ఆరోపణలు చేయడం, కోర్టుల్లో తప్పుడు కేసులు ఫైల్ చేయడం లోకేశ్‌కు అలవాటు. ప్రాక్టీస్ ప్రారంభించిన తొలినాళ్లలో ఆస్పత్రి యాజమాన్యంపై, సహచర వైద్యులపై కోర్టులో కేసులు వేసి, ఆ ఆరోపణలను రుజువు చేయడంలో విఫలమయ్యాడు. ఇదే తరహాలో 2022లో భారత ప్రధాని మోదీ, ఏపీ సీఎం వైఎస్ జగన్, అదానీ మీద వాషింగ్టన్ డీసీ కోర్టులో కేసులు ఫైల్ చేశాడు. ఇండియా నుంచి కంటైనర్లలో డబ్బుతో పాటు, ఇజ్రాయిల్ నుంచి స్పైవేర్ కొనుగోలు చేసి అమెరికాకు అక్రమంగా తరలిస్తున్నారంటూ ఆరోపణలు చేశాడు. తప్పుడు ఆరోపణలతో కోర్టు సమయాన్ని వృథా చేస్తున్నావని లోకేశ్‌కు కోర్టు చీవాట్లు పెట్టడంతో పాటు జరిమానా విధించింది. ప్రాక్టీస్‌పైనా నిషేధం వైద్య నిబంధనలకు విరుద్ధంగా రోగులకు చికిత్సలు అందించి పలువురి మరణానికి లోకేశ్ కారకుడయ్యాడు. 2006లో వర్జీనియా బోర్డ్ ఆఫ్ మెడిసిన్ లోకేశ్ మెడికల్ లైసెన్స్‌ను రద్దు చేసింది. అనంతరం న్యూయార్క్, న్యూజెర్సీ వంటి ఇతర ప్రాంతాలకు వెళ్లాడు. ఆయా రాష్ట్రాల్లోనూ లైసెన్స్‌ను రీవోక్ చేశారు. అయితే ఈ వాస్తవాలను కప్పిపుచ్చి అమెరికాలో ప్రముఖ వైద్యుడిగా చలామణి అవుతూ ఏపీ సీఎం జగన్‌పై అవాస్తవ ఆరోపణలకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల ప్రజలు వాస్తవాలను ఓ సారి తెలుసుకోవాలి. మేధావులుగా చలామణి అవుతున్న లోకేశ్ వంటి కులోన్మాదులు సీఎం జగన్‌పై దాడులకు పాల్పడుతున్నారు. -
అమెరికాలో హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు: టీడీపీకి వైఎస్సార్సీపీ స్ట్రాంగ్ కౌంటర్
అమెరికాలో మిస్సోరిలో కొన్ని నెలలుగా ఒక తెలుగు యువకుడిని బంధించి వేధించిన కేసు కలకలం రేపింది. అయితే ఈ కేసులో నిందితులను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో నిందితులపై సత్తారు వెంకటేష్ రెడ్డి (35), శ్రావణ్ వర్మ (23), నిఖిల్ (27)పై విచారణ, చట్టపరమైన చర్యలకు తీసుకునేందుకు అక్కడి అధికారులు సన్నద్ధమయ్యారు. అయితే ఇక్కడే మరోసారి టీడీపీ తన వక్రబుద్ధిని చాటుకుంది. ప్రధాన నిందితుడు వైఎస్సార్సీపీకి చెందిన నాయకుడు అంటూ టీడీపీ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తోంది. ఈ ఆరోపణలను ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్ ఖండించారు. "మన రాష్ట్రం, మనదేశం కానీ ఒక ప్రాంతంలో జరిగిన నేరాన్ని అడ్డం పెట్టుకుని మా పార్టీ, ప్రభుత్వం పై టీడీపీ విమర్శలు చేయడం టీడీపీ దిగజారుడుతానానికి నిదర్శనమన్నారు. మోకాలికి బొడిగుండుకు ముడిపెట్టి లబ్ధిపొందాలన్న ఆలోచనతో టీడీపీ దిగజారి వ్యవహరిస్తోంది. ఈ కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుంది. చట్టాన్ని గౌరవించే పార్టీ వైఎస్సార్సీపీ అని, నిందితులు ఎవరైనా సరే నేరం నిరూపణ అయిన పక్షంలో శిక్షార్హులని" ఆయన వెల్లడించారు. "టీడీపీ కార్యకర్తలు, అభిమానుల్లో నేరప్రవృత్తి ఉన్నవారు తమ వ్యక్తిగత జీవితాల్లో చేసే నేరాలకు టీడీపీ బాధ్యత తీసుకుంటుందా? టీడీపీ నేతలు మహిళలపై చేసే అఘాయిత్యాలకు చంద్రబాబు, లోకేష్ బాధ్యత తీసుకుంటారా? అని రత్నాకర్ సూటిగా ప్రశ్నించారు. అంతేకాదు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వెంకటేష్ సత్తారును అడ్డంపెట్టుకుని ఈ నేరాన్ని వైఎస్సార్సీపీకి ముడిపెట్టాలని, తద్వారా లబ్ధిపొందాలని చూసే టీడీపీ.. ముందుగా ఏపీలో టీడీపీ నేతలు నడిపే కాల్ మనీ సెక్స్ రాకెట్లపై సమాధానం చెప్పాలి. ఎక్కడో విదేశాల్లో జరిగే నేరాలను మాకు ముడిపెట్టడం కాదు.. ఏపీలో టీడీపీ నేతలు చేసే దుర్మార్గాలకు టీడీపీ బాధ్యత వహించాలన్నారు" రత్నాకర్. "కాల్ మనీ దందాలు, సెక్స్ రాకెట్లు నడిపి వేలాది మహిళల జీవితాలను చీకట్లోకి నెట్టిన నీచమైన చరిత్ర టీడీపీ నేతలది. వీరి సెక్స్ రాకెట్ దందా ఏపీ నుండి అమెరికా వరకు విస్తరించింది. గతంలో ఎన్నారై టీడీపీ నేతలు వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డారు. టీడీపీ నేరప్రవృత్తి కలిగిన పార్టీ..అందుకే ఏపీ ప్రజలు టీడీపీని 23 సీట్లకు పరిమితం చేశారు. ఇలాంటి అనైతిక ప్రచారం తో 2024 ఎన్నికల్లో తెదేపా తెలంగాణ లో మాదిరి గానే తుడిచి పెట్టుకు పోతుందని" పేర్కొన్నారు. ఇదే తెదేపా సంస్కారం ? మీరు చేస్తే సంసారం ... ఇంకోళ్ళు చేస్తే .....చారం .. రాష్ట్రం ఐనా , దేశం ఐనా ... విదేశం ఐనా ... చట్టానికి ఎవరు చుట్టం కాదు .. తన పని చట్టం చేసుకుంటది ..#ENDOFTDP pic.twitter.com/qqLE1LaOSM — Kadapa Rathnakar (@KadapaRathnakar) December 1, 2023 మరోవైపు ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ NRI మెడికల్ అఫైర్స్ అడ్వయిజర్ డాక్టర్. వాసుదేవరెడ్డి స్పందించారు. 'అమెరికాలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్నారై సత్తారు వెంకటేష్ రెడ్డికి, పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. ఈ ఘటనను వైఎస్సార్సీపీతో పాటు ప్రతి ఒక్క ఎన్నారై తీవ్రంగా ఖండిస్తున్నట్టు ప్రకటించారు. ప్రపంచంలో ఎక్కడ తప్పుడు పనులు తెరపైకి వచ్చినా, అది వైఎస్సార్సీపీకి అంటగట్టేలా చేయడమే టీడీపీతో పాటు కొన్ని ఛానళ్లు పనిగా పెట్టుకున్నాయని విమర్శించారు. -
ఏపీ మద్యంపై తప్పుడు ప్రచారం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో తయారయ్యే మద్యం బ్రాండ్లను తమిళనాడులో అమ్మకుండా ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ నిషేధించినట్లు సోషల్ మీడియాలో వస్తున్న క్లిప్పింగ్ పూర్తిగా అవాస్తవమని డిస్టిలరీస్ అండ్ బ్రూవరీస్ కమిషనర్, ఎపీఎస్బీసీఎల్ ఎండీ డి.వాసుదేవరెడ్డి తెలిపారు. ఏపీలో తయారయ్యే మద్యం బ్రాండ్లు తమిళనాడు సహా ఏ రాష్ట్రానికీ ఎగుమతి అవడంలేదని శనివారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. తమిళనాడుకి మద్యం ఎగుమతులే జరగనప్పుడు ఆ రాష్ట్రంలో ఏపీ మద్యాన్ని నిషేధించే అవకాశమే ఉండదని తెలిపారు. ప్రభుత్వంపై బురదజల్లే దురుద్దేశంతోనే ఈ క్లిప్పింగ్‌ను వాట్సాప్ గ్రూపుల్లో పెడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. రాష్ట్రంలో తయారవుతున్న ఐఎంఎఫ్ఎల్, బీరు రాష్ట్రంలో మాత్రమే వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని డిస్టిలరీలు, బ్రూవరీల మద్యం ఉత్పత్తిపై ప్రభుత్వ కెమికల్ లేబొరేటరీ ఇచ్చిన రిపోర్టులు పరిశీలించిన తర్వాతే వాటిలో ఐఎంఎఫ్ఎల్ ఉత్పత్తికి అనుమతి ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. చెన్నై ఎస్జీఎస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఇచ్చి న కెమికల్ రిపోర్టు కేవలం వారి శాంపిల్స్‌ను పరీక్షించి ఇచ్చినవేనని, ఐఎస్ 4449 (విస్కీ), ఐఎస్ 4450 (బ్రాందీ)శాంపిల్స్‌ను ఆ సంస్థ పరీక్షించలేదని గతంలోనే తాము స్పష్టం చేసినట్లు తెలిపారు. ఏపీలో తయారయ్యే మద్యంపై జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమన్నారు. -
మద్యం దుకాణాలను ప్రైవేటుపరం చేసే ఉద్దేశమే లేదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మద్యం దుకాణాల నిర్వహణను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని రాష్ట్ర బేవరేజస్ కార్పొరేషన్ స్పష్టం చేసింది. దశలవారీగా మద్యం నియంత్రణకు కట్టుబడే ప్రభుత్వం మద్యం దుకాణాల నిర్వహణను ప్రైవేటు వ్యక్తుల నుంచి తొలగించిన విషయాన్ని గుర్తు చేసింది. ప్రభుత్వ నిర్వహణలో మద్యం దుకాణాలు ఉండటం ద్వారానే దశలవారీ మద్యం నియంత్రణ సాధించగలమన్నది ప్రభుత్వ విధాన నిర్ణయమని పునరుద్ఘాటించింది. రాష్ట్రంలో మద్యం దుకాణాలను తిరిగి ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని ప్రభుత్వం యోచిస్తోందంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో ప్రచురించిన కథనాలు పూర్తిగా అవాస్తవమని బేవరేజస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి శనివారం స్పష్టం చేశారు. సెబీలో నమోదు చేసుకుని నిబంధనల మేరకే బాండ్ల జారీకి బేవరేజస్ కార్పొరేషన్ సన్నద్ధమవుతున్న తరుణంలో సంస్థ ఆర్థిక అస్తిత్వాన్ని దెబ్బతీసేందుకే ఈ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. అలాంటి వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. దశలవారీగా మద్యం నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఆయన వివరించారు. ఆ చర్యలు ఇలా.. ప్రైవేటు వ్యక్తుల నిర్వహణలో ఉంటే అనర్థాలే ► మద్యం దుకాణాలు ప్రైవేటు వ్యక్తుల నిర్వహణలో ఉంటే అనేక అనర్థాలకు దారి తీస్తుంది. నిబంధనలకు విరుద్ధంగా వేళాపాళా లేకుండా మద్యం దుకాణాలను నిర్వహిస్తారు. ఈ విషయాన్ని గుర్తించే ప్రభుత్వం 2019 అక్టోబరు 1 నుంచి మద్యం దుకాణాలను అధీనంలోకి తీసుకుంది. ► మద్యం నియంత్రణ చర్యల్లో భాగంగా అప్పటివరకు ఉన్న 4,380 మద్యం దుకాణాలను 2,934 దుకాణాలకు తగ్గించింది. ► మద్యం దుకాణాలు నిర్వహిస్తున్న రాష్ట్ర బేవరేజస్ కార్పొరేషన్ ఈ ఏడాది సెబీలో నమోదు చేసుకుని డిబెంచర్లు జారీ చేసింది. సెబీ నిబంధనల మేరకు పారదర్శకంగా ఆర్థిక వ్యవహారాలను నిర్వహిస్తోంది. ఆర్థిక నిపుణుల సూచనలతో పూర్తి ఆర్థిక క్రమశిక్షణతో బేవరేజస్ కార్పొరేషన్ లావాదేవీలు నిర్వహిస్తోంది. ► ఇటీవల కొన్ని వర్గాలు, పత్రికలు ప్రభుత్వ పనితీరుపై పనిగట్టుకుని దుష్ప్రచారం సాగిస్తున్నాయి. అందులో భాగంగానే రాష్ట్రంలో విక్రయిస్తున్న మద్యంలో విష పదార్థాల అవశేషాలు ఉన్నాయనే అసత్య ప్రచారాన్ని పదే పదే చేస్తున్నాయి. అందుకోసమే చెన్నైలోని ఎస్జీఎస్ ల్యాబొరేటరీలో కొన్ని తప్పుడు పరీక్షలు చేయించి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నాయి. ► కానీ రాష్ట్రంలో విక్రయిస్తున్న మద్యంలో ప్రమాదకర అవశేషాలు ఉన్నట్టు తాము నివేదిక ఇవ్వలేదని ఎస్జీఎస్ ల్యాబొరేటరీ స్పష్టం చేసింది. కేవలం బేవరేజస్ కార్పొరేషన్ బాండ్లు జారీ చేస్తున్న తరుణంలో ఆర్థిక అస్తిత్వాన్ని దెబ్బతీసేందుకే ఈ విధమైన దుష్ప్రచారం చేస్తున్నారు. ► అదే రీతిలో ప్రభుత్వం మద్యం దుకాణాల నిర్వహణను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించనుందని తాజాగా అసత్య ప్రచారాన్ని తెరపైకి తెచ్చి తప్పుడు ఊహాగానాలను వ్యాప్తిలోకి తెచ్చారు. ఇది శోచనీయం. -
ఏపీ వైద్య ఆరోగ్యశాఖ సలహాదారుడిగా డా. వాసుదేవరెడ్డి
సాక్షి, అమరావతి: అమెరికాలో ప్రముఖ వైద్యులు డాక్టర్. వాసుదేవరెడ్డి ఆర్. నలిపిరెడ్డిని వైద్య ఆరోగ్య శాఖ సలహాదారుగా ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ నియమించింది. ఎన్.ఆర్.ఐ మెడికల్ అఫైర్స్ అడ్వయిజర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ వైద్య సేవలు మరింత మెరుగుదలకు, అలాగే చిన్న పిల్లల జబ్బుల నివారణకు డాక్టర్ వాసుదేవరెడ్డి కృషి చేయనున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి జీత భత్యాలు ఆశించకుండా పనిచేసేందుకు ఆయన ముందుకు రావడం విశేషం. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్‌కు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే దివంగత వైఎస్సార్ ఆశయాలను సాధించటమే లక్ష్యంగా, ఎన్ఆర్ఐలను సమీకృతం చేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రవేశ పెట్టిన ఫ్యామిలీ డాక్టర్, విలేజ్ క్లినిక్స్‌ను మరింత పటిష్టం చేసేందుకు కృషి చేస్తానని డాక్టర్ వాసుదేవరెడ్డి వెల్లడించారు. అమెరికాలో పెద్ద సంఖ్యలో ఉన్న తెలుగు డాక్టర్లను సమస్వయం చేసి తమ సొంత గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలు అందించేలా పాటు పాడుతా నన్నారు. అమెరికాలో అమలవుతున్న అత్యంత అధునాతన వైద్య సేవలు, టెలీ మెడిసిన్ రంగం ఏపీకి చేరువయ్యేలా పనిచేస్తామని, అలాగే వైద్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడుల సేకరణ, నిధుల సమీకరణకు కృషి చేస్తానని వాసుదేవరెడ్డి తెలిపారు. కాగా చిత్తూరు జిల్లా వెదురు కుప్పం మండలం బుచ్చిరెడ్డి కండ్రిగ వాసుదేవరెడ్డి స్వస్థలం. విజయవాడ సిద్దార్థ మెడికల్ కాలేజీ ఎంబిబీఎస్ పూర్తి చేసిన ఆయన అసంతరం అమెరికా వెళ్లి మెల్ బోర్న్ (ఫ్లోరిడా ఆయన సేవలు అందిస్తున్నారు. -
TNR కుటుంబానికి 10 లక్షల రూపాయలందించిన 'ఐ డ్రీమ్' సంస్థ
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ యాంకర్, నటుడు టీఎన్ఆర్ కుటుంబానికి ఐడ్రీమ్ మీడియా అండగా నిలిచింది. స్వయంగా ఆ సంస్థ ఛైర్మన్ చిన్న వాసుదేవ రెడ్డి టీఎన్ఆర్ ఇంటికి వెళ్లి 10 లక్షల రూపాయల చెక్కును అందించారు. అంతేకాకుండా టీఎన్ఆర్ పిల్లల చదువుకు సంబంధించి పూర్తి బాధ్యతలు తానే తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం టీఎన్ఆర్ పిల్లలతో పాటు మరికొంత మంది కుటుంబ సభ్యులకు సైతం కరోనా సోకిందని, అదృష్టవశాత్తు వారిలో ఎవరికి సీరియస్‌గా లేదని చెప్పారు. అపోలో హాస్పిటల్స్ నుంచి ప్రముఖ వైద్యులు ఒకరు టీఎన్ఆర్ కుటుంబానికి వైద్యం అందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు తన ఫేస్బుక్ ఖాతా ద్వారా సుధీర్ఘ పోస్టును విడుదల చేశారు. 'టీఎన్ఆర్ కేవలం ఐ డ్రీమ్ సంస్థకు ఉద్యోగి మాత్రమే కాదు. వ్యక్తిగతంగా నాకు సన్నిహితుడు, స్నేహితుడు. సంస్థ ఎదుగుదలకు ఎన్నో సూచనలు ఇచ్చాడు. అలాంటి వ్యక్తి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉండటం నా బాధ్యత. వాళ్ళ పిల్లల భవిష్యత్తు, జ్యోతి గారికి కావాల్సిన నైతిక, ఆర్థిక మద్దతు అందజేసే విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదు. వ్యక్తిగా TNR మనమధ్య లేకపోయినా ఆయన విడిచి వెళ్లిన జ్ఞాపకాలు, చేసిన కళాసేవ ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి' అని ఎమోషనల్ పోస్టును షేర్ చేశారు. ఇక టీఎన్ఆర్ ఇటీవలె కరోనా కారణంగా కన్నుమూసిన సంగతి తెలిసిందే. 'ఫ్రాంక్లీ విత్ టీఎన్ఆర్' అనే షోతో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న టీఎన్ఆర్కు ఇటీవలె కరోనా సోకింది. మొదట హోం ఐసోలేషన్‌లో ఉన్న టీఎన్ఆర్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో కుటుంబసభ్యులు ఆయన్ను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అయితే చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. చదవండి : TNR కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన డైరెక్టర్ మారుతి TNR కుటుంబానికి చిరంజీవి, సంపూర్ణేష్ బాబు ఆర్థిక సహాయం -
విషమంగా వాసుదేవరెడ్డి ఆరోగ్యం
చిత్తూరు: పదోతరగతి విద్యార్థి వాసుదేవరెడ్డి ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని వైద్యులు వెల్లడించారు. చిత్తూరు జిల్లా కాలూరు నారాయణ స్కూల్ విద్యార్థి వాసుదేవరెడ్డి సోమవారం ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. పదిరోజుల క్రితం అదే స్కూల్లో పదో తరగతి విద్యార్థి సాయిచరణ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నారాయణ స్కూళ్లలో వరుస సంఘటనలపై విద్యార్థి, ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నారాయణ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు. -
కాడెద్దులైన రైతన్నలు
తొండూరు : తమ పొలంలోని కలుపు తీసేందుకు ఆ రైతులు కాడెద్దులుగా మారారు. మండలంలోని ఇనగలూరు గ్రామానికి చెందిన వాసుదేవరెడ్డి తన పొలంలో పొద్దుతిరుగుడుతో పాటు జొన్న, మినుము సాగు చేశాడు. పంటతో పాటు కలుపు కూడా పెరుగుతూ వచ్చింది. కలుపు నివారణకు ఎద్దులతో మెట్లను దున్నుతారు. ట్రాక్టర్లు రావడంతో వ్యవసాయ పనులకు ఎద్దులు దొరకుండా పోయాయి. దీంతో పంటను కాపాడుకునేందుకు తండ్రితో పాటు మరో వ్యక్తిని కలుపుకుని వాసుదేవరెడ్డి కాడెద్దులుగా మారారు.