ప్రతి ఒక్కరు స్లిమ్ గా, చక్కటి గ్లోతో మెరిసి పోవాలని అనుకుంటారు. అందుకే తాము అభిమానించే హీరోలు, హీరోయిన‍్లు అందం కోసం వాడే బ్రాండెడ్ క్రీమ్స్ ను అప‍్లయ్ చేసి ఎదుటి వారికి తమని తాము అందంగా చూపించుకోవాలని ప్రయత్నిస‍్తుంటారు. మరికొంత మంది యూట్యూబ్ వీడియోలు చూసి రకరకాల రెసిపీలను ట్రై చేస్తుంటారు. అది కూడా సాధ్యపడకపోతే చివరికి అరే వాళ్లకంటే మనం బాగున్నాం అంటూ వారికి వారు సర్ధి చెప్పుకుంటుంటారు. ఇప్పుడంటే ఇలా ఉంటే పూర్వం అందం కోసం మనిషి రక్తంలో స్నానం చేసేవారు.
ముఖ్యంగా 16వ శతాబ్ధానికి చెందిన రాణులు వారి ఆస్థానంలో పెద్దలు చెప్పినట్లు అందం కోసం చిత్ర విచిత్రమైన పనులు చేసేవారు. అందులో కొన్ని పనులు అత్యంత దారుణంగా ఉండేవి. ఎలిజిబెత్ బాతోరి ప్రపంచంలో అంత్యత ప్రమాదకరమైన రాణి. ప్రస్తుతం యూరప్ దేశాల‍్లో ఓ భాగమైన హంగేరి దేశంలో హంగేరియన్ రాజకుటుంబానికి చెందిన రాణి ఈ ఎలిజిబెత్ బాతోరి. హంగేరిలో ఓ రాజ్యాన్ని పరిపాలించేది. ఆమెకు అందంగా ఉండడం అంటే మహా పిచ్చి. ఆ అందం కోసం 1585 నుండి 1610 సంవత్సరం మధ్య కాలంలో పెళ్లికాని 650 మంది యువతుల్ని చంపేసింది.
రాణి కావడంతో తన రాజభవనంలో పనిచేసేందుకు పెళ్లికాని యువతుల్ని ఆహ్వానించేది. పనిపేరుతో వారిని చంపేసి వారి రక్తంతో స్నానం చేసేది. ఎలిజిబెత్ బాతోరికి తనకు అత్యంత సన్నిహితంగా ఉండేవారు ఎవరో చెప్పారట. పెళ్లికాని యువతుల రక్తంతో స్నానం చేస్తే అందంగా కనిపిస్తారని. అదిగో అప్పటి నుండి పెళ్లికాని యువతుల్ని పనికి పిలిపించి హత్యలు చేసింది. ఆమెకు మరో ఆరుగురు సహకరించినట్లు చరిత్ర ఆధారాలు చెబుతున్నాయి. అంతమందిని హత్య చేస‍్తుంటే ఎవరు పట్టించుకోలేదా అంటే ఆమె అసలే రాణి. ఎవరు ప్రశ్నిస్తారు. అయితే చివరికి పాపం పండింది. ఎలిజిబెత్ దగ్గర పనిచేసే సుసన్నా అనే సేవకురాలు బయటపెట్టడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. 1610లో ఆమెకు కోర్ట్ జీవిత ఖైదు విధించింది. రాణి తన పలుకుబడితో ఉరిశిక్ష నుంచి తప్పించుకున్నట్లు చరిత్ర చెబుతోంది.
ఈ బాతోరి పై హంగేరియన్ కు చెందిన డైరక్టర్ జురాజ్ జకుబిస్కో హాలీవుడ్ లో బాతోరి (కౌంట్ నెస్ ఆఫ్ బ్లడ్ ) పేరుతో సినిమా తెరకెక్కించారు. 10మిలియన్ డాలర్లతో తెరకెక్కిన ఈ చిత్రం 2008 జులై 10న విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment