ఒలింపిక్స్‌ బిడ్‌ నుంచి తప్పుకున్న బుడాపెస్ట్‌ | Budapest bid chief slams Olympics withdrawal | Sakshi
Sakshi News home page

ఒలింపిక్స్‌ బిడ్‌ నుంచి తప్పుకున్న బుడాపెస్ట్‌

Published Fri, Feb 24 2017 12:51 AM | Last Updated on Tue, Sep 5 2017 4:26 AM

Budapest bid chief slams Olympics withdrawal

బుడాపెస్ట్‌: ఒలింపిక్స్‌ లాంటి మెగా ఈవెంట్‌కు ఆతిథ్యమిచ్చిన ఆయా దేశాల ఆర్థిక పరిస్థితి ఇటీవల ఎంతగానో దిగజారడం మనకు కనిపిస్తోంది.  హంగేరీ ఈ విషయాన్ని తొందరగానే గుర్తించింది. 2024 ఒలింపిక్స్‌ నిర్వహణ బిడ్‌ నుంచి తమ నగరం బుడాపెస్ట్‌ తప్పుకుంటున్నట్లు ఆ ప్రభుత్వం ప్రకటించింది.

పెద్దమొత్తంలో ప్రజాధనాన్ని వినియోగించాల్సి వస్తుంది కాబట్టి 2024లో దేశ రాజధాని బుడాపెస్ట్‌లో ఈ క్రీడలకు ఆతిథ్యమివ్వా లా? వద్దా? అనే అంశంపై పౌరుల నిర్ణయాన్ని తెలపాలని కోరింది. ఒలిం పిక్స్‌ నిర్వహణను వ్యతిరేకిస్తూ ప్రజల నుంచి పెద్ద మొత్తంలో ఓట్లు పోలవడంతో బుడాపెస్ట్‌... ఒలింపిక్స్‌ బిడ్‌ నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement