
సాక్షి, విజయవాడ : ఇటలీ నుంచి వచ్చి ఛత్తీస్‌గఢ్ బార్డర్‌లో ఆగిపోయిన 33 మంది తెలుగు విద్యార్థులు ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టేందుకు లైన్ క్లియర్ అయింది. ఆ విద్యార్థులను క్షేమంగా ఏపీకి రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు సఫలీకృతం అయ్యాయి. విరాల్లోకి వెళితే.. ఇటలీ నుంచి వచ్చిన తెలుగు విద్యార్థులు ఛత్తీస్‌గఢ్ బార్డర్‌లో చిక్కుకుపోయారు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వ ఫ్రధాన కార్యదర్శి నీలం సాహ్ని వారిని రాష్ట్రానికి క్షేమంగా తీసుకు వచ్చేందుకు చొరవ చూపించారు. డీజీపీ గౌతమ్ సవాంగ్, ఐఏఎస్ అధికారి కృష్ణబాబులు రంగంలోకి దిగి రాయపూర్, జగదల్‌పూర్ మీదుగా సోమవారం విశాఖకు చేరే విధంగా ఏర్పాట్లు చేశారు. తెలుగు విద్యార్థులను ఏపీకి తీసుకు వచ్చేందుకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపించారు.
Comments
Please login to add a commentAdd a comment