Olympics bid
-
2036 ఒలింపిక్స్ ఆతిథ్యానికి భారత్ సిద్ధం!
2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి భారత్ సిద్ధంగా ఉన్నదని టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. దీన్ని సాధించేందుకు ఇండియన్ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)కి రోడ్‌మ్యాప్ ఇస్తామని చెప్పారు. జీ 20 ప్రెసిడెన్సీని భారత్ ఇంత పెద్ద స్థాయిలో నిర్వహించగలిగినప్పుడు..ఐఓఏతో కలిపి కేంద్ర ప్రభుత్వం ఒలింపిక్స్ నిర్వహించగలదని భావిస్తున్నట్లు అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఒలింపిక్స్‌కు పూర్తిగా సిద్ధమైన తర్వాతనే భారత్ బిడ్ వేస్తుందని ఆశిస్తున్నామన్నారు. భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) క్రీడల నిర్వహణకు ప్రభుత్వం మద్దతు ఇస్తుందని.. గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ ప్రపంచ స్థాయి క్రీడా మౌలిక సదుపాయాలతో ఆతిథ్య నగరంగా మారుతుందని ఠాకూర్ చెప్పారు. గతంలో 1982 ఆసియా క్రీడలు, 2010 కామన్వెల్త్ క్రీడలకు భారత్ ఆతిథ్యం ఇచ్చిందని కేంద్ర మంత్రి గుర్తుచేశారు. ఇప్పుడు ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి భారత్ సిద్ధమైందన్నారు. -
2032 ఒలింపిక్స్‌కు ఇండోనేసియా బిడ్
జకార్తా: ఆగ్నేయాసియా దేశం ఇండోనేసియా 2032 ఒలింపిక్స్ నిర్వహణకు ఆసక్తి చూపుతూ బిడ్ దాఖలు చేసింది. అధ్యక్షుడు జొకొ విడొడొ తరఫున... స్విట్జర్లాండ్‌లోని ఇండోనేసియా రాయబారి ములిమన్ హదాద్ తమ రాజధాని జకార్తాలో ఒలింపిక్స్ నిర్వహణకు సిద్ధమని బిడ్‌పై అధికారిక లేఖను అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)కి గత వారం లుసానేలో అందజేశారు. ఈ వివరాలను ఆ దేశ విదేశాంగ శాఖ మంగళవారం ఖరారు చేసింది. ‘ఓ పెద్ద దేశంగా ఇండోనేసియా శక్తి సామర్థ్యాలను చాటాల్సిన సమయం ఇది’ అని హదాద్ పేర్కొన్నారు. కాగా, గతేడాది ఆసియా క్రీడల ఆతిథ్యం సందర్భగా జొకొ విడొడొ 2032 ఒలింపిక్స్ నిర్వహణకు సిద్ధమని ప్రకటించారు. ఇప్పటికే భారత్ ఆసక్తి కనబరుస్తుండగా, దక్షిణ కొరియా–ఉత్తర కొరియా సంయుక్త బిడ్ వేశాయి. 2032లో మెగా ఈవెంట్ జరగబోయేది ఎక్కడో ఐఓసీ 2025లో ఖరారు చేస్తుంది. 2020కి టోక్యో, 2024కి పారిస్, 2028కి లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌కు వేదిక కానున్నాయి. -
ఒలింపిక్స్ బిడ్ నుంచి తప్పుకున్న బుడాపెస్ట్
బుడాపెస్ట్: ఒలింపిక్స్ లాంటి మెగా ఈవెంట్‌కు ఆతిథ్యమిచ్చిన ఆయా దేశాల ఆర్థిక పరిస్థితి ఇటీవల ఎంతగానో దిగజారడం మనకు కనిపిస్తోంది. హంగేరీ ఈ విషయాన్ని తొందరగానే గుర్తించింది. 2024 ఒలింపిక్స్ నిర్వహణ బిడ్ నుంచి తమ నగరం బుడాపెస్ట్ తప్పుకుంటున్నట్లు ఆ ప్రభుత్వం ప్రకటించింది. పెద్దమొత్తంలో ప్రజాధనాన్ని వినియోగించాల్సి వస్తుంది కాబట్టి 2024లో దేశ రాజధాని బుడాపెస్ట్‌లో ఈ క్రీడలకు ఆతిథ్యమివ్వా లా? వద్దా? అనే అంశంపై పౌరుల నిర్ణయాన్ని తెలపాలని కోరింది. ఒలిం పిక్స్ నిర్వహణను వ్యతిరేకిస్తూ ప్రజల నుంచి పెద్ద మొత్తంలో ఓట్లు పోలవడంతో బుడాపెస్ట్... ఒలింపిక్స్ బిడ్ నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొంది.