సాక్షి, అమరావతి: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థుల తరలింపు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఈ చర్యల్లో భాగంగా బుధవారం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోలండ్, హంగేరీలకు ఏపీ ప్రతినిధులను పంపాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు విద్యార్థుల వివరాలను విదేశాంగశాఖకు ఏపీ ప్రభుత్వం అందించింది.
ఆపరేషన్ గంగ
గత ఏడు రోజులుగా ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడి కొనసాగుతూనే ఉంది. హోరాహోరి పోరులో రెండు దేశాల సైన్యం శక్తి వంచన లేకుండా పోరాడుతున్నాయి. యుద్ధం రోజురోజుకు తీవ్రమవుతున్న దశలో భారత ప్రభుత్వం ఆపరేషన్ గంగ ప్రాజెక్టు ద్వారా భారతీయ విద్యార్థులను త్వరితగతిన స్వదేశానికి తరలించడానికి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా రష్యా దాడుల్లో భారతీయ విద్యార్థి.. కర్ణాటక రాష్ట్రం హవేరి జిల్లాకు చెందిన నవీణ్ శేఖరప్ప ఉక్రెయిన్‌లోని ఖర్కీవ్‌లో మంగళవారం ఉదయం చనిపోయారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సహాయ చర్యలను వేగవంతం చేసింది.
(చదవండి: Ukraine War: ఉక్రెయిన్ పిల్లలే మిమ్మల్ని రక్షిస్తున్నారు!’ )
Comments
Please login to add a commentAdd a comment