ఇరాన్ తన పొరుగు దేశమైన ఇజ్రాయెల్‌తోనూ, అగ్రరాజ్యం అమెరికాతోనూ ఉన్న వివాదం కారణంగా గత కొంతకాలంలో ప్రపంచం దృష్టిలో పడింది. ఇరాన్.. ఇజ్రాయెల్‌పై అప్రకటిత యుద్ధ ధోరణిలో ఉన్నదనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఇంతలోనే ఇరాన్ తన రాజధానిని టెహ్రాన్ నుండి వేరే ప్రదేశానికి మార్చాలనుకోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అది కూడా మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్, అమెరికాతో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్న తరుణంలో ఇరాన్ తీసుకున్న నిర్ణయంపై చర్చ జరుగుతోంది.
ఈ చర్చల నేపధ్యంలో ఇరాన్(Iran) ప్రభుత్వ ప్రతినిధి ఫతేమెహ్ మొహజెరానీ ఒక ప్రకటన చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితుల కారణంగా రాజధానిని మార్చాలనే నిర్ణయం తీసుకోలేదని మొహజెరానీ అన్నారు. అయితే ఇరాన్ నిర్ణయం వెనుక పలు కారణాలున్నాయని విశ్లేషకులు అంటున్నారు. ఇటీవలి కాలంలో టెహ్రాన్‌ను అనేక సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఈ నేపధ్యంలోనే ఇరాన్ ఈ నిర్ణయం తీసుకోవలసి వచ్చిందని అంటున్నారు. ఇండోనేషియాలో కూడా ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. జకార్తాను విడిచిపెట్టి, మెరుగైన నగరాన్ని నిర్మించే దిశగా ఇండోనేషియా ప్రయత్నాలు ప్రారంభించింది.
టెహ్రాన్(Tehran) మహానగరం అటు జనాభా, ఇటు పర్యావరణం పరంగా అనేక సమస్యలను ఎదుర్కొటోంది. ఫలితంగా నగరంలోపై మరింత ఒత్తిడి పెరుగుతోందని మొహజెరానీ తెలిపారు. నగరంలో పెరుగుతున్న జనాభా కారణంగా నీటితో పాటు విద్యుత్ కొరత పెరుగుతోంది. కాలుష్యం కూడా పెరిగిపోతోంది. దీనికితోడు భూకంపాలు సంభవించే ప్రాంతంలో టెహ్రాన్ ఉండటం వల్ల మరింత అసురక్షితంగా మారిందని మొహజెరానీ వివరించారు. అటువంటి పరిస్థితిలోనే ఇరాన్ ప్రభుత్వం రెండు కౌన్సిళ్లను ఏర్పాటు చేసింది. రాజధానిని టెహ్రాన్ నుండి మక్రాన్ ప్రాంతానికి మార్చడంపై ఈ కౌన్సిళ్లు విశ్లేషించాయి.
ఇది కూడా చదవండి: UPSC Success Story: ఇటు ఉద్యోగం.. అటు చదువు.. శ్వేతా భారతి విజయగాథ
Comments
Please login to add a commentAdd a comment