ఏకమైన బుడా, పెస్ట్ నగరాలు | Associated buda, pest cities | Sakshi
Sakshi News home page

ఏకమైన బుడా, పెస్ట్ నగరాలు

Published Thu, Nov 19 2015 10:40 PM | Last Updated on Sun, Sep 3 2017 12:43 PM

ఏకమైన బుడా, పెస్ట్ నగరాలు

ఏకమైన బుడా, పెస్ట్ నగరాలు

20 నవంబర్, 1873

 హంగేరీ రాజధాని ఏది? అనగానే చిన్నపిల్లాడు కూడా బుడాపెస్ట్ అని ఠపీమని చెబుతున్నారు కానీ, బుడాపెస్ట్ అనేది ఒకప్పుడు ఒకటి కాదు, రెండు నగరాలు. అవీ కూడా ఒకదాంతో మరోదానికి బద్ధశత్రువులుగా మెలిగిన నగరాలు. కొన్ని ప్రయోజనాల కోసం పరస్పర శత్రుప్రాంతాలైన బుడా, పెస్ట్ నగరాలు ఏకమై బుడాపెస్ట్‌గా మారి, హంగేరీ దేశానికి రాజధానిగా మారాయి. డాన్యూబ్ నదికి కుడి, ఎడమ దిశలలో ఉండేవి బుడా, పెస్ట్ నగరాలు. బుడా ప్రాంతం ఇప్పటికీ కొండలు, లోయలు, ఇరుకైన రోడ్లు, పురాతన కట్టడాలతో పురాతన నాగరికతకు, ప్రకృతి రమణీయతకు ఆనవాలుగా ఉంటుంది.

అత్యాధునిక కట్టడాలు, అత్యద్భుత భవనాలు, సువిశాలమైన రోడ్లతో, ఆహ్లాదకరమైన పార్కులతో, ఆధునిక నాగరకతకు ఆలవాలంగా ఉంటుంది పెస్ట్. ఒకప్పుడు కత్తులు దూసుకున్న ఈ నగరాలు బలమైన రాజధానిని ఏర్పరచడం కోసం తమ శత్రుత్వాన్ని మరచి ఒకటయ్యాయి. బుడాపెస్ట్ ఒక్కటీ సువిశాలమైన నగరంగా మారి హంగేరీ దేశానికి రాజధాని ఏర్పడింది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement