పదోతరగతి విద్యార్థి వాసుదేవరెడ్డి ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని వైద్యులు వెల్లడించారు
చిత్తూరు: పదోతరగతి విద్యార్థి వాసుదేవరెడ్డి ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని వైద్యులు వెల్లడించారు. చిత్తూరు జిల్లా కాలూరు నారాయణ స్కూల్ విద్యార్థి వాసుదేవరెడ్డి సోమవారం ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే.
పదిరోజుల క్రితం అదే స్కూల్‌లో పదో తరగతి విద్యార్థి సాయిచరణ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నారాయణ స్కూళ్లలో వరుస సంఘటనలపై విద్యార్థి, ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నారాయణ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు.