Hungary
-
లెబనాన్ పేజర్ల పేలుళ్లలో కేరళ టెక్కీ ప్రమేయం?
హెజ్బొల్లా లక్ష్యంగా జరిగిన పేజర్ల పేలుళ్ల కేసులో.. కేరళకు చెందిన ఓ టెక్కీని బల్గేరియా భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. నార్వేలో స్థిరపడిన అతనికి.. బల్గేరియాలో ఓ కంపెనీ ఉంది. అక్కడి నుంచే పేజర్ల సప్లై జరిగిందని, పేలుడు పదార్థాలను ఇక్కడే అమర్చి ఉంటారన్న అనుమానాల నడుమ మూడు రోజులపాటు అతన్ని విచారించారు. వయనాడ్‌కు చెందిన రిన్సన్ జోస్(37).. నార్వేలో స్థిరపడ్డాడు. రెండేళ్ల కిందట బల్గేరియాలో నోర్టా గ్లోబల్ లిమిటెడ్ అనే కన్సల్టెన్సీ కంపెనీ ఏర్పాటు చేశాడు. అయితే.. హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూప్ సభ్యులకు ఇతని కంపెనీ నుంచే పేజర్లు వెళ్లాయని తొలుత అధికారులు అనుమానించారు. ఈ అనుమానాలకు అతని కదలికలు కూడా మరింత బలం చేకూర్చాయి. దీంతో.. బల్గేరియా దర్యాప్తు సంస్థ డీఏఎన్ఎస్, ఆ దేశ విదేశాంగ సహకారంతో జోస్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరిపింది. చివరకు.. పేలుళ్లకు సంబంధించిన పేజర్లకు, ఇతని కంపెనీకి ఎలాంటి సంబంధం లేదని గుర్తించారు. అంతేకాదు.. లెబనాన్ పేలుళ్లలోని పేజర్లు అసలు బల్గేరియా నుంచే వెళ్లలేదని ప్రకటించారు.‘‘లెబనాన్ పేజర్ల పేలుళ్లకు నోర్టా గ్లోబల్ లిమిటెడ్‌తో ఎలాంటి సంబంధం లేదు. ఈ కంపెనీ యాజమానితో పేజర్లకు సంబంధించి లావాదేవీలు(ట్రాన్జాక్షన్స్) జరిగాయన్న వాదనలోనూ నిజం లేదు’’ అని డీఏఎన్ఎస్ ప్రకటించింది. మరోవైపు ఓస్లో(నార్వే) పోలీసులు సైతం ప్రాథమిక విచారణలో జోస్‌కు ఎలాంటి సంబంధం లేదని తేల్చాయి.ఇదీ చదవండి: పేరు వేరే అయినా.. పేజర్ వీళ్లదేసెప్టెంబర్ 17వ తేదీన లెబనాన్‌లో జరిగిన పేజర్ల పేలుళ్లలో 12 మంది మరణించగా.. వేల మంది గాయపడ్డారు. ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్ ఈ పేలుళ్లకు పాల్పడి ఉంటుందని, పేజర్లలో పేలుడు పదార్థాలను అమర్చి ఉంటుందని లెబనాన్ అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ క్రమంలో..తైవాన్‌కు చెందిన పేజర్ల కంపెనీ గోల్డ్ అపోలో పైనా అనుమానాలు వ్యక్తం చేసింది. అయితే.. పేలుడుకు గురైన ఏఆర్-924 పేజర్లకు తమకు సంబంధం లేదని తైవాన్ కంపెనీ స్పష్టం చేసింది. హంగేరీ బుడాపెస్ట్‌కు చెందిన ఓ కంపెనీ దగ్గర వాటి తయారీ ట్రేడ్ మార్క్ ఉందని తేలింది. అయినప్పటికీ నార్వే, బల్గేరియా వైపే దర్యాప్తు అధికారుల దృష్టి మళ్లింది. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లిన రిన్సన్ జోస్.. కొంతకాలం లండన్‌లోనూ పని చేశాడు. ఆపై సొంతంగా కంపెనీ ఏర్పాటు చేసుకున్నాడు. అతని భార్య కూడా ఓస్లోలోనే ఉంది. తాజా పరిణామాలతో కేరళలోని జోస్ కుటుంబం ఆందోళనకు గురైంది. అతన్ని ఇరికించే కుట్ర జరిగిందని ఆరోపణలు చేసింది. మూడు రోజులపాటు అధికారులు అతన్ని కనీసం ఫోన్లో మాట్లాడేందుకు కూడా అనుమతించలేదని భార్య మీడియా వద్ద వాపోయింది. అయితే లెబనాన్ పేలుళ్ల కేసు నుంచి క్లీన్చిట్ ఇచ్చినప్పటికీ అతన్ని ఇంకా అధికారులు విడుదల చేయలేదని సమాచారం. -
పేరు వేరే అయినా.. పేజర్ వీళ్లదే
లెబనాన్‌లో వేలాది పేజర్లు ఒకే సమయంలో పేలి వేలాది మందిని గాయపరిచి, కొందరి ప్రాణాలు తీసిన ఘటనలో కొత్త విషయాలు బయటికొస్తున్నాయి. పేలిన పేజర్లను హంగేరీలోని ఒక సంస్థకు హెజ్బొల్లా, లెబనాన్ సైన్యం ఆర్డర్ ఇవ్వగా వాటిలో స్వల్ప పరిమాణంలో పేలుడు పదార్థాన్ని అమర్చి సరఫరా చేశారని గత రెండ్రోజులుగా వార్తలొచ్చాయి. అయితే వాస్తవానికి ఆ పేజర్లను తయారుచేసిన సంస్థ ఇజ్రాయెల్‌కు చెందిన డొల్ల కంపెనీ అని అంతర్జాతీయ మీడియా కోడై కూస్తోంది. హంగేరీలో పేరులో ‘బీఏసీ’ అక్షరాలుండే కంపెనీలు కుప్పలుతెప్పలుగా ఉన్నాయి. వీటి పోలికలతో ‘బీఏసీ కన్సల్టింగ్ కేఎఫ్టీ’ పేరిట ఒక నకిలీ కంపెనీని ఇజ్రాయెల్ స్థాపించింది. పేజర్లను అది తయారుచేస్తుంది. హెజ్బొల్లా సభ్యులకు పేలుడు పదార్థమున్న పేజర్లను సరఫరా చేసి వారిని అంతంచేయడమే ఈ కంపెనీ లక్ష్యం. ఇందుకోసం ముగ్గురు ఇజ్రాయెల్ నిఘా విభాగ అధికారులు ప్రత్యేకంగా పనిచేశారని తెలుస్తోంది. లెబనాన్ నుంచి పేజర్ల సరఫరా కాంట్రాక్ట్ సంపాదించేందుకు ఇజ్రాయెల్ చాన్నాళ్ల క్రితమే మూడు డొల్ల కంపెనీలను ఏర్పాటుచేసిందని న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. ఈ మూడు కంపెనీల్లో ఒకటైన బీఏసీ కన్సల్టింగ్ కేఎఫ్టీ హంగేరీలోని బుడాపెస్ట్ కేంద్రంగా పనిచేస్తోంది. ఈ సంస్థకు, ఇజ్రాయెల్‌కు సంబంధం ఉంటుందని హెజ్బొల్లా అస్సలు ఊహించలేదు. ఎలాంటి అనుమానం రాకపోవడంతో బీఏసీ కన్సల్టింగ్ సంస్థకే హెజ్బొల్లా పేజర్ల సరఫరా ఆర్డర్ ఇచ్చిందని ఇరాన్‌లోని మెహర్ న్యూస్ఏజెన్సీ వివరించింది. బీఏసీ కన్సల్టింగ్ గత మూడేళ్లుగా తైవాన్‌కు చెందిన గోల్డ్ అపోలో బ్రాండ్‌తో పేజర్లు తయారుచేసి విక్రయిస్తోంది. దీంతో హెజ్బొల్లా నుంచి చాలా సులువుగా బీఏసీ సంస్థ ఆర్డర్ సాధించగల్గిందని మెహర్ తన కథనంలో పేర్కొంది. అందుకే యూరప్ దేశానికి చెందిన పేజర్లు పేలితే తనకేం సంబంధం అన్నట్లు ఇజ్రాయెల్ ఇంతవరకు ఎలాంటి వివరణ ఇవ్వలేదని తెలుస్తోంది. అయితే ఈ విషయమై బీఏసీ కన్సల్టింగ్ వాదన మరోలా ఉండటం విశేషం. ‘‘ పేజర్ల తయారీలో మాకు ఎలాంటి సంబంధం లేదు. మేం కేవలం వాటిని రవాణా చేశాం’’ అని బీఏసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారిణి క్రిస్టినా బార్సోనీ అర్సిడియాకోనో స్పష్టంచేశారు. పేలిన పేజర్లను మాత్రమేగాక సాధారణ పౌరుల కోసం కూడా వేలాది పేజర్లను ఈ సంస్థ తయారుచేసినట్లు సమాచారం. ఈ సాధారణ పేజర్లు ఏవీకూడా పేలినట్లు వార్తలు రాలేదు. హెజ్బొల్లా సభ్యులు వాడిన, పేలిన పేజర్లు 2022 ఏడాది అర్ధభాగంలో తయారుచేసి ఉంటారని తెలుస్తోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ముగ్గురు పిల్లలను కంటే రుణమాఫీ..! ఎక్కడంటే..
జీవితాంతం ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు.. పెద్ద కారు కొనుక్కుంటే సబ్సిడీ కూడా ఇస్తారు. ప్రభుత్వమే క్రెచ్‌లు ఏర్పాటుచేసి మీ పిల్లల్ని సాకుతుంది.. ఏంటీ ఆఫర్ల సునామీ అంటారా..? ఉన్నాయ్ ఇంకా చాలా ఉన్నాయి. కానీ ఇవన్నీ రావాలంటే ఓ పని చేయాలి. అదేంపని.. ఎక్కడో అనుకుంటున్నారా అయితే ఈ ఆసక్తికరమైన వ్యవహారంపై ఓ లుక్కేయండి.ఓవైపు ప్రపంచ జనాభా రోజురోజుకీ పెరుగుతుంటే.. కొన్ని దేశాలు మాత్రం జననరేటు క్షీణతతో ఇబ్బందులు పడుతున్నాయి. ఆర్థిక, వృత్తిపరమైన సవాళ్లతో అక్కడి యువత పెళ్లిళ్లపై ఆసక్తి చూపించడం లేదు. చైనా, జపాన్, సౌత్ కొరియా వంటి ఆసియన్ కంట్రీస్ ఈ లిస్ట్‌లో ఉన్నాయి. అటు యూరప్ దేశాల్లోనూ ఇదే పరిస్థితి. భవిష్యత్ తరం తగ్గిపోతోంది. వలసలపై ఆధారపడాల్సి వస్తోంది.ఐరోపా దేశం హంగేరీ కూడా ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటోంది. దీంతో జనాభా పెంచుకునేందుకు బంపర్ ఆఫర్లు ప్రకటించింది ఆ దేశ ప్రభుత్వం. ఎక్కువమంది సంతానం ఉన్నవారు జీవితాంతం ఆదాయపు పన్ను కట్టాల్సిన అవసరం లేదని స్వయంగా ప్రకటించారు హంగేరీ ప్రధాని విక్టోర్ అర్బన్. కనీసం నలుగురు లేదా అంతకంటే ఎక్కువమందిని కనే మహిళలకు జీవితకాలం ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మినహాయింపు కల్పిస్తామని తెలిపింది హంగేరీ సర్కార్. పెద్ద కుటుంబాలు పెద్ద పెద్ద కార్లు కొనుక్కోడానికి.. సబ్సిడీని కూడా ఇస్తామని ప్రకటించి సంచలనం రేపింది. ప్రకటించింది. అంతేగాక, పిల్లల పెంపకం కోసం దేశవ్యాప్తంగా 21వేల క్రెచ్‌లను ప్రారంభించినట్టు తెలిపింది. ఇలాంటి మినహాయింపులతో పెళ్లిళ్లు, కుటుంబ వ్యవస్థను ప్రోత్సహించినట్లవుతుందని అభిప్రాయపడుతోంది హంగేరీ ప్రభుత్వం. ప్రస్తుతం హంగేరీ జనాభా దాదాపు 97 లక్షలు. కనీసం కోటి మంది కూడా లేని దేశం అన్నమాట. హంగేరీలో జనాభా సమస్య కొత్తేమీ కాదు. 1980 నుంచి అక్కడ జననాల రేటు తగ్గుతూ వస్తోంది.2000 సంవత్సరం నుంచి గణనీయంగా పడిపోయింది. దీంతో పెళ్లిళ్లు, జననాల రేటును పెంచేందుకు.. 2019లో ఓ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది అక్కడి ప్రభుత్వం. 41 ఏళ్లు రాకముందే పెళ్లి చేసుకునే అమ్మాయిలకు 10 మిలియన్ ఫోరింట్స్ అంటే 33వేల అమెరికన్ డాలర్ల రుణ సదుపాయం కల్పించింది. పెళ్లయిన తర్వాత ఆ మహిళ ఇద్దరు పిల్లలకు జన్మనిస్తే, ఈ లోన్‌లో మూడోవంతును రద్దవుతుంది. ఒకవేళ ముగ్గురు అంతకంటే ఎక్కువ సంతానం కలిగితే.. మొత్తం రుణాన్ని మాఫీ చేస్తామని ఆఫర్ ఇచ్చింది.విక్టోర్ అర్బన్ 2010 నుంచి హంగేరీ ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు. వరుసగా ఐదోసారి ప్రధాని పదవి చేపట్టిన అర్బన్. వలస విధానంలో చాలా స్ట్రిక్ట్. ఇమ్మిగ్రెంట్స్ పెరిగిపోతే, హంగేరీ అస్థిత్వమే ప్రశ్నార్థకంగా మారుతుందని భావిస్తారు. అందుకే వలసదారుల విషయంలో జీరో టోలరెన్స్ విధానం అమలుచేస్తూ.. వివాదాస్పదంగా మారారు. వలసదారులు, నేటీవ్ హంగేరియన్స్కు పుట్టిన సంతానాన్ని మిక్స్డ్ పాపులేషన్‌గా అభివర్ణించి.. వ్యతిరేకత మూటగట్టుకున్నారు. అయినప్పటికీ హంగేరీ కోసం కఠినంగా ఉండేందుకు వెనుకాడను అంటారు విక్టోర్ అర్బన్.వలసలపై ఆధారపడాల్సిన పరిస్థితిని తగ్గించుకునేందుకు..హంగేరీ మహిళలు ఎక్కువమంది పిల్లల్ని కనేలా ప్రోత్సహకాలు ప్రకటిస్తున్నారు. జీడీపీలో 4 శాతం కుటుంబాల కోసమే ఖర్చు చేస్తోంది హంగేరీ ప్రభుత్వం. కొత్తగా పెళ్లైన జంటకు 24 నెలలపాటు నెలకు 5000వేల హంగేరియన్ ఫోరింట్స్ చెల్లిస్తోంది. వేతనాల్లో ప్రత్యేకంగా ఫ్యామిలీ అలవెన్సులు ఉంటాయి. పిల్లల సంఖ్య ఆధారంగా కొత్తగా ఇల్లు కట్టుకునే లేదా కొనుక్కునేవారికి సబ్సీడీలు అందిస్తోంది హంగేరీ ప్రభుత్వం. ఇన్ని ఆఫర్లు అమలుచేస్తున్నా.. 2010-2018 మధ్య హంగేరీలో ఫెర్టిలిటీ రేటు 0.30 శాతమే పెరిగింది. అందుకే మరిన్ని బంపర్ ఆఫర్లతో ముందుకొచ్చింది హంగేరీ ప్రభుత్వం. మరి ఇవి ఎంతవరకూ వర్కౌట్ అవుతాయే చూడాలి మరి. -
హంగేరి అధ్యక్షురాలి రాజీనామా
హంగేరి అధ్యక్షురాలు కాటలిన్ నోవాక్ తన అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేస్తున్నట్లు శనివారం ప్రకటించారు. ఓ చిల్డ్రన్స్ హోమ్‌లోని చిన్న పిల్లలపై లైగింక వేధింపులకు పాల్పడిన కేసులో దోషిగా నిర్ధారించబడిన వ్యక్తికి క్షమాభిక్ష పెట్టడంపై తీసుకున్న నిర్ణయంపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం అయింది. దోషి విషయంలో అధ్యక్షురాలు తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో ఖండిస్తూ.. నిరసన వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో అధ్యక్షురాలు కాటలిన్ నోవాక్ రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. శనివారం ఆమె స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను తప్పు చేశాను. అందుకే ఇదే అధ్యక్షురాలిగా ఇదే నా చివరి ప్రసగం. అధ్యక్షురాలి పదవికి నేను రాజీనామా చేస్తున్నా. బాధితులకు నేను సహకరించనందుకు క్షమాపణలు. నేను చిన్న పిల్లలు, వారి కుటుంబాలకు రక్షణకు కట్టుబడి ఉంటా’ అని ఆమె వెల్లడించారు. లైంగిక వేధింపుల కేసులో దోషిపై తీసుకున్న నిర్ణయంతో ప్రతిపక్షాలు, నిరసనకారుల శుక్రవారం అధ్యక్షురాలి నివాసం ముందు భారీగా చేరుకొని నిరసనలు తెలిపారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు ఆమెపై ఒత్తిడి పెంచారు. దీంతో ఆమె రాజీనామా ప్రకటించినట్లు సమాచారం. ఇక .. అధ్యక్షురాలి రాజీనామాపై మాజీ న్యాయ మంత్రి జుడిట్ వర్గా స్పందిస్తూ.. కాటలిన్ నోవాక్ ప్రజా జీవితం నుంచి తప్పుకుంటున్నారని ప్రకటించారు. 2022లో కటాలిన్ నోవాక్ హంగేరి దేశానికి తొలి అధ్యక్షురాలిగా ఎన్నికై సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. చిల్డ్రన్స్ హోమ్ మాజీ డిప్యూటీ డైరెక్టర్‌కు క్షమాభిక్ష పెట్టడం వివాదం రేపింది. పిల్లలపై చిల్డ్రన్స్ హోమ్.. యజమాని లైంగిక వేధింపులను కప్పిపుచ్చడానికి దోషి సహాయం చేశాడని తెలుస్తోంది. దోషికి క్షమాభిక్ష నిర్ణయాన్ని గతేడాది ఏప్రిల్‌లో తీసుకున్నప్పటికీ.. గతవారం ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఒక్కసారిగా ప్రతిపక్షాలు కటాలిన్ నోవాక్ తన అధ్యక్షురాలి పదవికి రాజానామా చేయాలని డిమాండ్ చేశారు. చదవండి: పాక్‌లో సంకీర్ణం..! -
వెదురు నుంచి జీవ ఇంధనాలు!
ఆధునిక యుగంలో ప్రపంచవ్యాప్తంగా శిలాజ ఇంధనాల వినియోగం నానాటికీ పెరిగిపోతోంది. సరైన ప్రత్యామ్నాయ ఇంధనాలు విరివిగా అందుబాటులో లేకపోవడంతో పెట్రోల్, డీజిల్, బొగ్గు వంటి వాటిపై అనివార్యంగా ఆధారపడాల్సి వస్తోంది. వీటివల్ల వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయని, పర్యావరణానికి, భూగోళంపై మానవళి మనుగడకు ముప్పు ఏర్పడుతోందని తెలిసినప్పటికీ మరో దారిలేక ప్రమాదకరమైన ఇంధనాలపైనే అధికంగా ఆధారపడాల్సి వస్తోంది. మరోవైపు పునరుత్పాదక ఇంధనాలపై పరిశోధనలు జరుగుతున్నాయి. సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి ఆశించిన స్థాయిలో ఊపందుకోవడం లేదు. జల విద్యుత్ ఉత్పత్తికి కొన్ని పరిమితులున్నాయి. ఇలాంటి తరుణంలో హంగేరీలోని ‘హంగేరియన్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ లైఫ్ సైన్సెస్’ పరిశోధకులు తీపి కబురు అందించారు. అడవుల్లో సహజసిద్ధంగా, విస్తృతంగా పెరిగే వెదురు(బ్యాంబూ)తో బయో ఇథనాల్, బయో గ్యాస్ వంటి జీవ ఇంధన ఉత్పత్తులు తయారు చేయవచ్చని తమ అధ్యయనంలో తేల్చారు. సమీప భవిష్యత్తులో పునరుత్పాదక ఇంధన రంగంలో వెదురు ఒక విప్లవమే సృష్టించబోతోందని చెబుతున్నారు. శిలాజ ఇంధనాలకు కాలుష్యానికి తావులేని ఇలాంటి ఇంధనాలే సరైన ప్రత్యామ్నాయం అవుతాయని అంటున్నారు. ఈ అధ్యయనం వివరాలను ‘జీసీబీ బయో ఎనర్జీ’ జర్నల్‌లో ప్రచురించారు. ► ఇతర చెట్లతో పోలిస్తే వెదురు చాలా వేగంగా పెరుగుతుంది. ఇదొక విలువైన సహజ వనరు. కాలుష్యాన్ని కట్టడి చేసే విషయంలో వెదురును ‘సూపర్ స్పాంజ్’గా పరిగణిస్తుంటారు. కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకుంటుంది. వాతావరణంలోకి ప్రాణవాయువు(ఆక్సిజన్) ను అధికంగా విడుదల చేస్తుంది. ► ప్రమాదకరమైన గ్రీన్హౌస్ వాయువుల ఉద్గారాన్ని అరికట్టడంలో వెదురు పాత్ర చాలా కీలకం. భూమిపై వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది. ► ప్రకృతిలో వెదురు ప్రాధాన్యతను గుర్తించిన పరిశోధకులు దాని నుంచి పునరుత్పాదక ఇంధనాల తయారీపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ► కిణ్వ ప్రక్రియ(ఫెర్మెంటేషన్), అధిక ఉష్ణోగ్రతల వద్ద కుళ్లిపోయేలా చేయడం(పైరోలిసిస్)తోపాటు హైడ్రోథర్మల్ లిక్విఫాక్షన్, అనెయిరోబిక్ డైజేషన్ వంటి ప్రక్రియల ద్వారా ముడి వెదురు నుంచి బయో ఇథనాల్, బయోగ్యాస్ ఉత్పత్తి చేయవచ్చని కనిపెట్టారు. ► పరిశుద్ధమైన, స్థిరమైన ఇంధన వనరులను అందించగల సామర్థ్యం వెదురుకు ఉందని గుర్తించారు. ► కొన్ని జాతుల వెదురు నుంచి అధికంగా బయో ఇంధనం ఉత్పత్తి అవుతుందని చెబుతున్నారు. వేర్వేరు జాతులు వేర్వేరుగా రసాయన చర్య జరపడమే ఇందుకు కారణమని పేర్కొంటున్నారు. ► వెదురులో సెల్యూలోజ్లు, హెమిసెల్యూలోజ్ లో అధిక మోతాదులో ఉంటాయి. వీటి నుంచి బయో ఇథనాల్, బయోగ్యాస్తోపాటు బయోచర్ అనే ఎరువు కూడా ఉత్పత్తి అవుతుంది. ► వెదురు నుంచి ప్రత్యామ్నాయ ఇంధనాలను తయారు చేసుకుంటే శిలాజ ఇంధనాలపై ఆధారపడాల్సిన అవసరం గణనీయంగా తగ్గిపోతుందని, తద్వారా కాలుష్యాన్ని, వాతావరణ మార్పులను నియంత్రించవచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు. వెదురు నుంచి జీవ ఇంధనాల ఉత్పత్తి ప్లాంట్లకు పెద్దగా పెట్టుబడి అవసరం లేదని చెబుతున్నారు. ఇది పూర్తిగా సురక్షితమైన ప్రక్రియ అని పేర్కొంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
George Soros: ఎవరీయన.. ప్రధాని మోదీని ఏమన్నాడంటే..
జార్జ్ సోరోస్.(92). ఈ పేరు వింటే చాలూ బీజేపీ మండిపడుతోంది. ప్రధాని నరేంద్ర మోదీపై ఈయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఈ మేరకు కేంద్రం తరపున మంతత్రి స్మృతి ఇరానీ సైతం ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు.ఇంతకీ ఈయనెవరూ? ప్రధాని మోదీని ఏమన్నారంటే.. ► జార్జ్ సోరోస్.. హంగేరియన్-అమెరికన్ వ్యాపారవేత్త. ప్రపంచ అపర కుబేరుల్లో ఒకరు. ఈయన సంపద విలువ 8.6 బిలియన్ డాలర్లు. ఓపెన్ సొసైటీ ఫౌండేషన్స్ పేరుతో 32 బిలియన్ డాలర్లను దానం చేస్తున్నట్లు ప్రకటించి.. 15 బిలియన్డాలర్లు ఇప్పటికే ఇచ్చేశాడు కూడా. ప్రపంచంలోకెల్లా ‘అత్యంత ఉదార దాత’ అనే బిరుదును ఈయనకు కట్టబెట్టింది ఫోర్బ్స్. అయితే.. ► మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్(జర్మనీ--ఫిబ్రవరి 17-19 తేదీల నడుమ జరగనుంది) దరిమిలా.. జార్జ్ సోరోస్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అదానీ గ్రూప్ సంక్షోభాన్ని లేవనెత్తిన ఆయన.. విదేశీ పెట్టుబడిదారులు, భారత పార్లమెంట్లో విపక్షాలు లేవనెత్తుతున్న ప్రశ్నలకు ప్రధాని మోదీ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ► ‘మోదీ, అదానీకి దగ్గరి సంబంధాలున్నాయి. హిండెన్‌బర్గ్ నివేదికతో అదానీ గ్రూప్ కష్టాల్లో పడింది. మోదీ బలహీన పడే అవకాశముంది. ‘‘ఈ పరిణామం కచ్చితంగా భారత సమాఖ్య ప్రభుత్వంపై ఆ దేశ ప్రధాని మోదీకి ఉన్న పట్టును గణనీయంగా బలహీనపరుస్తుంది.సంస్థాగత సంస్కరణల కోసం తలుపులు తెరవాల్సి వస్తుంది. నాకు అక్కడి(భారత్) విషయాలపై పెద్దగా అవగాహన లేకపోయి ఉండొచ్చు. కానీ, భారతదేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణను నేను ఆశిస్తున్నాను" అని మిస్టర్ సోరోస్ పేర్కొన్నారు. ► ఈ బిలియనీర్ వ్యాఖ్యలపై బీజేపీ ఇప్పుడు మండిపడుతోంది. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సోరోస్ వ్యాఖ్యలను ‘భారత్‌పై సహించరాని దాడి’గా అభివర్ణించారామె.విదేశీ శక్తులంతా మూకుమ్మడిగా భారత ప్రజాస్వామ్య విధానంలో జోక్యం చేసుకునే యత్నం చేస్తున్నాయని.. దేశప్రజలంతా కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆమె పిలుపు ఇచ్చారు.అంతేకాదు సోరోస్‌ను ఆర్థిక యుద్ధ నేరగాడిగా అభివర్ణించారామె. ఆయన కేవలం ప్రధాని మోదీపైనే కాదు.. భారత ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడి చేస్తున్నారు. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌ను దోచుకున్న సోరోస్‌ను ఆర్థిక నేరగాడిగా ఆ దేశం ప్రకటించింది. అలాంటి వ్యక్తి ఇప్పుడు భారత ప్రజాస్వామ్యాన్ని విచ్ఛిన్నం చేయాలనే తన కోరికను బయటపెట్టారు. ఇలాంటి వారు ఇతర దేశాల్లో ప్రభుత్వాలను పడగొట్టి.. తమకు నచ్చిన వ్యక్తులను అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తారు. ఇందుకోసం బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడతారు. గతంలోనూ మన అంతర్గత వ్యవహారాల్లో ఇలాగే విదేశీ శక్తులు జోక్యం చేసుకోగా.. వారిని మనం ఓడించాం. ఈసారి కూడా అలాగే చేస్తాం అని స్మృతి ఇరానీ పేర్కొన్నారు. Whether the PM-linked Adani scam sparks a democratic revival in India depends entirely on the Congress, Opposition parties & our electoral process. It has NOTHING to do with George Soros. Our Nehruvian legacy ensures people like Soros cannot determine our electoral outcomes. — Jairam Ramesh (@Jairam_Ramesh) February 17, 2023 ► జార్జ్ సోరోస్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. అదానీ వ్యవహారం భారత్‌లో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు దారితీస్తుందా? అనేది పూర్తిగా కాంగ్రెస్, ఇతర ప్రతిపకక్షాలు, మా ఎన్నికల ప్రక్రియపై ఆధారపడి ఉంటుంది. ఇందులో జార్జ్ సోరోస్ కు ఎలాంటి సంబంధం లేదు. సోరోస్ లాంటి వ్యక్తులు మన ఎన్నికల ఫలితాలను నిర్ణయించలేరు అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి జైరాం రమేశ్ ట్విటర్ ద్వారా తెలియజేశారు. ► ప్రపంచ ధనికుల్లో ఒకరైన జార్జ్ సోరోస్.. హంగేరీలో ఓ జూయిష్ ఫ్యామిలీలో పుట్టారు. నాజీల రంగ ప్రవేశంతో.. ఆయన కుటుంబం లండన్‌కు వలస వెళ్లింది. అక్కడే ఆయన విద్యాభ్యాసం కొనసాగింది. ఆపై లండన్‌లోనే ఓ ప్రముఖ బ్యాంక్‌లో కొంతకాలం పని చేసి.. 1956లో ఆయన న్యూయార్క్‌కు వెళ్లి యూరోపియన్ సెక్యూరిటీస్ అనలిస్ట్‌గా పని చేయడం ప్రారంభించారు. ► 1973లో హెడ్గే ఫండ్(పూల్ ఇన్వెస్ట్మెంట్) అనే సాహసోపేతమైన అడుగుతో ఆర్థిక ప్రపంచంలో కొత్త ఒరవడి సృష్టించారాయన. ఆపై ఎన్నో సంచలనాలకు ఆయన నెలవయ్యాడు. ► బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం.. ఆయన దగ్గరి సంపద 8.5 బిలియన్ డాలర్లు. అలాగే ఓపెన్ సొసైటీ ఫౌండేషన్స్ పేరుతో ఛారిటీ పనులు చేస్తున్నారాయన. ప్రజాస్వామ్య పరిరక్షణ, పాదర్శకత, వాక్ స్వేచ్ఛ నినాదాలతో ఈ ఫౌండేషన్ నిధులను ఖర్చు చేస్తోంది. ► రష్యా, చెకోస్లోవేకియా, పోలాండ్, రష్యా, యుగోస్లేవియా.. ప్రచ్ఛన్న యుద్ధం ముగింపు తర్వాత ఈ దేశాల్లోనూ ఫౌండేషన్ కార్యకలాపాలు నిర్వహించారాయన. ప్రస్తుతం 70కి పైగా దేశాల్లో జార్జ్ సోరోస్ ‘ఓపెన్ సొసైటీ ఫౌండేషన్స్’ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ► రాజకీయంగానూ ఆయన అభిప్రాయాలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో గతంలో.. బరాక్ ఒబామా, హిల్లరీ క్లింటన్, జో బైడెన్లకు ఆయన మద్దతు ప్రకటించారు. అలాగే.. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్‌లకు బద్ధ వ్యతిరేకి. ఇప్పుడు అదానీ గ్రూప్-హిండెన్‌బర్గ్ వ్యవహారంలో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా మాట్లాడడం బీజేపీ శ్రేణులకు ఆగ్రహం తెప్పిస్తోంది. -
Europe Drought 2022: జాడలేని వాన చినుకు.. అల్లాడిపోతున్న యూరప్
బ్రిటన్‌లో థేమ్స్ నది ఎండిపోతోంది. ఫ్రాన్స్‌లో ఎండ వేడిమికి కార్చిచ్చులు ఎగసిపడుతున్నాయి. నదుల్లో నీళ్లు లేక చచ్చిపోయిన చేపలు గుట్టలుగుట్టలుగా పడుతున్నాయి. స్పెయిన్‌లో రిజర్వాయర్లు నీళ్లు లేక బోసిపోతున్నాయి. మొత్తంగా యూరప్‌లో సగభాగాన్ని కరువు కమ్మేస్తోంది. లండన్: వాతావరణంలో మార్పుల ప్రభావం యూరప్‌ను అల్లాడిస్తోంది. బ్రిటన్, ఫ్రాన్స్, హంగేరి, సెర్బియా, స్పెయిన్, పోర్చుగల్, జర్మనీ తదితర దేశాల్లో కరువు ముంచుకొస్తోంది. పశ్చిమ, మధ్య, దక్షిణ యూరప్‌లో రెండు నెలలుగా వాన చినుకు జాడ కూడా లేదు! దాంతో యూరప్‌లోని సగం ప్రాంతాల్లో కరువు పడగ విప్పింది. యూరోపియన్ యూనియన్‌లో 46% ప్రాంతాల్లో ప్రమాదకంగా కరువు పరిస్థితులున్నాయి. వాటిలో 11% ప్రాంతాల్లోనైతే అతి తీవ్ర కరువు నెలకొంది! దక్షిణ ఇంగ్లండ్‌లో థేమ్స్ నదిలో ఏకంగా 356 కి.మీ. మేర ఇసుక మేటలు వేసింది. నది జన్మస్థానం వద్ద వానలు కురవకపోవడం, ఎగువ నుంచి నీళ్లు రాకపోవడంతో ఎన్నడూ లేనంతగా ఎండిపోయింది! ఫ్రాన్స్‌లోని టిల్లె నదిలో సెకనుకు సగటున 2,100 గాలన్లు నీరు ప్రవహించే చోట్ల కూడా ఇప్పుడు చుక్క నీరు కనిపించడం లేదు. దక్షిణ, మధ్య, తూర్పు ఇంగ్లండ్‌లో ఏకంగా 8 ప్రాంతాలను కరువు ప్రభావితమైనవిగా బ్రిటన్ ప్రకటించింది. 1935 తర్వాత ఇలాంటి పరిస్థితులు రావడం ఇదే తొలిసారి! ఇంగ్లండ్‌లో కొద్ది వారాలుగా ఉష్ణోగ్రతలు ఏకంగా 40 డిగ్రీల సెల్సియస్ పైగానమోదవుతున్నాయి. ఈ ఏడాది జూలై అత్యంత పొడి మాసంగా రికార్డులకెక్కింది. ఇవే పరిస్థితులు తూర్పు ఆఫ్రికా, మెక్సికోల్లో కనబడుతున్నాయి. 500 ఏళ్లకోసారి మాత్రమే ఇంతటి కరువు పరిస్థితులను చూస్తామని నిపుణులు చెబుతున్నారు. నదులు ఎండిపోతూ ఉండడంతో జల విద్యుత్కేంద్రాలు మూతపడుతున్నాయి. 2018లో కూడా కరువు పరిస్థితులు వచ్చినా ఇంత టి పరిస్థితులను ఎదుర్కోలేదని అధ్యయనవేత్లలు అంటున్నారు. అక్టోబర్ దాకా ఇవే పరిస్థితులు కొనసాగుతాయన్న అంచనాలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. పరిస్థితులు తీవ్రమైతే ఇళ్లల్లో తోటలకు నీళ్లు పెట్టడం, కార్లు శుభ్రం చేయడం, ఇంట్లోని పూల్స్‌లో నీళ్లు నింపడంపై నిషేధం విధిస్తారు. – సాక్షి, నేషనల్ డెస్క్ ప్రమాద ఘంటికలు... ► బ్రిటన్‌లో జూలైలో సగటు వర్షపాతం 35% మాత్రమే నమోదైంది. ► దాంతో ఆవులు తాగే నీళ్లపై కూడా రోజుకు 100 లీటర్లు అంటూ రేషన్ విధిస్తున్నారు. ► మొక్కజొన్న ఉత్పత్తి 30%, పొద్దుతిరుగుడు ఉత్పత్తి 16 లక్షల టన్నులకు తగ్గనుందని అంచనా. ► బంగాళదుంప రైతులంతా నష్టపోయారు. ► జర్మనీలోని రైన్ నదిలో నీటి ప్రవాహం తగ్గిపోతూ వస్తోంది. చాలాచోట్ల 5 అడుగుల నీరు మాత్రమే ఉంది. ఈ నదిపై రవాణా ఆగిపోతే∙8 వేల కోట్ల డాలర్ల నష్టం సంభవిస్తుంది. ► ఇటలీలో గత 70 ఏళ్లలో చూడనంతటి అనావృష్టి పరిస్థితులు నెలకొన్నాయి. ► ఇటలీలోని అతి పెద్ద నది పో సగం వరకు ఎండిపోయింది. ► ఫ్రాన్స్‌లో 100కు పైగా మున్సిపాల్టీల్లో ట్యాంకర్ల ద్వారా నీళ్లు పంపిణీ చేస్తున్నారు. ► ఎండ తీవ్రతకు ఫ్రాన్స్‌లో గిర్నోడ్ లో 74 చదరపు కిలోమీటర్ల మేర కార్చిచ్చు వ్యాపించింది. ► స్పెయిన్‌లో ప్రధాన రిజర్వాయర్లలో నీటి మట్టాలు భారీగా పడిపోయాయి. ► హంగరీలో నదులన్నీ బురద గుంతలుగా మారిపోతున్నాయి. -
హంగేరీ క్రికెట్ జట్టులో రాణిస్తున్న సిరిపురం కుర్రోడు
రాజాం(విజయనగరం జిల్లా): ఆ యువకుడు చేసేది సాఫ్ట్వేర్ ఉద్యోగం. రాణిస్తున్నది క్రికెట్లో. చిన్పప్పుడు నుంచి చదువులో ముందుండే కుర్రాడు.. తల్లిదండ్రులు అనుకున్నట్టే చిన్న వయస్సులోనే సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించాడు. అక్కడితో ఆగకుండా ఊర్లోని పొలాలు, కల్లాల్లో ఆడిన క్రికెట్ ఆటపై మక్కువతో సాధన చేశాడు. శిక్షణలో రాటుదేలి హంగేరీ దేశ క్రికెట్ జట్టులో ప్రధాన ఆటగాడిగా ఎదిగాడు. యువతకు స్ఫూర్తిదాయకంగా నిలిచాడు. ఆయనే.. సంతకవిటి మండలం సిరిపురం గ్రామానికి చెందిన భవానీ ప్రసాద్. చదువులో దిట్ట.. భవానీ ప్రసాద్‌ది రైతు కుటుంబం. తల్లిదండ్రులు లక్ష్మి, రాంబాబులు వ్యవసాయదారులు. భవానీప్రసాద్ 1 నుంచి 7వ తరగతి వరకూ సిరిపురంలోని శివానంద హైస్కూల్లోను, 8 నుంచి 10 తరగతులను సింహాచలం ఏపీ రెసిడెన్సియల్ స్కూల్లో పూర్తిచేశాడు. పదోతరగతిలో 490 మార్కులు సాధించాడు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని గురులకు కళాశాలలో ఇంటర్ ఎంపీసీ పూర్తిచేసి వెయ్యికు 929 మార్కులు సాధించాడు. ఎచ్చెర్ల శివానీ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్‌ను ఐటీ విభాగంలో పూర్తిచేశాడు. చివరి సంవత్సరంలో జరిగిన క్యాంపస్ ఇంటర్వ్యూలో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో కొలువు దక్కించుకున్నాడు. అక్కడ మూడేళ్లు పనిచేసిన అనంతరం టీసీఎస్‌లో టీమ్ లీడర్‌గా ఉన్నత ఉద్యోగం రావడంతో షిఫ్ట్ అయ్యాడు. కంపెనీ తరఫున హంగేరీ వెళ్లి స్థిరపడ్డాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగంలో రాణిస్తూనే క్రికెట్‌పై దృష్టిసారించిన 30 ఏళ్ల భవానీ ప్రసాద్ ఆ దేశ జట్టులో చోటు సంపాదించాడు. బౌలర్‌గా రాణింపు.. చిన్నప్పుడు గ్రామంలో సరదాగా ఆడిన క్రికెట్.. భవానీ ప్రసాద్‌కు హంగేరీ దేశంలో విపరీతమైన క్రేజీ తెచ్చిపెట్టింది. ఉద్యోగరీత్యా హంగేరీ వెళ్లిన ఆయన అక్కడ బెంగుళూరుకు చెందిన సత్యదీప్అశ్వద్నారాయణ ఏర్పాటుచేసిన హంగేరీ కోబ్రా క్రికెట్ క్లబ్లో చేరాడు. ఆ దేశ క్రికెటర్లతో పాటు వివిధ దేశాలనుంచి వచ్చి హంగేరీలో స్థిరపడినవారంతా ఆ క్లబ్లో చేరి ప్రతిభను చాటేవారు. ఇక్కడ ఐపీఎల్ మ్యాచ్‌ల తరహాలో కోబ్రాక్లబ్ అక్కడ జాతీయ స్థాయిలో జరిగే వివిధ క్లబ్‌లతో పోటీపడేది. ఆ పోటీల్లో 2018 నుంచి భవానీప్రసాద్ ఆడుతూ వచ్చాడు. చివరకు ఆ దేశ క్రికెట్ సెలక్షన్ కమిటీ భవానీ ప్రసాద్‌ను దేశ జట్టులోకి తీసుకుంది. 2021 నుంచి ఏడాది వ్యవధిలో హంగేరీ 11దేశాలతో ఆడిన క్రికెట్ పోటీల్లో పాల్గొన్నాడు. బల్గేరియాతో జరిగిన మ్యాచ్‌లో రెండు ఓవర్లలో మూడు వికెట్లు తీసి ఓడిపోవాల్సిన తమ జట్టును గెలిపించాడు. దీంతో హంగేరీ టీంలో ఉత్తమ బౌలర్‌గా స్థానం దక్కించుకున్నాడు. జెర్సీ నంబర్–78తో ఆడుతున్న భవానీప్రసాద్ ఆఫ్ స్పిన్నర్ బౌలింగ్‌తో ప్రత్యర్థులను హడలెత్తించడంలో దిట్ట. కుటుంబ నేపథ్యం.. భవానీ ప్రసాద్ సాఫ్ట్వేర్ ఉద్యోగికాగా, సోదరి స్వప్న, సోదరుడు అనీల్‌లు బ్యాంకు ఉద్యోగులుగా స్థిరపడ్డారు. తల్లిదండ్రులు లక్ష్మి, రాంబాబులు ఏడాది వ్యవధిలో మరణించడం వీరిలో విషాదం నింపింది. హంగేరీకి అండగా... క్రికెట్‌ను ఇష్టపడనివారు, ప్రేమించనివారు ఉండరు. అందులో నేను కూడా ఒకడ్ని. చిన్నప్పుడు పిచ్చాపాటిగా క్రికెట్ ఆడేవాడిని. హంగేరీ వచ్చిన తరువాత కోచ్ సత్యదీప్అశ్వద్నారాయణ వద్ద శిక్షణ పొందాను. ప్రతిభను గుర్తించి క్లబ్ పెట్టారు. మాకు ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం హంగేరీ ఐసీసీ ర్యాంకులో 54వ స్థానంలో ఉంది. ఉన్నత స్థానంలోకి తీసుకెళ్లాలన్నది మా లక్ష్యం. మా తల్లిదండ్రులు ఆశయాలు మేరకు ఇతరులకు సాయం చేయడమే ముందున్న కర్తవ్యం. – అదపాక భవానీ ప్రసాద్, క్రీడాకారుడు -
కీవే అదిరిపోయే స్కూటర్లు: అయ్య బాబోయ్ అంత ధరా!
సాక్షి, ముంబై: బెనెల్లీ గ్రూప్‌కు చెందిన హంగేరియన్ వాహన తయారీ సంస్థ కీవే సరికొత్త ఉత్పత్తులతో భారతీయ మార్కెట్లోకి ప్రవేశించింది. కొత్త బ్రాండ్‌ను సిక్స్టీస్ 300ఐ, వియోస్ట్ 300లను రెండు మోడల్స్‌ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. వీటి ప్రారంభ ధర రూ.2,99,000 లుగా ఉండనున్నాయి. వాటిల్లో ఒకటి రెట్రో క్లాసిక్ మోడల్ అయితే, రెండోది మ్యాక్సీ-స్కూటర్. రూ. 10,000 ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చు. అలాగే రెండేళ్ల అనిలిమిటెడ్ వారంటీకూడా ఉంది. కేరళలోని త్రివేండ్రంలో ఇప్పటికే ఒక బ్రాంచ్‌ను ఓపెన్ చేసింది. 1999లో ఏర్పాటు చేసిన కీవే కంపెనీ అధునాతన టెక్నాలజీతో రెట్రో క్లాసిక్ స్కూటర్‌ను తీసుకొస్తున్నామని వెల్లడించింది. కీవే కనెక్ట్ సిస్టమ్, సిమ్ కార్డు టెక్నాలజీతో ఈ స్కూటర్లు పనిచేస్తాయి. అంటే ఇంటిగ్రేటెడ్ జీపీఎస్ యూనిట్ కీవే యాప్‌కు కనెక్ట్ అయితే వెహికల్ ఎక్కడుందో తెలుసుకోవచ్చు. ఇంజిన్‌ను రిమోట్ స్విచ్ ఆఫ్ చేయడం, జియో-ఫెన్స్‌ను సెటప్ రైడ్ రికార్డ్స్ మేనేజ్, స్పీడ్ లిమిట్, కమ్యూనిటీ రైడ్‌లో లొకేషన్ సమాచారాన్ని స్నేహితులతో షేర్ చేసే అవకాశాన్ని కూడా అందిస్తోంది. కీవే సిక్స్టీస్ 300ఐ ఫీచర్లు రెట్రో క్లాసిక్ స్కూటర్ లో 278 సీసీ సింగిల్-సిలిండర్, ఫోర్-స్ట్రోక్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 6500 ఆర్పీఎం వద్ద గరిష్టంగా 18.7 హెచ్‌పీ పవర్, 6000 ఆర్పీఎం వద్ద 22ఎన్ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 120/70-12 టైర్లు, డ్యూయల్-ఛానల్ ABSతో డిస్క్ బ్రేక్‌లు, స్ప్లిట్-సీట్, డ్యూయల్ ఎల్ఈడీ బ్రేక్ లైట్లు, సిగ్నల్ లైట్లతో కలిపి ఫుల్ ఎల్ఈడీ హెడ్‌లైట్ ఇతర ఆకర్షణలు ఇంకా మల్టీ-ఫంక్షన్ ఇగ్నిషన్ స్విచ్ ఎలక్ట్రిక్ స్టార్టర్, అండర్-సీట్ స్టోరేజ్ యాక్సెస్, స్టీరింగ్ లాక్ వంటి స్పెసిఫికేషన్లు కూడా లబ్యం. మ్యాట్ లైట్ బ్లూ, మ్యాట్ వైట్, మ్యాట్ గ్రే కలర్స్‌లో ఇది లభ్యం. కీవే వియోస్ట్ 300 ఫీచర్లు యాంగ్యులర్ బాడీవర్క్‌తో కూడిన ఏరోడైనమిక్ డిజైన్‌తో కూడిన మ్యాక్సీ స్కూటర్ ఇది. 12 లీటర్ల ఫ్యుయెల్ ట్యాంక్, 278సీసీ లిక్విడ్-కూల్డ్ ఫోర్-స్ట్రోక్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 6500 ఆర్పీఎంవద్ద 18.7హెచ్‌పీ గరిష్ట పవర్‌ను, 6000ఆర్పీఎం వద్ద 22ఎన్ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. నాలుగు ఎల్ఈడీ, ప్రొజెక్టర్లు, డీఆర్ఎల్ హెడ్లైట్లు, టర్న్ ఇండికేటర్ సిగ్నల్లు, కాంటినెంటల్ బెల్ట్ డ్రైవ్ సిస్టమ్, డిస్క్ బ్రేక్‌లు, టెలిస్కోపిక్ షాక్ అబ్జార్బర్లు, డ్యూయల్-ఛానల్ ABSలు ఇతర ఫీచర్లు. మ్యాట్ బ్లాక్, మ్యాట్ బ్లూ, మ్యాట్ వైట్ అనే మూడు రంగుల్లో ఈ స్కూటరు లభిస్తుంది. Benelli | Keeway India cordially invites you to our newest dealership in Trivandrum. Come witness the roar. Visit: Benelli | Keeway - Trivandrum NH 66 Bypass, Chackai, Anayara. P.O, Trivandrum - 695029, Kerala.#Trivandrum #BenelliIndia #KeewayIndia #India pic.twitter.com/xCaELTIFZq — KeewayIndia (@keeway_india) June 1, 2022 అలాగే 2022 చివరికి నాలుగు కేటగిరీల్లో మొత్తం ఎనిమిది ప్రొడక్ట్స్‌ను లాంచ్ చేయాలని కీవే భావిస్తోంది. ముఖ్యంగా హై-ఎండ్ స్కూటర్లు, క్రూయిజర్లు, స్పోర్ట్ మోటార్‌సైకిళ్లు, రెట్రో-స్ట్రీట్ బైక్స్‌పై దృష్టిపెట్టినట్టు కీవే ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ వికాస్ ఝబఖ్ తెలిపారు. The #Vieste300 is a modern powerhouse with a chiselled design, made to ease your city commute. Experience its brilliant performance first hand. Starts at ₹ 2.99 Lakhs* with 2-Year Unlimited KMS warranty ,Book yours online at ₹ 10 000 only from https://t.co/TZ4YeukZv3 T&C* Apply pic.twitter.com/Xiyn0EvPia — KeewayIndia (@keeway_india) May 31, 2022 -
ఉక్రెయిన్ పరిస్థితులపై సాక్షి ఎక్స్ క్లూజివ్ రిపోర్ట్
-
హంగేరీ నుంచి ఇండియాకు పయనమైన ఏపీ విద్యార్థులు
సాక్షి, అమరావతి: ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన మన విద్యార్థులను యుద్ధ ప్రాతిపదికన ఇక్కడికి తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చూపిన చొరవ సత్ఫలితాలిస్తోంది. ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు ప్రత్యేక ప్రతినిధులుగా వెళ్లిన వారు ఇటు కేంద్రం, అటు ఆయా దేశాల్లోని కీలక అధికారులతో ఎప్పటికప్పుడు చర్చిస్తూ తరలింపు వేగవంతంగా సాగేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ప్రవాసాంధ్రుల ప్రభుత్వ సలహాదారు, ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షుడు మేడపాటి వెంకట్.. హంగేరిలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హరిదీప్‌సింగ్ పూరితో సమావేశమై విద్యార్థుల తరలింపు అంశాల గురించి చర్చించారు. అక్కడి ఎంబసీ అధికారులతో మాట్లాడారు. భారత రాయబార కార్యాలయ అధికారి తుహిన్ కుమార్‌తో సమావేశమయ్యారు. తత్ఫలితంగా శనివారం ఒక్కరోజే బుడాపెస్ట్ నుంచి 100 మంది మన విద్యార్థులు ఇండియాకు బయలుదేరారు. విదేశీ వ్యవహారాల అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, తెలుగు, భారత అసోసియేషన్లతో మాట్లాడుతూ విద్యార్థుల తరలింపు ప్రక్రియను సమన్వయం చేస్తున్నామని వెంకట్ తెలిపారు. మన విద్యార్థులు ఉంటున్న వసతి కేంద్రాలకు వెళ్లి వారితో మాట్లాడామని చెప్పారు. ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులతో వారి పిల్లలను ఎప్పటికప్పుడు ఫోన్లో మాట్లాడిస్తూ ధైర్యం చెబుతున్నామని తెలిపారు. శనివారం ఒక్క రోజే 1,100 మంది భారతీయులను తరలించగా, అందులో వంద మంది మన ఏపీ విద్యార్థులు ఉన్నారన్నారు. -
తెలుగు విద్యార్థుల తరలింపు కోసం ఏర్పాట్లు ముమ్మరం
-
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
సాక్షి, అమరావతి: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థుల తరలింపు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఈ చర్యల్లో భాగంగా బుధవారం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోలండ్, హంగేరీలకు ఏపీ ప్రతినిధులను పంపాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు విద్యార్థుల వివరాలను విదేశాంగశాఖకు ఏపీ ప్రభుత్వం అందించింది. ఆపరేషన్ గంగ గత ఏడు రోజులుగా ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడి కొనసాగుతూనే ఉంది. హోరాహోరి పోరులో రెండు దేశాల సైన్యం శక్తి వంచన లేకుండా పోరాడుతున్నాయి. యుద్ధం రోజురోజుకు తీవ్రమవుతున్న దశలో భారత ప్రభుత్వం ఆపరేషన్ గంగ ప్రాజెక్టు ద్వారా భారతీయ విద్యార్థులను త్వరితగతిన స్వదేశానికి తరలించడానికి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా రష్యా దాడుల్లో భారతీయ విద్యార్థి.. కర్ణాటక రాష్ట్రం హవేరి జిల్లాకు చెందిన నవీణ్ శేఖరప్ప ఉక్రెయిన్‌లోని ఖర్కీవ్‌లో మంగళవారం ఉదయం చనిపోయారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సహాయ చర్యలను వేగవంతం చేసింది. (చదవండి: Ukraine War: ఉక్రెయిన్ పిల్లలే మిమ్మల్ని రక్షిస్తున్నారు!’ ) -
ఉక్రెయిన్ నుంచి మనవాళ్లు రావాలంటే.. ఇంత ఖర్చు అవుతుందా?
ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన 16 వేల మంది భారతీయులను క్షేమంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రత్యేక ఏర్పాట్లు చేసిన సంగతి మనకు తెలిసిందే. ఉక్రెయిల్‌లో ప్రస్తుతం రష్యా కొనసాగిస్తున్న దాడుల్లో ఎక్కువగా తూర్పు ప్రాంతంలోనే సాగుతున్నాయి. యూరప్ దేశాలపైవు ఉన్న పశ్చిమ ప్రాంతంలో దాడులు తక్కువగా ఉన్నాయి. దీంతో పశ్చిమ ప్రాంతాలకు పాస్‌పోర్ట్ ఇతర డాక్యుమెంట్లతో రావాలంటూ ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయులకు కేంద్రం సూచించింది. అక్కడి నుంచి భారతీయులను ఎయిర్ ఇండియా విమానంలో మన దేశానికి తీసుకొని వస్తున్నారు. అయితే, అక్కడ నుంచి విమాన ప్రయాణానికి అయ్యే ఖర్చు రూ.1.10 కోట్లకు పైగా ఉంటుంది. విమానాల కాలవ్యవధిని బట్టి ఈ మొత్తం పెరుగుతుంది. రొమేనియా, హంగరీతో సహా ఉక్రెయిన్ పొరుగు దేశాల నుంచి డ్రీమ్ లైనర్ అని పిలిచే బోయింగ్ 787 విమానంతో విమానయాన సంస్థ సేవలను అందిస్తుంది. ఇప్పటికే వందలాది మంది భారతీయులను తిరిగి తీసుకువచ్చింది. డ్రీమ్ లైనర్ అని పిలిచే చార్టర్డ్ విమానాన్ని నడపడానికి అయ్యే ఖర్చు గంటకు రూ.7 నుంచి 8 లక్షల ఖర్చు అవుతుందని విమానయాన సంస్థ వర్గాలు తెలిపాయి. "అందుకే మనం ఎక్కడికి వెళుతున్నాము, ఎంత దూరం ప్రయాణిస్తున్నాము" అనే దానిపై ఆధారపడి ఖర్చు ఉంటుంది. ఈ మొత్తం ఖర్చులో సిబ్బంది, ఇంధనం, నావిగేషన్, ల్యాండింగ్ & పార్కింగ్ ఛార్జీలకు సంబంధించిన ఖర్చులు ఉంటాయి. ప్రస్తుతం, ఎయిర్ ఇండియా బుకారెస్ట్ (రొమేనియా), బుడాపెస్ట్ (హంగరీ)లకు విమాన సేవలను అందిస్తుంది. ఈ రెండూ ప్రదేశాలకు షెడ్యూల్ ప్రకారం ఎలాంటి సేవలు లేవు. ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ ఫ్లైట్ అవేర్ ప్రకారం.. బుడాపెస్ట్ నుంచి ముంబైకి విమానం చేరుకోవడానికి దాదాపు ఆరు గంటల పాటు సమయం పట్టింది. అలాగే, బుడాపెస్ట్ నుంచి ఢిల్లీకి సుమారు 6 గంటలు, మరొక విమానానికి ఢిల్లీ నుంచి బుడాపెస్ట్'కు 7 గంటలకు పైగా సమయం పట్టింది. ఖర్చు గంటకు రూ.7 నుంచి 8 లక్షల మధ్య ఉంటుంది కాబట్టి, రౌండ్ ట్రిప్ కోసం మొత్తం ఖర్చు రూ.1.10 కోట్లకు పైగా ఉంటుంది. అయితే, ఈ ప్రయాణానికి అయ్యే ఖర్చులను కేంద్ర ప్రభుత్వం ప్రజల నుంచి వసూలు చేయడం లేదు. ఉక్రెయిన్ నుంచి తిరిగి వస్తున్న తమ రాష్ట్రాల ప్రజల ఖర్చులను భరిస్తామని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. డ్రీమ్ లైనర్ విమానంలో 250కి పైగా సీట్లు ఉన్నాయి. ఈ విమానం సగటున గంటకు 5 టన్నుల ఇంధనాన్ని వినియోగిస్తుంది. భారతీయుల తరలింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత విమానయాన సంస్థకు అయిన ఖర్చును తిరిగి చెల్లించడానికి ప్రభుత్వానికి పంపుతుందని ఆ వర్గాలు తెలిపాయి. (చదవండి: ఇక ఉద్యోగులు ఆఫీసులకు రావాల్సిందే.. కీలక సర్వే!) -
ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు.. బుకారెస్ట్ చేరుకున్న ఎయిరిండియా
ఉక్రెయిన్‌పై రష్యా బాంబు వర్షం కొనసాగుతూనే ఉంది. ఆ దేశ రాజధాని కీవ్‌పై బాంబలు మిస్సైల్స్‌తో రష్యన్ దళాలు విరుచుకుపడుతున్నాయి. దీంతో ఉక్రెయిన్‌లో చిక్కుకపోయిన భారతీయ విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ప్రమాదక ప్రదేశాల్లో ఉన్నవారంతా బాంబ్ షెల్టర్స్, అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్లు, బంకర్లలో తలదాచుకుంటున్నారు. కంటిమీద కునుకు లేకుండా ప్రాణాలు అరచేతిలో పట్టుకుని స్వదేశానికి చేరుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు విదేశాంగ శాఖ సైతం చర్యలను వేగవంతం చేసింది. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను తీసుకొచ్చేందుకు 4 ఎయిరిండియా విమానాలను నడుపుతోంది. ఉక్రెయిన్‌లోని 470 మంది భారతీయ విద్యార్థులు నేడు భారత్ చేరుకోనున్నారు. ముందుగా భారతీయులను ఉక్రెయిన్ సరిహద్దులైన రొమేనియా, హంగరీ ప్రాంతాలకు తరలించారు. రొమేనియా రాజధాని బుకారెస్ట్‌కు చేరుకొని ఎయిరిండియా విమానాల్లో భారత్‌కు బయల్దేరనున్నారు. చదవండి: యుద్ధం ప్రత్యక్ష ప్రభావం భారత్‌పై ఎలా ఉండబోతుంది? పూర్తి వివరాలు ఇప్పటికే ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకురావడానికి ముంబై నుంచి వెళ్లిన ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానం AI-1943 రొమేనియా రాజధాని బుకారెస్ట్‌కు చేరుకుంది. ఈ విమానం సాయంత్రం 4 గంటలకు ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు చేరుకోనుంది. ఉక్రెయిన్ నుంచి వచ్చే ఈ విద్యార్థులకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్వాగతం పలుకనున్నారు. మరో రెండు విమనాలను రొమేనియా సరిహద్దు వద్దకు, ఒకటి హంగేరికి పంపనుంది. A special flight of Air India AI-1943 lands at Bucharest in Romania for the evacuation of stranded Indians. pic.twitter.com/YGYoVGMcQS — ANI (@ANI) February 26, 2022 ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌లో చిక్కుకపోయిన భారత పౌరులకు కీవ్‌లోని భారత రాయబార కార్యాలయం కీలక సూచన చేసింది. సరిహద్దు పోస్టుల వద్ద ఉన్న భారత అధికారులతో ముందస్తు సమన్వయం లేకుండా ఉక్రెయిన్ సరిహద్దు పోస్టుల వద్దకు వెళ్లవద్దని సూచించింది. ‘వివిధ సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద పరిస్థితి చాలా సున్నితంగా ఉంది. భారతీయ పౌరులనును సమన్వయంతో తరలించడానికి పొరుగు దేశాలలోని భారత రాయబార కార్యాలయాలతో ఎంబసీ నిరంతరం పని చేస్తోంది. అధికారులతో సమన్వయం లేకుండా ఎవరూ సరిహద్దూలకు రావొద్దు’ అని ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం శనివారం ఉదయం ట్వీట్ చేసింది. Advisory to all Indian Nationals/Students in Ukraine as on 26 February 2022.@MEAIndia @PIB_India @PIBHindi @DDNewslive @DDNewsHindi @DDNational @IndianDiplomacy pic.twitter.com/yN6PT2Yi8c — India in Ukraine (@IndiainUkraine) February 26, 2022 -
ముఖ్య గమనిక! హంగేరీ వచ్చే వాళ్లు ముందుగా ఈ వివరాలు ఇవ్వండి
ఉక్రెయిన్‌లో యుద్ధ సమయంలో చిక్కుకుపోయిన భారతీయులను రోమేనియా, హంగేరీల మీదుగా ఇండియాకి తీసుకువచ్చేందుకు కేంద్రం వ్యూహం రచించింది. ఈ మేరకు తగు జాగ్రత్తలు తీసుకుంటూ హంగేరీ, రోమేనియా సరిహద్దులకు చేరుకోవాలంటూ భారతీయులకు సూచనలు జారీ చేసింది. భారత ఎంబసీ నుంచి వచ్చిన సూచనలకు అనుగుణంగా ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయులు కేపీపీ టైసా సరిహద్దు వద్ద హంగేరిలోకి వెళ్లేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇలా వచ్చే వారి కోసం హంగేరీలో ఉన్న ఇండియన్ ఎంబసీ కొన్ని విధి విధానాలు రూపొందించింది. అందులో భాగంగా కేపీపీ టైసా సరిహద్దుకు చేరుకోవాడనికి ముందే ఆన్లైన్లో కొన్ని పత్రాలు ఫిల్ చేయాలంటూ కోరింది. Imp Notice! Students wanting to cross border through Kpp Tysa may please fill the form -https://t.co/jmkFl3Nahn Students and other stranded in Ukraine should follow advisory & alerts issued by @IndiainUkraine @MEAIndia @BshBudapest — Indian Embassy in Hungary (@IndiaInHungary) February 24, 2022 ఉక్రెయిన్ నుంచి హంగేరీ వచ్చే భారతీయులు ముందుగా పేరు, జెండర్, పుట్టినరోజు, ఉక్రెయిన్‌లో కాంటాక్ట్ నంబర్, భారత్‌లో కాంటాక్ట్ నంబర్, ఇండియాలో అడ్రస్, ఈ మెయిల్, పాస్‌పోర్ట్ నంబరు, పాస్‌పోర్ట్ ఎక్స్పైరీ తేది, ఉక్రెయిన్‌లో అడ్రస్, దగ్గరగా ఉన్న హంగేరి సరిహద్దు తదితర వివరాలు పొందు పరచాల్సి ఉంటుంది. ఇది చాలా ముఖ్య గమనికగా హాంగేరీ లోని ఇండియన్ ఎంబసీ పేర్కొంది. చదవండి: హంగేరి, రుమేనియా బోర్డర్‌కి రండి - కేంద్రం కీలక ఆదేశాలు -
మనకు తెలిసిన పెద్ద నోటు 2,000.. మరి ప్రపంచంలో పెద్ద నోటేంటో తెలుసా..?
బడ్జెట్ అంటేనే డబ్బుల లెక్కలు.. అంటే మనకు గుర్తొచ్చేవి కరెన్సీ నోట్లు, నాణేలే. నాగరికతలు అభివృద్ధి చెందిన మొదట్లో డబ్బులనేవే లేవు. ఓ వస్తువు ఇవ్వడం, బదులుగా మరో వస్తువు తీసుకోవడమే. ఆ తర్వాత బంగారం, వెండి, రాగి, ఇతర లోహాలతో చేసిన నాణేలు కరెన్సీగా అమల్లోకి వచ్చాయి. కాగితాన్ని కనిపెట్టాక నోట్లు మొదలయ్యాయి. అందులోనూ ఏ దేశానికి ఆ దేశం నచ్చినట్టుగా కరెన్సీ నోట్లు, నాణేలను తయారు చేసుకుంటూ వస్తున్నాయి. మరి ఈ కరెన్సీలో కొన్ని చిత్రాలేమిటో చూద్దామా..? స్టాంపు కాదు డబ్బులే.. ప్రపంచంలోనే ఇప్పటివరకు అధికారికంగా చలామణీ అయిన అతిచిన్న కరెన్సీ నోటు.. రొమేనియా దేశానికి చెందిన ‘10 బని’. 1917లో ముద్రించిన ఈ కరెన్సీనోటు పరిమాణం 4.4 సెంటీమీటర్ల ఎత్తు, 3.3 సెంటీమీటర్ల వెడల్పు మాత్రమే. అంటే కాస్త పెద్ద సైజు స్టాంపు అంత అన్నమాట. సాధారణంగా కరెన్సీ నోట్లు తక్కువ ఎత్తుతో, ఎక్కువ వెడల్పుతో అడ్డంగా ఉంటాయి. కానీ దీని ఎత్తు ఎక్కువ, వెడల్పు తక్కువ. ఇంకో విశేషం ఏమిటంటే.. ఈ నోట్లకు నకిలీలను తయారు చేస్తే పదేళ్లు జైల్లో వేస్తామని ఆ నోటుపైనే ముద్రించారు. చదవండి: (బడ్జెట్ ఇంగ్లిష్‌లోనే ఎందుకు?) సర్టిఫికెట్ సైజులో లక్ష నోటు... ఈ ఫొటోలో ఓ సర్టిఫికెట్ అంత పెద్దగా కనిపిస్తున్నది ఫిలిప్పీన్స్‌కు చెందిన లక్ష పెసోల కరెన్సీ నోటు. ఆ దేశానికి స్పెయిన్ నుంచి స్వాతంత్య్రం వచ్చి 300 ఏళ్లయిన సందర్భంగా.. 1998లో 14 అంగుళాల పొడవు, 8.5 అంగుళాల వెడల్పుతో ఈ నోటును విడుదల చేసింది. ప్రపంచంలో అధికారికంగా చెలామణిలో ఉన్న అతిపెద్ద కరెన్సీ నోటు ఇదే. కోటి కోట్ల కోట్లు.. ఒక్క నోటు మామూలుగా మనం చూసే పెద్ద నోట్లు అంటే ఏంటి? ఐదు వందలు, రెండు వేలే కదా. ఒకప్పుడు పదివేల నోటు కూడా ఉండేది. మరి ప్రపంచంలో ఇలా అత్యధిక డినామినేషన్ ఉన్న నోటు ఏదో తెలుసా..? హంగరీ దేశానికి చెందిన ‘కోటి కోట్ల కోట్లు (100 మిలియన్ బిలియన్)’ పెంగో నోటు. అంటే ఒకటి పక్కన 20 సున్నాలు పెడితే వచ్చే సంఖ్య అది. 1946లో రెండో ప్రపంచ యుద్ధంలో బాగా దెబ్బతిన్న హంగరీలో ధరలు పెరిగిపోయి ద్రవ్యోల్బణం ఆకాశాన్ని అంటింది. దాంతో ఈ నోటును విడుదల చేశారు. 2008లో జింబాబ్వేలో ధరలు, ద్రవ్యోల్బణం పెరిగిపోవడంతో.. అక్కడి ప్రభుత్వం ఏకంగా కోటి కోట్ల (హండ్రెడ్ ట్రిలియన్) జింబాబ్వే డాలర్ల నోట్లను విడుదల చేసింది. పోకెమాన్.. డాలర్ మిక్కీమౌస్.. 2 డాలర్లు సాధారణంగా ఏ దేశమైనా తమ నాణేలపై ప్రముఖులు, తమ దేశ ప్రత్యేకతలు వంటివాటిని ముద్రిస్తుంటుంది. కానీ నియూ మాత్రం చిత్రంగా స్టార్‌వార్స్, పోకెమాన్, మిక్కీమౌస్, చివరికి ఇటీవలి ఫ్రాజెన్ వంటి యానిమేటెడ్ క్యారెక్టర్లను కాయిన్లపై ముద్రిస్తోంది. పసిఫిక్ సముద్రం మధ్యలో చిన్న దీవి అయిన నియూ.. న్యూజిలాండ్ పర్యవేక్షణలో స్వతంత్ర దేశంగా కొనసాగుతోంది. ‘నియూ డాలర్స్’గా పిలిచే ఈ కరెన్సీ అధికారికంగా చెల్లుబాటు అవుతుంది కూడా. -
23 కోట్ల బీమా సొమ్ము కోసం రైలు పట్టాలపై పడుకుని రెండు కాళ్లు..!!
ఇన్సూరెన్స్ కింద కోట్ల రూపాయలు ఆర్జించవచ్చనే దురాశతో ఓ వ్యక్తి ఏకంగా ట్రైన్ కింద కాళ్లు పెట్టాడు. ఇది జరగడానికి కొంతకాలం ముందు సదరు వ్యక్తి ఒకటి, రెండు కాదు సుమారు 14 బీమా పాలసీలను తీసుకున్నాడు. ఐతే ఏళ్లు గడుస్తున్నా బీమా తాలూకు రూ. 23 కోట్ల డబ్బు పొందలేకపోతున్నాననే బాధతో ఈ పనికి పూనుకున్నాడు సదరు వ్యక్తి. డబ్బుకోసం కాళ్లను నరుక్కున్న ఈ వ్యక్తిని చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. మీడియా కథనాల ప్రకారం హంగేరీకి చెందిన సెందర్ అనే వ్యక్తి ఇన్సురెన్స్ కింద లభించే 23 కోట్ల 97 లక్షల రూపాయల కోసం రైలు ట్రాక్‌పై పడుకుని రెండు కాళ్లు నరుక్కున్నాడు. 2014లో జరిగిన ఈ షాకింగ్ ఘటనలో 54 ఏళ్ల సెందర్ తన రెండు కాళ్లను కోల్పోయాడు. అప్పటి నుంచి కృత్రిమ అవయవాలను వాడుతూ వీల్‌చైర్ సపోర్టుతో బతుకువెళ్లదీస్తున్నాడు. కాళ్లు కోల్పోయిన తర్వాత బీమా డబ్బు కోసం సెందర్ బీమా కంపెనీలను సంప్రదించాడు. కానీ అతని ఎత్తుగడ బీమా సంస్థలు పసిగట్టి అతనికి ఊహించని షాక్ ఇచ్చాయి. నిజానికి సెందర్ తన కాళ్లు పోగొట్టుకోవడానికి కొంతకాలం ముందు, 14 రకాల హై రిస్క్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలను తీసుకున్నాడు. దీంతో బీమా కంపెనీలకు అనుమానం వచ్చి, క్లెయిమ్‌ను ఆలస్యం చేశాయి. దీనితో మనస్థాపం చెందిన సెండర్ కోర్టును ఆశ్రయించాడు. కోర్టు విచారణలో విషయం అంతా బట్టబయలయ్యింది. పొదుపు ఖాతాల కంటే బీమా పాలసీలపై వచ్చే రాబడులు మెరుగ్గా ఉంటాయని ఆర్థిక సలహా అందుకున్న తర్వాతనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు సెందర్ కోర్టులో ఒప్పుకున్నాడు. అందుకే పాలసీలు కూడా తీసుకున్నాడట. గ్లాస్‌పై జారిపడి, అదుపు తప్పి రైలు ట్రాక్‌పై పడిపోయినట్లు, ఈ ప్రమాదంలో అతని రెండు కాళ్లు తెగిపోయాయని అందరి ముందూ నమ్మబలికి, బీమా డబ్బు మొత్తాన్ని పొందడానికి ప్లాన్ వేసినట్లు కోర్టు ముందు చెప్పుకొచ్చాడు. అతను ఉద్దేశపూర్వకంగా ఇన్సురెన్సు డబ్బు కోసమే రైలు ముందు పడుకున్నాడని ఏడేళ్ల విచారణలో రుజువు కావడంతో తాజాగా జిల్లా కోర్టు ఈ కేసుపై తీర్పు వెలువరించింది. అతని మోసం బయటపడటంతో బీమా సొమ్ము దక్కలేదు సరికదా పరువు కూడా పోయింది. చదవండి: Supai Village Story: టెక్నాలజీ కన్నే ఎరుగని అమెరికా పల్లెటూరు.. నేటికీ గాడిదలపైనే ప్రయాణం..! -
బిట్‌కాయిన్ సృష్టికర్త ఎవరో తెలుసా...!
ప్రపంచంలోనే అత్యంత విలువైన క్రిప్టోకరెన్సీ ఏది అంటే ఠక్కున చెప్పేది బిట్‌కాయిన్. చాలావరకు క్రిప్టోకరెన్సీల్లో బిట్‌కాయిన్ ఎక్కువ ఆదరణ లభించింది. ఎల్సాల్వ్డార్, పరాగ్వే వంటి దేశాలు కూడా బిట్‌కాయిన్‌కు చట్టబద్ధత కల్పిస్తానమని వెల్లడించిన విషయం తెలిసిందే. బిట్‌కాయిన్‌ను మొదటిసారిగా 2008లో రూపోందించారు. బిట్‌కాయిన్ మార్కెట్ విలువ 2009లో 0.0094982452 డాలర్ల నుంచి మొదలై నేడు సుమారు 991.2 బిలియన్డాలర్లకు పెరిగింది. చదవండి: క్రిప్టోకరెన్సీ నుంచి పొంచి ఉన్న పెనుముప్పు...! బిట్‌కాయిన్ ఒక కంటి కనిపించని క్రిప్టోకరెన్సీ. బిట్‌కాయిన్‌ను ఎవరు సృష్టించారంటే చెప్పడం చాలా కష్టం. దీన్ని సృష్టించిన వ్యక్తి ఎవరో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. సతోషి నకమోటో అనే పేరును ఉపయోగించి మొదట చెలామణీ వచ్చింది. సతోషి నకమోటో అనే పేరు ఒక వ్యక్తిదో లేకపోతే కొంతమంది వ్యక్తుల సమూహమో ఎవరీకి తెలియదు. బిట్కాయిన్తెలియరాలేదు. దీన్ని 2008లో రూపొందించారు. తొలి విగ్రహ ఏర్పాటు..! తాజాగా బిట్‌కాయిన్ సృష్టికర్త సతోషిక నకమోటో తొలి విగ్రహాన్ని గురువారం రోజున హంగేరీలోని బుద్దాపెస్ట్లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి వేలాదిమంది ప్రజలు హజరయ్యారు. ఆవిష్కరణ వేడుకలో "స్టాచ్యూ ఆఫ్ సతోషి" ప్రాజెక్ట్ సహ వ్యవస్థాపకుడు , క్రిప్టో న్యూస్ సైట్ క్రిప్టో అకాడెమియా ఎడిటర్, హంగేరియన్ క్రిప్టో ఎక్స్ఛేంజ్ సీఈవో డెబ్రేక్జెని బర్నబా హాజరయ్యారు. Front of #StatueOfSatoshi pic.twitter.com/LvlDmtio1c — Disclose.tv (@disclosetv) September 16, 2021 చదవండి: Cryptocurrency: క్రిప్టోకరెన్సీ దెబ్బకు వీటి ధరలు భారీగా పెరగనున్నాయా..! -
ప్రియామాలిక్కు అభినందనలు తెలిపిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: హంగేరీ వేదికగా జరిగిన రెజ్లింగ్ వరల్డ్ క్యాడెట్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించిన భారత్ రెజ్లర్ ప్రియా మాలిక్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. దేశానికి మరో పురస్కారం వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. ‘‘హంగేరిలో జరిగిన ప్రపంచ క్యాడెట్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ తరపున బంగారు పతకం సాధించినందుకు ప్రియా మాలిక్‌కు నా హృదయపూర్వక అభినందనలు’’ అని ట్వీట్ చేశారు. రెజ్లింగ్ వరల్డ్ క్యాడెట్ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ సాధించిన తర్వాత ప్రియామాలిక్ విజయహాసం కాగా హంగేరీలో జరుగుతున్న రెజ్లింగ్ పోటీల్లో 73 కేజీల విభాగంలో ఫైనల్లో ప్రియా మాలిక్ విజయం సాధించి గోల్డ్‌మెడల్ కైవసం చేసుకుంది. ఆమె 5-0తో బెలారస్ రెజ్లర్‌ను ఓడించి పసిడిని ఖాతాలో వేసుకుంది. ఇక టోక్యో ఒలింపిక్స్‌లో కూడా భారత రెజ్లర్లపై భారీ అంచనాలే ఉన్నాయి. 57 కేజీల విభాగంలో రవి కుమార్ దహియా, 65 కేజీల విభాగంలో భజరంగ్ పూనియా, 86 కేజీల విభాగంలో దీపక్ పూనియా పురుషుల జాబితాలో పోటీ పడనుండగా మహిళల విభాగంలో సీమా, వినేశ్ ఫోగర్, అన్షు, సోనమ్ బరిలో దిగబోతున్నారు.ప్రియా మాలిక్ విజయమై సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. Another day, another laurel to the nation! My hearty congratulations to Priya Malik on clinching gold for India at World Cadet wrestling championship in Hungary. #priyamalik — YS Jagan Mohan Reddy (@ysjagan) July 25, 2021 -
ప్రియా మాలిక్‌కు గోల్డ్ మెడల్
బుడాపెస్ట్: భారత్ రెజ్లర్ ప్రియా మాలిక్ సంచలనం స్పష్టించింది. రెజ్లింగ్ వరల్డ్ క్యాడెట్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించి అంతర్జాతీయ వేదికపై సత్తాచాటింది. హంగేరీలో జరుగుతున్న రెజ్లింగ్ పోటీల్లో 73 కేజీల విభాగంలో ఫైనల్లో విజయం సాధించి గోల్డ్‌మెడల్ కైవసం చేసుకుంది. ప్రియా మాలిక్ 5-0తో బెలారస్ రెజ్లర్‌ను ఓడించి పసిడిని ఖాతాలో వేసుకుంది.. టోక్యో ఒలింపిక్స్‌లో మీరాభాయ్ చాను రజతం గెలిచిన తర్వాతి రోజే, మరో ప్రపంచ క్రీడ వేదికపై భారత మహిళా అథ్లెట్లు సత్తా చాటడం క్రీడాభిమానులను సంతోషానికి గురిచేస్తుంది. టోక్యో ఒలింపిక్స్‌లో కూడా భారత రెజ్లర్లపై భారీ అంచనాలే ఉన్నాయి. 57 కేజీల విభాగంలో రవి కుమార్ దహియా, 65 కేజీల విభాగంలో భజరంగ్ పూనియా, 86 కేజీల విభాగంలో దీపక్ పూనియా పురుషుల జాబితాలో పోటీ పడనుండగా మహిళల విభాగంలో సీమా, వినేశ్ ఫోగట్, అన్షు, సోనమ్ బరిలో దిగబోతున్నారు.ప్రియా మాలిక్ విజయమై సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. -
అమ్మో అందాల రాక్షసి : 650 మందిని చంపి వాళ్ల రక్తంతో
ప్రతి ఒక్కరు స్లిమ్ గా, చక్కటి గ్లోతో మెరిసి పోవాలని అనుకుంటారు. అందుకే తాము అభిమానించే హీరోలు, హీరోయిన్లు అందం కోసం వాడే బ్రాండెడ్ క్రీమ్స్ ను అప్లయ్ చేసి ఎదుటి వారికి తమని తాము అందంగా చూపించుకోవాలని ప్రయత్నిస్తుంటారు. మరికొంత మంది యూట్యూబ్ వీడియోలు చూసి రకరకాల రెసిపీలను ట్రై చేస్తుంటారు. అది కూడా సాధ్యపడకపోతే చివరికి అరే వాళ్లకంటే మనం బాగున్నాం అంటూ వారికి వారు సర్ధి చెప్పుకుంటుంటారు. ఇప్పుడంటే ఇలా ఉంటే పూర్వం అందం కోసం మనిషి రక్తంలో స్నానం చేసేవారు. ముఖ్యంగా 16వ శతాబ్ధానికి చెందిన రాణులు వారి ఆస్థానంలో పెద్దలు చెప్పినట్లు అందం కోసం చిత్ర విచిత్రమైన పనులు చేసేవారు. అందులో కొన్ని పనులు అత్యంత దారుణంగా ఉండేవి. ఎలిజిబెత్ బాతోరి ప్రపంచంలో అంత్యత ప్రమాదకరమైన రాణి. ప్రస్తుతం యూరప్ దేశాల్లో ఓ భాగమైన హంగేరి దేశంలో హంగేరియన్ రాజకుటుంబానికి చెందిన రాణి ఈ ఎలిజిబెత్ బాతోరి. హంగేరిలో ఓ రాజ్యాన్ని పరిపాలించేది. ఆమెకు అందంగా ఉండడం అంటే మహా పిచ్చి. ఆ అందం కోసం 1585 నుండి 1610 సంవత్సరం మధ్య కాలంలో పెళ్లికాని 650 మంది యువతుల్ని చంపేసింది. రాణి కావడంతో తన రాజభవనంలో పనిచేసేందుకు పెళ్లికాని యువతుల్ని ఆహ్వానించేది. పనిపేరుతో వారిని చంపేసి వారి రక్తంతో స్నానం చేసేది. ఎలిజిబెత్ బాతోరికి తనకు అత్యంత సన్నిహితంగా ఉండేవారు ఎవరో చెప్పారట. పెళ్లికాని యువతుల రక్తంతో స్నానం చేస్తే అందంగా కనిపిస్తారని. అదిగో అప్పటి నుండి పెళ్లికాని యువతుల్ని పనికి పిలిపించి హత్యలు చేసింది. ఆమెకు మరో ఆరుగురు సహకరించినట్లు చరిత్ర ఆధారాలు చెబుతున్నాయి. అంతమందిని హత్య చేస్తుంటే ఎవరు పట్టించుకోలేదా అంటే ఆమె అసలే రాణి. ఎవరు ప్రశ్నిస్తారు. అయితే చివరికి పాపం పండింది. ఎలిజిబెత్ దగ్గర పనిచేసే సుసన్నా అనే సేవకురాలు బయటపెట్టడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. 1610లో ఆమెకు కోర్ట్ జీవిత ఖైదు విధించింది. రాణి తన పలుకుబడితో ఉరిశిక్ష నుంచి తప్పించుకున్నట్లు చరిత్ర చెబుతోంది. ఈ బాతోరి పై హంగేరియన్ కు చెందిన డైరక్టర్ జురాజ్ జకుబిస్కో హాలీవుడ్ లో బాతోరి (కౌంట్ నెస్ ఆఫ్ బ్లడ్ ) పేరుతో సినిమా తెరకెక్కించారు. 10మిలియన్ డాలర్లతో తెరకెక్కిన ఈ చిత్రం 2008 జులై 10న విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. -
కరోనాతో ఒలింపిక్ చాంపియన్ కన్నుమూత
బుడాపెస్ట్: ప్రపంచ షూటింగ్ క్రీడాలోకంలో విషాదం చోటు చేసుకుంది. 2004 ఏథెన్స్ ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత, నాలుగుసార్లు వరల్డ్ చాంపియన్, ఆరుసార్లు యూరోపియన్ చాంపియన్ అయిన హంగేరి మహిళా షూటర్ డయానా ఇగాలేను కరోనా మహమ్మారి కబళించింది. 56 ఏళ్ల డయానా కరోనా వైరస్ లక్షణాలతో మంగళవారం ఆసుపత్రిలో చేరగా... శుక్రవారం ఆమె తుదిశ్వాస విడిచింది. 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో స్కీట్ ఈవెంట్లో కాంస్య పతకం నెగ్గిన డయానా... 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. తద్వారా షూటింగ్ క్రీడాంశంలో స్వర్ణం నెగ్గిన తొలి హంగేరి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది. ఓవరాల్‌గా ఆమె అంతర్జాతీయస్థాయిలో 32 పతకాలు గెల్చుకుంది. -
పసిడి పోరుకు ప్రసాద్
బుడాపెస్ట్ (హంగేరి): బోక్స్కాయ్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ బాక్సర్ పీఎల్ ప్రసాద్ పురుషుల 52 కేజీల విభాగంలో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. విశాఖపట్నం జిల్లాకు చెందిన 24 ఏళ్ల ప్రసాద్ సెమీఫైనల్లో 4–1తో దివాలి దిమిత్రి (రష్యా)పై విజయం సాధించాడు. 91 కేజీల విభాగం సెమీఫైనల్లో భారత బాక్సర్ గౌరవ్‌కు తన ప్రత్యర్థి నుంచి వాకోవర్ లభించడంతో అతను ఫైనల్‌కు చేరాడు. మహిళల విభాగంలో జ్యోతి గులియా (51 కేజీలు), మనీషా (57 కేజీలు) కూడా స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించారు. సెమీఫైనల్స్‌లో మనీషా 4–1తో బాసానెట్స్ మెరియానా (ఉక్రెయిన్)పై, జ్యోతి 5–0తో మాండీ మేరీ (కెనడా)పై గెలుపొందారు. ఇంతింతై... విశాఖ స్పోర్ట్స్: 13 ఏళ్ల క్రితం మొదలైన ప్రసాద్ బాక్సింగ్ ప్రస్థానం నేడు అంతర్జాతీయస్థాయికి చేరుకుంది. కోచ్ వెంకటేశ్వర రావు శిక్షణలో రాటుదేలిన ప్రసాద్ సరీ్వసెస్ స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (ఎస్‌ఎస్‌పీబీ) జట్టు తరఫున జాతీయ చాంపియన్‌షిప్ బరిలోకి దిగి పతకాల వేట మొదలుపెట్టాడు. ఇప్పటికీ దానిని కొనసాగిస్తూ కెరీర్లో దూసుకుపోతున్నాడు. విశాఖలోని అక్కయ్యపాలెంకు చెందిన ప్రసాద్ కాంబినేషన్ పంచ్‌లు సంధించడంలో దిట్ట. 2008 డిసెంబర్లో జరిగిన జాతీయ సబ్ జూనియర్ చాంపియన్‌షిప్‌లో సర్వీసెస్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ ప్రసాద్ తొలి స్వర్ణాన్ని సాధించాడు. అటునుంచి వెనుదిరిగి చూడలేదు. వివిధ కేటగిరీల్లో ఏడుసార్లు జాతీయ చాంపియన్‌గా నిలిచిన ప్రసాద్ 2012లో ఫిన్లాండ్లో జరిగిన తామెర్ అంతర్జాతీయ టోరీ్నలో స్వర్ణం సాధించాడు. అదే ఏడాది ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం, 2013లో ఆసియా యూత్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలిచాడు. తల్లిదండ్రులు వేణుగోపాల్, గౌరిల ప్రోత్సాహంతో అంచెలంచెలుగా ఎదిగిన ప్రసాద్‌కు ఐదేళ్ల క్రితం భుజం గాయం అయింది. భుజానికి శస్త్ర చికిత్స జరిగాక కొంతకాలం ఆటకు దూరంగా ఉన్నాడు. గాయం నుంచి కోలుకున్నాక మళ్లీ రింగ్‌లోకి అడుగు పెట్టాడు. పతకాల వేట మొదలుపెట్టాడు. , , -
అందుకే.. భారత్‌లో మా రాయబారి: హంగేరీ
న్యూఢిల్లీ: భారత అంతర్గత వ్యవహారాలపై ఇతర దేశాల జోక్యం తగదని హంగేరీ విదేశాంగ మంత్రి పీటర్ సిజార్టో హితవు పలికారు. భారత ప్రభుత్వం అవలంబించే విధానాలను అనుసరించి ఎవరిని ఎన్నుకోవాలనే విషయంలో భారతీయులదే తుది నిర్ణయం అని వ్యాఖ్యానించారు. పీటర్ సిజార్టో ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ... పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌరపట్టిక(ఎన్నార్సీ), కశ్మీర్ తదితర అంశాలు భారత అంతర్గత విషయాలని పేర్కొన్నారు. అలాంటప్పుడు తామెందుకు వాటి గురించి వ్యాఖ్యలు చేయాలని ప్రశ్నించారు. ‘‘అవన్నీ పూర్తిగా భారత అంతర్గత విషయాలు. వీటిని మేం భారతీయులకే వదిలేస్తాం. తమ దేశంలో సమర్థవంత పాలన అందించలేకపోయినా ఇతర దేశాలకు ఉద్భోద చేసే రకం కాదు మేము. నిజానికి ఒక ప్రభుత్వం మంచి నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు వారినే తిరిగి ఎన్నుకుంటారు. లేనట్లయితే అధికారానికి దూరం చేస్తారు. కాబట్టి వీటన్నింటిపై స్పందించే హక్కు భారతీయులకే ఉంటుందని భావిస్తున్నాం’’ అని పేర్కొన్నారు. అదే విధంగా... కశ్మీర్‌కు రానున్న యూరోపియన్ యూనియన్ బృందంలో హంగేరీ ప్రతినిధి కూడా ఉంటారన్న ప్రశ్నకు బదులుగా... ‘‘ కశ్మీర్‌కు వెళ్తామని మేం ఎవరికీ చెప్పలేదు. భారత్‌తో ద్వైపాక్షిక బంధాలు మెరుగుపరచడానికే మా రాయబారి ఇక్కడ ఉన్నారు. ఇక కశ్మీర్ పర్యటన అందులో భాగం కాదు కదా’’ అని పీటర్ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. కాగా చైనా సహాయంతో ఐక్యరాజ్య సమితి భద్రతామండలిలో కశ్మీర్ అంశాన్ని మరోసారి లేవనెత్తేందుకు ప్రయత్నించి.. దాయాది దేశం పాకిస్తాన్ భంగపడిన విషయం తెలిసిందే. ’‘ ఐక్యరాజ్య సమితి వేదికగా పాక్ ప్రతినిధులు పదేపదే చేసిన నిరాధార ఆరోపణలకు మద్దతు లభించలేదు’’అని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ తెలిపారు. ఈ నేపథ్యంలో యూరోపియన్ దేశం హంగేరీ విదేశాంగ మంత్రి పీటర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఐరాసలో పాక్‌కు మళ్లీ భంగపాటు -
రవీందర్‌కు రజతం
బుడాపెస్ట్ (హంగేరి): ప్రపంచ అండర్–23 రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్ రవీందర్ రజత పతకంతో సంతృప్తి పడ్డాడు. బుధవారం జరిగిన పురుషుల 61 కేజీల ఫ్రీస్టయిల్ ఫైనల్లో రవీందర్ 3–5 పాయింట్ల తేడాతో ఉలుక్‌బెక్ జోల్‌డోష్‌బెకోవ్ (కిర్గిస్తాన్) చేతిలో ఓడిపోయాడు. మూడు నిమిషాల తొలి రౌండ్ ముగిశాక 1–0తో ఆధిక్యంలో నిలిచిన రవీందర్ మరో మూడు నిమిషాల నిడివిగల రెండో రౌండ్లో మాత్రం తడబడ్డాడు. బౌట్ ముగియడానికి రెండు నిమిషాల సమయం ఉందనగా ఉలుక్‌బెక్ ఇంజ్యూరీ టైమ్ తీసుకున్నాడు. ఆ తర్వాత ఒక్కసారిగా ఉలుక్‌బెక్ రెండు మూవ్‌మెంట్స్‌తో నాలుగు పాయింట్లు సంపాదించి 4–1తో ఆధిక్యంలోకి వెళ్లాడు. చివరి సెకన్లలో రవీందర్ తేరుకున్నా అప్పటికే ఆలస్యమై పోయింది. ఇదే టోర్నీ మహిళల 50 కేజీల విభాగంలో భారత రెజ్లర్ జ్యోతి కాంస్య పతకం కోసం పోటీపడనుంది. సెమీఫైనల్లో జ్యోతి 4–15తో కికా కగాటా (జపాన్) చేతిలో ఓడిపోయింది.ప్రపంచ అండర్–23 రెజ్లింగ్ టోర్నీలో భారత్‌కు ఓవరాల్‌గా లభించిన పతకాలు. ఈ ఐదూ రజతాలే కావడం గమనార్హం. గతంలో బజరంగ్, వినోద్ కుమార్, రీతూ ఫొగాట్ (2017లో), రవి దహియా (2018లో) రజత పతకాలు నెగ్గారు. -
హాసన్‌ని కాదు శ్రుతీని!
నటిగా ఇండస్ట్రీలో పదేళ్లు పూర్తి చేసుకున్నారు శ్రుతీహాసన్. ఈ సెలబ్రేషన్‌ను బుడాపెస్ట్‌లో (హంగేరీ దేశం) జరుపుకుంటున్నారు. ఇంతకీ. అక్కడేం చేస్తున్నారనుకుంటున్నారా? త్వరలోనే ఓ హాలీవుడ్ టీవీ సిరీస్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. దానికి సంబంధించిన యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొనడం కోసం శిక్షణ తీసుకుంటున్నారామె. కొత్త సిరీస్, పదేళ్ల ప్రయాణం గురించి శ్రుతీహాసన్ మాట్లాడుతూ – ‘‘ట్రెడ్‌స్టోన్’ అనే టీవీ సిరీస్ చేస్తున్నాను. ఈ సిరీస్‌లో భారీ యాక్షన్ సన్నివేశాలున్నాయి. అందుకే ప్రతీరోజు కఠినమైన శిక్షణలో పాల్గొంటున్నాను. స్క్రిప్ట్ విన్నప్పుడు యాక్షన్ సన్నివేశాలేగా.. పదేళ్లుగా సినిమాలు చేస్తున్నాం. అంత కష్టంగా ఉంటాయా? అనుకున్నాను. కానీ చాలా కష్టంగా ఉన్నాయి. నేను దీన్ని బాధగా చెప్పడంలేదు. కానీ వర్క్‌ని చాలా ఎంజాయ్ చేస్తున్నాను. పదేళ్లయినా కూడా నేను పని చేస్తూనే ఉండాలని కోరుకున్నాను. నేను అనుకున్నట్లుగానే జరగడం ఆనందంగా ఉంది. అలాగే ప్రస్తుతం నెపోటిజమ్ (బంధు ప్రీతి) గురించి చర్చలు ఎక్కువ జరుగుతున్నాయి. నా ఇంటి పేరే చిత్రపరిశ్రమలో నాకు తలుపు తెరిచిందని బాగా తెలుసు. ఆ పేరే లేకపోతే కష్టాలు పడాల్సి వచ్చేది. అందుకు నేను మావాళ్లకు కృతజ్ఞురాలిగానే ఉంటాను. అయితే నేను కేవలం హాసన్గానే ఉండిపోకుండా శ్రుతీగా నిలబడ్డాను. నాకంటూ ప్రత్యేకమైన పేరు తెచ్చుకోగలిగాను. అది అందరికీ తెలిసిందే’’ అని అన్నారు. -
అక్కడ మరో ఇద్దరు చంద్రుళ్లు..!
భూ గ్రహానికి ఒక ఉపగ్రహం మాత్రమే ఉందనీ.. అది చంద్రుడనీ అందరికీ తెలుసు. మనం అనుకుంటున్నట్టు భూమికి చంద్రుడితో పాటు మరో రెండు ఉపగ్రహాలున్నాయనీ హంగేరీకి చెందిన ఆస్ట్రనామర్లు, భౌతిక శాస్త్రవేత్తలు తేల్చారు. దట్టమైన దుమ్మూ, ధూళితో కూడిన చంద్రుని వంటి నిర్మితాలు రెండు భూమికి ఉపగ్రహాలుగా ఉన్నాయనే ఆధారాలు తమ వద్ద ఉన్నాయని వారు వెల్లడించారు. దీంతో 50 ఏళ్ల క్రితం మొదలైన ‘చంద్ర పరిశోధన’ లకు ఫలితం దక్కినట్టయింది. కాగా, రాయల్ ఆస్ట్రనామికల్ సొసైటీ ఈ పరిశోధనలపై కథనం ప్రచురించింది. దాని ప్రకారం.. భూమికి ఉపగ్రహాలుగా మరో రెండు చంద్రుళ్లున్నాయని నిరూపించేందుకు అవసరమైన డేటా హంగేరీయన్ శాస్త్రవేత్తల వద్ద ఉంది. దుమ్మూ, ధూళితో నిర్మితమైయున్న ఈ పదార్థాలు భూమి కంటే 9 రెట్లు వెడల్పుగా ఉంటాయని వెల్లడైంది. అనగా ఈ నిర్మితాలు భూమికంటే 45 వేల నుంచి 65 వేల మైళ్ల వెడల్పుంటాయి. కొన్ని ముఖ్య విషయాలు.. చంద్రుణ్ని పోలిన నిర్మాణాలు అంతరిక్షంలో ఉన్నాయనీ, అవి భూమి చుట్టూ తిరుగుతున్నాయనే అంచనాలు 1961లోనే మొదలయ్యాయి. పోలండ్‌కు చెందిన ఆస్ట్రనామర్ కజిమియర్జ్ కార్డ్లీస్కీ దుమ్మూధూళితో కూడిన చంద్రుణ్ని పోలిన నిర్మాణాలు ఉన్నాయని గుర్తించారు. ఈయన పేరుమీదనే వాటిని కార్డ్లీస్కీ మేఘాలుగా పిలుస్తున్నాం. కాగా, తాజాగా వెలుగుచూసిన కార్డ్లీస్కీ మేఘాలు తేలికపాటి దుమ్ము, ధూళి అణువులతో నిర్మితమై ఉన్నందున పెద్దగా బరువుండవు. కానీ, సూర్యకిరణాలు ఈ మేఘాలపై పడినప్పుడు అవి కాంతిమయమవుతాయని రాయల్ సొసైటీ తెలిపింది. ఈ నిర్మితాలు చంద్రుని కన్నా భూమికి దగ్గరగా ఉన్నా.. సూర్యుడు, నక్షత్రాలు, అంతరిక్ష వెలుతుర్ల కారణంగా మనకు కనిపించడం లేదని ఈ రిపోర్టు వెల్లడించింది. కార్డ్లీస్కీ మేఘాలు తరచూ మార్పులకు లోనవుతాయి. ఇవి ఒకే క్షక్ష్యలో తిరుగుతూ వేల సంవత్సరాలు ఉనికిలో ఉంటాయి. అయితే తేలికపాటి పదార్థాలతో నిర్మితమైనందున వాటిలో అంతర్గంతంగా ఉన్న అణువులు ఒకదాన్నొకటి రాసుకూంటూ ఉంటాయని కథనం ప్రచురించింది. కాగా, కార్డ్లీస్కీ మేఘాలు అంతరిక్ష ప్రయోగాలకు ఉపకరిస్తాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. -
ఎయిర్ ఇండియా విమానానికి తెగిన సంబంధాలు
-
ఒలింపిక్స్ బిడ్ నుంచి తప్పుకున్న బుడాపెస్ట్
బుడాపెస్ట్: ఒలింపిక్స్ లాంటి మెగా ఈవెంట్‌కు ఆతిథ్యమిచ్చిన ఆయా దేశాల ఆర్థిక పరిస్థితి ఇటీవల ఎంతగానో దిగజారడం మనకు కనిపిస్తోంది. హంగేరీ ఈ విషయాన్ని తొందరగానే గుర్తించింది. 2024 ఒలింపిక్స్ నిర్వహణ బిడ్ నుంచి తమ నగరం బుడాపెస్ట్ తప్పుకుంటున్నట్లు ఆ ప్రభుత్వం ప్రకటించింది. పెద్దమొత్తంలో ప్రజాధనాన్ని వినియోగించాల్సి వస్తుంది కాబట్టి 2024లో దేశ రాజధాని బుడాపెస్ట్‌లో ఈ క్రీడలకు ఆతిథ్యమివ్వా లా? వద్దా? అనే అంశంపై పౌరుల నిర్ణయాన్ని తెలపాలని కోరింది. ఒలిం పిక్స్ నిర్వహణను వ్యతిరేకిస్తూ ప్రజల నుంచి పెద్ద మొత్తంలో ఓట్లు పోలవడంతో బుడాపెస్ట్... ఒలింపిక్స్ బిడ్ నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొంది. -
సరిహద్దుల్లో పందుల తలకాయలు వేలాడదీస్తారా?
బుడాపెస్ట్: సిరియా దేశం నుంచి వస్తున్న ముస్లిం వలసలను నిరోధించేందుకు ఇంతవరకు భౌతిక దాడులకు దిగిన హంగేరి ప్రభుత్వం ఇప్పుడు అనైతిక చర్యకు ఆలోచన చేయడంపై ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సెర్బియా సరిహద్దు గుండా దేశంలోకి ముస్లింల వలసలను నిరోధించేందుకు సరిహద్దు కంచె వద్ద తెగ నరికిన పందుల తలలను వేలాడదీయాలంటూ యూరోపియన్ పార్లమెంట్ సభ్యుడు, హంగేరి పాలకపక్ష పార్లమెంట్ సభ్యుడు గ్యోర్జి స్కాఫిన్ సూచన చేశారు. దీనికి కొంత మంది పాలకపక్ష సభ్యులు మద్దతు పలగ్గా ప్రతిపక్ష సభ్యులు విమర్శలు గుప్పిస్తారు. ఈ సూచనపై మానవ హక్కుల సంఘాలు విరుచుకుపడుతున్నాయి. ఇప్పటికే సరిహద్దు కంచె వద్ద వలస ప్రజలను భయపెట్టేందుకు క్యారెట్లతో తయారు చేసి, వేలాడదీసిన ‘దిష్టి బొమ్మ’లను తీసివేయాలని డిమాండ్ చేస్తున్న అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు ఇప్పుడు అంతకంటే భయంకరమైన ఆలోచన చేయడం పట్ల మండి పడుతున్నాయి. సిరియా దేశాల నుంచి వస్తున్న ముస్లిం ప్రజల వలసలను అరికట్టేందుకు సెర్బియా వద్ద హంగేరి గతేడాదే సరిహద్దును మూసివేసింది. ముట్టుకుంటే కోసుకుపోయే పదునైన రేసర్ లాంటి కంచెను ఏర్పాటు చేసింది. అయినా వలస ప్రజలు దూసుకువస్తుండడంతో హంగేరి సైన్యం వారిపై భౌతిక దాడులకు దిగింది. మహిళలు, పిల్లలు అనే విచక్షణ చూడకుండా ముస్లిం ప్రజలను పిడిగుద్దులు కురిపిస్తున్నారు. లాటీలు, తుపాకీ మడమలతో చితక బాదుతున్నారు. ఈ సంఘటనలపై ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘం కూడా స్పందించి ఈ సంఘటనలపై దర్యాప్తు జరిపించాల్సిందిగా హంగేరి ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇప్పటికీ సరిహద్దుల గుండా దాదాపు పది లక్షల మంది ప్రజలు తమ దేశంలోకి అక్రమంగా ప్రవేశించారని, వారికి ఎన్ని విధాలుగా నచ్చ చెప్పినా వలసలు ఆగడం లేదని హంగేరి ప్రభుత్వం వాదిస్తోంది. -
నా నరాల్లో పామురక్తం...మాజికల్ పవర్ నా సొంతం
హంగరీ: బాక్సింగ్ లో బారతీయ ఆటగాడిని ఎలాగైనా ఓడించాలనే తపనతో హంగేరియన్ బాక్సర్ అష్టకష్టాలు పడుతున్నాడు. భారత బాక్సర్ ఒలంపిక్ విజేత, పద్మశ్రీ, విజయేంద్ర సింగ్ ను ఎదర్కోవడానికి హంగరీ బాక్సర్ అలెగ్జాండెర్ హోర్వాత్(20) తన డైట్ లో సాంప్రదాయ పద్ధతులను ఫాలో అవుతున్నాడట. పాము రక్తాన్ని తాగుతున్నానని, దీంతో తన పవర్ పంచ్ లతో ఇక అతనికి సరైన గుణపాఠం చెబుతానంటున్నాడు. బాక్సింగ్ రింగ్ లో విజయేంద్ర సింగ్ తో తలపడేందుకు పాము రక్తాన్ని తాగుతున్నాడు. పాము తాజా రక్తాన్ని తాగడం ద్వారా తన శరీరాన్ని మరింత ధృఢంగా శక్తివంతంగా తయారు చేసుకోవాలని అతని ప్లాన్. పాము రక్తాన్ని సేవించడం వల్ల అద్భుతమైన శక్తి సామర్ధ్యాలను సాధించ వచ్చని హంగేరియన్లు నమ్ముతారు. శతాబ్దాలుగా కొనసాగుతున్న ఈ సాంప్రదాయం సైనికుల్లో కూడా అమల్లో ఉంది. అనేక శతాబ్దాలుగా తన కుటుంబంలో తాజా పాము రక్తాన్ని తాగడం సంప్రదాయం గా కొనసాగుతోందని స్వయంగా అలెగ్జాండర్ తెలిపాడు. ఇది తనకు చాలా గర్వకారణమని, దాని మాజికల్ పవర్ ను మాటల్లో చెప్పలేనన్నాడు. పాము రక్తం తన నరాల్లో ప్రవహిస్తున్నంతసేపు తనకిక ఎదురే ఉండదని, తన ప్రధాన ప్రత్యర్థి విజయేందర్ ను మట్టికరిపిస్తానని వ్యాఖ్యానించాడు. కాగా మార్చి 12 న భారతీయ స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ తో హంగేరియన్ బాక్సర్ అలెగ్జాండర్ తలపడనున్నాడు. ప్రొఫెషనల్ బాక్సింగ్ లో మూడు విజయాల తర్వాత విజయేందర్ కు ఇది నాల్గవ పోటీ. అటు అలెగ్జాండర్ తనకు గట్టి పోటి ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ అతణ్ని ఓడించడం పెద్దకష్టం కాదని విజయేందర్ ఇప్పటికే ప్రకటించాడు. -
ఏకమైన బుడా, పెస్ట్ నగరాలు
20 నవంబర్, 1873 హంగేరీ రాజధాని ఏది? అనగానే చిన్నపిల్లాడు కూడా బుడాపెస్ట్ అని ఠపీమని చెబుతున్నారు కానీ, బుడాపెస్ట్ అనేది ఒకప్పుడు ఒకటి కాదు, రెండు నగరాలు. అవీ కూడా ఒకదాంతో మరోదానికి బద్ధశత్రువులుగా మెలిగిన నగరాలు. కొన్ని ప్రయోజనాల కోసం పరస్పర శత్రుప్రాంతాలైన బుడా, పెస్ట్ నగరాలు ఏకమై బుడాపెస్ట్గా మారి, హంగేరీ దేశానికి రాజధానిగా మారాయి. డాన్యూబ్ నదికి కుడి, ఎడమ దిశలలో ఉండేవి బుడా, పెస్ట్ నగరాలు. బుడా ప్రాంతం ఇప్పటికీ కొండలు, లోయలు, ఇరుకైన రోడ్లు, పురాతన కట్టడాలతో పురాతన నాగరికతకు, ప్రకృతి రమణీయతకు ఆనవాలుగా ఉంటుంది. అత్యాధునిక కట్టడాలు, అత్యద్భుత భవనాలు, సువిశాలమైన రోడ్లతో, ఆహ్లాదకరమైన పార్కులతో, ఆధునిక నాగరకతకు ఆలవాలంగా ఉంటుంది పెస్ట్. ఒకప్పుడు కత్తులు దూసుకున్న ఈ నగరాలు బలమైన రాజధానిని ఏర్పరచడం కోసం తమ శత్రుత్వాన్ని మరచి ఒకటయ్యాయి. బుడాపెస్ట్ ఒక్కటీ సువిశాలమైన నగరంగా మారి హంగేరీ దేశానికి రాజధాని ఏర్పడింది. -
రాయల్ బెంగాల్ టైగర్ మాతా
-
వేసవిలో చల్లగా.. శీతాకాలం వెచ్చగా..!
ఎండాకాలం ఎండలు. వానాకాలం వానలు. చలికాలం చలి.. కాలం ఏదైనా మనిషికి కష్టాలు మాత్రం కామనే! అందుకే అన్ని కాలాల్లోనూ సౌకర్యంగా ఉండే ఇల్లుంటే బాగుంటుందని చాలామంది అనుకుంటారు. అలాంటి వారి కోసం డిజైన్ చేసిందే ఈ ‘ఆల్‌వాటర్’ హోమ్! ఈ ఇల్లు వేసవిలో చల్లగా ఉంటుంది. చలికాలం వెచ్చగా ఉంటుంది! కరెంటు అవసరాన్ని చాలావరకూ తగ్గిస్తుంది కూడా! బయటి వాతావరణంతో సంబంధం లేకుండా లోపల ఎల్లప్పుడూ మనకు అనుకూలమైన వాతావరణమే ఉండే ఈ ఆల్‌వాటర్ ఇల్లును హంగేరికి చెందిన డాక్టర్ మత్యాస్ గుటాయ్ అనే ఆర్కిటెక్ట్ డిజైన్ చేశారు. ఇంటి గోడల్లో ఇటుకలకు బదులుగా గాజు, స్టీలుతో చేసిన ప్యానెళ్లను అమర్చే ఈ పద్ధతికి ఆయన ‘ఆల్‌వాటర్ టెక్నాలజీ’ అని పేరుపెట్టారు. దీనినే ‘లిక్విడ్ ఇంజనీరింగ్’గానూ పిలుస్తున్నారు. ఈ పద్ధతిలో ఓ చిన్న ప్రొటోటైప్(ప్రాథమిక నమూనా) ఇంటిని ఆయన నిర్మించారు. గోడల్లో నీరు! ఆల్‌వాటర్ ఇల్లు నిర్మాణం కోసం ప్రత్యేకంగా రూపొందించిన గ్లాస్, స్టీలు ప్యానెళ్లతో గోడలను నిర్మిస్తారు. పైకప్పులోనూ ఇవే ప్యానెళ్లు ఉంటాయి. రెండు రెండు ప్యానెళ్లను దగ్గరగా కలిపి అమర్చడం వల్ల వీటి మధ్యలో సన్నటి ఖాళీ ఏర్పడుతుంది. ఈ ప్యానెళ్లన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటాయి. వీటిలో నీరు, ప్రత్యేక ద్రవం, వాయువులను నింపుతారు. దీంతో అన్ని ప్యానెళ్లలోని నీరు కలిసిపోయి ఉంటుంది. దీనివల్ల ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ప్యానెళ్లలోని నీటి ఉష్ణోగ్రత ఇల్లంతా ఒకే స్థాయిలో ఉంటుంది. ఉష్ణోగ్రతలు బాగా తక్కువగా ఉన్నప్పుడు కూడా వీటిన్నింటిలో సమ ఉష్ణోగ్రత ఉంటుంది. అందువల్ల ఇంటిలో కూడా సమ ఉష్ణోగ్రతతో కూడిన వాతావరణం ఉంటుంది. అదేవిధంగా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు అందిన వేడిని స్టీలు ప్యానెళ్లు బయటికి పోనివ్వకుండా నిల్వ చేసుకుంటాయి. ఉష్ణోగ్రతలు పడిపోయి వాతావరణం చల్లగా మారినప్పుడు ఆ వేడిని ఇంటిలోపలివైపు విడుదల చేస్తాయి. ఈ ప్రక్రియను మెకానికల్‌గా కూడా నియంత్రించవచ్చట. భలే ఇల్లు కదూ! -
హంగేరీ
ప్రపంచ వీక్షణం నైసర్గిక స్వరూపం ఖండం: యూరప్ వైశాల్యం: 93,030 చదరపు కిలోమీటర్లు జనాభా: 98,77,365 (తాజా అంచనాల ప్రకారం) రాజధాని: బుడాపెస్ట్ ప్రభుత్వం: యూనిటరీ పార్లమెంటరీ కాన్స్టిట్యూషనల్ రిపబ్లిక్ కరెన్సీ: ఫోరింట్ భాష: మాగ్యార్ (హంగేరియన్) మతం: క్రైస్తవులు వాతావరణం: జనవరిలో-4 నుండి 1 డి గ్రీ వరకు, జులైలో 16 నుండి 28 డిగ్రీల వరకు. పంటలు: తృణధాన్యాలు, బంగాళదుంపలు, చెరుకు, కూరగాయలు, పళ్లు, ద్రాక్ష. పరిశ్రమలు: ఇనుము, ఉక్కు పరిశ్రమలు, దుస్తులు, రసాయనాలు, యంత్ర పరికరాలు, రవాణా పరికరాలు, కలప ఉత్పత్తులు, గనులు. ఎగుమతులు: ఆహార ఉత్పత్తులు, యంత్ర పరికరాలు, రసాయనాలు, మోటారు వాహనాలు, దుస్తులు, ఇనుము, ఉక్కు. స్వాతంత్య్రం: అక్టోబర్ 23, 1989. సరిహద్దులు: చెకొస్లోవేకియా, రష్యా, రొమేనియా, యుగొస్లావియా, ఆస్ట్రియా. చరిత్ర వెయ్యి సంవత్సరాల కిందటే ఈ దేశపు పునాదులు ఏర్పడ్డాయని చర్రిత చె బుతోంది. క్రీస్తుశకం 896 లో మాగ్యార్లు అనే రష్యా దేశపు స్టెప్పీలు డాన్యూబ్ నది తీరం గుండా వచ్చి ఈ ప్రాంతంలో స్థిరపడ్డారు. వీరు నిజానికి దేశ దిమ్మరులు. గుర్రాలను పెంచుకోవడం వీరికి వృత్తి. వీళ్లకు నాయకుడు అర్పాడ్, ఇతను ప్రస్తుత హంగేరీ దేశపు పశ్చిమ భాగాన్ని ఆక్రమించి పరిపాలించాడు. మొట్టమొదటి హంగేరియన్ సామ్రాజ్యం మాగ్వార్ రాజు స్టీఫెన్ నాయకత్వంలో క్రీస్తుశకం 1000 శతాబ్దంలో ఏర్పడింది. ఈ సామ్రాజ్యం క్రమంగా విస్తరించింది. అయితే మధ్య మధ్యన తుర్కులు దాడులు చేస్తూ ఉండేవారు. చివరికి వీరు హంగేరీ మధ్య భూభాగాన్ని ఆక్రమించుకొని 150 సంవత్సరాలు పరిపాలన చేశారు. వీరు 16, 17 శతాబ్దాలలో తమ సామ్రాజ్యాన్ని విస్తరించారు. ఆస్ట్రియాను పరిపాలిస్తున్న హప్స్‌బర్గ్ పాలకులు ఈ తుర్కుల మీద క్రమంగా దాడులు చేసి క్రీస్తు శకం 1699లో హంగేరీ దేశాన్ని పూర్తిగా ఆక్రమించారు. 1848 లో ఆస్ట్రియా స్వాతంత్య్ర పోరాటాన్ని వీరు రష్యా సహకారంతో అణచి వేశారు. అయితే మాగ్యార్లు తను అస్తిత్వాన్ని చాటుకోవడానికి హప్స్‌బర్గ్ పాలకుల మీద తిరుగుబాటు ఫలితంగా 1867లో ద్వంద్వ పాలన చేయాలని నిర్ణయం జరిగింది. దాని ఫలితంగా ఆస్ట్రో హంగేరీ రాజ్యపాలనలో మాగ్యార్లతో పాటు చెకొస్లోవేకియన్లు, స్లోవేనియన్లు, సెర్బ్‌లు కూడా భాగస్వాములు అయ్యారు. మొదటి ప్రపంచయుద్ధం తరువాత హాప్స్బర్స్ రాజ్యం కూలిపోయింది. ఫలితంగా హంగే రీ తన భూభాగాన్ని ఒక వంతు చెకోస్లోవేకియాకు, రుమేనియాకు, యుగొస్లోవియాకు కోల్పోయింది. 1930 దశకంలో హంగేరీ, జర్మన్ ఆధిపత్యంలో పని చేసింది. రెండో ప్రపంచ యుద్ధంలో హంగేరీ జర్మనీతో కలిసి రష్యాపై యుద్ధం చేసింది. అయితే రెండో ప్రపంచయుద్ధం పూర్తయ్యాక చిత్రంగా హంగేరీ రష్యాకు అనుకూలంగా మారిపోయింది. ప్రజలు - సంస్క ృతి హంగేరీ ప్రజలు తమ పూర్వపు మాగ్యావర్ సంస్కృతిని, ఆ భాషను, అప్పటి ఆహార రీతులను, పురాతన జాపపద సంగీతాన్ని ఎంతో ఇష్టపడతారు. హంగేరియన్లు భోజనాన్ని చాలా సుష్టుగా తింటారు. బాగా తాగుతారు కూడా! పాప్రికా అనే ఆహారాన్ని బాగా తింటారు. టోకాజ్, బుల్స్బ్లడ్ అనే పేరు గల వైన్ ఇక్కడ ఉత్పత్తి అవుతుంది. ప్రజలు కూడా వీటికి అధికంగా ఉపయోగిస్తారు. భార్యాభర్తలిద్దరూ పనికి వెళ్లడం ఇక్కడ రివాజు. జాతీయ, ప్రాంతీయ ఉత్సవాలలో జానపద గీతాలు, నృత్యాలు ఇక్కడ సర్వసాధారణం. నగరాలలో మహిళలు జీన్స్, సూట్స్ ధరిస్తారు. ఎంబ్రాయిడరీ చేసిన, లేసులతో అల్లిన టోపీ మహిళలు సాధారణంగా ధరిస్తారు. ఉర్గోస్, కరికాజో, సర్దాస్ అనే పేర్లు గల నృత్యాలు బాగా ప్రాచూర్యంలో ఉన్నాయి.ఇక హంగేరీయన్లు తమ శరీరాలను మర్దన చేసుకోవడానికి ఎక్కువ ఇష్టపడతారు. మర్దన కోసం ‘స్పా’లు ప్రతిచోటా అందుబాటులో ఉంటాయి. దేశ పరిపాలనా రీతులు - ప్రత్యేకతలు హంగేరీ దేశం పరిపాలనా సౌలభ్యం కోసం 19 కౌంటీలుగా విభజింపబడింది. ఈ 19 కౌంటీలు తిరిగి 198 రైడింగ్లుగా విభజింపబడ్డాయి. దేశం మొత్తంలో 20 నగరాలు అతి పెద్దవిగా చలామణి అవుతున్నాయి. వీటిలో బుడాపెస్ట్, డెబ్రెసెన్, మిస్కోల్క్, జెగెడ్, పెక్స్, గ్యోర్, నిరె గీజా, మొదలైనవి పెద్ద జనాభాలో ఉన్నాయి. దేశంలో రొమేనియన్లు, జర్మన్లు, స్లోవాక్లు, రొమేనియన్ల జనాభా కూడా బాగా ఉంది. 1. {పపంచం మొత్తంలో కుర్రకారుకు ఇష్టమైన రూబిక్ క్యూబ్‌ను కనిపెట్టిన వ్యక్తి ఈ దేశానికి చెందినవాడే. అతడి పేరు ఎర్నో రూబిక్, 1974లో అతడు క్యూబ్‌ను కనిపెట్టాడు. అదే రూబిక్ క్యూబ్. 2. ‘విటమిన్ సి’ ని కనిపెట్టిన అల్బర్ జెంట్ ఈ దేశానికి చెందిన వాడు. అతడి కి 1937లో నోబెల్ బహుమతి లభించింది. 3. ప్లాస్మో టీవిని 1936లో ఈ దేశానికి చెందిన శాస్త్రవేత్త కల్మన్ తిహాన్యీ దానిని కనిపెట్టాడు. 4. మనం విరివిగా ఉపయోగిస్తున్న బాల్ పాయింట్ పెన్నును లాస్జ్లో బైరో అనే శాస్త్రవేత్త కనిపెట్టాడు. అతడు ఈ దేశస్థుడే. 5. ప్రపంచ ప్రసిద్ధి చెందిన హ్రైడోజన్ బాంబును ఈ దేశస్థుడైన ఎడ్వర్డ్ టెల్లర్ కనిపెట్టాడు. చూడదగిన ప్రదేశాలు బాలాటన్ సరస్సు బాలాటన్ సరస్సు - ఆ సరస్సులో ఉన్న ద్వీపగ్రామం. గ్రామంలో ఉన్న 17వ శతాబ్దపు బెనెడిక్ట్ ఆబే చూడద గ్గవి. దాదాపు 598 చదరపు కిలోమీటర్లు వెడల్పు ఉన్న సరస్సు నీలి ఆకాశపు రంగును కలిగి ఉండి సందర్శకులను మంత్రముగ్థులను చేస్తుంది. దేశం మొత్తంలో ఒక అద్భుతమైన టూరిస్టు ప్రదేశం ఇది. ఇక్కడ ఒక ఓడరేవు కూడా ఉండడం ఒక విశేషం. ఈ సరస్సునే హంగేరీయన్ సముద్రం అని ముద్దుగా పిలుస్తుంటారు. ఈ సరస్సు చుట్టూ 130 బీచ్‌లు ఉన్నాయి. సరస్సు రెండువైపులా అనేక చిన్న చిన్న గ్రామాలు, రిసార్టులు నిండి ఉన్నాయి. ఇక్కడ సంవత్సరం పొడవునా యాత్రికులు సందడి చేస్తుంటారు. చిన్న చిన్న గుహలు, ఎకో హిల్, సక్స్ హిల్, అబే, ఇంకా సరస్సు చుట్టూ దాదాపు 30 చిన్న గ్రామాలు నెలకొని ఉన్నాయి. బుడాపెస్ట్ హంగేరీ దేశాన్ని దర్శించడానికి ప్రపంచ వ్యాప్తంగా సందర్శకులు వస్తూ ఉంటారు. సందర్శకుల రాకడలో ఈ దేశం ప్రపంచంలో పదమూడవ స్థానంలో ఉంది. దేశ రాజధాని బుడాపెస్ట్ సంవత్సరం పొడవునా సందర్శకులతో కళకళలాడుతూ ఉంటుంది. ఇక్కడ చారిత్రక ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. వియన్నా గేట్ స్క్వేర్లు ఉన్న వరుస గృహాలు, సండోర్ రాజభవనం ఇప్పుడిది అధ్యక్ష భవనంగా మారింది. వర్కర్ట్ కాసినో, 17వ శతాబ్దంలో నిర్మించిన పెటెర్ఫీ ప్యాలెస్, గ్రేషుమ్ ప్యాలెస్, హంగేరియన్ అకాడమీ ఆఫ్ సెన్సైస్, బుడా క్యాజిల్, స్టేట్ ఓపెరా హవుస్ గోల్డ్ మ్యూజియం, బాహవుస్ విల్లాలు, సిటీ పార్క్, ఇన్నర్ సిటి పరిశ్ చర్చి, కేవ్ చర్చి, లిబర్టీ విగ్రహం, లిబర్టీ బ్రిడ్జి, హీరోస్ స్క్వేర్, గ్రేట్ మార్కెట్ హాల్, మిల్లేనియం పార్లమెంట్ బిల్డింగ్ సెయింట్ స్టీఫెన్ బాసిలికా, గుల్ బాబా టోంబ్, సెయింట్ ఇస్త్వాన్ బాసిలికా, డాన్యూబ్ నది మీద నిర్మించిన వివిధ వంతెనలను తప్పక చూడాల్సిందే. మొత్తం ఏడు బ్రిడ్జిలు, ఏడు విధాలుగా ఉంటాయి. ఎగెర్ ఈ చారిత్రాత్మక నగరం దేశ ఉత్తర ప్రాంతంలో ఉంది. ఈ నగరం మాట్రాబక్ అనే రెండు పర్వతాల మధ్య ఉంది. ఈ నగర ప్రత్యేకతలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా అద్భుత శైలిలో శతాబ్దాల క్రితం నిర్మించిన క్యాజిల్‌లు, ధర్మల్ బాత్ ప్రదేశాలు, చారిత్రక కట్టడాలు ఉన్నాయి. ముఖ్యంగా టర్కిష్ ప్రజలు తమ ఉనికి తెలుపుకోవడానికి దశాబ్దాల క్రితం నిర్మించిన ఒంటి స్తంభ మినరెట్ నగరానికి ఒక ప్రత్యేక ఆకర్షణ. ఈ స్తంభం 42 మీటర్ల ఎత్తు ఉంటుంది. లోపలి నుండి పైవరకు ఎక్కడానికి 97 మెట్లు ఉంటాయి. నగరంలో సెర్బియన్ల చర్చి రెక్టెంప్లమ్ మరో ప్రత్యేక ఆకర్షణ. ఇక వైన్ మ్యూజియం మద్యం ప్రియులను ఎంతగానో ఆకర్షిస్తుంది. పిర్కర్ ప్రాంతంలో నిర్మించిన బాసిలికా ఒక గొప్ప కట్టడం. నగరంలో ఇళ్లు సాధారణంగా రెండు లేదా మూడు అంతస్తుల్లో ఉంటాయి. ఇంటి పైకప్పులన్నీ దాదాపు ఎరుపు రంగుతో ఉంటాయి. దూరం నుండి చూస్తే ఎరుపుదనం పరుచుకున్నట్లు కనబడుతుంది. మొహాక్స్ ఈ నగరం డాన్యూబ్ నది ఒడ్డున ఉంది. ఈ నగరంలో పదిహేను, పదహారు శతాబ్దాలలో రెండు యుద్ధాలు జరిగాయి. మొదటిది క్రీ.శ.1526లో జరిగింది. ఈ యుద్ధంలో ఒట్టోమాన్ రాజులు గెలిచి ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు. రెండవది క్రీ.వ. 1687 లో జరిగింది. ఈ యుద్ధంలో ఒట్టోమాన్ రాజులు ఓడిపోయి కనుమరుగైపోయారు. ఓట్టోమాన్ రాజులు ఈ ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేశారు. ఆనాటి ఆనవాళ్లు నేటికీ మనకు కనిపిస్తాయి. ఈ నగరంలో ఆనాడు యుద్ధాలలో మరణించిన 1700 మంది సైనికులకు గుర్తుగా మొహాక్స్ టార్టెనెల్మి ఎమ్లెంఖేమి అనే నిర్మాణం నేటికి నిలిచి ఉంది. ఈ నగరం ప్రతి వసంత మాసంలో బుసోజరాస్ కార్నివాల్ పండగ జరుగుతుంది. నగరం మధ్యలో టౌన్‌హాల్ భవనం, దాని నిర్మాణం ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తాయి. మెమోరియల్ పార్క్, డాన్యూబ్ నది పరవ ళ్లు అందరినీ ఆకట్టుకుంటాయి. ఈ నగరం నుండి ముగ్గురు వ్యక్తులు ప్రపంచానికి చాటి చెప్పారు. వారితో ఫెరెంక్ ఫాఫ్ గొప్ప ఆర్కిటెక్ట్, ఎండ్రేరోజ్దా ప్రపంచ ప్రసిద్ధ పెయింటర్, నోర్బర్ట్ మిచెలిస్ ఒక గొప్ప రేసింగ్ డ్రైవర్. -
కండల రాణి
భారతదేశం పెద్ద పెద్ద బాడీబిల్డర్లను ప్రపంచానికి పరిచయం చేసింది. కాని మహిళా బాడీబిల్డర్లు అప్పట్లో లేరు. అయితే, ఇప్పుడు మహిళల బాడీబిల్డింగ్‌లో రైజింగ్‌స్టార్ ఆవిర్భవించారు. ఆమే నగరవాసి కిరణ్ డెంబ్లా. ఇటీవల హంగేరిలో జరిగిన ప్రపంచ మహిళల బాడీబిల్డింగ్ ఛాంపియన్‌షిప్‌లో 6వ స్థానాన్ని కైవసం చేసుకుని మనదేశంలోనూ మహిళా బాడీబిల్టర్లు ఉన్నారని చాటిచెప్పారు ఈ ఇద్దరు పిల్లల తల్లి. కండలక్వీన్గా మారి నగరంలో ఫిట్నెస్ ప్రపంచానికి సరికొత్త దారులు తెరిచారు. కేవలం మగవారే కాదు మగువలు కూడా ఫిట్నెస్ పరంగా అద్భుతాలు సృష్టించగలరని నిరూపించడంతోపాటు రకరకాల కారణాలతో వ్యాయామానికి దూరమవుతున్న మహిళల్లో చైతన్యం తేవాలనేదే తన ప్రయత్నం అంటారు కిరణ్. యోగా కావచ్చు.. జాగింగ్ కావచ్చు.. ఏరోబిక్స్ కావచ్చు.. ఏదైనా సరే మహిళ తలచుకుంటే అగ్రస్థానంలో నిలవగలదని పేర్కొన్నారామె. -
నాడు నిరుపేద... నేడు కోటీశ్వరుడు!
హంగేరీకి చెందిన లాస్లో ఆండ్రాషెక్ (55) ఒకప్పుడు బాగా బతికాడు. కానీ ముప్ఫయ్యేళ్లు వచ్చేసరికి మద్యానికి బానిసై జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. అప్పులు చేశాడు. చివరకు నిలువ నీడ లేకుండా పోయి నిరుపేదగా మిగిలాడు. తల్లికి కూడా వయసైపోయి, అతడిని పోషించలేని పరిస్థితుల్లో ఉండటంతో... బంధువులు జాలిపడి ఆ తల్లీకొడుకులకు తిండిపెట్టేవారు. కానీ కొన్నాళ్లకు వాళ్లు కూడా విసిగిపోయారు. లాస్లోని బయటకు గెంటేయమని చెప్పారు. దాంతో తాను ఎలాంటి పరిస్థితుల్లో బతుకుతున్నాడో అర్థమైంది లాస్లోకి. కానీ ఎంత ప్రయత్నించినా మద్యానికి దూరం కాలేకపోయాడు. ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. అంతలో అతడికి సామాజిక కార్యకర్త అనికోతో పరిచయమైంది. ఇద్దరూ ప్రేమలో పడి, పెళ్లి చేసుకున్నారు. తర్వాత పదేళ్ల పాటు శ్రమించి అతడిని మామూలు మనిషిని చేసింది అనికో. చిన్నాచితకా పనులు చేసుకుంటూ, భార్యతో సంతోషంగా బతుకుతోన్న లాస్లో మొన్నామధ్య అనుకోకుండా ఓ లాటరీ టికెట్ కొన్నాడు. ఆ లాటరీ కాస్తా తగలడంతో ఒక్కసారిగా దాదాపు పదిహేడు కోట్ల రూపాయలు మన కరెన్సీ లెక్కలో వచ్చిపడ్డాయి. ఉక్కిరి బిక్కిరైపోయాడు లాస్లో. ఏదో సరదాగా కొన్నాను తప్ప, తగులుతుందనుకోలేదు అంటూ సంబరపడుతున్నాడు. అలాగని అతడు ఆ డబ్బును విలాసంగా ఖర్చు చేయాలనుకోవడం లేదు. ‘ఓర్పుతో నన్ను మామూలు మనిషిని చేసిన అనికోని ఏ లోటూ లేకుండా చూసుకుంటాను, మిగిలినదంతా పేదల కోసం ఖర్చుపెడతాను’ అంటున్నాడు. అదేంటి, ఏమీ దాచుకోవా అని అడిగితే... ‘నాకు డబ్బు మీద వ్యామోహం లేదు, ఇతరుల కోసం బతకడమే జీవితం అని నా భార్యని చూసి తెలుసుకున్నాను, నేనూ అలాగే బతుకుతాను’ అంటున్నాడు నవ్వుతూ. హ్యాట్సాఫ్ లాస్లో!